గ్రామీణ వాతావరణానికి అనుగుణంగా తగినంత స్థలంలో విశాలంగా ఆధునిక పాకను/ కొట్టామును ఏర్పాటు చేసుకోవాలి. పాడి పశువుల పాకలను ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు బాగా వచ్చే, నీళ్ళు నిలవని చోట ఏర్పాటు చేసుకోవాలి. పశువుల పేడ, మూత్రము, పశువులను కడిగిన నీళ్ళు పాకలో నిల్వవుండ కుండా పోయ్యేటట్లు తగిన ఏర్పాటు చేసుకోవాలి. పాక/కొట్టము చుట్టు పక్కల చెట్లు నాటాలి. కొట్టము / పాకలో ఖనిజ లవణపు ఇటుకలు ఎల్లప్పుడు ఉంచాలి. గోమారిలు మరియు పిడుదులు రాకుండా చూసుకోవాలి.
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020