హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / పాల పుట్టగొడుగుల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పాల పుట్టగొడుగుల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు

పాల పుట్టగొడుగుల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు.

పుట్టగొడుగులు అనేవి పంగన్ (శిలింద్ర) జాతికి చెందిన చిన్న మొక్కలు అని చెప్పుకోవచ్చు. ఈ పుట్టగొడుగులలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నందున పోషకాహారలోపంతో బాధపడే వారికీ, మహిళలకు, పిల్లలకు చాలా మంచి ఆహారంగా ఉపయెగపడుతుంది. భూమి మీద మొత్తంగా 2000 రకాలకు పైగా పుట్టగొడుగులు ఉన్నప్పటికీ అందులో 20 రకాలను మాత్రమే ఆహార వినియెగానికి ఉపయెగపడేవిగా గుర్తించారు. వాటిలో మానవులు కృత్రిమంగా 3 లేక 4 రకాలు మాత్రమే పెంచుతున్న ఇక్కడ మనం పాల పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం.

పాల పుట్టగొడుగులు పెంపకానికి 30-35 సెం.గ్రే. ఉష్ణోగ్రత మరియు 85-95 శాతం తేమ అనుకూలమైనవి. మర్చి నుండి అక్టోబర్ మాసం పాల పుట్టగొడుగుల పెంపకానికి అనుకూలం.

పాల పుట్టగొడుగులలో పోషక విలువలు

 • విటమిన్లు : సి మరియు బి విటమిన్లు
 • అమైనో ఆమ్లాలు : లైసిన్, ట్రిప్టోపాన్
 • ఖనిజ లవణాలు : పాస్పరస్, కాల్షియం, పొటాషియం, రాగి, ఇనుము
 • నీరు : 89-91%
 • లవణాలు : 0.97-1.26%
 • పీచు పదార్ధాలు : 0.09-1.67%
 • పిండి పదార్ధాలు : 5.3-6.28%
 • మాంసకృతులు : 0.25-0.65%
 • శక్తి (100 గ్రా.లకు) : 43 కిలో కాలరీలు

పాల పుట్టగొడుగుల ఉపయెగలు

 • తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుంది.
 • వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలయిన గడ్డి, చొప్ప ఇతర పదార్ధాలతో కొద్దిపాటి ఖర్చుతో వీటిని పెంచవచ్చు.
 • నిల్వ సామర్ధ్యం ఎక్కువ. రిఫ్రిజిరేటర్ లో 20 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు.
 • గది ఉష్టోగ్రత వద్ద అయితే 25-28 సెం.గ్రే. 100 గేజ్ పాలిథిన్ సంచిలో 40(mm) వ్యాసంలో 8-16 రంద్రాలను  చేసి  3-4 రోజులు  నిల్వ ఉంచవచ్చు.
 • పాల వలె ఆకర్షణీయమైన తెలుపు రంగును కలిగి ఉండటం వల్ల వినియేగదారులు ఎక్కువగా ఇష్టపడతారు.
 • నిల్వ ఉంచినపుడు గోధుమ వర్ణంలోకి మరపు. తద్వారా మార్కెట్ విలువ పడిపోకుండా ఉంటుంది.
 • సులువుగా మార్కెట్ చేసుకోవచ్చు. కాడలను క్రీంది భాగాన కోసి, మట్టి, చెత్తను తీసివేయాలి. వీటిని తాజాగా లేదా రంద్రాలు కలిగిన పాలిథిన్ సంచులలో ప్యాక్ చేసి 20-25 రోజుల వరకు రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచి మార్కెటింగ్ చేసుకోవాలి.

పుట్టగొడుగుల పెంపకంలో పాటించవలసిన జాగ్రత్తలు

 • మందు ద్రావణంలో నానబెట్టిన వరిగడ్డిని బయటకు తీసిన తరువాత అందులో70% తేమ ఉండేట్లు ఆరనివ్వాలి.
 • పుట్టగొడుగుల పెంపకంలో కీలకమైన అంశం విత్తనం, నాణ్యమైన విత్తనం ప్యాకెట్ లలో ఆకుపచ్చ, నీలి, ఎరుపు లాంటి మచ్చలు ఏమైనా వుంటే అలాంటి ప్యాకెట్స్ వాడకపోవడం మంచింది.
 • కేసింగ్ కు వాడే మట్టిలో 7.5 నుండి  8 పి.హెచ్.(ఉదజని సూచిక) ఉండే విధంగా ఎంపిక చేసుకోవాలి.
 • స్పాన్ రన్నింగ్ గదులు గడ్డి నిల్వ ఉంచే ప్రాంతానికి దూరంగా ఉండేలా చూసుకోవాలి. స్పాన్ రన్నింగ్ గదిలోకి వచ్చేముందు కళ్ళను 5% బ్లీచింగ్ పౌడర్ లేదా 5% పార్మాలిన్ ద్రావణంలో ముంచి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనతో పాటు వచ్చే కలుషితాలను అరికట్టవచ్చు.

పుట్టగొడుగుల ప్యాకింగ్ : పుట్టగొడుగులు పండించిన  తర్వాత వాటి గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ లో అశ్రద్ధ చేయుకుండా పుట్టగొడుగులను కోసిన తరువాత చక్కగా శుభ్రపరిచి 200 నుంచి 250 గ్రాములు 150 గేజ్ పాలిథిన్ కవరులో వేసి ప్యాక్ చేయాలి. పాలిథిన్ కవాతుకు రంద్రాలు చేయాలి మంచిగా ప్యాక్ చేసినట్లయితే చల్లటి ప్రాంతంలో దాదాపు 7 నుండి 8 రోజులు నిల్వ చేయవచ్చు.

పుట్టగొడుగుల నిల్వ పద్ధతులు

 • తాజా పుట్టగొడుగుల రంగు మారకుండా నిల్వ చేయుటకు నీళ్ళలో 1.5% సోడియం బై సల్పేట్ లేదా పొటాషియం మెటబైసల్పేట్ వేసి పుట్టగొడుగులు కడిగితే రంగు మారవు.
 • పుట్టగొడుగులు 0.5% నిమ్మ ఉప్పులో కడిగితే కొంత వరకు రంగు మేరువు.
 • పుట్టగొడుగులు ప్రైజ్ లో 15-20 రోజులు నిల్వ ఉంచవచ్చు.
 • పుట్టగొడుగులు ఎండబెట్టి వడియాలుగా వాడుకోవచ్చు మరియు పొడి చేసుకొని వాడుకోవచ్చు.
 • ఊరవేసి పచ్చళ్ళు చేసి నిల్వ చేయవచ్చు.

మార్కెటింగ్ : మనకు దగ్గరలో ఉన్న మార్కెట్ ని ఎంపిక చేసుకోవాలి. మార్కెట్ అంచనా ప్రకారం బెడ్లను ప్రతిరోజు పంటతిసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తాజా పుట్టగొడుగులని సూపర్ మార్కెట్, రెస్టారెంట్, రైతుబజార్, చైనీస్ రెస్టారెంట్, పాస్ట్ పుడ్ సెంటర్లకి మార్కెట్ చేసుకోవచ్చు.

సాగుచేయు విధానం

 • పుట్టగొడులని లిగనో లైటిక్  మరియు సెల్యులోలైటిక్ వ్యర్ధపదార్ధాల పై పెంచవచ్చు.
 • వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వలన దీనిని ఎక్కువగా వాడుతారు.
 • ముందుగా వరిగడ్డిని 3-5 సెం.మీ. ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మంచి నీటిలో 4-6 గంటలు నానబెట్టాలి.
 • నానబెట్టిన గడ్డి నుండి నీరు తీసివేసి శుద్ధి చేసుకొనవలెను. సబ్ స్ట్రీట్ ను 3 విధాలుగా శుద్ధి చేసుకోవచ్చు.

వేడి నీటి విధానం : పెద్ద ట్యంక్ లో నీటిని మరిగించి నీటి ఉష్ణోగ్రత  80-90 సెం.గ్రే. చేరినాక గడ్డితో నింపిన గొనె సంచులను ఆ నీటిలో ముంచి 40-60 నిమిషాలు ఉండేటట్లు చూడాలి.

స్టీమ్ పాశరైజేషన్ : తడి గడ్డిని రంద్రాలున్న చెక్క ట్రేలలో ఇన్ స్యులేటెడ్  గదిలో ఉంచాలి. బాయిలర్ ద్వారా సబ్ స్ట్రీట్ ఉష్ణోగ్రతను ఆవిరి ద్వారా 65-70 సెం.గ్రే. పెంచి 5-6 గంటల వరకు ఆవిరి ఉంచాలి.

 • గదిలోకి గాలి సమంగా పంపించినట్లయితే ఉష్ణోగ్రత తగిన విధంగా ఉంటుంది.
 • దీని తరువాత సబ్ స్ట్రీట్ ను స్పేనింగ్ గదిలో సంచులను నింపుటకు మరియు స్పానింగ్ కు తరిలించిలి.

రసాయన పద్ధతి : రసాయన పద్దతిలో అయితే 100 లీటర్ల నీటిలో 7.5 గ్రా కార్బండజిమ్ మరియు 250 మీ.లి. పార్మాల్డి హెడ్ కలిపినా ద్రావణంలో 10 కిలోల గడ్డి మొక్కల్ని నీటిలో మునిగే విధంగా 12-16 గంటల పాటు ఉంచి శుద్ధి చేయాలి.

బెడ్లు తాయారు చేయు విధానం మరియు స్పానింగ్

పాశరైజేషన్ తరువాత సబ్ స్ట్రీట్ ను వైరు మెష్ లేదా శుభ్రమైన బట్ట పైన గది ఉష్ణోగ్రతకు చల్లబరిచి తేమశాతాన్ని 60-65% వరకు ఆరనివ్వాలి. తేమశాతం తనిఖీ చేయడానికి చేతినిండా గడ్డిని తీసుకొని వెళ్ళమధ్య ఉంచి పిండినప్పుడు నీరు కారానిచో తగినంత తేమశాతం ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. తరువాత పాలిథిన్ సంచులలో 12*8 లేదా  14*24 అంగుళాల సైజు కవర్లని తీసుకొని 15 నుండి 20 రంద్రాలు చేయాలి. సంచులలో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెం.మీ. మందాన వేసి విత్తనాన్ని అంచుల పై కాకుండా మధ్యలో వేయాలి. పాలిథిన్ సంచులలో నింపిన తడి సబ్ స్ట్రీట్ ను 5 శాతం స్పాన్ కలపాలి. (50 గ్రాముల స్పాన్ 1 కేజీ తడి సబ్ స్ట్రీట్ కు) గడ్డిని కొద్దిపాటి ఒత్తిడితో నింపాలి కానీ బిగుతుగా ఉంచరాదు. సంచుల ముఠాలను రబ్బరు బ్యాండ్ తో మూసివేయాలి. తర్వాత సంచులను స్పాన్ రన్నింగ్ గదులలోకి మార్చాలి. స్పానింగ్ మూడు విధాలుగా చేయవచ్చు.

 1. ఉపరిభాగా స్పానింగ్
 2. లేయర్ స్పానింగ్
 3. మిక్స్ డ్ స్పానింగ్ లేదా కంప్లిట్ స్పానింగ్ లేదా సంపూర్ణ మైన స్పానింగ్

ఉపరిభాగ స్పానింగ్ : పాశరైజ్డ్ సబ్ స్ట్రీట్ ను సంచులలో నింపి పై బాగానే స్పాన్ ను చల్లాలి. ఈ విధానం అటోకాల్వ్ లేదా స్టీమ్ స్టెరిలైజేషన్ చేసిన సబ్ స్ట్రీట్ ను వాడేటప్పుడు పాటించాలి.

లేయర్ స్పానింగ్ : ఈ విధానాన్ని వేడినీరు లేదా స్టీమ్ స్టెరిలైజేషన్ చేసినపుడు పాటిస్తారు. ఈ విధానంలో సబ్ స్ట్రీట్ ను మరియు స్పాన్ ను పొరలుగా వేయాలి.

సంపూర్ణ స్పానింగ్ : ఈ విధానంలో స్పాన్ మరియు సబ్ స్ట్రీట్ ను సంపూర్ణంగా కలిసేటట్టు చేసి సంచులలో నింపుతారు.

స్పాన్ రన్నింగ్ : ఇవి సబ్ స్ట్రీట్ పైన బూజు పెరిగేదాశ. ఈ దశలలో గాలి అవసరం చాలా తక్కువ. బూజు పెరుగుదలకు అధికంగా ఏసీ అవసరం గనుక గదిని చీకటిగా ఉంచాలి. 28-35 సెం.ఉష్ణోగ్రత అఉండేటట్లు చూడాలి. ప్రతిరోజు పరిశీలిస్తూ కలుషితమైన వాటిని తీసి వేయాలి. స్పాన్ రన్నింగ్ 20-25 రోజులలో బూజు అల్లుకోవడం పూర్తవుతుంది. సంచులన్నీ పూర్తిగా తెల్లగా కప్పబడతాయి.

కేసింగ్ : స్పాన్ రన్నింగ్ పూర్తయిన తర్వాత సంచులను కేసింగ్ చేస్తారు. సబ్ స్ట్రీట్ పైన ప్రిక్తిపీకేశాం తో పాటు ప్రుటింగ్ బాడీలకు స్ధులమైన ఆధారాన్ని ఇవ్వడానికి పాశరైజేషన్ మట్టిని పొరగా కప్పుతారు. దీనిని కేసింగ్ అంటారు. కేసింగ్ పదార్ధాన్ని కేసింగ్ చేయడానికి 2 వరాల ముందుగానే పార్మాల్డి హైడ్ (5%) తో తడిపి పాశరైజేషన్ చేయాలి. ఆవిరితో పాశరైజేషన్ (65 సెం.గ్రే. వద్ద) 2 గంటలు చేయడం సమర్ధవంతమైంది. తడి కేసింగ్ పదార్ధాన్ని 2-3 ఇంచుల కొలతవున్న ట్రేలలో నింపి పాశరైజేషన్ గదిలో నెల నుండి 50 సెం.మీ. ఎత్తులో ఒక దాని పై ఒకటి వుంచాలి. ఆవిరి ప్రసరించే విధంగా (సుమారు 50 సెం.మీ.) మధ్య దూరం ఉంచాలి. ఆవిరి నెల ఉపరితల భాగంలో పంపించాలి. సీలింగ్ నుండి మరియు నెల పై భాగాన 20-30 సెం.మీ. ఎత్తులో బ్లోయర్ ద్వారా గాలి ప్రసరింపజేసిన యెడల ఉష్ణోగ్రత సమంగా ఉండేట్లు చూడవచ్చును. కేసింగ్ పదార్ధాన్ని 2 గంటలు 65 సెం.గ్రే. ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. డిజిటల్ ధర్మామీటర్ కేసింగ్ పై భాగాన, మధ్య క్రంది భాగాన సెన్సారుల నుండి ఉష్ణోగ్రతను సమన్వయ పరచవచ్చు. అటోకాల్వ్ లో 15 పి.ఎస్.ఐ. వద్ద 30 నిమిషాలు వరకు పాశరైజేషన్ చేయవచ్చు. చిన్న మొత్తంలో పెంచినపుడు మట్టిని ప్రెషర్ కుక్కర్ లో పాశరైజేషన్ చేసుకోవచ్చు కానీ పెద్ద మొత్తంలో వేరే పాశరైజేషన్ గది అవసరం. బాగా బూజు అల్లుకున్న సంచులను క్రాపింగ్ గదిలోకి మర్చి తెరవాలి. ప్లాస్ట్రక్ పోరాదు క్రైండకు మడిచి సబ్ స్ట్రీట్ ను సమతలం చేయాలి. చల్లార్చిన పాశరైజేషన్ మట్టిని 2-3 సెం.మీ. లోతు సబ్ స్ట్రీట్ పైన సమానంగా పరుచుకోవాలి. మట్టిని పరిచిన వెంటనే సంచులలో కార్బండజిమ్ 1 గ్రా. / లి. చొప్పున పిచికారి చేయాలి. మరసటి రోజు నుండి నీటిని పెట్టాలి.

క్రాపింగ్ : కేసింగ్ చేసిన వెంటనే 15-20 రోజులలో గుండుసూది పరిమాణంలో పుట్టగొడుగులు ఉద్బవించడం జరుగుతుంది. గదిలో 29-35 సెం.గ్రే. ఉష్ణోగ్రత 80-90% తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. స్ర్పేయర్ల ద్వారా నీటితో తడపాలి. 8-10 రోజులలో పంటలు వస్తాయి. ఈ రకం పుట్టగొడుగులను 1 కిలో ఎండుగడ్డికి 0.6-1 కిలోల తాజా పుట్టగొడుగులు లభిస్తాయి. పిరియస్ వ్యాసం 6-8 సెం.మీ. ఉన్నప్పుడు పుట్టగొడుగులను కోత కోయాలి.

ఆధారం : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.02325581395
నట్ట sriramulu Oct 29, 2019 04:21 AM

కావాల్సిన వారి cell నంబర్స్ ఇవ్వాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు