హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / పుట్టగొడుగుల యెక్క ప్రాముఖ్యత మరియు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పుట్టగొడుగుల యెక్క ప్రాముఖ్యత మరియు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పుట్టగొడుగుల యెక్క ప్రాముఖ్యత.

పుట్టగొడుగులు మంచి ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి గల ముఖ్యకారణం వాటిలో ఉన్న పోష్టికాహార విలువలతో పాటు శోషధ గుణాలను కలిగి ఉండటం. పుట్టగొడుగులతో లైసిన్ అనే అమైనో ఆమ్లం జీర్ణశక్తిని పెంపొందించటానికి ఉపయెగపడుతుంది.

ముఖ్యంగా పుట్టగొడుగుల్లో 89-90% నీరు, 0.97-1.26% లవణాలు,  2.78-3.94% మాంసకృత్త్తులు, 0.25-0.65% క్రొవ్వు  పదార్ధాలు, 0.09-1.68% పీచు  పదార్ధాలు, 5.30-6.26 పిండి పదార్ధాలు ఉంటాయి.

వీటిని వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలైన గడ్డి, చొప్ప, ఇతర పదార్ధాలతో కొద్దిపాటి ఖర్చుతో పెంచవచ్చు. ప్రతి 100  గ్రా. తాజా పుట్టగొడుగులు 43 కిలో కేలరీల శక్తినిస్తాయి.

 • పుట్టగొడుగులతో మంచి పోష్టిక మరియు ఒహాశధా గుణాలు ఉండటం వాళ్ళ ప్రజలు దీన్ని కొనుగోలు చేయటానికి ఇష్టపడుతున్నారు.
 • వీటికి వాణిజ్య విలువను జోడించినట్లయితే రైతులకు లాభం చేకూరే అవకాశం అభిస్తుంది.

పుట్టగొడుగుల పెంపకంలో చేయవలసిన పనులు

 • కంపోస్టను చాలా జాగ్రత్తగా తయారుచేసుకోవాలి. కంపోస్ట్ తయారీ పై ఆదాయం ఆధారపడి ఉంటుంది.
 • స్పాన్ కోసం ఉపయెగించే కంపోస్ట్ దుర్వాసన రాకుండా జాగ్రత్త పడాలి.
 • బెడ్సేను నింపేటప్పుడు కంపోస్ట్ ఎక్కువ తేమగా లేకుండా చూసుకోవాలి.
 • బెడ్స్ కోసం వాడే కవర్స్ లో తగిన మేతదులో కంపోస్టను నింపు కోవాలి.
 • నాణ్యమైన స్పాన్ ను ఎంచుకోవాలి.
 • కేసింగ్ పదార్ధం మురదువుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా గాలి ప్రవేశించడానికి అనువుగా ఉంటుంది.
 • స్పాన్ వేసిన తర్వాత లేదా కేసింగ్ వేయకముందు కంపోస్ట్ మీద నీళ్ళు చల్లాలి.
 • ఒక్క సంవత్సరం పాటు కుళ్ళిపోయిన పశువుల ఎరువును ఉపయెగించుకోవాలి.
 • కేసింగ్ వేసిన తర్వాత గాడి యెక్క ఉష్ణోగ్రత మొదటి మూడు రోజుల వరకు 22-24 సెల్సియస్  తర్వాత దాని ఉష్ణోగ్రతను 14-18 సెల్సియస్ తగ్గించుకోవాలి (ఉష్ణోగ్రత శాతం అనేది పుట్టగొడుగుల రకాన్ని బట్టి మారుతుంది.)
 • గది యెక్క తేమ శాతాన్ని పెంచడానికి మరియు ఎష్ణోగ్రతను తగ్గించడానికి చల్లటి నీళ్ళను గోడలకి తగిలించిన గొనె సంచి మీరు చల్లకొవాలి.
 • చేదు శిలింద్రం వృద్ధి చెందినచో శిలింద్రనాశినిని వెంటనే సాప్ట్ చేసుకోవాలి.
 • ఎదిగిన పుట్టగొడుగులను తొలగించడం వల్ల ఏర్పడిన రంధ్రాలను తిరిగి కేసింగితో పూడ్చాలి.
 • కేసింగ్ ను వాడే ముందు సుష్మక్రిములు లేకుండా శుద్ధి చేసుకోవాలి.
 • గది యెక్క నేలను తరచుగా శుభ్రపరచుకోవాలి.
 • గదిలోకి ప్రవేశించడానికి మాత్రమే ఏర్పర్చిన చెప్పలేను మాత్రమే వినియెగించాలి. దీని వలన సుష్మాక్రైముల తాకిడిని అరికట్టవచ్చు.
 • కేసింగ్ ను వెంటనే వినియెగించని ఎదల క్రముల బారిన పడే అవకాశం ఉంది.

పుట్టగొడుగుల పెంపకంలో చేయకూడని పనులు

 • బెడ్స్ కోసం ఉపయెగించే కంపోస్ట్ అధిక తేమగా ఉండకూడదు.
 • పాడైన స్పాన్ కు ఉపయెగించరాదు.
 • కేసింగ్ ఎండిన తర్వాత పగుళ్ళురానిచో అందులో గాలి ప్రవేశించడానికి అవకాశం లేదు. పిన్ హెడ్ సైజ్ పుట్టగొడుగులు వృద్ధి చెందని ఏదని గట్టిగ ఏర్పడిన కేసింగ్ ను పరచువలెను.
 • పుట్టగొడుగుల కొత్త కోసం ఎటువంటి పరికరాలను ఎపయెగించరాదు లేని యెడల ఇది సుసుక్మాక్రముల వృద్ధికి దారి తీస్తుంది.

పుట్టగొడుగులను వినియెగించడం వలన ఈ క్రంది పేర్కొన్న వ్యాధులను కొంత మేరకు అరికట్టవచ్చును.

పుట్టగొడుగుల

వ్యాధులు

1. టర్కీతోక (ట్రెమెటస్ వర్సి కోలార్)

క్యాన్సర్, హెపటైటిస్ బి, మలేరియా

2. గుండీ పుట్టగొడుగులు (అగారికాస్)

రక్తపోటు, వైరస్, మధుమేహం, క్యాన్సర్

3. ఆల్ చిప్ప/ముత్యపుచిప్ప గొడుగులు (ఫ్లూరోటస్)

రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధులు, క్యాన్సర్ సమస్యలు

4. షైటకే (లెంటినుల ఏడాదేస్)

రక్తపోటు, కొలెప్ట్రాల్, మధుమేహం, , క్యాన్సర్ సమస్యలు

5.  గొంగళి పురుగు పుట్టగొడుగులు (కార్డి సెప్స్)

ఉబ్బసం, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు

6. చాగా పుట్టగొడుగులు (ఏర్నాటస్ ఆబ్లిక్యూస్)

లివర్ వ్యాధులు, రక్తపోటు, క్యాన్సర్

7. చేస్తేనాట్ పుట్టగొడుగులు  (ఆగారిక్ బిస్పోరాస్)

మధుమేహం, కొలెప్ట్రాల్, గుండె సమస్యలు

8.   మెసీమ పుట్టగొడుగులు (పేలినన్ లింతాస్)

గుండె సమస్యలు, క్యాన్సర్ సమస్యలు

9. రైషీ (గానోడెర్మా లుసిడం)

కీళ్ళవాతం, మధుమేహం, క్యాన్సర్, అలసట, నీరసం, గుండె సమస్యలు

గానోడెర్మా అప్లానెటేమ్

కిడ్నీ సమస్యలు, వాపులు, అలర్జీ

10. మెయ్ టేక్ (గ్రిపోల పొందోసా)

క్యాన్సర్, రక్తపోటు, హెపటైటిస్ వ్యధలు

11. కాలిప్లవర్ పుట్టగొడుగులు (స్పారెస్పీస్ క్రాస్ప)

మధుమేహం, క్యాన్సర్.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.02631578947
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు