వ్యవసాయ రంగంలో ఆశించిన స్థాయిలో ఉత్పాదకత, ఉత్పత్తిని సాధించడమే కాకుండా, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం కూడా కీలకమైన అంశం. అంతేకాక పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ, వ్యవసాయ రంగంలో అనుకున్న ఉత్పాదకతను సాధించాలి. ఇలా చేయాలంటే పంటకు అవసరమయ్యే నీటిని, నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దీనికి సమగ్ర సాగునీటి, పోషకాల యాజమాన్యం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
సమగ్ర సాగునీటి, పోషకాల యాజమాన్యంలో 'ఫర్టిగేషన్' పద్ధతి విప్లవాత్మక శకానికి నాంది పలికింది. ఈ పద్ధతి వల్ల సాగు నీరు, పంటకు అవసరమయ్యే పోషకాలు ఒకేసారి సూక్ష్మ నీటి పారుదల పద్ధతిలో మొక్కలకు అందించబడతాయి. దీనివల్ల పంటకు అవసరమైన సమయంలో,అవసరమైనంత పోషకాలు అందడం వల్ల పర్యావరణంపై ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ప్రస్తుతం ఫర్టిగేషన్ చాలా రకాల పంటల్లో, వైవిధ్యభరితమైన నేలల్లో, వాతావరణ పరిస్థితుల్లో విరివిగా వాడుకలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫెర్టిగేషన్ కింద విస్తీర్ణం ఏడాదికి పెరుగుతూ వస్తుంది. సాగునీటికి ప్రాధాన్యతనిచ్చే ఇజ్రాయిల్ లాంటి దేశంలో దాదాపు 75 శాతం సాగువిస్తీర్ణం సూక్ష్మసాగునీటి పద్ధతి ద్వారానే సాగు చేస్తున్నారు. ఇందులో 81 శాతం విస్తీర్ణం ఫర్టిగేషన్ పద్ధతిలో సాగుచేస్తున్నారు. ఇజ్రాయిల్ కానీ ఇంకా భారతదేశంలో ఈపద్ధతి ప్రారంభస్థాయిలోనే ఉంది.
ఫర్టిగేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు
- పంటల దిగుబడి 25-30 శాతం వరకు పెరుగుతుంది.
- ఎరువుల వాడకం 25-30 శాతం వరకు, కూలీల అవసరం 10-15 శాతం వరకు, అలాగే యాంత్రీకరణ ఖర్చులు 20-25 శాతం వరకు తగ్గుతాయి.
- పంటకు కావాల్సిన పోషకాలు ఖచ్చితంగా, సమానంగా అందచేయబడతాయి.
- పంటకు కావాల్సిన మోతాదులో పోషకాలు లభిస్తాయి.
- పంటల్లో సూక్ష్మవాతావరణం పొడిగా ఉంటుంది. దీనివల్ల వ్యాధికారక శిలీంధ్రాలు ఎదుగుదల తక్కువగా ఉంటుంది.
- సాంప్రదాయ పద్ధతులు (వెదజల్లడం, మొక్కల మొదళ్ళలో వేయడం)లతో పోలిస్తే ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యం రెండింతలు అవుతుంది.
- పోషకాలు భూమిలోకి ఇంకిపోవడం, ఆవిరి కావడం, అలాగే గ్రహించలేని పోషకాలుగా మారడం లాంటి నష్టాన్ని ఫర్టిగేషన్ ద్వారా చాలా వరకు అధిగమించవచ్చు.
- ఈ ఫర్టిగేషన్ ద్వారా తేలిక పాటి భూములను కూడా పంట పండించడానికి వాడవచ్చు.
- వాలుగా ఉన్న పొలాల్లో అలాగే ఇతర సమస్యాత్మక భూములకు ఫర్టిగేషన్ ూలూ అనుకూలమైన పద్ధతి. అన్నింటికంటే ముఖ్యంగా వర్టిగేషన్ వర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది.
ఫర్టిగేషన్కి సంబంధించిన పరికరాలు
ఇందులో సాధారణంగా రెండు ప్రధానమైన విడి భాగాలు ఉంటాయి. అవి బైపాస్ ట్యాంక్, వెంచురీ ఇండక్టర్లు
- ఫర్టిగేషన్ పరికరం ఎంపిక ముఖ్యంగా వాడే ఎరువులు (పొడి లేదా ద్రవ) ఆధారిత శక్తి, పొలం విస్తీర్ణం, పరికరం ఖరీదు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- ఫర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. లేకపోతే ఎరువుల అవశేషాలు డ్రిప్పరు రంద్రాన్ని మూసివేస్తాయి.
- పొడి లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే ఎరువులకు నీటిలో కలిసిన వెంటనే కరిగిపోయే స్వభావం కలిగి ఉండాలి.
- నాణ్యత, దిగుబడులను సాధంచడానికి క్లోరైడ్లు లేనటువంటి ఎరువులను ఎంపిక చేసుకోవాలి.
ఫర్టిగేషన్ యాజమాన్యంలో కీలకమైన అంశాలు
ఈ పద్ధతి ద్వారా పంటలను పండించేటప్పుడు, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని, వాటికి అనుగుణంగా పోషకాలను ఏ దశలో ఎంత మోతాదులో విడుదల చేయాలి అనే అంశాలను నిర్ణయిస్తారు.
ఫర్టిగేషన్ను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు
- ఎన్నుకునే పంట రకం, పంట ఎదుగుదల దశ, నిర్ణీత విస్తీర్ణంలో మొక్కల సాంద్రత, పంట పోషకాలను తీసుకునే విధానం, పెట్టుకున్నదిగుబడులు.
- సాగు విధానం (సాధారణ సాగు, గ్రీన్ హౌస్‌లో సాగు, మట్టిలేకుండా ఇతర మాధ్యమాలలో సాగు)
- భూమి భౌతిక, రసాయనిక లక్షణాలు (నేల స్వభావం, లవణ పరిమాణ సూచిక, ఉదజని సూచిక, బంక శాతం, సేంద్రియ కర్బనం, భూసారం)
- వాతావరణ పరిస్థితులు
- సాగునీటి నాణ్యత (ఉదజని సూచిక, ఇ.సి.)
ఫర్టిగేషన్ యాజమాన్యం సూచించిన వివిధ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఫర్టిగేషన్ ద్వారా పంటలకు పోషకాలను అందించే ప్రణాళికలను తయారు చేసేటప్పుడు కింది సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
- మధ్యస్థం నుండి లోతైన రేగడి భూముల్లో ఫర్టిలైజరు ట్యాంకు పరికరాన్ని తేలిక పాటి భూముల్లో ఫర్టిలైజరు ఇంజెక్టరు పరికరాన్ని వాడుకోవాలి.
ప్రతిరోజు ఫర్టిగేషన్ ద్వారా పోషకాలను అందించాలి. అలా వీలుకాకపోతే ఒక రోజువదిలి మరుసటి రోజు ఇవ్వాలి.
- పంటకు కావాల్సిన పోషక అవసరాల దృష్ట్యా ఎరువులను ఎంపిక చేసుకోవాలి. ఈ ఎరువులు పోషకాలను అందించడమే కాకుండా సాగునీటి ఉదజని సూచికను సవరించేవిగా ఉండాలి.
- ఎంపిక చేసుకునే ఎరువు సాగునీటి నాణ్యతకు అనువుగా ఉండాలి. (లేకపోతే అవక్షేపాల వల్ల డ్రిప్పర్లు మూసుకుపోతాయి)
- ఫర్టిగేషన్ వ్యవధి, ఎప్పుడు సాగునీటి వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి.
- ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించాలి. దీనివల్ల సాలు అంతటా సమానమైన ఒత్తిడితో నీరు విడుదల అవుతుంది. నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిగేషన్ ప్రారంభించాలి.
- ఫర్టిగేషన్‌లో ఎరువులను, క్రిమిసంహారక మందులు లేదా క్లోరిన్‌తో కలిపి ఇవ్వకూడదు.
- ఫర్టిగేషన్ తరువాత నిర్ణీత వ్యవధిలో డ్రిమ్ వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. దీనివల్ల పైపులలో, డ్రిప్పర్లలో మిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగి వేయబడతాయి. నిర్ణీత వ్యవధికన్నా ఎక్కువ సేపు నీటిని పంపితే మొక్కల వేర్ల దగ్గర్లో ఉన్న పోషకాలు కొట్టుకుపోయి భూమిలోపలి పొరల్లోకి వెళ్ళి అక్కడే ఇంకి పోతాయి.
నీటిలో కరిగే రసాయనిక ఎరువులు
|
ఎరువు
|
పోషకాల శాతం
|
ఎన్
|
పి
|
కె
|
యూరియా
|
46
|
0
|
0
|
అమ్మోనియం నైట్రేట్
|
34
|
0
|
0
|
అమ్మోనియం సల్ఫేట్
|
21
|
0
|
0
|
కాలియం నైట్రేట్
|
16
|
0
|
|
మెగ్నిషియం నైట్రేట్
|
11
|
0
|
0
|
యూరియా అమ్మోనియం నైట్రేట్
|
32
|
0
|
0
|
పొటాషియం నైట్రేట్
|
13
|
0
|
46
|
ఎం.ఒ.పి
|
12
|
61
|
0
|
పొటాషియం క్లోరైడ్
|
0
|
0
|
60
|
పొటాషియం నైట్రేట్
|
13
|
0
|
46
|
సల్ఫేట్
|
0
|
0
|
50
|
పొటాషియం థయోసల్ఫేట్
|
0
|
0
|
25
|
యు.కె.పి.
|
0
|
52
|
34
|
ఫాస్ఫారిక్ఆసిడ్
|
0
|
52
|
0
|
ఎన్.పి.కె
|
13
|
19
|
19
|
20
|
20
|
20
|
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక