హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / ఫర్టిగేషన్ లో తీసుకోవల్సిన మెళకువలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఫర్టిగేషన్ లో తీసుకోవల్సిన మెళకువలు

ఫర్టిగేషన్ లో తీసుకోవల్సిన మెళకువలు గురించి తెలుసుకుందాం.

వ్యవసాయ రంగంలో ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని, ఉత్పాదకతలను సాధించే దిశగా ఏర్పరచుకున్న లక్ష్యాలలో అధిక ఉత్పత్తిని సాధించడమే కాకుండా ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం కూడా అతి కీలకమైన అంశం. అంతే కాకుండా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ, వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధిని సాధించడం కూడా ఆధునిక వ్యవసాయ పరిశోధనలలలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లక్ష్యాలను సాధించాలంటే పంటలకు అవసరమయ్యే నీటిని, పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించడమే మార్గం.

సమగ్ర సాగునీటి, పోషకాల యాజమాన్యంలో ఫర్టిగేషన్ పద్ధతి విప్లవాత్మక శకానికి నాంది పలికింది. ఈ పద్దతిలో సాగునీరు, పంటలకు అవసరమయ్యే పోషకాలు ఒకేసారి సమాంతరంగా సూక్ష్మనీటి పారుదల పద్దతిలో మొక్కలకు అందించబడతాయి. ఈ పద్ధతి వల్ల పంటల దిగుబడులు పెరగడమే కాకుండా పర్యావరణంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఫర్టిగేషన్ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాల దుష్ట్యా భారతదేశంతో సహా  ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఇప్పటికే సాగునీటి పద్దతులు అయిన భూ ఉపరితలాల డ్రిప్, భూమి లేపల నుండి చేసే డ్రిప్, మైక్రోస్ప్రింకర్లపై మక్కువ చూపిస్తున్నారు.

బిందుసేద్యం రైతుల్లో ఫర్టిగేషన్ మొక్కలకు నీటిలో పాటు నీటిలో కరిగే ఎరువులను అందించే పద్ధతి పట్ల పెరిగిన అవగాహన వల్ల రైతులు ఫర్టిగేషన్ వైపు ఆకర్షితులు అవుతున్నారు.

భారతదేశంతో సహా ప్రరంచ వ్యాప్తంగా ఫర్టిగేషన్ కింద విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చే ఇజ్రాయిల్ లాంటి దేశాల్లోనైతే దాదాపు 75 శాతం సాగు విస్తీర్ణం సూక్ష్మసాగునీటి పద్ధతి ద్వారానే పాగవుతోంది.

ప్రస్తుతం భారతదేశంలో మాత్రం ఫర్టిగేషన్ పద్ధతి వాడకం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సూక్ష్మపాగు నీటి పద్ధతుల కింద ఉన్న మొత్తం విస్తీర్ణం- 1.43 మి.హె కేవలం కొద్దిపాటి విస్తీర్ణంలో మాత్రమే ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల వాడకం సాంప్రదాయ పద్దతుల్లోనే అంటే, వెదజల్లడం గానీ, లేదా మొక్కల మొదళ్ళలో వేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఫర్టిగేషన్ పద్ధతుల వల్ల పోషకాలను ఖచ్చితత్వంతో మొక్క వేరు వ్యవస్థకు సూటిగా అందించే సౌలభ్యం ఉంది.

ఫర్టిగేషన్ ద్వారా మొక్క ఎదుగుదల దశలకు అనుగుణంగా వాటి అవసరాలను ఎప్పటికప్పుడు బేరాజు వేస్తూ వేరు ఎదుగుదల, కాండం అభివృద్ధి చెందే దశ, పూత, కాపు దశల్లో సిఫార్సు చేసిన పోషకాలను అందించే అవకాశం ఉంది.

ఫర్టిగేషన్ వల్ల కలిగే లాభాలు

 • మొక్కలకు/పంటకు ఖచ్చితత్వంతో పోషకాలను అందించవచ్చు.
 • ఈ పద్ధతిలో పంట పోషకాల అవసరాలను, ఎదుగుదల దశలను అలాగే వాతావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోవడం వల్ల పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
 • పంటలకు కావల్సిన మోతాదులో పోషకాల లభ్యత.
 • ఈదురు గాలుల వల్ల పోషకాలు వ్యర్థమయ్యే ప్రమాదం ఉండదు. అలాగే తక్కువ సామర్థ్యం గల సూక్ష్మ ప్రవాహం వల్ల భూమి పైపొర కోతకు గురికాదు.
 • సూక్ష్మ సాగునీటి పద్ధతుల వల్ల పంటల్లో సూక్ష్మ వాతావరణం పొడిగా ఉంటుంది. కాబట్టి పోగాల వ్యాప్తికి దోహదం చేసే శీలీంద్రాల ఎదుగుదల తక్కువగా ఉంటుంది.
 • ఎరువుల వాడకం 15 నుండి 40 శాతం వరకు, రసాయనిక మందుల వాడకం 20-30 శాతం వరకు, కూలీల అవసరం 10-15 శాతం అలాగే 20-25 శాతం యాంత్రిక శక్తి ఖర్చులు తగ్గుతాయి.
 • సాంప్రదాయ పద్ధతుల్లో ఎరువులను వెదజల్లడం, మొక్కల మెదళ్ళలో వేయడం లాంటి పద్ధతులలో పోలిస్తే ఫర్టిగేషన్ వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం రెట్టింపు అవుతుంది.
 • వాలుగా ఉన్న, పొలాల్లో అలాగే ఇతర సమస్యాత్మక భూములకు ఫర్టిగేషన్ చాలా అనుకూలమైన పద్ధతి. ముఖ్యంగా ఫర్టిగేషన్ పద్దతి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది.
 • ఫర్టిగేషన్ పద్ధతి వల్ల పంట దిగుబడులు దాదాపు 30 నుండి 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
 • ఫర్టిగేషన్ పద్ధతిలో పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే ఎరువులను నీటితో కలిపిన తక్షణం కరిగిపోయే స్వభావం ఉండాలి.

నీటిలో కరిగే రసాయనిక ఎరువులు

నత్రజని

యూరియా (40-0-0)

అమ్మోనియం నైట్రేట్ (34-0-0)

అమ్మోనియం సల్ఫేట్ (21-0-0)

కాల్షియం నైట్రేట్ (16-0-0), (15-0-0)

యూరియా అమ్మోనియం నైట్రేట్ (32-0-0)

పొటాషియం నైట్రేట్ (13-0-46)

మెగ్నీషియం నైట్రేట్ (11-0-0)

ఎం.ఎ.పి.(12-61-0)

పొటాష్

పొటాషియం క్లోరైడ్ (0-0-60) తెల్లది మాత్రమే

పొటాషియం సల్ఫేట్ (13-0-46)

పొటాషియం సల్ఫేట్ (0-0-50)

పొటాషియం ధయోసల్ఫేట్ (0-0-25) (ద్రావణం)

భాస్వరం

యూరియా ఫాస్ఫేట్ (17-44-0)

ఎం.ఎ.పి. (12-61-0)

ఎం.కె.పి (0-52-34)

ఫాస్ఫారిక్ ఆసిడ్ (0-52-0)

ఫర్టిగేషన్ పద్ధతి యాజమాన్యంలో కీలకమైన అంశాలు

ఫర్టిగేషన్ ద్వారా పంటల యాజమాన్యంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని, వాటికి అనుగుణంగా పోషకాలను ఏ దశళో ఎంత మోతాదులో వేయాలి అనే అంశాలను నిర్ణయిస్తారు.

ఫర్టిగేషన్ ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు

 • firtigationఎన్నుకునే పంట (రకం, పంట ఎదుగుదల దశ, నిర్ణీత విస్తీర్ణంలో మోక్కల సాంద్రత పంట పోశకాలను తీసుకునే విధానం లక్ష్యంగా పెట్టుకున్న దిగుబడులు)
 • సాగు విధానం.
 • భూ భౌతిక, రసాయనిక లక్షణాలు (నేల స్వభావం, లవణ పరిమాణ సూచిక, ఉదజని సూచిక, బంక శాతం, భూసారం, సేంద్రీయ కర్బనం)
 • వాతావరణ పరిస్థితులు.
 • సాగునీటి నాణ్యత.

పైన సూచించిన విదంగా ఫర్టిగేషన్ యాజమాన్యం వివిధ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది.

 • మధ్యస్థం నుండి లోతైన రేగడి భూముల్లో ఫర్టిలైజరు ట్యాంకు పరికరాన్ని వాడుకోవలి. అలాగే తేలికపాటి భూముల్లో ఫర్టిలైజర్ ఇంజెక్టరు పరికరాన్ని వాడుకోవాలి.
 • ప్రతిరోజు ఫర్టిగేషన్ ద్వారా పోషకాలను అందించడం అత్యంత శ్రేయస్కరం, వీలుకాకపోతే వారానికి రెండుసార్లయిన ఫర్టిగేషన్ పెట్టుకోవాలి.
 • పంట పోషకాల అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవలి. ఎంపిక చేసుకునే ఎరువు పొషకాలను అందించడమే కాకుండా అవసరమయితే నీటి ఉదజని సూచికను సవరించేదిగా ఉండాలి.
 • సాగునీటిలో ఎక్కువ మోతాదు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, ఇనుము లేదా మాంగనీసు గనుక ఉంటే ఇవి ఎరువులతో చర్య జరిపి ఎరువుల సామర్థ్యాన్ని తగ్గిస్తాయని రైతులు గుర్తించుకోవాలి.
 • సాధారంణంగా దొరికే యూరియా, తెల్లరకం మ్యూరేట్ ఆఫ్ పొటాష్, నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులతో కలపడం వల్ల పంట నత్రజని, భాస్వరం, పొటాష్ ల అవసరాలను తీర్చుకోవచ్చు.
 • పంటలకు సిపార్సు చేసిన మోత్తం పోషకాలను పూర్తి పంట కాలంలో అందించే విధంగా రోజువారీ మొతాదును లెక్కగట్టుకోవలి.
 • ద్రవ లేదా పొడి రూపంలో ఉండే రసాయనిక ఎరువులను ట్యాంకుల్లో కలిపేటప్పుడు ట్యాంకులో 50-75 శాతం నీళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి.
 • ఫర్టిగేషన్ వ్యవధి ఎప్పుడూ సాగునీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి.
 • ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించాలి. దీనివల్ల పొలం అంతటా సమానమైన ఒత్తిడితో నీరు విడుదల అవుతుంది.
 • డ్రిప్ సిస్టంను కొద్దిసేపు నడిపి, నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిగేషన్ ప్రారంభించాలి.
 • చెరకు పంటకు గాను ఫర్టిగేషన్ ద్వారా అందించేందుకు అవసరమయ్యే వివిధ ఎరువుల మొతాదులను కింద ఇవ్వబడిన పట్టికలో చూడవచ్చు.

నీటిలో కరిగే రసాయనిక ఎరువుల మొతాదు (కి/హె/రోజుకు)

నాటిన 20-80 రోజులకు : యూరియా (46-0-0) (17-44-0) – 0.50, యూరియా ఫాస్ఫేట్ (0-0-60) – 1.25

నాటిన 81-160 రోజులకు : యూరియా (46-0-0) (17-44-0) – 0.50, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (19-19-19) – 0.25

నాటిన 161-210 రోజులకు : యూరియా (46-0-0) (17-44-0) – 0.60, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (19-19-19) – 0.75

ఫర్టిగేషన్ ఎరువుల వివరాలు

యూరియా, అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం నైట్రేచ్, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పొటాషియం ఫాస్ఫేట్, పొటాషియం నైట్రేట్.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.01086956522
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు