హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / బిటి ప్రతి హైబ్రిడ్ రకాల పరిశీలన నివేదిక
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బిటి ప్రతి హైబ్రిడ్ రకాల పరిశీలన నివేదిక

బిటి ప్రతి హైబ్రిడ్ రకాల పరిశీలన నివేదిక

ప్రతిలో కయ తొలుచు పురుగు తాకిడికి కుదేలైన ప్రతి రైతుకు ఆశికిరణంలా.. రోదికింది హైబ్రిడ్ ప్రతి ! కానీ దళారుల జిమిక్కుకు మోసపోయిన రైతు కొన్ని బిటి హైబ్రిడ్ రకాలను మాత్రమే ఆర్థిక దిగిబడినిస్తాయని భ్రమపడి... పోటీపడి.. దళారుల మోసానికి గురై... నష్టపోతున్నారు ! ఫలితం... లాభం దళారులకు.... సమయము, డబ్బు నష్టపోవటం ,కొన్నిసార్లు నకిలీ విత్తనములు ద్వారా పంట కూడా నష్టపోవటం రైతుకు జరుగుతుంది.

ఈ పరిస్థితిని గమనించిన వ్యవసాయ శాఖా కమిషనర్ శ్రీ కే . మధుసూధనరావు గారు వివిధ రకాల బిటి హైబ్రిడ్ ప్రతి రకాలు పనితీరు, దిగుబడి వృత్యాసాలను ఏరువాక శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులతో కలిసి 10  గ్రామాలలో పరిశీలించవలసినదిగా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆత్మను ఆదేశించటమైనది.

వరి ఆదేశానుసారం ఆత్మా (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ) గుంటూరు ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ అధికారులు మరియు ఏరువాక శాస్త్రవేత్తల సహకారంతో గుంటూరుజిల్లాల్లో ఆర్థిక విస్తీర్ణంలో ప్రతి పండించు ప్రాంతాలలో 10  గ్రామాలను ఎన్నుకొని, ఆ గ్రామాలలో రైతులు విరివిగా సాగుచేయుచున్న 19  రకాల బిటి హైబ్రిడ్ ప్రతి రకాలను పరిశీలనను కొరకు ఎన్నుకోవడం జరిగింది.

పంటకాలంలో 60  వ రోజు , 90  రోజు మరియు 120  వ రోజులలో పంట ఎదుగుదల పూతసంఖ్య, కాయలసంఖ్య, కొమ్మలసంఖ్య, నూగు వివిరాలు, ఆశించిన చీడపీడల వివరాలు సాగుపద్ధతులను గమనించడం జరిగినది. అలాగే దిగుబడి వివరాలు, ఖర్చు, నికరాదాయం విశ్లేషించడం జరిగింది.

పది గ్రామాలలో 19  రకాల బిటి ప్రతి హైబ్రిడ్ పనితీరును పరిశీలించగా దిగుబడి ఎకరాకు 8  నుండి 16 క్విన్టలు నమోదు చేయడమైనది. అయితే ఈ దిగుబడి వృత్యాసాలకు కారణాలను విశ్లేషించగా ప్రతి దిగుబడి పంట యాజమాన్య పద్ధతులు, ఆయా గ్రామాలలోని వాతావరణ పరిస్థితులు ముఖ్యనగ వర్షపాతం మీద ఆధారపడినదని  తెలియచున్నది. అంతేకాని బిటి ప్రతి హైబ్రిడ్ రకాల ఎన్నికపై కాదని సుస్పష్టంగా తెలిసినది. ఉదాహరణకు మట్టి చెరుకూరు గ్రామంలో ఎంపికచేయబడిన 4  బిటి ప్రతి హైబ్రిడ్ రకాల దిగుబడిని పరిశీలించగా దిగుబడి ఇంచుమించు ఒకేవిధముగా ఎకరాకు 13  నుండి 14  క్విన్టల్ల దిగుబడి నమోదు కాగా జగ్గాపురం గ్రామంలో ఎంపికచేయబడిన 3 బిటి ప్రతి హైబ్రిడ్ రకాల దిగుబడులను పరిశీలించగా ఇంచుమించు ఒకేవిధముగా ఎకరాకు 8 -9  క్విన్టల్ల దిగుబడులు నమోదు అయినవి. అంతేకాదు జాదూ బిటి ప్రతి హైబ్రిడ్ రకము, ఒక గ్రామంలో ఎకరాకు 11 .5  క్విన్టల దిగుబడిని ఇవ్వగా, అదే ప్రతి రకము వేరొక గ్రామములో ఎకరాకు 16  క్విన్టల్ల దిగుబడిని ఇచ్చింది.

చివరిగా ఆత్మా, వ్యవసాయశాఖాధికారులు, ఏరువాక శాస్త్రవేత్తలు కలిపి నిర్వహించిన అధ్యయనంలో ఈ క్రింది విషయములు నిరూపితమైనవి.

1  బిటి ప్రతి హైబ్రిడ్ దిగుబడి వాతావరణ పరిస్థితులు ముఖ్యముగా వర్షపాతపై ఆధారపడినది.

2 . ప్రతి సాగులో సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులు పాటించుట వలన తక్కువ ఖర్చుతో ఆర్థిక దిగుబడితో పటు, నికరాదాయాన్ని పొందవచ్చు.

3  మార్కెట్ లో లభించు అన్ని కంపెనీల, అన్ని బిటి ప్రతిరకాలు ఇంచుమించుగా ఒకేవిధమైన దిగుబడులను ఇస్తున్నాయి.

4 . ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులు సూక్ష్మధత బోపాలు అన్ని రకాల బిటి హైబ్రిడ్ ప్రతిలో గమనించుటమైనది.

5 . పై విషయాలను గ్రహించని రైతు కొన్నిరకాల బిటి ప్రతి హైబ్రిడ్ ల కొరకై తాపత్రయ పాడుతా వలన దళారుల మోసాలకు ఎక్కువగా గురై చివరకు నష్టపోయేది రైతే!

వట్టి చెరుకూరు గ్రామంలో రైతు స్థాయిలో ప్రదర్శన క్షేత్ర

నిర్వహణ కొరకు బి.టి. ప్రతి హైబ్రిడ్ రకాలు- వీటి దిగుబడి వివరములు

వ.నెంబి.టి. హైబ్రిడ్ రకముమొక్క ఎత్తుకొమ్మల సంఖ్యమొగ్గలా సంఖ్యకాయల సంఖ్యఆశించిన పురుగుల/ తెగుళ్లు దిగుబడి(క్వి )పోగు ఖర్చు
1 . జాక్పాట్ 120 34 39 27 తెల్లదోమ 14 22 ,000
2 . జాదూ 125 36 33 38 తెల్లదోమ 14 22 ,000
3 . బీటా 130 31 48 32 తెల్లదోమ 13 22 ,000
4. నందిని 110 27 31 23 తెల్లదోమ , పేమ 12 22 ,000

జగ్గాపురము గ్రామంలో రైతు స్థాయిలో ప్రదర్శన క్షేత్ర

నిర్వహణ కొరకు బి.టి. ప్రతి హైబ్రిడ్ రకాలు- వాటి దిగుబడి వివరములు

వ.నెంబి.టి. హైబ్రిడ్ రకముమొక్క ఎత్తుకొమ్మల సంఖ్యమొగ్గలా సంఖ్యకాయల సంఖ్యఆశించిన పురుగుల/ తెగుళ్లు దిగుబడి(క్వి )పోగు ఖర్చు
1 భాస్కర్-9 160 32 19 22 తెల్లదోమ 9.5 20,000
2 మల్లికా బి.టి.-2 110 25 16 14 తెల్లదోమ 9 25,000
3 . గబ్బర్ 120 22 39 23 తెల్లదోమ 8 23,000

వివిధ గ్రామములలో రైతు స్థాయిలో నిర్వహించిన ప్ప్రదర్శన క్షేత్రములో నమోదు చేసిన జాదూ బి.టి. ప్రతి హైబ్రది దిగుబడి వివరములు

వ.నెంబి.టి. హైబ్రిడ్ రకముమొక్క ఎత్తు కొమ్ల సంఖ్యమొగ్గలా సంఖ్యకాయల సంఖ్యఆశించిన పురుగుల/ తెగుళ్లుదిగుబడి(క్వి )పోగు ఖర్చు
1 మిట్టపాలెం 130 32 38 36 తెల్లదోమ, పేమ 16 20,000
2 వట్టిచెరుకూరు 125 36 33 38 తెల్లదోమ 14 22,000
3 యర్లపాడు 150 18 34 21 పేమ 13.3 22,000
4 గుడిపూడి 150 33 33 43 ఎర్రవెల్లి, పేమబంక 12.5 22,000
5 నరేండ్ల 125 38 52 36 పేమ 12 30,000
6 ముక్కముల 149.7 29 26 39 తెల్లదోమ , ఎర్రవెల్లి 11.5 15,000
7 అంజనీ పురం 150.6 30 34 40 తెల్లదోమ, పేమ 11.5 10,000

పరిశీలన: పై పట్టికలను పరిశీలించిన బి.టి. నిజేహి హైబ్రిడ్ రకముల దిగుబడి ఎంపికకన్నా వాతావరణ పరిస్థితులు మరియు సేద్య పద్దతులపై ఆధారపై విదితమైనది.

ఆధారము :  వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ

3.10638297872
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు