অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భూసారం – సేంద్రియ ఎరువుల ఆవశ్యకత

పైర్లకు కావాల్సిన పోషకాలను అందించడానికి ఎరువులు వేయాలి. మొక్కలు, జంతువులు, మానవుల అవశేషాల నుండి తయారయ్యే వాటిని సేంద్రియ ఎరువులు అంటాం.

సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. 1960 వరకు రైతులు సేంద్రియ ఎరువుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ఎంతో ఉపయోగం ఉన్న విటి వాడకం నేడు చాలా వరకు తగ్గిపాయింది. వ్యవసాయం యంత్రికరణకు గురైన తరువాత రైతు ఇంట్లో ఉండే పాడి పశువులను అమ్మివేయడం జరిగింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్న పశువులు పదుల/వందల సంఖ్యకు పడిపోయాయి.

చైనా దేశంతో పోల్చకుంటే మన నేలలు అధిక దిగుబడులను ఇస్తాయి. కానీ చైనా రైతులు అధికంగా సేంద్రియ ఎరువులను వాడతారు. మన రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించడం వలన దిగుబడులు అనేవి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో హరిత విప్లవం పచ్చిన తరువాత, రైతులు అధికంగా పంట దిగుబడులను పెంచడం కోసం అధిక మోతాదులో విచక్షణా రహింతంగా రసాయనిక ఎరువులను వేయడం పల్ల క్రమేషి భూములు నిస్సారమయి అల్ప పోషక పదార్ధం లోటు (సుక్ష్మ పోషక పదార్ధాలు ముఖ్యంగా జింకు, ఇనుము) కు గురయ్యింది. ఎక్కువ దిగుబడులనే సాధించాలనే ఉన్ద్దేశంతో రైతులు అధిక మోతాదులో నత్రజని ఎరువులను యూరుయా రూపంలో వేయటం, వేసే విధానం సక్రమంగా పాటించకుండా ఎరువులను వెదజల్లడం వంటి పద్ధతులను ఆచరించడం వలన ఎరువులు సక్రమంగా వినియోగ పడక పంట నాణ్యత కోల్పోతుంది. సేంద్రియ ఎరువులను వాడటం వలన భూమి భౌతిక లక్షణాలను కొల్పొయి పోషకాల మధ్య సమతుల్యత దెబ్బతినడం వలన సుక్ష్మపోషక లోపాలు, చీడ పీడలను తట్టుకునే శక్తిని కొల్పొయి తక్కువ నాణ్యత దిగుబడి వస్తోంది. ఇప్పటికి రసాయనిక ఎరువులు వాడటం వలన నిస్సారమైన భూములను తిరిగి సారవంతం చేయడానికి రైతులు సేంద్రియ ఎరువులు వాడకం పై దృష్టి పెట్టి నాణ్యత గల పంటను పండించుకోవాలి.

సేంద్రియ ఎరువులను రెండు రకాలుగా విభజించపచ్చు.

  1. స్థూల సేంద్రియ ఎరువులు
  2. చిక్కటి సేంద్రియ ఎరువులు.

స్థూల సేంద్రియ ఎరువులు

ఇందులో పశువుల ఎరువు, మేకల, గొర్రెల, పంది ఎరువు, కంపోస్టు ఎరువు, కోళ్ళ ఎరువులు ఒక రకానికి చెందినవి. కాగా పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు ఇంకో రకానికి చెందినవి. స్ధుల ఎరువులలో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ నేల ఫలదాత భూభౌతిక లక్షణాలను మెరుగు పరచడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.

 

పశువుల పేడ ఎరువు

రైతులు ఉపయోగించే ఎరువుల్లో ముఖ్యమైనవి. వాడుకలోనున్నది. దీనిని జాగ్రత్తగా ఒక గోయ్యిలో భద్రపరిస్తే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. పశువుల కొట్టం దగ్గరగా సుమారు వీలును బట్టి 20-25 అడుగుల పొడవు, 5-6 అంగుళాల వెడల్పు, 3 అడుగుల లోతు ఒక గొయ్యి తవ్వి పశువుల పేడ, మూత్రం, తడిసిన చెత్త పశువులు తినగా మిగిలిన గడ్డి గుంతలో ఒక వైపు నుండి పోసుకురావాలి. గొయ్యి నిండిన తర్వాత 2-3 క్రిలోల సూఫర్ ఫాస్ఫేట్ మట్టి బురద తడపడం బురదలో కప్పాలి. 3-4 నేలల తర్వాత ఎరువు బాగా చివికి (మాగి) పొలానికి (మే మాసంలో) వుంచి సేంద్రియు ఎరువుగా తయారవుతుంది. కానీ రైతులు గ్రామంలో పశువుల పేడను ఎరువుగా తయారవుతుంది. కానీ రైతులు గ్రామంలో పశువుల పేడను చెత్తను ఒక కుప్పగా పోయడం ద్వారా అది ఎండకు ఎండి, వానకు తడిసి ఉండడం వలన పోషక విలువ తగ్గిపోయే అవకాశం ఎక్కువ.sendriya

కాబట్టి ఒక గోతిలో వానకు తడవకుండా ఎండకు ఎండకుండా మట్టిలో కప్పి ఉంచితే మంచి పోషకాలు కలిగి ఉంటుంది. ఇందులో నత్రజని పోషకం 0.5-1.5 శాతం, భాస్వరం - 0.3-0.9 శాతం, పొటాషియం - 0.5-1.9 శాతం ఉంటాయి.

గోబర్ గ్యాస్ ఎరువు

పశువుల పేడ నుండి తయారవుతుంది. ఇంటిలో సారవంతమైన సేంద్రియ ఎరువు ఉంటుంది. నత్రజని సుమారు 2–2.4 శాతం వరకు ఉంటుంది.

కంపోస్టు ఎరువు

గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ప్రాంతంలో లభ్యమయ్యే చెతాచెదారం, రాలిన ఆకులు, గుర్రపుడెక్క పార్టీనియం జిల్లెడు వంటి కలుపు మొక్కలు, కుళ్ళిన కూరగాయలు, పండ్లు, వరి ఊక, చెరకు పిప్పి, రంపపు పొట్టు, వేరుశనగ పొట్టు, వేరుశనగ పొట్టు, పశువుల మూత్రంలో కలిసిన పేడను కంపోస్టు తయారీకి ఉపయోగించవచ్చు. కంపోస్టు ఎరువును రైతు స్థాయిలో ఒక మీటరు లోతు రెండు మీటర్ల వెడల్పు అవసరమైన పొడవు గల గోతిని తవ్వాలి. అందులో వ్యర్థ పదార్థాలను వరుసగా వేసూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంత చల్లుతూ 8-10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి పైభాగాన్ని పేడ మట్టితో అలకాలి. 3-4 నెలల్లో మంచి సేంద్రియ పదార్థం తయారవుతుంది. పట్టణాల్లో నిత్యం తయారవుతున్న వేల టన్నుల వ్యర్థ పదార్థాలను తగలబెట్టకుండా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఇలాంటి కంపోస్టు ఎరువు తయారీకి వాడితే మనకు సేంద్రియ ఎరువు సులభంగా లభ్యమయ్యే అధిక దిగుబడిని సాధించవచ్చు. దీనికి పరిశ్రమల నుండి పచ్చి వ్యర్ధ పదార్థాలు, మానవ మల మూత్ర,, పట్టణ వ్యర్థాలను ఉపయోగించుకుంటే కాలుష్యాన్ని అరికట్టి విలువైన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందులో నత్రజని 0.5-2 శాతం, భాస్వరం 0.4-3.3 శాతం, పొటాషియం - 0.8-2 శాతం వరకు లభ్యమవుతుంది.

కోళ్ళ ఎరువు

మన రాష్ట్రంలో కోళ్ళ పెంపకం భాగా అభివృద్ధి చెందింది. కోళ్ళ ఫారాలు ఉన్నచోట తగినంత కోళ్ళ ఎరువు లభ్యమవుతుంది. సాలీనా సుమారు 5 లక్షల టన్నుల కోళ్ళ ఎరువు లభిస్తుందని అంచనా. 40 కోళ్ళు నుండి ఒక సంవత్సరంలో ఒక టన్ను ఎరువు తయారవుతుంది. షెడ్లో కోళ్ళ కింద వేసిన పొట్టు, మల మూత్రాలతో కలిసి చివికి మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. కేజెస్లోని ఎరువు (45 శాతం తేమ కలది)లో 2.2 శాతం నత్రజని 1.3 శాతం భాస్వరం 1.0 శాతం పొటాష్ ఉంటాయి. తేమ తగ్గే కొద్ది పోషక శాతం పెరుగుతుంది. కోళ్ళ ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు ఉపయోగపడుతాయి. నత్రజని 3 శాతం, భాస్వరం 2 శాతం, పొటాషియం 3 శాతం ఉంటాయి.sendriyatwo

గొర్రెల/మేకల ఎరువు

గొర్రెల, మేక దొడ్లలో వచ్చిన ఎరువును అలాగే భద్రపరిచి పొలానికి వాడుకోవచ్చు. ఈ జీవాలను సాధారణంగా ఎండాకాలంలో పొలంలో రాత్రిపూట మందకొట్టడం అలవాటుగా వస్తుంది. వీటి మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడడతాయి. మంద కొట్టడం పూర్తికాగానే పొలాన్ని ఒక్కసారి దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృథా కాకుండా ఉపయోగపడతాయి. గొర్రెల ఎరువుల్లో నత్రజని 0.5-0.7 శాతం, భాస్వరం 0.4-0.6 శాతం, పొటాషియం 0.1-3 శాతం.

పచ్చిరొట్ట ఎరువులు

నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం సులువైన చౌకైన పద్ధతి పప్పుజాతి (లెగ్యూమ్స్) పచ్చిరొట్టకు బాగా పనికి వస్తాయి. ඩීඩීඑම් සීපාර, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, అవిశె పైర్లు ముఖ్యమైనవి. ఈ పైర్లు వేసి పూతకు వచ్చే సమయంలో నేలలో కలియదున్ని ఎరువుగా ఉపయోగించుకోవడాన్ని పచ్చిరొట్ట ఎరువు (గ్రీన్ మెన్యూరింగ్) అంటారు. ఈ పైర్లు పెరగడానికి తగినంత తేమ, నేలలో నీటి వసతి ఉండాలి. జీలుగ, జనుము, అలసంద పైర్లు ఎకరానికి 5 నుండి 7 టన్నులు, పిల్లిపెసర, పెసర, మినుము పైర్లు సుమారు 3 టన్నుల పచ్చిరొట్టనిస్తాయి. వీటిని నేలలో కలియదున్నిన తర్వాత బాగా నీరు పెట్టి 2 వారాల పాలు మరగనివ్వాలి.

జీలుగ - నత్రజని 0.62 శాతం, భాస్వరం 0.15 శాతం, పొటాషియం 0.46 శాతం.

జనుము - నత్రజని 0.75, భాస్వరం 0.12, పొటాషియం 0.51

పచ్చి ఆకు ఎరువులు

అందుబాటులో ఉన్న చోట నుండి చెరువు గట్లు, కాలువ గట్లు, పొలం గట్లు, బంజరు భూములు, అడవి ప్రాంతాలలో పెరిగే అన్ని రకాల మొక్కల నుండి పచ్చి ఆకులు సేకరించి పొలంలో వేసి ఎరువుగా ఉపయోగించడాన్ని పచ్చి ఆకు ఎరువు (గ్రీన్ లీఫ్ మ్యాన్యూరింగ్) అంటూరు. పచ్చిరొట్ట పైర్లు పెంచడానికి వీలు లేనప్పుడు లేదా ప్రధాన పంటలు వేయడానికి మధ్యలో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు పచ్చిఆకు ఎరువులు ఉపయోగించుకోవచ్చు. కానుగ, గై రిసీడియా, ఐసోమియ (తాటాకు), తంగేడు, వేప, జిల్లేడు, గుర్రపు డెక్క వంటి మొక్కలు పచ్చి ఆకు ఎరువుగా బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి పెంచే కానుగ, గైరిసీడియా మొక్కల నుండి సంవత్సరానికి రెండుసార్లు ఆకులను కోయవచ్చు. ఒక మొక్క నుండి ఏటా సుమారు 100 కిలోల రొట్ట లభిస్తుంది. నజ్రతని 1-1.5 శాతం, భాస్వరం 4–4.5 శాతం, పొటాషియం 2–7 శాతం.

చెరుకు మడ్డి

ఇది చెరకు ఫ్యాక్టరీ నుండి ఉత్పత్తిగా లేదా వ్యర్థ పదార్థంగా వెలువడుతుంది. వంద టన్నుల చెరకు నుండి 3-4 టన్నుల చెరకు మడ్డి లభిస్తుంది.

పంది ఎరువు

నత్రజని 3.75 శాతం, భాస్వరం 3.13 శాతం, పొటాషియం 2.5 శాతం.

వానపాము ఎరువు

వానపాములు సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మికల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మీ కాస్టింగ్స్ అని వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మీ కంపోస్టు అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలేసిన, కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్తాచెదారం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. వర్మీ కంపోస్టు తయారు చేయడానికి రెండు రకాల వానపాములను ఉపయోగించవచ్చు.

  1. భూమిపై పొరలలో ఉండేవి బొరియలు చేయని రకాలు - ఐసినియా, ఫొటేడా, యుండ్రిలస్ యుజుని.
  2. భూమి లోపల పొరలలో ఉండేవి (బొరియలు చేసే రకాలు): వీటిని ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా యోసియూటికా రకాలు ముఖ్యమైనవి.

ఈ రెండు రకాలలో నేలపై పొరలలో సంచరించే రకాలు కంపోస్టును త్వరితంగా తయారు చేయడానికి అనువైనవి. త్వరగా కంపోస్టు తయారీకి 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత బాగా అనుకూలమైనది. 30-40 శాతం తేమ ఉండాలి. 2x2.5 మీటర్ల గుంతలు తీసి వర్మీ కంపోస్టు బెడ్స్ తయారు చేయాలి. అడుగు భాగంలో కొబ్బరి పీచు, చెరకు ఆకు, కొబ్బరి ఆకు వేయాలి. సులభంగా కుళ్ళే వ్యర్ధి పదార్థాలతో గుంతను పూర్తిగా నింపాలి. నత్రజని - 1.5-3 శాతం, భాస్వరం - 0.5-2.2 శాతం, పొటాషియం - 11-175 .

చక్కటి సేంద్రియ ఎరువులు

 

నత్రజని

ఫాస్ఫరస్

పొటాషియం

వేరుశనగ పిండి

6.5-7.5

1.3

1.5

నువ్వుల పిండి

4.7-6.2

2.0

1.3

వేపపిండి

5.2-5.6

1.1

1.5

ఆముదపు పిండి

4-4.4

1.9

1.4

కానుగ పిండి

3.9-4.0

0.9-1.0

1.3-1.4

పత్తిగింజల పొడి

3

2.5

1.6

పొగాకు పేస్ట్

1.2

0.8

0.8

రక్తపు పొడి

10

1.2

0.7

చేపట పొట్టు

4-10

3-10

0.3-1.5

సేంద్రియ ఎరువుల వాడకం వలన నేలలో అనేక ప్రయోజనకరమైన మార్పులు కలుగుతాయి. సేంద్రియ పదార్ధం భౌతిక లక్షణాలను మెరుగు పడుతుంది. బరువు నేలలు గుల్లబారి మొక్కల వేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు ఇంకడం పెరిగి మరుగు సౌకర్యం మెరుగవుతుంది. ఇసుక, ఎర్ర దుబ్బ చల్క నేలల్లో మట్టి రేణువులు అమరికను క్రమబద్ధం చేస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచుకునే శక్తి పెరగడానికి దోహదం చేస్తుంది. వర్వాభావం ఏర్పడినప్పుడు నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించడానికి తోడ్పడే సూక్ష్మజీవులకు సేంద్రియ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతుంది.

ముఖ్య పోషకాలే కాకుండా మిగిలిన అన్ని పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. సేంద్రియ పదార్థం మరింతగా చివికి (మాగి) మార్పు చెంది హ్యూమస్ అనే విలువైన తయారవుతుంది. ఇవి పోషకాలను అధికంగా పట్టి ఉంచి మొక్కలకు సమర్థవంతంగా అందిస్తుంది. చౌడు భూములకు సేంద్రియ ఎరువులు అత్యంత ప్రయోజనకరం. ఆమ్ల నేలల్లో, క్షార నేలల్లో హానికరమైన లక్షణాలను తగ్గిస్తుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate