హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / మిరపలో ఎరువుల ఖర్చు తగ్గించే పరికరం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మిరపలో ఎరువుల ఖర్చు తగ్గించే పరికరం

మిరపలో ఎరువుల ఖర్చు తగ్గించే పరికరం.

ఖమ్మం జిల్లాలో పండించే ముఖ్యమైన వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైనది. మిరప పంట సాగు చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం. మిరప పంట సాగులో భాగంగా అధికంగా రైతుకు ఖర్చు అయ్యే అంశాలలో ఎరువుల వినియెగం ముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు, శాస్రివేత్తలు సిపార్సు చేసిన మేతదు కంటే అధికంగా ఎరువులను వినియెగించడం జరుగుతుంది. దీని వలన రైతుకు సాగు ఖర్చు మితిమీరిన భారంగా మారుతుంది. ఎరువులను పంటలో "మొక్క వేరు వ్యవస్ధ వద్ద వేయడం (పికెటింగ్)" పద్ధతి ద్వారా కూలీలు అధిక సంఖ్యలో కావాల్సివస్తుంది. మీరు ముఖ్యంగా పంట సమయంలో కూలీలు దొరకడం అనేది రైతుకు ఒక సవాలుగా మారింది.

ఈ సమస్యల దృప్తియా ఎల్లాపురం గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లాకు చెందిన రైతు తుమ్మల రాణా ప్రతాప్, ఎరువుల ఖర్చు తగ్గించే పరికరం (ఫర్టిలైజర్ అప్లికేటర్) ని రైతులందిరికి ఉపయెగపడేలా రూపొందించడం జరిగింది.

పరికరం రూపకల్పన

పదిహేను కిలోల ఎరువులను వేసుకునే సామర్ధ్యం గల ఇనుపరేకును తీసుకొని దాన్ని గఱతు రూపంలో మలచి, ఈ పరికరాన్ని గొర్రెలు అమర్చి సులువుగా ఎరువులను చేయడమేకాకుండా మొక్క దగ్గర పడి సమగ్రంగా వినియెగించుకునే లాగ సాధ్యపడుతుంది. అదేవిధంగా ఈ పద్దతిని, సంప్రదాయ పద్దతిలో (పికెటింగ్) పోల్చుకున్నట్లెతే ఫర్టిలైజర్ అప్లికేటర్ ద్వారా ఒకేసారి ఎరువులను మరియు అంతరకృషి చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. సంప్రదాయ పద్దతిలో ఎరువులను ఒకసారి అంతరకృషి ఒకసారి చేసుకోవడం జరుగుతుంది. దీని వలన రైతుకు ఖర్చు మరియు సమయం కూడా ఎక్కువగా అవడం జరుగుతుంది. కానీ ఈ సమస్య ఫర్టిలైజర్ అప్లికేటర్ ద్వారా పరిష్కారం అయ్యేవిధంగా రూపొందించబడింది. ఏకకాలంలో ఎరువులను వేయడం, అంతరకృషి చేసుకునేవిధంగా ఉండడం వలన రైతుకు ఎంతో శ్రమను తగ్గించే విధంగా వీలుపడుతుంది. ఇదే కాకుండా అనేక లాభాలను రైతు రాణాప్రతాప్ మరియు కృషి విజన్ కేంద్రం, వైరా శాస్రివేత్తలు గమనించడం జరిగింది. వీటిలో చూసుకున్నట్లెతే మఖ్యంగా రైతుకి కూలీలా ఖర్చు తగ్గిపోయి సాగు ఖర్చు తగ్గిపోవడం, ఎక్కువ సమయం అవసరం లేకుండా తక్కువ సమయం లోనే ఎరువులను వేసుకోవడం, వృధా కాకుండా మొక్కకు సంపూర్ణంగా ఉపయెగించుకొనేలా ఈ పరికరం దోహద పడుతుంది.

కృషి విజాన కేంద్రం శాస్రివేత్తల సహకారం

రైతు రాణా ప్రతాప్ తనకు మీదట పరికరాన్ని రూపొందించాలని వచ్చిన ఆలోచనతో మీదట కృషి విజాన కేంద్రం, వైరాకు వచ్చి శాస్ర్తవేత్తలు సంప్రదించినప్పుడు, శాస్తయివేత్తలు ఆ పరికరం రూపుడిదెలాగా తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలతో పరికరం రూపుదిద్దిన తర్వాత పరికరం పని తీరును గమనించి దాని ఎక్కసామర్ధ్యాన్ని, లాభనష్టాలను, పరిశీలించడం జరిగింది. పరికరం యెక్క లాభాలను చూసి ఆ సాంకేతికతను ఎక్కువ మంది రైతులకు చేరేవిధంగా రైతు రాణా ప్రతాప్ తో పాటు శాస్రివేత్తలు విస్తృరితంగా వ్యాపింపజేశారు.

పరికరం పనితీరు

సంప్రదాయ పద్దతిలో ఎరువు వేసేటప్పుడు ఎక్కువ మంది కూలీలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే మిరపలో ఎరువు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా పికెటింగ్ పద్దతిలో ఎరువు వేసే పద్దతిలో, నలుగురు ఖాళీలు 6 గంటల సమయంలో కేవలం ఒక ఎకరంలో మాత్రమే ఎరువు వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతు రాణా ప్రతాప్ రూపొందించిన ఫర్టిలైజర్ అప్లికేటర్ ద్వారా మిరపలో ఎరువు వేయడం ద్వారా కేవలం ఇద్దరు కూలీలతో ఒక ఎకరం విస్తీర్ణంలో గంట సమయంలోనే ఎరువు వేయవచ్చిని రైతు తెలియజేశారు. ఈ క్రమంలో 6 గంటల వ్యవధిలో కేవలం ఇద్దరు కూలీలతో మాత్రమే 6 ఎకరాల విస్తీర్ణంలో ఎరువు వేయడం ద్వారా కూలీలా కొరతను అధిగమించడమేకాకుండా తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో పార్టీలైనర్ అప్లికేటర్ ద్వారా ఒకేసారి ఎరువు వేయడం మరియు అంతరకృషి చేయడం ద్వారా ఎరువుల వినియెగం సామర్ధ్యం పెరగటంతో పాటుగా రెండు పనులు ఒకేసారి చేయటానికి వీలు కలుగుతుంది. కాబట్టి రైతులు సమయాను కులంగా మిరపలో ఎరువులు అవకాశం వుందని రైతు తెలియజేశారు.

ఫర్టిలైజర్ అప్లికేటర్ మరియు పికెటింగ్ పద్ధతి ద్వారా వేసే ఎరువుల వ్యత్యాసాన్ని ఈ క్రంది పట్టికలో చూపించబడింది.

క్ర.సం.

వివరాలు

సంప్రదాయ విధానం

ఫర్టిలైజర్ అప్లికేటర్

1.

పనిచేసే విధానం

కూలీలతో (పికెటింగ్)

పశువులతో (ఫర్టిలైజర్ అప్లికేటర్)

2.

కూలీలా సంఖ్య

4

2

3.

ఖర్చు / ఎకరానికి

రూ.1000

రూ.500

4.

కేటాయంచిన సమయం / ఎకరానికి

6 గం.

1 గం.

(6 గం.కు., 6 ఎకరాలు )

5.

సాళ్ళు

1

2

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.975
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు