పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మెట్టసాగులో మెళకువలు

మెట్టసాగులో మెళకువలు.

 • ఆంధ్రప్రదేశ్  లో 65  శాతము వ్యవసాయ వర్షాధారంగానేన్ జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో  సరాసరి వర్షపాతం 700 -1500  మీ.మీ. రాయలసీమలో 544-826  మీ.మీ. మరియు కోస్తా ఆంధ్రలో 757-1130  మీ.మీ. ఈ మూడు ప్రణతాల్లోనూ మోత్తాసగు జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో ఎర్రనేలలు 65  శాతం, నెల్లనేలలు 35  శాతం వున్నాయి.
 • భూసంరక్షణ : వర్షం తక్కువగానుం, సకాలంలోనూ పడక పోవటం వలన పంటల దిగుబడియూలో చాల వృత్యాసముంటుంది. మొత్తసాగులో భూసంరక్షణ మరియు ఆధునిక మొట్ట వ్యవసాయ సాగు పద్దతులను సారించి అధిక దిగుబడులను సాధించవచ్చు.
 • ఎర్రనేలలు: ఎర్రనేలలు లోతు తక్కువ మరియు నీటి నిల్వవుంచుకొనే శక్తి కూడా తక్కవుగా వుండి, వర్షం ద్వారా లభించేటువంటి నీరు ఒరవడి రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఈ ఒరవడి ద్వారా సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్థాలు నష్టపోవటం జరుగుతుంది. వీటిని రక్షించటానికి కాంటూరు గాట్లు, జీవగట్లతో వేలుకు అడ్డంగా సేద్యం చేయాలి. కనుక మొట్ట వ్యవసాభివృద్ధితో భూసంరక్షణ చాల ప్రాధాన్యమైంది.
 • వాలుకడ్డంగా దుక్కిదున్నటం, విత్తటం, అన్తరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకింప చేయవచ్చును.
 • నెల పైపొర గడ్డిపడే భూములలో ఎకరానికి 15  టన్నుల ఇసుకను తొలి కలియ దున్నాలి. ఇటువంటి భూముల్లో వేరుశనగ ఊడలు సులభంగా దిగి, కాయలు బాగా పోరాడానికి అవకాశముంటుంది. వర్షపు నీరు బాగా భూమి లోపలి ఇంకి నీటి వృధా తగ్గుతుంది.
 • వేరుశనగలో అంతరపంథాగా కందిని వేసేటప్పుడు, కందితోపాటు ఒరవడిని అరికట్టి పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే , ఒరవడి అరికట్టడమే కాకుండా,అధిక నిరాకడైమ పొందవచ్చు.
 • నల్లనేలలు: నల్ల నెలలు నీటికి నిల్వ ఉంచుకునే శక్తి అధికం. వర్షపు నీరు త్వరగా ఇంకానందు వలన ఎక్కువ శాతం నీరు , మట్టి కొట్టుకొనే పోతుంది. ఈ నెలల్లో అధిక దిగుబడిని సాధించకుండా భూమిని దున్నడంలో కొత్త సాంకేతిక పద్దతులను అవలంభించాలి.
 • ఎర్రనేలలు కాంటూరు గట్ల మాదిరిగా నల్ల నెలలకు 0 .8  ఘణపు మీటర్ల గ్రేడెడ్ గాట్లు వేయాలి. ఈ గట్ల పైభాగాన 0 .1 -0 .25  శాతం వేలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పరచి, ఈ కాలువను పెద్ద కలువలతో కలిపి, నెల కొత్త లేకుండా, నీటిని బయటికి పోయేలా చేయాలి.
 • వెడల్పాటి బోదెలు - కలువగా నేలను తయారు చేసి, వెడల్పాటి బోదెలపైనా విత్తు కోవాలి. కాలువలు ఎక్కువ నీటిని బయటికి పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్ల రేగడి నెలలకు ఈ పద్ధతి అనుకూలం. లేదా మూడు మీటర్ల వెడల్పుతో, 20  సేమ్.మీ. ఎత్తుగల వెడల్పాటి బోదెలు చేసి విత్తుకున్న మంచి దిగుబడులు వస్తాయి. బోదెల ప్రక్కకు కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటికి పోవడానికి ఉపయోగపడతాయి.
 • ఎకరానికి 8  టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకుతుంది.

మేలైన యాజమాన్య పద్ధతులు:

 • అనువైన పంటలు మరియు విధే సమయం /; వర్షం వచ్చే సమయాన్ని మరియు నెల స్వభావాన్ని బట్టి పంటలను నిర్ణయించుకోవాలి. వివిధ మాసాల్లో విత్తువలసిన పంటలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

వ్యవసాయ వాతావరణ మండలాల వారీగా వర్షాధారం క్రింద అనువైన మరియు ప్రత్యామ్నాయ పంటలు

వ్యవసాయ వాతావరణ మండలము

నేలలు

అనువైన పంటలు

ప్రత్యామ్నాయ పంటలు

జూన్ -జులై

ఆగస్టు

సెప్టెంబర్

1) ఉత్తర కోస్తా మండలము (శ్రీకాకుళం , విజయనగరం, విశాఖ జిల్లాలోని మైదాన ప్రాంతాలు )

తేలిక నేలలు

గోగు, వేరుశనగ, జొన్న,ఉలవ,రాగి.

రాగి, ఉలవలు, జొన్న (చొప్పకు), కంది (మొక్కలు /సాళ్ళ మధ్య దూరం తగ్గించి)

పెసర, ఉలవ,  ప్రొద్దుతిరుగుడు

మధ్యస్థిము నుండి బరువైన నేలలు

నువ్వులు, పెసర మరియు మినుము

రాగి, మినుము, కూరగాయలు జొన్న (చొప్పకు), ఉలవలు, గోరు చిక్కుడు, కంది (దగ్గరగా విత్తుకోవాలి) మొక్కజొన్న (స్వల్ప కాలిక రకాలు) మొక్కజొన్న + కంది

 

2) గోదావరి మండలం (తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి)

తేలిక నేలలు

వేరుశనగ, జొన్న

రాగి, ఉలవలు, జొన్న (చొప్పకు), పిల్లి పెసర, అలసంద

మినుము

మధ్యస్థిము నుండి బరువైన నేలలు

ప్రత్తి, పొగాకు, పెసర, మినుము మరియు నువ్వులు

రాగి, ఉలవలు, మిరప, జొన్న (చొప్పకు), ప్రొద్దుతిరుగుడు

 

3) కృష్ణా మండలం (కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు)

తేలిక నేలలు

ఆముదము, కంది, పెసర, వేరుశనగ, జొన్న, సజ్జ, కొర్ర.

ఉలవలు, జొన్న (చొప్పుకు)

మినుము

మధ్యస్థిము నుండి బరువైన నేలలు

ప్రత్తి, పొగాకు, కంది, పెసర, మినుము, ఆముదము.

కంది (దగ్గరగా విత్తుకొనుట అలసంద, ప్రత్తి+కంది

 

4) దక్షిణ మండలం (చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు)

తేలిక నేలలు

వేరుశనగ, కంది, జొన్న, రాగి, సజ్జ, ఆముదము,

రాగి, కంది (దగ్గరగా విత్తుకొనుట), పెసర, వేరుశనగ, ఆముదం, జొన్న (చొప్పకు).

మినుము, పెసర, ఉలువ, జొన్న

మధ్యస్థిము నుండి బరువైన నేలలు

ప్రత్తి, మినుము, ఆముదము, కొర్ర.

ఉలువలు, అలసంద, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ

 

5) అత్యల్ప వర్షపాత మండలం (కర్నూలు, అనంతపురం(జిల్లాలు)

తేలిక నేలలు

వేరుశనగ, కంది, జొన్న, ఆముదము.

కొర్ర, ఉల్లిగడ్డ, జొన్న (చొప్పకు) వేరుశనగ

మేతజోన్న, పెసర, సజ్జ, ఉలవ.

మధ్యస్థిము నుండి బరువైన నేలలు

ప్రత్తి, జొన్న పొగాకు, కంది ఆముదము, కొర్ర.

సజ్జ, ఉలవలు, ఆముదం, వేరుశనగ+కంది ప్రొద్దుతిరుగుడు

ప్రొద్దుతిరుగుడు

6) ఉత్తర, మధ్య, తెలంగాణ మండలం (ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలు)

తేలిక నేలలు

జొన్న, కంది, మినుము

ఉలవలు, పొద్దుతిరుగుడు, ఆముదము

ఉలవ

మధ్యస్థిము నుండి బరువైన నేలలు

ప్రత్తి, సోయాబీన్, జొన్న.

ప్రొద్దుతిరుగుడు, కంది, (దగ్గరగా విత్తుకొనుట)

 

7) దక్షిణ తెలంగాణ మండలం మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు

తేలిక నేలలు

వేరుశనగ, కంది, జొన్న, ఆముదము.

ఉలవలు, జొన్న, (చొప్పకు), సజ్జ,  రాగి, ప్రొద్దుతిరుగుడు, ఆముదము

పెసర, ఉలవ

మధ్యస్థిము నుండి బరువైన నేలలు

ప్రత్తి, జొన్న, ఆముదము

ప్రొద్దుతిరుగుడు, ఆముదము, కంది (దగ్గరగా విత్తుకొనుట)

 

మెట్ట పొలాలకు అనువైన పంట రకాలు:

పేరు

రకాలు

నూనె గింజలు

వేరుశనగ

వేమన, తిరుపతి - 4, కదిరి - 5, కె - 6, కె - 9 , నారాయణి, అభయ, ఐ.సి.జి.వి.- 91114 , అనంత , గ్రీష్మ కదిరి హరితాంధ్ర.

ఆముదము

క్రాంతి, జ్వాల, జ్యోతి, హరిత, కిరణ్, పి.సి.హెచ్ - 111 , డి.సి.హెచ్ - 32

ప్రొద్దుతిరుగుడు

మొర్డాన్, ఎ.పి.ఎస్.హెచ్ - 11 , కేబియస్.హెచ్ - 1 , ఎన్ డి .యస్.హెచ్ - 1 . మాధవి, గౌరి, రాజేశ్వరి, శ్వేతా, ఎలమంచిలి - 11 , ఎలమంచిలి - 17 , చందన, మంజీరా, సాగర్ ముత్యాలు, బీమా, టి.యస్.ఎఫ్ -1.

అపరాలు

కంది

పల్నాడు (ఎల్.ఆర్.జి. - 30 ), అభయ,ఎల్.ఆర్.జి.- 41 , టి.ఆర్.జి.-33 , ఐ.సి.పి.ఎల్.- 85063 , పి.ఆర్.జి - 100 , డబ్లు.ఆర్.జి.-53 , డబ్లు.ఆర్.జి.-27 .

పెసర

యమ్.ఎల్.-267 , మధిర - 295 , పుష్కర, వరంగల్ -2 ,యల్.జి.జి.-450 , యల్.జి.జి. - 407 , టి.యం. -96 -2 , పూస -105.

అపరాలు

మినుము

కృష్ణయ్య, ప్రభావ, ఎల్.బి.జి. - 623 , ఎల్.బి.జి. - 752 , ఎల్.బి.జి.-20 , పి.యు.31.

ఉలవ

మారుకులై, ఫై.హెచ్,జి. - 9 పి.డి.యం.-1 , వి.జెడ్.యం.-1.

శనగ

క్రాంతి,శ్వేత, అన్నేగిరి, జ్యోతి, జె.జి. -11 , కె.ఎ.కె, -2 , విహార్ , జాకీ -9218.

సోయాచిక్కుడు

పి.కె. -472 ,యం.ఎ.సి.హెచ్ - 58

చిరుధాన్యాలు

జొన్న

సి.యస్.హెచ్. -5 , సి.యస్.హెచ్.-6 , సి.యస్.హెచ్. -9 , సి.యస్.హెచ్.-1 . ఎన్.టి.జె. -1 ఎన్.టి.జె. -2,ఎన్.టి.జె. -3, ఎన్.టి.జె. -4, యం.-35 -1.

సజ్జ

ఐ.సి.టి.పి.- 8503 , ఐ.సి.యం.వి. -221 , ఐ.సి.టి.పి -8203 ,రాజ్ -171

కొర్ర

ప్రసాదు , చిత్ర , లేపాక్షి, కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీ లక్ష్మి , సూర్యనంది.

వాణిజ్య పంటలు

ప్రత్తి

యాన్.ఎ. -1325 (నరసింహ), కాంచన, శివానంది, అరవింద, యాగంటి.

వర్షాధార ఎర్రనేలల్లో ప్రత్యనాయ పంటలు విత్తు సమయము

పంటలు

జూన్ మొదటి పక్షము

జూన్ రెండవ  పక్షము

జులై మొదటి పక్షము

జులై రెండవ  పక్షము

ఆగెస్ట్ మొదటి పక్షము

ఆగెస్ట్ రెండవ పక్షము

సెప్టెంబర్

అక్టోబర్

వేరుశనగ

Yes

Yes

Yes

Yes

No

No

No

No

ఆముదము

Yes

Yes

Yes

Yes

No

No

No

No

కంది

Yes

Yes

Yes

Yes

No

No

No

No

జొన్న

Yes

Yes

Yes

Yes

Yes

Yes

No

No

సజ్జ

Yes

Yes

Yes

Yes

Yes

Yes

No

No

కొర్ర

Yes

Yes

Yes

Yes

Yes

Yes

No

No

పెసర

Yes

Yes

Yes

Yes

Yes

Yes

Yes

No

అలసంద

Yes

Yes

Yes

Yes

Yes

Yes

Yes

No

అనుముల

Yes

Yes

Yes

Yes

Yes

Yes

No

Yes

గోరుచిక్కుడు

Yes

Yes

Yes

Yes

Yes

No

No

Yes

మోత జొన్న

Yes

Yes

Yes

Yes

Yes

Yes

Yes

Yes

ఉలవ

No

No

No

No

No

Yes

Yes

Yes

విత్తనం మరియు విత్తే పద్దతి

మొత్తసాగులో ముక్యంగా వేరుశనగ, కంది, శనగ, జొన్న, సజ్జ, రాగి, ఉలవలు అలసందలు లాంటి పంటలు ముఖ్యమైనవి. అన్ని పంటలతో పోల్చితే ఒక ఎకరానికి సరిపడే విత్తన మోతాదు, దాని ఖరీదు వేరుశనగలో ఎక్కువ. అందువలన వేరుశనగ కాయల నుండి వచ్చే చిన్న, సన్న గింజలను వేరుచేసి ఎక్కువ ఖరీదుతో పెద్ద సైజు విత్తనాన్ని రైతులు కొంటూ ఉండటం వలన విత్తనపు ఖరీదు ఎక్కువ అవుతుంది.కానీ సన్నని విత్తనాలు కూడా విత్తుటకు ఉపయోగించవచ్చును. దీని వలన వేరుశనగ దిగుబడులతో ఎలాంటి తేడాలు వుండవు.

మొత్తసాగులో ఎర్రనేలల్లో వర్షాధారంగా పండించే వేరుశనగకు వర్షం పడిన తర్వాత నెలలో తగిన తేమ ఉంటే ఆ పంటను విత్తుకోవచ్చును. నెలలో తగిన తేమ ఈ తేలిక నెలల్లో రెండు లేక మూడు రోజులలో ఆరిపోతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణంగా వాడుకలో వున్నా విధి గొర్రలనే కాక తక్కువ కాలంలో ఎక్కువ ఎకరాలను విత్తడానికి వీలుగా ఎద్దులతో లాగే అనంత ఆటోమేటిక్ విత్తు పరికరం సంప్రదాయ గొర్రు మాదిరిగానే 4 సళ్ళలో 2 ఎద్దుల సహాయంతో రోజుకు 4 నుంచి 5 ఏకారములలో విత్తనం విత్తుతుంది. ఈ విత్తు పరికరం ముఖ్య ఉపయోగం ఏమిటంటే ఒక్కొక్క సాలుకు విధానం వదిలే కూలి అవసరం లేకుండానే పైన అమర్చబడిన బాక్స్ లో ఒకేసారి 8 కేజీల విత్తనం నింపుకోవచ్చు. ఈ పరికరం బాక్స్ కింద వుండే ఒక గేటు ధ్వారా సిపార్సు చేయబడిన విత్తనం 40 కేజీలు ఒక ఎకరానికి విత్తుకోవచ్చు. ఈ విత్తన పరికరం ఖరీదు దాదాపు రూ. 8500 /- (విత్తన బాక్స్ మరియు ప్రైము కలిపి) లేదంటే ఒక విత్తనపు బాక్స్ ఖరీదు సుమారు రూ.5000 /- ఈ బాక్స్ ను రైతులే స్వయంగా అమర్చుకోవచ్చును ఈ యంత్రాన్ని వాడుట వలన విత్త నానికి ఎటువంటి హాని వుండదు. 'అనంత వేరుశనగ విత్తే పరికరం' రూపొందించబడినది. దీనిని ఉపయోగించటం వలన తగిన లోతులో సిపార్సు చేసిన మోతాదులో, నిర్దశించిన ప్రకారం మొక్కల మధ్యదూరం ఉండేలా తేమ ఆరిపోకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలను విత్తడానికి వీలు కలుగుతుంది.

విత్తనశుద్ధి: పంటమొదటి దశలో అనగా 25 -30 రోజుల వరకు చీడ,పీడల ఉధృతిని తట్టుకోవడానికి విత్తనశుద్ధి తప్పనిసరి. వేరుశనగను ఆశించే వేరుపురుగును అదుపులో ఉంచడానికి కిలో విత్తనానికి 6 .5 మి.లీ. క్లోరిపైరుపాస్ మందును విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. మొవ్వుకుళ్ళును వ్యాపి చేసి తమర పురుగుల ఉధృతిని తగ్గించడానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. తొలిదశలో వేరుశనగను ఆశించే మొదలుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళను అదుపులో ఉంచడానికి 3 గ్రా, మాంకోజెబ్ లేదా 1 గ్రాము కార్బండైజిమ్ మరియు 4 గ్రాముల ట్రైకోడెర్మా పొడితో కలిపి విత్తనశుద్ధి చేయాలి.

ఎరువుల యాజమాన్యం: వేరుశనగకుగాని, వేరుశన + కంది అంతర పంటకు గని విధానం వేసేటప్పుడు ఎకరాకు 8 కిలోల నత్రజని, 16 కిలోల చొప్పున భాస్వరం మరియు పోటాష్ నిచ్చే ఎరువులు వేయాలి . సజ్జకుగాని, సజ్జ + కంది అంతర పంటకుగాని ఎకరాకు 16 కిలోల చొప్పున నత్రజని మరియు భాస్వరం ఎరువులు చేయాలి. సజ్జ, జొన్న పైర్లకు ఎకరాకు 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం వితేటప్పుడు వేయాలి. విత్తిన నెల రోజుల తర్వాత వానవస్తే ఎకరాకు 8 కిలోల నత్రజని పైపాటుగా వేయాలి. ఉలవకు 4 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం వేయాలి. భూసార పరీక్షా చేయంచి భాస్వరం , పోటాష్ ఎరువులు ఎంత కావలసింది నిర్ధారించుకోవాలి.

 • వేరుశనగకు విత్తిన 35 రోజులకు మరియు 45 రోజులకు 0 .2 శాతము జింకు సల్పటును (2 గ్రా.లీటరు నీటిలో కలిపి) పిచికారీ చేయాలి.

వర్షపు నీటి యాజయాన్యం:

మొట్ట ప్రాంతాలలో 10 నుంచి 40 రోజుల వరకు పంట కాలంలో వర్షాభావ పరిస్ధితులు నెలకొనవచ్చు. ఒక్కోసారి ఎడతెరపి లేకుండా వర్షం కురవడం వలన పొలం నుండి నీరు పొంగి ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించే నీటిని నీటిగుంత (Farm pond ) లో నిలువ చేసి, పైరు పది రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదురుకున్నపుడు , స్క్రిపంక్లర్ల ధ్వారా గంట సేపు ఒక తడి యిస్తే, మెట్ట ప్రాంతాల్లో 20 -30 % దిగుబడి పెరుగుతుంది. నీటి గుంతలను 150 -400 గ.మీ. పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. నీటి గుంతలు 10 మీ, పొడవు 10 మీ. వెడల్పు, 2 .5 మీ. లోతు తవ్వుకోవాలి. నీటి గుంతల్లో నీరు నిల్వ ఉండడానికి 6 భాగాలు మట్టి ఒక భాగం సిమెంటు కలిపి కూడా పూయవచ్చు. ఇలా పూత పూయడం వలన నీటి గుంటల్లో నీరు రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. నీటి గుంతలో నిల్వచేసిన నీటిని వినియోగించి ఒక తడి (20 మి.మీ. లేదా 30 మి.మీ) నీటిని బిందు సేద్యం (డ్రిప్) ధ్వారా శనగ పంటకు సున్నితపు దశలో తడిని ఇచ్చినప్పుడు దిగుబడి పెరుగుతుంది.కంది, ప్రత్తి మరియు జొన్న పంటలలో నీటి గుంతలలో నీటిని పంట కీలకదశలో ఒక తడి ఇచ్చినచో దిగుబడి పెరుగుతుంది. వేసవిలో పడిన వర్షపు నీరు నీటి గుంతలలో నిల్వ వుంటే, ఆ నీటిని వినియోగించి బిందెల ధ్వారా ప్రతి పంటను జూన్లోనే విత్తుకుంటే ఒక నెల రోజులు బెట్టకు గురైన పంట వర్షాభావ పరిస్ధితులను తట్టుకోగలదు. ఆ తర్వాత వర్షాలు అందునుగా పడితే మేలైన దిగుబడులు పొందవచ్చు.

కలుపు నివారణ: సమగ్ర కలుపు నివారణ పద్ధతులు పాటించి కలుపును నివారించాలి. విత్తనం వేసిన తర్వాత 25 రోజుల కొకసారి, 40 రోజుల కొకసారి దంతిగాని, మెట్ల గుంతకగాని వేసి కలుపు నివారించవచ్చు. విత్తిన రెండో రోజు ఎకరాకు 750 మిల్లీలీటర్ల పెండిమీదలిన్ ను తగినంత తడి మట్టితో కలిపి పొలం పై వెదజల్లాలి లేదా పై మందును లీటరు నీటికి 5 మిల్లీమీటర్ల కలిపి పిచికారీ చేయాలి.

ట్రాక్టరు సహాయంతో 'అనంత వేరుశనగ విత్తే కాపరికరంతో విత్తిన పొలంలో తగిన సమయంలో కలుపు నివారించుటకు ట్రాక్టరుతో నడిచే అంతర కృషి పరికరము తాయారు చేయబడినది. దీనిని ఉపయోగించుట వలన వరుసల మధ్యలో తేలికగా కలుపు నిర్ములించవచ్చును.

ప్రత్యామ్నాయ భూ వినియోగం:

మెట్ట పొలాలకు అనువైన పండ్ల తోటలు: మెట్ట భూములందు పండ్ల తోటలను ప్రోత్సహించి, బీడు భూములను, క్షార భూములను, కొండ ప్రణతాలను సాగులోనికి తీసుకురావచ్చు, రేగు, సీతాఫలం, ఉసిరి, నేరేడు, మామిడి, సపోట తక్కువ నీటితోనే పలాశయాన్నివ్వగలవు. కావున వీటిని మెట్టపంటలుగా పెంచవచ్చు. సాగునీరు అందివ్వగల పరిస్థితుల్లో సపోట, మామిడి మరియు దానిమ్మను బీడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. ఈ తోటల్లో 3 సంవత్సరాల వరకు అంతర పంటలను పెంచి, అధిక ఆదాయం పొందవచ్చు.

మిశ్రమ వ్యవసాయం: రైతులు వేరుశనగ మాత్రమే సాగు చేయడం వలన 4 నెలల వరకు మాత్రమే ఉపాధి ఉంటుంది. అయితే ఒక హెక్టారు విస్తీర్ణంలో వేరుశనగ పండించే రైతు దానితో పాటుగా, 10 గొర్రె పిల్లలను 4 నెలలపాటు పెంచుకోవడంతో అదనపు నికరాఢ్యాన్ని పొందడానికి వీలవుతుంది.

సేంద్రియ వ్యవసాయము: సేంద్రియ కర్బనము ఎక్కువగా వున్నా నెలల్లో, నేల బైతిక లక్షణాలను మెరుగు పరుస్తుంది. బరువు నెలలు గుల్లబారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయ పడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగు నీటి పారుదల సావకార్యం మెరుగవుతుంది. ఇసుక నెలల్లో మట్టి రేణువుల అమెరికాను క్రమబద్ధం చేస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువకాలం నిల్వ చేసుకొనే సామర్ధ్యం పెరగడానికి దోహదపడుతుంది బెట్ట పరిస్థితిని తట్టుకొనే శక్తి పెరుగుతుంది.

ప్రస్తుతము మన రాష్ట్రంలోని నెలల్లో సేంద్రియ కర్బనం అత్యల్పస్థాయి లో (0 .5 % కంటే తక్కువ) ఉన్నది. సేంద్రియ కర్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో ఆయా ప్రాంతాలలో అందుబాటును బట్టి పశువుల ఎరువు. పచ్చిరొట్ట ఎరువు, పచ్చిఆకు ఎరువు, కోడిపెంట, గొర్రెల ఎరువు, గొర్రెల మందకట్టుట, వర్మ కంపోస్టు వంటి ఎరువులను విస్తుతంగా ఉపయోగించాలి. సేంద్రియ వ్యవసాయం వాళ్ళ దీర్ఘకాలిక సుస్థిరత సాధించవచ్చు.

3.02564102564
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు