పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అటవీ వ్యవసాయం

వివిధరకాల అటవీ వ్యవసాయ పద్ధతులు

అటవీ వ్యవసాయం

 1. అటవీ వ్యవసాయం” అనగా మనం నిత్యం పండించే పంటలతో పాటు చేట్లను కూడా కలిపి వ్యవసాయం చేసుకోవడం”.
 2. ముఖ్య ఉద్ధేశ్యం: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆశించిన అధిక దిగుబడులను ఒక్క ఆహార పంటల ద్వారానే రైతులు వారి యొక్క వ్యవసాయ కమతాలలో పొందలేక పోతున్నారు. కేవలం వ్యవ సాయ పంటలు పండించటానికి వ్యవసాయ కూలీల సమస్య ఎదురౌతున్నది. కావున చాలా మంది రైతులు వ్యవసాయం చేయడం మానివేసి ఇతర పనులలో దృష్టి  సారిస్తునారు. రైతులు వారు నిత్యం పండంచే ఆహార పంటలతో పాటు వాణిజ్యపరంగా పెంచే చెట్లను కూడ కలిపి వ్యవసాయం చేయడం వల్ల వ్యవసాయం లోవచ్చే నష్టాన్ని తగ్గించవచ్చును. ఈ పద్ధతి వలన వివిధ ఉత్పత్తులు ఉదా: కలప, వంట చెఱకు, పశు గ్రాసం పండ్ల చెట్లు పెంచడం ద్వారా లాభం పొంద వచ్చును.
 3. అటవీ వ్యవసాయంలో పెంచే చెట్లు: సిస్సు, సీసం, దిరిసినం, కానుగ, వేప, ఉసిరి, చింత, నేరేడు. ఔషధ మొక్కలు,: మారేడు, కరక్కాయ, తానికాయ.
 4. అటవీ వ్యవసాయ పద్ధతులు:

వివిధ అటవీ వ్యవసాయ పద్ధతులు:

క్రమసంఖ్య

అటవీ వ్యవసాయ పద్ధతులు:

ఉదాహరణ

1

అగ్రి సిల్వికల్చర్ పద్ధతి: చెట్ల మధ్యలో ఆహార పంటలు పెంచడం

వేరుశనగ + సుబాబుల, కందులు + సిస్సు, సజ్జ+కానుగ

2

అగ్రి హార్టికల్చర్ పద్ధతి: పండ్ల చెట్ల మధ్యలో ఆహార పంటలు పెంచడం

బొబ్బర + చింత, అలసంద + కరివేపాకు + మామిడి

3

అగ్రి హార్టి సిల్వికల్చర్ పద్ధతి: పండ్ల చెట్లు + అటవీజాతి మొక్కలలో  ఆహార పంటలు

అవసరాలు+చింత/సీతాఫల్ +కరివేపాకు

4

హార్టి పాస్చ్యురల్ పద్ధతి: పండ్ల చెట్ల మధ్యలో పశుగ్రాసంను పెంచటం   చడం

అంజన్ గడ్డి+స్టైలో-సీతాఫలం, పెసర/ గోరుచిక్కుడు – చింత

5

సిల్వి  పాస్చ్యురల్ పద్ధతి: చెట్ల మధ్యలో పశుగ్రాసంను పెంచడం         చడం

స్టైలో పశుగ్రాసం+తుమ్మ చెట్లు, అంజన్ గడ్డి+తుమ్మ చెట్లు

6

సిల్వి పాస్చ్యురల్ పద్ధతి: చెట్ల మధ్య లో ఔషధం మొక్కలు పెంచడం        పెంచడం   చడం

అశ్వగంధ+తాని/కరక్కాయ, నేలవాము+తాని/కర క్కాయ, కలబంధ = తాని/కరక్కాయ

7

హార్టి మెడిసినల్ పద్ధతి: పండ్ల చెట్ల మధ్యలో ఔషధం మొక్కలు పెంచడం

ఉసిరి+తులసి/అశ్వగంధ, ఉసిరి+కలబంధ, సీతాఫల్ + కలబంధ

8

బ్లాక్ ప్లాన్ టేషన్: ఒకేరకమైన చెట్లను సాగు చేయడం

యూకలిప్టస, సరుగుడు, సుబాబుల్ , కానుగ, విప్ప, వేప, టేకు, ఎర్రచందనం

9

గట్లమీద చెట్లు పెంచడం

టేకు, యూకలిప్టస్ , నేరేడు, కొబ్బరి, అవిశ, మునగ, కరివేపాకు

10

సమస్యాత్మక (చౌడు)భూములలో పెంచే చెట్లు

నల్లమద్ధి, సీమరూబ, సీమచింత, ఉసిరి, స్టైలో గడ్డి, అంజన్ గడ్డి

11

చేను చుట్టూ పెంచే చెట్లు (జీవ కంచెలు)

వెదురు, సిల్వర్ ఓక్ , నల్లతుమ్మ, వాక్కాయ, గచ్చకాయ

అటవి వ్యవసాయ పధతులు

 • వాణిజ్య పరంగా రైతులు వారి యొక్క పొలాల్లో పెంచేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
 • టేకు : వేరు మొక్కలు (స్టంఫ్ )ద్వారా మొలచిన మొక్క లను వేసుకోవలెను. టిష్యూకల్చర్ ద్వారా పెంచిన మొక్క లను తక్కువ ధరకు కొనవలెను. అంటే మొక్కకి వల్లరైతు కన్న ఎక్కువ పెట్టి కొనకూడదు.
 • శ్రీ గంధం, ఎర్రచందనం, టేకు, వెదురు, మలబార్ వేప: ఈ మొక్కలను రైతులు వారి యొక్క పొలంలో సేధ్యం దగ్గర చేసినప్పుడు మరియు చెట్లను కొట్టినప్పుడు  స్థానిక అటవీ వ్యవసాయ అధికారులకు తెలియ చేయవలెను. ముఖ్యంగా రైతులు వాణిజ్యపరంగా వెలువడే ప్రకటనలు చూసి మోసపోకుండా మరియు ఈ మొక్కలను అధిక విస్తీర్ణంలో వేసినప్పుడు నైపుణ్యం గల నిపుణులను సంప్రదించ వలెను. ఈ మొక్కలు కూడా రూ. 20-30/- కన్న ఎక్కువ పెట్టి కొని కూడదు.
 • రైతులు చెట్లనుండి రాలిన ఎండు ఆకులను, చిన్న కొమ్మలను తగల బెట్టకుండా వర్మికంపోస్ట్ పద్ధతి ద్వారా తమకుతాముగా ఎరువును తయారుచేసు కోవచ్చు. మరియు భూమి యొక్క సారము కూడ పెంచవచ్చును.
 • అడవి పందుల సమస్య : చేను చుట్టూ, వాక్కాయ, గచ్చకాయ, కలబంద మొదలగు చెట్లను దగ్గర గా వేయడం వల్ల అడవి పందుల నష్టాన్ని నివారించవచ్చు.
 • జమాయిల్, సుబాబుల్, సురుగుడు: ఈ మొక్కలు పరిశోధనల ద్వారా ఆయా ప్రాంతాలకు ఎంపిక చేయ బడిన క్లోన్స్ ని మాత్రమే రైతులు వారి పొలాల్లో వేసి లాభం పొందవచ్చును.

మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త, అగ్రోఫారెస్ట్రీ విభాగం, రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫోన్ నెం. 040-24010116

2.99324324324
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు