పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆపత్కాల పంటల ప్రణాళిక

ఆపత్కాల పంటల ప్రణాళిక,అనువైన రకాలు

ముఖ్య ఉద్దేశ్యాలు

 1. వర్షభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటల ఎంపిక మరియు చేపట్టవలసిన యాజమాన్య పద్దతులు తెలుసు కొనుట
 • ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన నిర్దేశించబడిన పంటలను సాగు చేయలేనటు వంటి పరిస్థితులు ఆపత్కాల ఉన్నప్పుడు పంటల ప్రణాళిక (కంటిజెన్సీక్రాప్ ప్లానింగ్) అవసరము ఉంటుంది.

ప్రతి కూల వాతావరణ పరిస్థితులు ఈ క్రింది విధాలుగా ఉండవచ్చును.

 • ఋతుపవనాలు ఆలస్యముగా రావడము
 • ఋతుపవనాలు సకాలంలో వచ్చి, పంటల విత్తిన తర్వాత వివిధ దశలలో బెట్టకు గురికావడం
 • సరైన వర్షాలు కురవక, కాలువల ద్వారా కొద్దిమొత్తంలో లేక ఆలస్యముగా లేక అసలే నీరు విడుదల చేయక పోవడము.
 • సరైన వర్షాలు కురవక బోర్లు, మరియు బోర్ల ద్వారా తక్కువగా విడుదల కావడము(డిశ్చార్ర్జ్)
 • అకాల వర్షాలు, తుఫానులు, వడగండ్లు,అతి శీతల మరియు అధిక వేడి గాలులు .
 • ప్రతి కూల వాతావరణములను అనుసరించి తగిన యాజమాన్య పద్దతులు పాటించడం వల్ల నష్ట నివారణ తగ్గించు కోవచ్చు .
 • తెలంగాణ జిల్లాలలో అనువైన వివిధ ఆపత్కాల పంట ప్రణాళికలు.
 1. ఋతుపవలాలు ఆలస్యంగా రావడం
ఋతుపవలాలు ఆలస్యంగా వచ్చినప్పుడు • తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవాలి.
• నేల 15 సెం.మీ లోతు వరకు తడిసిన తరువాత లేదా 50 నుండి 75 మి.మీ వర్షం కురిసిన తర్వాతనే విత్తుకోవాలి.
• 10 నుండి 15 శాతం ఎక్కువ విత్తనలను వేసుకోవాలి.
• అంతర పంటల లేదా మిశ్రమ పంటలను వేసుకోవాలి.
• అంతర పంటలలో ధాన్యపు పంట  లకు బదులు పప్పుదినుసులు లేదా నూనెగింజల పంటలను వేసుకోవాలి.
• సోయాచిక్కుడు మరియు ప్రత్తి  పంటలను తేలికపాటి నెలల్లో వర్షాధారపు పంటలుగా విత్తుకో కూడదు


2.ఋతుపవనాలు సకాలంలో వచ్చి.పంటలు విత్తిన తర్వాత వివిధ దశలలో బెట్టకు గురి కావడము.
పంట తొలి దశలో సంభవించే వర్షాభావ పరిస్థితులలో • మొలక శాతం బాగా తగ్గినచో పంటను మళ్ళీ విత్తడం లేదా అదే రకాన్ని ఎన్నుకుని పొగుంటలను/ పడిపాదులు పూర్తి చేయాలి.
• అంతర సేద్యం చేసి  తేమను సంరక్షించు కోవాలి. 
• యురియాను (2%) పిచికారీ  ఛేయాలి.
• పైపాటు  ఎరువులను వాయుదా వేసుకోవాలి.
• వర్షాభావ పరిస్థితుల వలన రసం పీల్చే పురుగుల ఉదృతి పెరుగుతుంది. కావున నివారణ చర్యలు చేపట్టాలి..

పంట పెరిదే దశలో సంబవించే వర్షాభావ పరిస్థితులలో 30-45 రోజుల పంటకు అంతర సేద్యం చేసి తేమను సంరక్షించుకోవాలి.
నీటితడి అందుబాటులో ఉన్నచో పంట కీలక దశలో సాలు విడిచి సాలుకు నీటి తడి ఇవ్వాలి.
పైపాటు ఎరువులను వాయిదా వేసుకోవాలి.
పొటాషియం నైట్రేట్ ను (13:0:45) 10గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వర్షాభావ పరిస్థితుల వలన రసం పీల్చే పురుగుల ఉదృతి పెరుగుతుంది. కావున నివారణ చర్యలు చేపట్టాలి.
ముందుగానే ఋతుపవనాలు తిరిగి వెళ్ళి పోవడం నత్రజని ఎరువులను పై పాటుగా వేసుకోవాలి.
పూతదశలో యూరియాను (2%) పిచికారి చేయడం.
పొటాషియం నైట్రేట్ ను (13:0:45) 10గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నీటి తడి అందుబాటులో ఉన్నచో పంట కీలక దశలో సాలు విడిచి సాలుకు నీటి తడి ఇవ్వాలి.
వర్షాభావ పరిస్థితుల వలన రసం పీల్చే పురుగుల ఉదృతి పెరుగుతుంది. కావున నివారణ చర్యలు చేపట్టాలి.
పంట పక్వదశకు రాగానే కోసుకోవడం. (physiological maturity
3. సరైన వర్షాలు కురవక, కాలువల ద్వారా కొద్దిమొత్తంలో లేక ఆలస్యముగా నీరు విడుదల చేయడము
• వరి పంటను నేరుగా విత్తుకోవాలి
• ముదురు నాట్లు వేసే రైతులు దీర్ఘకాలిక రకాలను 60 రోజులు, మధ్యకాలిక రకాలు 50 రోజులు మరియు స్వల్పకాలిక రకాలు 40 రోజుల నారును నాటు కోవచ్చును.
• వరి నాట్లు వేసే రైతులు పైపైన నాటుతూ కుదురుకు 4 నుండి 6   మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి.
• కుదుర్లను దగ్గర దగ్గరగా నాటుకోవాలి
• సిఫారసు చేసిన నత్రజని ఎరువును 2/3 వంతును నాటు     సమయంలో తిరిగి 1/3 వంతును చిరుపిట్ట దశలో వేసుకోవాలి.
• పురుగు మరియు తెగుళ్ల ఉధృతిని గమనిస్తుఊ అవసరం మేరకు నివారణ చేయాలి.

4. సరైన వర్షాలు కురవక, చెరువులు మరియు కుంటలలో నీరు చేరకపోవడము.
• వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన ప్రొద్దుతిరుగుడు, ఉలవలు, కంది మరియు పశుగ్రాస పంటలను విత్తుకోవాలి.

5.  సరైన వర్షాలు కురవక, బోర్లు మరియు బావుల ద్వారా నీరు చలా తక్కువగా లభ్యం కావడం.
అధిక వర్షాలు కురిసి నప్పుడు 1. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన ప్రోద్దుతిరుగుడు, ఉలవలు , కంది మరియు పశుగ్రాస పంటలను విత్తుకోవాలి. 
2. మెట్ట వంట కీలక దశలలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీరు పెట్టుకోవాలి.


6. అకాల వర్షాలు,తుఫానులు,వడగుండ్లు, అతి శీతల మరియు అధుక వేడి గాలులు.
అధిక వర్షాలు కురిసి నప్పుడు • ముందుగా పొలంలోని మురుగు నీటిని తీసివేయాలి.
• అదనపు మోతాదులో నత్రజని మరియు పొటాషియం ఎరువులు పైపాటుగా వేసుకోవాలి.
• తెగుళ్ళు సోకకుండా తెగుళ్ల మందులను పిచికారి చేయాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. మెట్ట పంటలలో అధిక తేమ వలన అశించే ఎండు తెగులు నివారణకు 3గ్రా. కాపర్ –ఆక్సీ – క్లోరైడ్ను లీటరు. నీటిని కలిపి మొక్కల మెదళ్ళ చుట్టు నేలను త్డపాలి.అతిశీతల వాతావరణ పరిస్థితులలో • పాలిథిన్ షీట్లతో నారుమడులను కప్పి ఉదయం తీసివేయాలి.
• ప్రతురోజు సాయంత్రం నారుమడికి నీరు పెట్టాలి మరియు ఉదయం నీటిని తీసివేయాలి.
అధిక గాలులు వీచినప్పుడు • వరి పంట కోత దశలో ఉండి అధిక గాలులకు చేలు పడిపోతే, పడిపోయిన దుబ్బులను లేపి నిలగట్టాలి.
• చెఱకు మొక్కల పడిపోకుండా జడచుట్టే పద్దతి ద్వారా నిలబెట్టాలి.
• పురుగు మరియు కలుపు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి.
వడగళ్ళ వర్షాలు కురిసినప్పుడు • పొలంలో విరిగిన కొమ్మలను మరియు రాలిన కాయలను ఏరివేయాలి.
• వరిలో పడిపోయిన పంటను నిలబెట్టాలి
• పంట పూత దశలో ఉన్నప్పుడు పైపాటుగా యూరియా పాటాష్ ఎరువులను వేసుకోవాలి.

తెలంగాణా జిల్ల్లాలలో అనువైన వివిధ ఆపత్కాల పంట ప్రణాళికలు.

 

ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు

క్ర.సం.

జిల్లా

భూమి రకము

జూన్ 30 వరకు

జూలై 15 వరకు

జూలై 31 వరకు

ఆగఘ్ట 15 వరకు

1

రంగా రెడ్డి

తేలికపాటి నేలలు

జొన్న, సజ్జ, పెసర

కంది, మొక్కజొన్న. ప్రత్తి, మినుము

ఆముదం, (క్రాంతి, కిరణ్, జ్యోతి) ప్రొద్దుతిరుగుడు పశు గ్రాస జొన్న

 

 

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

జొన్న, పెసర

ప్రత్తి, మొక్కజొన్న, మినుము

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863, ఆముదం (క్రాంతి, కిరణ్ , జ్యోతి) ప్రొద్దుతిరుగుడు పశు గ్రాస జొన్న

 

2

నిజామాబాద్

తేలికపాటి నేలలు

పెసర, జొన్న

ప్రత్తి, మొక్కజొన్న, మినుము

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

పెసర

ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

 

3

మెదక్

తేలికపాటి నేలలు

జొన్న,పెసర

మొక్కజొన్న.మినుము

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

ఆముదం, (క్రాంతి, కిరణ్ , జ్యోతి) ప్రొద్దుతిరుగుడు పశు గ్రాస జొన్న

 

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

పెసర

ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,మిరప ఆముదం, (క్రాంతి,కిరణ్ , జ్యోతి)

 

 

 

4

మహబూబ్ నగర్

తేలికపాటి నేలలు

జొన్న, పెసర

మొక్కజొన్న.ప్రత్తి

వేరుశనగ

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

ఆముదం, (క్రాంతి, కిరణ్, జ్యోతి) ఉలవలు

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

 

ప్రత్తి, మొక్కజొన్న, రాగి

 

ప్రొద్దుతిరుగుడు

5

న్లల్గొండ

తేలికపాటి నేలలు

జొన్న,  పెసర

.ప్రత్తి, వేరుశనగ

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,మిరప      `

ఆముదం, (క్రాంతి, కిరణ్, జ్యోతి) ఉలవలు

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

జొన్న,  పెసర

మొక్కజొన్న.ప్రత్తి

వేరుశనగ

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863, మిరప

 

6

వరంగల్

తేలికపాటి నేలలు

పెసర

.ప్రత్తి, మొక్కజొన్న వేరుశనగ

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,మిరప      `

ఆముదం, (క్రాంతి, కిరణ్, జ్యోతి)

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

పెసర

ప్రత్తి, సోయాచిక్కుడు

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,మిరప

 

7

ఖమ్మం

తేలికపాటి నేలలు

పెసర

ప్రత్తి, మొక్కజొన్న,

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

 

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

పెసర

ప్రత్తి, మిరప

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

 

8

కరీంనగర్

తేలిక పాటి నేలలు

పెసర, సజ్జ

ప్రత్తి, మొక్కజొన్న,

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

ఆముదం, (క్రాంతి, కిరణ్ , జ్యోతి)

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

పెసర

ప్రత్తి,

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,మిరప

 

9

ఆదిలా

బాద్

తేలికపాటి            నేలలు

పెసర

ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,

 

 

 

మధ్యస్థ నుండి బరువు నేలలు

జొన్న, పెసర

ప్రత్తి, మొక్కజొన్న, మినుము, సోయా చిక్కుడు

కంది పిఆర్ జి -158, పిఆర్ జి-100, ఐసిపి-8863,మిరప

 

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.01251564456
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు