অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చెఱువులో చేపపిల్లలు వదలుటలో మెళుకువలు

చెఱువులో చేపపిల్లలు వదలుటలో మెళుకువలు

పెంచదగిన ఉత్తమ చేపలు

బొచ్చె, రోహు, మ్రిగాల, (దేశీయకార్పు) జాతి చేపలు, వెండి చేప, గడ్డిచేట, బంగారు తీగ (విదేశీ కార్పు) జాతి చేపలు.

ఉత్తమ చేపపిల్లల ఎన్నికలో మెళకువలు

  1. త్వరగా పెరిగే చేపలను ఎన్నుకోవాలి.
  2. పెంచే చేపలు ఇతర చేపలను తినేటట్లుగా ఉండకూడదు.
  3. ఎన్నుకొన్న చేపపిల్లల రకాలు సహజంగా లభించే ఆహారాన్ని కాకుండా అదనపు ఆహారాన్ని కూడా అంగీరకంచేటట్లు ఉండాలి.
  4. ఇతర రకాల చేపలతో పోటీపడకుండా సర్ధుకుపోయేటట్లు ఉండాలి.
  5. నీటిలో పలు తలాలలో సంచరించి అక్కడి ఆహారాన్ని పూర్తిగా వినియోగించు కునేటట్లు ఉండాలి.

నీటి తలములు

  • 1 ఉపరితలము 2. మధ్య తలము 3. అదోతలము ఈ మూడు తలాల్లో చేపల సహజ ఆహారం అయిన ప్లాంక్టాన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఆహారాన్ని పూర్తిగా వినియోగించు కోవాలంటే మూడు తలాలలో సంచరించే చేప పిల్లలను ఎన్నుకోవాలి. ఒకే రకము చేపలను పెంచిన మిగతా తలాల ఆహారం వృధా అవుతుంది. 1. బొచ్చె, వెండి చేపలు: ఉపరి తలంలో ఉంటాయి. బొచ్చే, వెండి చేపలు ఉపరి తలంలో ఉండే వృక్ష, జంతు సంబంధమైన ఆహారాన్ని పూర్తిగా వినియోగించు కుంటాయి.
  • రోహు గడ్డిచేపలు : మధ్య తలములో ఉంటాయి. రోహు అన్ని రకముల ఆహారం తీసుకుంటుంది. గడ్డి చేప నీటిలో లభించే నీటి మొక్కలు తింటుంది. 3. మ్రిగాల, బంగారుతీగ నీటి అడుగు భాగంలో లభించు ఆహార పదార్థం తింటుంది.
  • మన విదేశీ కార్పు రకాలు అయిన వెండిచేప, గడ్డి చేప రవాణాలో మెత్తబడి గిట్టుబాటు ధర, గిరాకీ తక్కువ గా ఉండడం వల్ల ఎక్కువగా పెంచటం లేదు. అలాగే మ్రిగాల పెరుగుదల మొదటి సం. తర్వాత సం. విపరీతంగా (ఎక్కువగా) ఉండటం వలన ఇది కూడా ఎక్కువగా పెంచడం లేదు..

చేప గ్రుడ్లు నుండి వెలువడిన చేపపిల్ల పేర్లు

క్రమసంఖ్య తెలుగు పేరు ఇంగ్లీషు పేరు కొలతలు
1. చేపనారు (గ్రుడ్డు నుండి వెలువడిన 3 రోజులకు) హెచలింగ్ 6 – 8 మి.మీ
2. చేపనారు స్పాన్ 8 - 10  మి.మీ
3. చిరు చేప హెచలింగ్ 12 – 24 మి.మీ
4. ఎదిగిన చిరు చేప ఫ్రై 25 - 50 మి.మీ
5. పెరిగిన చేప పిల్ల అడ్వాన్స్డ్ ఫ్రై 50 - 100 మి.మీ
6. ఎదిగిన చేపపిల్ల అడ్వాన్స్డ్ ఫల్లోడ్స్ 100 - 150 మి.మీ

మిశ్రమ చేపల పెంపకము

  • ఒక నీటి వనరులలో రెండు లేక అంతకన్నా ఎక్కువ రకాల చేపలు పెంచుట, మరియు ఆ నీటిలో లభించే సహజమైన ఆహారాన్ని పూర్తిగా సద్వినియోగ పరచుకొనే పద్దతిని మిశ్రమ చేపల పెంపకం అందురు.

చేప పిల్లలు కలుపుట లో మెళుకువలు

  • చెఱువులో నీరు ఉండు కాలము, నీటిలోతు, వార్షిక చెఱువు, అర్ధవార్షిక చెఱువు, అల్పకాలిక చెరువు, మరియు నిర్మితమైన చేపల చెరువు, తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని చేప పిల్ల ల చెరువు నీటి విస్త్రీర్ణం, చెరువులో నీరు ఉండే కాలంను దృష్టిలో ఉంకుకొని ఉత్తమ మేలు జాతి చేప పిల్లల తగు సంఖ్యలో కలిపిన యెడల అధిక చేపలు ఉత్పత్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. చేపపిల్లల రవాణా: చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల నుండి చేపల పెంపకము చేయు చెరువులకు చేప పిల్లలు చేరవేయుటకు వాటిని తగిన నీటిలో పాలి థీన్ కవర్ లో 1/3 వంతు శుభ్రమైన నీరు పోస, ఫ్రై సైజు సుమారు 500 ఒక కవర్ లో వేసి ఆక్సిజన్ తో కవర్ లో నింపి చేపపిల్లల ఈ కవర్ చివర సుతి లితో ముడి గట్టిగా కట్టి జిఐ టిన్ లో చేర్చి సుదూర ప్రాంతాలకు రవాణా చేయుచునారు. పెద్ద సైజు చేప పిల్లలను 1000 నుండి 5000 లీటర్ల సింథటిక్ ట్యాంకులో ఆక్సిజన్ సరఫరా చేయుచూ రవాణా చేయుచున్నారు.

రవాణాలో చనిపోవడానికి కారణాలు

  1. ప్రాణవాయువు తగ్గిపోవుట
  2. విషవాయువుల ప్రభావం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ మరియు అమోనియా చేప పిల్లలు రవాణా చేయు
  3. నీటిలో అధికంగా ఉన్నప్పుడ
  4. చేపపిల్లల రవాణాకు పట్టిన కాలం\
  5. ఉష్ణోగ్రత మార్పుల వలన
  6. మల విసర్జన పదార్థములు పేరుకు పోవడం వల్ల

రవాణాలో చనిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

  1. రవాణాకు ఇక రోజు (24గం.) ముందు చేపపిల్లలు పీపాలో పెట్టి కండిషన్ చేయవలెను. (ఆహారం ఇవ్వకుండా) ఇందువలన మలవిసర్జన పదార్థము లు చేపల రవాణాకు ఉపయోగించు నీటిలోపేరుకు పోకుండా నీరు కలుషితం కాకుండా తద్వారా చేపపిల్లలు చనిపోవుట నివారించ వచ్చును
  2. రంధ్రాలు లేని పాలిథీన్ కవర్ ఎంచుకోవాలి.
  3. చేపపిల్లల రవాణా సాయంత్రం వేళలో లేదా ఉదయం చేయడం శ్రేయస్కరం. ఎందుకనగా ఉష్ణోగ్రత మార్పులు ఎక్కువగా కావు.
  4. చేపల మల వ్యర్థ పదార్థం విసర్జించుట వలన విడుదల అయిన విష పదార్థములు తగ్గుటకు కండిషన్ చేయ వలెను.

నీటి వనరులు అనగా చెరువులు మరియు కుంటలను నీరు నిలువ ఉండుకాలమును బట్టి (3) రకాలుగా విభ జించినారు

  1. శాశ్వత నీటి వనరులు – ఇట్టి నీటి వనరులలో సంవత్సరం పొడుగున నీరు నిలువ ఉండును.
  2. దీర్ఘకాలిక నీటి వనరులు – ఇట్టి వనరులలో 6 నెలలకు పైబడి మరియు సం. లోపు
  3. స్వల్పకాలిక నీటి వనరులు – 6 నెలలోపు నీరు నిల్వ ఉండునవి.

నిర్మితమైన నీటి వనరులు అనగా

  • మన రాష్ట్రములోని రిజర్వాయరు/ చెరువు/ కుంటలు ప్రధానముగా సేధ్యము (పంటకు నీరు తోడించుట) కొరకు నిర్మితమైనవి. ఇట్టి నీటి వనరులు పంటలకు సాగు నీరు అందించుటయే కాకుండా చేపల పెంపకము, పశు వులకు త్రాగు నీరు భూగర్బ జలాల పెంపు మరియు వరద నీటి నివారణకు ముఖ్యముగా ఉపయోగించ బడుచున్నవి.
  • శాశ్వత మరియు దీర్ఘకాలిక నీటి వనరులలో 4 అడ్ుగుల లోతు పైబడి ఉన్న నీటి వనరులలో పై మూడు రకాల చేపలు పెంచుట వలన ఆ నీటి వనరులలో లభ్యమగు పూర్తి ఆహారమును చేపలు వినియోగించుకొని అధిక దిగుబడి రాగలదు. దీనినే మిశ్రమ చేపల పెంపకము అంటారు. ఆ మూడు రకాల చేపలను వరుసగా 30:45 నిష్పత్తిలో వేయాలి.
  • స్వల్పకాలిక మరియు లోతు తక్కువగల దీర్ఘకాలిక నీటి వనరులు బంగారుతీగ పెంపకమునకు చాలా అనుకూలమైనవి. కాని ఇటువంటి నీటి వనరులలో మూడు రకముల చేపలు పెంచిన యెడల సరిపోవునంత ఆహారము లభించక సరైన ఎదుగుదల లేక మత్స్యకారులకు నష్టము కలుగును. కాబట్టి మిశ్రమ చేపల పెంపకము మాత్రమే తప్పక చేపట్టాలి. చేపల అధికోత్పత్తి సాధించుటకు, చేప పిల్లల సైజు క్రియాశీలకమైనది. ఫ్రైదశ (1 అంగుళము) పిల్లలను నేరు గా వదిలిన యెడల నీటి వనరులలోని భక్షక జీవులకు సులభముగా ఆహారముగా దొరుకును, మరియు వాతావ రణ ఒడిదుడుకులకు తట్టుకునే శక్తి కలిగి వుండక పోవుట వలన ఆశించిన స్థాయిలో బ్రతుకవు. కాబట్టి ఇట్టి ఫ్రై సైజు చేప పిల్లలను ఫింగర్ లింగ్ (2 నుండి 5 అంగుళము సైజు గలవి) దశకు, ఏదైనా ఇక చిన్న కుంటలో లేదా పెస్ (వెదురు బొంగులచే నిర్మితమైనవి.) నందు ఒక నెల రోజులు పెంచిన తర్వాత వదలిన యెడల జీవ మరియు వాతా వరణ ప్రతికూల పరిస్థితులకు ఎదుర్కొని ఎక్కువ శాతం బ్రతుకును. మరియు ఎక్కువ ఉత్పత్తికి అవకాశాలు ఏర్పడును.
  • అధునాతన పద్దతిలో చేపల పెంపకం – అత్యంత లాభదాయకం

యాజమాన్యపద్ధతులు

  • నీటి వనరులు ఎండిన తర్వాత మే మరియు జూన్ మాసములలో నీటి మొక్కలు అనగా తుంగ, నాచు, ముల్లనాచు, తామర పాల సముద్రం మొదలగునవి వేళ్ళతో సహా తొలగించవలయును. తర్వాత నీళ్ళు నిలబడు స్థలమును బాగుగా కలియదున్నవలయును. దీని వలన అడుగు భాగములో విషవాయువులు తొలగి పోవును. ఇక హెక్టారుకు 2 క్వీంటాళ్ళ రాయి సున్నమును చెరువు/కుంట అంత సమానముగా చల్లవల యును. దీని వలన సూక్ష్మక్రిములు చనిపోవుటయే కాకుండా నేల స్వభావమును అనుకూలముగా మార్చివే యును. తదుపరి నీళ్ళు చేరునప్పుడు పశువుల పేడను ఒక హెక్టారుకు 250 కిలోల చొప్పున వేయవలెను. దీని వలన వారము రోజులలో చేపల ఆహారమైన ప్లవకముల ఉత్పత్తి అధికముగా జరుగును. వాటిలోని కీటకములు (పురుగుల) నివారించబడుటకు ఒక ఎకరమునకు 20 మి.లీ ల బ్యూటాక్స్ లేదా నోటిక్స్ లేదా ఎక్టోమిన్ ను చల్లాలి. ఈ కీటకాలను నియంత్రించుట వలన ఆహారము కొరకు చేపలకు పోటీ తగ్గి త్వరితగతిన పెరుగును.
  • సంఘ పరిధిలో ఒక చిన్న కుంటను చేప పిల్లలను పెంచుటకు (స్పాన్ లేదా ఫ్రై ధశ నుండి ఫింగర్ లింగ్ దశకు) పై యాజమాన్య పద్దతులు తూచ తప్పక పాటించవలయును. ఈ పద్ధతిలో తయారు చేయబడిన కుంట లేదా పెన్ లో వారివారి అవసరమును బట్టి దానికి రెండు రెట్ల ఫ్రై లేదా 4 రెట్ల స్పాన్ ను 20 నుండి 40 రోజుల పెంచాలి. ఇట్టి పిల్లలకు తవుడు వేరుశనగ మరియు పల్లీపిండి పొడిని ఆహారముగా ప్రతి రోజు రెండు పూటలు (2మోతాదులు ఉదయం మరియు ఒక మోటాదు సాయంత్రం) వాటి సంఖ్యను బట్టి ఇవ్వాలి. పెంచుకున్న చేప పిల్లల రక్షణ కొరకు చుట్టు మరియు పై భాగాన రక్షక వలను ఏర్పటు చేసిన యెడల భక్ష జీవుల (పక్షుల)నుండి రక్షింపవచ్చును. ఈ పద్దతిలో పెంచిన పిల్లలను చెరువు/కుంటల నందు వదిలిన యెడల అధికోత్పత్తి సాధించ వచ్చును. చేపల పెంపకమును అనుకూల మైన చెరువు/ కుంటల నందు ఇదే యాజమాన్య పద్దతిని ఫింగర్ లింగ్ చేపపిల్లలను వదలక ముందు చేపట్టాలి. ఇట్టి వనరులలో నెలకొక సారి అదే మోతాదులో పశువుల పేడ మరియు 3 నెలల కొకసారి సున్నమును వేయాలి. దీనికి అనుబంధముగా నూనె తీసిన తవుడు మరియు పల్లి చెక్క 2:1 నిష్పత్తిలో పెంచుకున్న చేపల యొక్క మొత్తం బరువు 2 శాతమును కృత్రిమ ఆహారమును ఇచ్చి యెడల మంచి దిగుబడి వచ్చును. ఒకవేళ నీటి వనరులలో కలుపు మొక్కలు ఉన్నయెడల నెలకొకసారి వీలైనంత వరకు సభ్యులందరు కలిసి తొలగీంచాలి. అంతేకాకుండా నీటి మొక్కల విస్త్రరణను బట్టి 100 నుండి 200ల వరకు గడ్డిచేప పిల్లలను వదలాలి. ఈ పద్దతులలో నీటి మొక్కలను నియంత్రించని యెడల చెరువులో లభ్యమగు పోషక పదార్థములను ఉపయోగించుకొని చేపల పెరుగుదల మరియు దిగుబడిని ఎంతగానో తగ్గించును.
  • పక్షమునకు లేదా మాసమున కొకసారి చేపల ఎదుగుదలను పరిశీలించాలి. ఆశించిన ఎదుగుదల లేనప్పుడు స్థానిక మత్స్య అభివృద్ధి అధికారి గారిని సంప్రదించినచో తదనుగుణమైన సూచనలు ఇవ్వబడును. ఈ యాజమాన్య పద్దతులు పాటించిన యెడల చాలా వరకు చేపల వ్యాధులు నివారించ వచ్చును.మరియుఅధిక ఉత్పత్తిని సాధించవచ్చును.
  • సంవత్సరము అంతయు నీళ్ళువుండు చెరువులలో నీళ్ళు కొద్దిగా ఉన్నప్పుడు ఇట్టి నీళ్ళలో ఉండు వాలుగ మరియు ఇతర భక్షక చేపలను సమూలంగా నివారించుటకు మహువ చెక్క (ఇప్ప పూవు చెక్కను) ను వేయాలి. తత్ఫలితముగా పనికి రాని చేపలు చనిపోయి పెంచదగిన చేపలు వేయుటకు అనుకూలముగా ఉండును.

మంచినీటి చేపల పెంపకంలో మత్స్యకారులు, మత్స్య కృషీవరులకు సూచనలు – పోషకాహార విలువలు

చేయవలసినవి చేయకూడనివి
·     చేపల పెంపకానికి ఎన్నుకొనే చెరువుల్లో 9 నుండి 10 నెలల వరకునీరు ఉండేటట్లు చూసుకోవాలి. ·     చిన్న కుంటలు 3-4 నెలలో ఎండిపోతాయి,. వాటిని పెంపకానికి ఎన్నుకోకూడదు.
·     చెరువు గట్లు పటిష్టంగా ఉండాలి. చెరువు తూములు వద్ద జాలీలు అమర్చుకోవాలి. ·     చెరువు నీరు కలుషితము కాకుండా చూసుకోవాలి కలుషితమైన నీటిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది.
·     చెరువు నీటిలో ఒండ్రు చేరి నీటిమట్టము తగ్గకుండా నీరు బురద కాకుండా ఉండేందుకు వేసవిలోనే చెరువు గర్భములోతు చేసుకోవాలి. ·     నీటి మట్టము 4 – 5 అడుగులకు తగ్గకూడదు.
·     చెరువుల్లో చేపలను తినే జల చరాలు లేకుండా ఎక్కువ గా నీటి మొక్కలు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ·     పరిమితికి మించి ఎరువులు వాడకూడదు. దాని వలన నీరు కలుషితము అవుతుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది.
·     చెరువు సత్తువ చేయడానికి హె.కుక్ 10 నుండి 12 టన్నుల పేడ, రెండు, మూడు దఫాలుగా వేయాలి. మరో 150 కిలోల సూపర్  ఫాస్ఫేట్ /యన్ .పి.కె. వంటి రసాయనిక ఎరువులు, 50 కిలోల సున్నము వాడ వచ్చును. ·     అత్యాశపడి సూచనలకు మించి ఎక్కువ చేప పిల్లలను వదలరాదు. ఆక్సిజన్ సరిగా దొరకక పోవడము, వ్యాధులు రావడము జరుగవచ్చు. పెరుగుదల మందగిస్తుంది.
·     చేపల పెంపకానికి మేలు రకపు కార్ప్ జాతి చేప పిల్లలు ఎకరాకు 3000 నెం.(25మి.మి పైబడిన సైజు గలది) వదలాలి.
·     నెలకొకసారి వలతో పట్టించి పెరుగుదలను గమనించాలి.
·     పెరిగే చేపలకు అదనంగా (వాటి బరువులో 2-3% వరకు బరువు గల) నూనె తీసిన తవుడు, పల్లి చెక్క కలిపిన ఆహారపు ముద్దలను గంపలలో వేయవలెను.
·     చేపలకు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసు కోవాలి.

మన ప్రాంతములో తరచుగా సంభవించు వ్యాధులు, వ్యాధి కారకములు మరియు చికిత్సా విధానము

క్రమ

సంఖ్య

వ్యాధి

పేరు

వ్యాధి కారకము

వ్యాధి లక్షణములు

చికిత్సా విధానం

1

చేప పేను

వ్యాధి

అర్గులస్,లెర్నియా ఎర్గసిలన్ (బాహ్య పరాన్న జీవులు)

గట్లను రాసుకూనును,తోక కొట్టుకొని ఎగురును,శరీరం పైన పరాన్న జీవులుపాకు తూ కనిపించును.మొప్పల పై తెల్ల పురుగులు కన్పి స్తాయి.

నువాన్ అను కీటకనాశిని మందు ను ఒక హెక్టారు నీటి విస్తీర్ణముకు ఒక లీటరు మందును ఇసుకతో కలిపిచల్లాలి. ఈ పద్దతిని ఒక వారం తర్వాత తరిగి చేయాలి. వీటి గ్రుడ్లు నీటి మొక్కల భాగాలకు అంటుకొని ఉండుట వలన అట్టి మొక్కలను తొలగించాలి. లేదా కలుపుమొక్కల నాశనిని పిచికారీ చేయాలి.

2.

కాలమ్ నారిస్ వ్యాధి

ప్లెక్సీబాక్టమ్ నారీస్ (బాక్టీరియా)

తెలుపు బూడిద రంగుగల కురుపులు చర్మము తల, రెక్కలు మరియుమొప్పల   పై ఏర్పడుతాయి.

ఆక్సి  టెట్రా సైక్లిన్ మందును ప్రతి కి.ల ఆహారమునకు 8 గ్రాముల చొప్పున 10 రోజులు ఇవ్వాలి.

3 .

ఫరంకు లోసిస్ వ్యాధి

ఎరోమోనాస్ సల్మో  సిడా (బాక్టీరియా)

శరీరమునల్లబడును, రెక్క ల కుదుళ్ళలో మొప్పల పై తీవ్ర రక్తస్రావం అగును.

టెట్రా మైసిన్ లేదా క్లోరోమైసిన్ లేదా సల్ఫోనమైడ్ ప్రతి 100 కి. గ్రా. ఆహారమునకు 6 ను&ండి 8 గ్రా. చొప్పున 10 రోజులు ఇవ్వాలి.

4.

తోక రెక్కల క్రుళ్ళు వ్యాధి

ఏరోమోనాస్ ప్రజాతులు

రెక్కల మరియు తోక అంచులు తెల్లగా పాలిపోయి క్షీణించును.

పై చికిత్సా విధానం అనుసరించాలి.

5.

మొప్పల క్రుళ్ళు వ్యాధి

బ్రాంకియోమైసిస్ (శిలీంధ్రం)

మొప్పల రంగు పసుపు గోధుమ రంగులోకి మారి బొడిపెలు ఏర్పడును.

మాలకైట్ గ్రీన్ లేదా కాపర్ సల్ఫేట్ రసాయనమును 0.2 నుండి 0.5 పిపి.ఎం. మోతాదులో ప్రతి మూడు రోజుల కోకసారి వ్యాధి తగ్గు వరకు చల్లాలి.

6.

ఇక్ వ్యధి(తెల్లపొంగు)

ఇక్తియుప్తిరియన్

మల్టిపిలిన్

( ప్రోటోజోవాను )

చర్మము,రెక్కలు, మొప్పల పై సూది తల అంత బొడిపెలు లేదా మచ్చలు ఏర్పడును.

మాలకైట్ గ్రీన్ 0.1 నుండి 3.0 పి.పి.ఎం. మోతాదులలో చల్లాలి. ప్రతి రెండు మూడు రోజులకొకసారి లేదా ఫార్మలిన్ 15 నుండి 20 పి.పి.ఎం మోతాదులో రెండు సార్లు చల్లాలి.

7.

ఇ.యు.ఎస్ . వ్యాధి (పుళ్లవ్యాధి)

బాక్టీరియా, ఫంగస్

శరీరముపై పెద్ద పుండ్లు ఏర్పడి రక్తస్రావము జరుగును

సిఫాక్స్ అను రసాయనిక మందును ఒక హెక్టారుకు లీటర్ చొప్పున పిచికారీ చేయాలి.

8.

గిల్ ప్లూక్ (మొప్పల వ్యాధి)

డెక్టైలో గైరస్ (బద్దె పురుగులు)

మొప్పలు క్షీణించుట, జిగురు అధికంగా స్రవించుట, తెల్లటి పూత లేదా మచ్చలు మొప్పలపై ఏర్పడుట.

మాలథియాన్ 100 లీటర్ల నీటికి 25 మిల్లీ లీటర్ల చొప్పున 4 రోజుల కొకసారి 3 సార్లు వేయాలి.

9.

స్కిన్ ప్లూక్

గైరో డైక్లైలస్

చర్మపు పైకణజాలము క్షిణించి అధిక జిగురు స్రవించును. పొలుసులు ఊడిపోవును. చర్మము సహజరంగు కోల్పోయి తెలుపు, బూడిద రంగు పూత ఏర్పడును.

పై చికిత్సా విధానం అనుసరించాలి.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate