పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయములో జీవ నియంత్రణ-జీవ రసాయనాల వాడకం

సమస్యలు,పద్ధతులు,జీవనియంత్రణ ఉత్పత్తికేంద్రాల సమాచారం

వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ఈ మధ్య కాలంలో రైతు సోదరులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపటం జరుగుతున్నది. అనాదిగా వాడుతున్న రసాయనిక పురుగు

మందుల వలన రైతాంగం ఆశించిన ఫలితాలు లేకపోవటం, వాటి వాడకం వలన కలిగే దుష్ఫలితాల మీద రైతు లలో పెరిగిన అవగాహన మరియు పురుగు మందుల అవశేషాలు లేని/తక్కువ ఉన్న ఉత్పత్తులకు మంచి ధర లభించటం రైతు సోదరులను జివనియంత్రణ పద్ధతులు మరియు జీవ రసాయనాల వాడకం వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి.

జీవనియంత్రణ పద్ధతులు మరియు జీవ రసాయనాలపై వ్యవసాయదారులకు మంచి నమ్మకం ఉన్నప్పటికీ వాటి లభ్యత మరియు నాణ్యతా పరమయిన సమస్యలు రైతులను వాటికి దూరంగా ఉంచుతున్నాయి.

 • రసాయనిక పురుగు మందులకు ధీటైన ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను మరియు జీవ రసాయనాలను వాడాలనుకొంటున్నప్పటికీ మార్కెట్లో రసాయనిక పురుగు మందులను దొరికినంత సులభంగా జీవరసాయనాలు లభ్యంకావటం లేదన్నది ఒక ముఖ్య సమస్య,
 • మరోవైపు రైతాంగానికి జీవనియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల మీద పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగ చేసుకొని “బెయో ఉత్పత్తులు” అనబడే బూటకపు పేర్లతో నాణ్యతలేని/నిషేదించబడ్డ పదర్ధాలను మోసపూరితంగా రైతులకు అంటకట్టడం, రెందవ అతి పెద్ద సమస్య.

జీవనియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకంలో ఎదురయ్యే లభ్యతాపరమయిన సమస్యలు-వాటి సమాధానాలు.

 • ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవి ట్రైకోకార్డుల రూపంలో రైతులు వాడుకోదలచినా కూడా మార్కెట్లో వాటి సమయానుసాత లభ్యత ఒక ప్రధాన సమస్య గా చెప్పుకోవచ్చు.
 • తక్కువ నిల్వ శక్తి (9 నుండి 12 రోజుల) ఉన్న ట్రైకో కార్డులను మార్కెట్ వారు అందుబాటులోనికి తేవడానికి వనుకంజ వేస్తున్నారు.
 • ఈ సమస్యకు సమాధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి ఆద్వర్యంలో జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పని చేస్తున్నాయి.  ఈ కేంద్రాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయంలోని అఖిలభారత  జీవనియంత్రణ పరియోజన యొక్క సాంకేతిక సహకారంతో ట్రైకో కార్డులను ఉత్పత్తి చేస్తుఊ ప్రతి జిల్లాలో రైతు సోదతులకు పంటకాలంలో వీటిని  అందుబాటులో ఉంచుతాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని ఈ కేంద్రం పై ఉత్పత్తి కేంద్రాలకు నోడల్ సెంటరుగా ఉంటుంది. మదర్ కల్చర్ ను అందు బాటులో ఉంచుతుంది.
 • ట్రైకోడెర్మా విరిడి రూ. 100/- ప్రతి కిలో చొప్పున సూడోమోనాస్ ఫోర్ సెన్స్ రూ 150/- ప్రతి కిలో చొప్పున ఈ కేంద్రాలలో లభిస్తాయి.

వివిధ పంటలలో జీవెనియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల నివారణ సంబంధిత వివరాలు

పంట చీడపీడలు జీవరసాయనము మోతారు మరియు ఇతర వివరాలు
ప్రత్తి క్ కాయతొలుచు పురుగులు ట్రైకోగ్రామ్మా కార్డు 4 కార్డులు/ఎకరా-8 సార్లు(పది రోజుల వ్యవధిలో)
పేనుబంక, తెల్లదోమ, దీపపు ;పురుగులు. వర్టిసిల్లియం లకాని 5గ్రా,/లీటరు నీటికి రెండు పిచికారిలు 10 రోజుల వ్యవధిలో
వరి కాండం తొలుచు పురుగు మరియు ఆకుముడత పురుగు ట్రైకోగ్రామ్మా కార్డు 4 కార్డులు/ఎకరా-3 సార్లు(పది రోజుల వ్యవధిలో) మొదటి రెలీజు-నాటిన 30వ రోజు
మిరప శనగ పచ్చ పురుగు ట్రైకోగ్రామ్మా కార్డు 4 కార్డులు/ఎకరా-3 సార్లు(పది రోజుల వ్యవధిలో) మొదటి రెలీజు-నాటిన 25 వ రోజు
పొగాకు లద్దె పురుగు యన; పి.వి. వైరస్ ద్రావకం 100 ఎల్ .ఇ./ఎకరాకు
చెఱకు కాండం తొలుచు పురుగు ట్రైకో కార్డులు 4 కార్డులు/ఎకరా-5 సార్లుమొదటి రెలీజు-నాటిన 45 వ రోజులకు
కణుపు తొలుచు పురుగు ట్రైకో కార్డులు 4 కార్డులు/ఎకరా-10 సార్లు(మొదటి రెలీజు-నాటిన 60 వ రోజులకు
మొక్కజొన్న కాండం తొలుచు పురుగు ట్రైకో కార్డులు 4 కార్డులు/ఎకరా-5 సార్లుమొదటి రెలీజు-నాటిన 12 వ రోజులకు
జీవనియంత్రణ సాధనాలుగా వాడే పరాన్న జీవులు బదనికలు కీటక నాశక వైరస్ ఆధారిత జీవరసాయనాలు

మార్కెట్ నుండి రైతు సోదరులు జీవ రసాయనాలు కొనుగోలు చేసే సమయంలో పాటించవలసిన మెళకువలు మరియ్ తీసుకోవలసిన జాగ్రత్తలు రెక్కల జాతి పురుగులను ;నియంత్రించే బవేరియా బాసియానా, వేరు నాశించే పురుగులను నిరోధించే మెటారైజియం ఎనైలోప్లిఏ, రసం పీల్చే పురుగుల సముదాయాన్ని అరికట్టే వర్టిసిల్లియం లకాని, వివిధ తెగుళ్ళను నివారించే అజాడిరాక్టిన్ వేపనూనె) వంటి జీవ రసాయనాలు ఈ మధ్య కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా ;మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహా జీవరసాయనాలన్నీ కూడా భారత పురుగుమందుల చట్టంలోకి వస్తాయన్న వాస్తవాన్ని రైతాంగం గమనించాలి. దిగువ పొందపరచిన మెళకువలను మరియు జాగ్రత్తలను రైతులు జీవరసాయనాల కొనుగోలు సమయంలో పాటించినట్లయితే భవిష్యత్తులో నాణ్యతకు

పట్టిక 2: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిధ్యాలయం వారి సాంకేతిక సహకారంతో నడుపబడుతున్న జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు మరియు సంబందిత సమాచారం

జిల్లా

కేంద్రంచిరునామా

సంబందిత అధికారి

సంబంధిత అధికారి సెల్ ఫోన్ నెం.

ఆదిలాబాద్

బయోకంట్రోల్ లాబ్ , కృషి కాంప్లెక్స్  , సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్ , దిస్నాపూర్ , ఆదిలాబాద్

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886614525

నిజామాబాద్

బయోలాజికల్ కంట్రోల్ లాబ్ అగ్రి మార్కెట్ కమిటీ భవన సముదాయం, శ్రద్ధానంద్ గంజ్ నిజామాబాద్

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886612710

కరీంనగర్

బయోలాజికల్ కంట్రోల్ లాబ్ కలక్టరేట్ భవన సముదాయం కరీంనగర్

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886612779

మహబూబ్ నగర్

బయోలాజికల్ కంట్రోల్ లాబ్(ఆయిల్ సీడ్స్) మహబూబ్ నగర్

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886614763

రంగారెడ్డి

బయోలాజికల్ కంట్రోల్ లాబ్ c/o డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రైతు శిక్షణా కేంద్రం, రాజేంద్రనగర్ , హైదరాబాద్

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886613913

మెదక్

బయోలాజికల్ కంట్రోల్ లాబ్ ఎం.ఆర్ .ఓ. ఆఫీస్ దగ్గర c/o  స్టేట్ సీడ్ ఫారం, సదాశివపేట్, మెదక్

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886614292

వరంగల్

బయోలాజికల్ కంట్రోల్ లాబ్ ములుగు రోడ్డు, వరంగల్

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886614641

నల్గొండ

బయోలాజికల్ కంట్రోల్ లాబ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మాన్యం చెలక, నల్గొండ టౌన్ నల్గొండ

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886614435

ఖమ్మం

బయోలాజికల్ కంట్రోల్ లాబ్ డోర్ నెం.7/2/120/1, ద్వారకానగర్ గట్టయ్య సెంటర్ ఖమ్మం.             )

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్

8886614270

రైతాంగం జీవనరసాయనాల కొనుగోలు సమయంలో గమనించవలసిన విషయాలు

 1. కొనుగోలు చేసే జీవ రసాయనం పాకెట్ / బాటిల్ పైన ప్రభుత్వంచే జారీచేయబడిన పంజీకరణ సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి.
 2. జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు క్షమతలో తేడా రాకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అని తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుగోలు చేయాలి.
 3. కొనుగోలు సమయంలో సరైన రశీదును పొంది దానిపై అమ్మిన వారి సంతకం ఉన్నదని నిశ్చితపరుచుకోవాలి.
 4. ఎటువంటి పరిస్థితులలోను సరైన వివరాలు లేని, రశీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలను కొనగూడదు మరియు వాడకూడదు. జీవరసాయనాలను భద్రపరచుకొనుట మరియు వాడకం విషయంలో పాటించవలసిన మెళకువలు
 5. జీవ రసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో గాని, తేమ లేక నీరు ఉన్న ప్రదేశాలలోగాని ఉంచరాదు.
 6. వీలయినంత వరకు ప్యాకింగ్ ను వాడుకొనే సమయంలోనే తియాలి.
 7. యన్ .పి.వి. వైరస్ ద్రావణాన్ని వీలయినంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారి చేయాలి.
 8. జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులతో కలిపి పిచికారి చేయరాదు.
 9. జీవ రసాయనాల నాణ్యత మీద రైతాంగానికి అనుమానాలుంటే రైతులుగాని, వారి ప్రతినిధులు గానీ ఆ నమూనాలను ప్రభూత్వ బయోపెస్టిసైడ్ క్వాలిటీ టెస్టింగ్ లాబ్ (జీవ రసాయనాల, గుణ నియంత్రణ ప్రయోగశాల) మలక్ పేట, హైదరాబాద్ కు ఇచ్చి అధికారికంగా నాణ్యత పరీక్షలు చేయించుకోవచ్చును.
 10. జీవ రసాయనాల పేరు మీద ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా ఉద్ధేశపూర్వక మోసానికి పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారికిగాని లేక వ్యవసాయ కమీషనర్ గారి కార్యాలయంలో డిఫ్యూటీ డైరెక్టర్ (సస్యరక్షణ ) గారికి గాని లిఖిత ఫిర్యాదు ఇవ్వవచ్చు.
 11. ఈ మధ్య కాలంలో “బయో ప్రోడక్ట్స్ ’ (జీవ ఉత్పత్తులు) పేరు మీద పెద్ద ఎత్తున కొన్ని కంపెనీలు వీటిని రైతులకు అంటగట్టడం పరిపాటి అయినది. చట్టపరంగా ఈ బయో ప్రోడక్ట్స్ కు ఎటువంటి ప్రభూత్వ అనుమతులు లేకపోయినప్పటికీ, పురుగు మందుల చట్టం మరియు ఎరువుల నియంత్రణ ఆదేశం (ఎఫ్ .సి.ఓ)లో పొందు పరచబడక పోవడంవల్ల ఇవి పెద్ద ఎత్తున చలామణి అవుతున్నాయి. వాటిలో మొక్కల పేంచే కొన్ని రకాల రసాయనాలను చట్టవిరుద్దంగా కలపటం వలన మొక్క ఏపుగా పెరుగినట్టు కనపడినా అశించిన ఫలితాలు మాత్రం శూన్యం, కొన్ని సందర్భాలలో ఈ బయో ప్రోడక్ట్స్ ఆకర్షణీయమైన పెర్లుతొ అన్ని రకాల రోగాలను, చీడపీడలను నివారిస్తాయనే అబద్ధపు ప్రచారంతో ఆమయక రైతులకు అంటగట్టడం జరుగుతున్నది. ఇతువంటి అబద్ధపు ప్రచారాలను రైతు సోదరులు ఎటువంటి పరిస్థితులలోను నమ్మి మోసపోకుండా చట్టబద్ధమైన జీవ రసాయనాలను మాత్రమే వాడుకుంటూ ఆశించిన లాభాలను పొందవచ్చు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా:ప్రధాన శాస్త్రవేత్త, జీవ నియంత్రణ పరియోజన, రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫోన్ నెం. 9848421791

3.029296875
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు