పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జీవన ఎరువులు

జీవన ఎరువుల రకాలు,ఉపయోగవిధానాలు

ప్రస్తుత వ్యవసాయ రంగంలో అనేక నూతన విధానాల ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి ప్రయత్నిస్తున్నం. ఇదే కాక పంటల సరళిలో కూడా మార్పులు వచ్చినవి. పూర్వం ప్రధాన పంట తరువార రైతులు పప్పుజాతి పంటలను పండించడం, సేంద్రియ ఎరువులను వాడటం ద్వారా భూమిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచేవారు. హరిత విప్లవం పాటించి ప్రవేశపెట్టిన క్రొత్త విధానాలు ద్వారా మనం పండించే పంట పొలాల్లో ఎన్నో అధునిక రసాయనిక ఎరువులు, పురుగు మందులు, శీలీంధ్ర నాశకాలు, కలుపు మందులు వాడటం వల్ల మన భూముల సారము తగ్గి బీడు భూములుగా మారుతున్నాయి. ఇదేకాకతోడ్పడ తాయి. అలాగే భూమి యొక్క భూభౌతిక లక్షణాలను అభివృద్ధి పరుస్తాయి.

జీవన ఎరువులంటే ప్రకృతిలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు. స్వతంత్రంగా కానీ కలిసి జీవెస్తూ వాటి జీవన క్రియల ద్వారా పంటలకు కావల్సిన పోషకాలను వాతావరణం లేదా నేల నుండి గ్రహించి మొక్కలకు అందించే సూక్ష్మజీవుల సముదాయం.

జీవన ఎరువులు ఎన్ని రకాలు?ఏఏ పంటలకు వాడవచ్చు?

 • నత్రజనిని స్థిరీకరించేవి.
 • భాస్వరం కరిగించి మొక్కకు అందించేవి.
 • మొక్కకు పెరుగుదలను అభివృద్ధి పరిచే సూక్ష్మజీవులు.
 • పొటాషియం మరియు జింకు కరిగించేవి.
 • సేంద్రియ కర్బనంను తయారు చేసే సూక్ష్మ జీవులు

నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు

 

గాలిలో ఉన్న 78 శాతం నత్రజని మొక్కకు ఉపయోగపడే విధంగా మొక్క యొక్క వేరు బుడిపెలలో లేదా వేరు యొక్క చివరి భాగంలో నత్రజనిని స్థిరీకరిస్తాయి.

 

 1. రైజోబియం: కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పు ధాన్యాలు, వేరుశనగ, సోయా చిక్కుడు వంటీ నూనె గింజలు,బఠాని, చిక్కుడు వంటి కూరగాయలు, పిల్లిపెసర, ఉలవ, బెర్సీమ్ వంటిపశుగ్రాస పైర్లు నత్రజని స్థిరీక రించుటకు వాడుకోవచ్చు.
 2. నీలి ఆకుపచ్చ నాచు : అజొల్లా, అజోస్పైరిల్లం నత్రజని స్థిరీకరించడానికి వరి పంటలో వాడుకోవచ్చు.
 3. అజటోబ్యాక్టర్ : ఇవి స్వతంత్రంగా జీవించే సూక్ష్మజీవులు, ఈ బ్యాక్టీరియాను పప్పుజాతి పంటలకు తప్ప అన్ని రకాల పంట పొలాల్లో, నారు మడుల్లో మరియు కూరగాయ, ఉద్యాన పంటలలో నత్రజని లభ్యత కొరకు వాడు కోవచ్చు. మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజని తీసుకొని వివిధ మొక్కలలో నత్రజనిని స్థిరీకరిస్తాయి.
 4. అసిటొ బ్యాక్టర్: ఈ బ్యాక్టీరియా లేదా సూక్ష్మజీవులు చెఱకు వేర్ల మీద, కాండం, ఆకుల మీద నివసిస్తూ నత్రజనిన్ మొక్కకు అందిస్తాయి.

భాస్వరం కరిగించి మొక్కకు అందించే జీవన ఎరువులు

భూమిలో నిల్వ ఉండీ, లభ్యం కాని భాస్వరాన్ని కొన్న్ రకాల బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు అవి ఉత్పత్తి చేసే ఆమ్లాలు మరియు వివిధ ఎంజైముల ద్వారా కరిగించి మొక్కలకు అందజేస్తాయి. మైకోరైజా శిలీంధ్రం, భాస్వరం మరియు వివిధ సూక్ష్మ పోషకాలను వేరుకు అందించే గుణం కల్గినది కాగా బాసిల్లస్ , సూడొమోనాస్ , ఆస్పరిజిల్లస్ , పెనిసీలియం వంటి శిలీంధ్రాలు భాస్వరాన్ని కరిగించి మొక్కకు భాస్వరం మరియు ఇతర పోషకాల లభ్యతను పెంచే స్వభారం కలిగినవి. ఈ భాస్వర ఎరువుని అన్ని పంట పొలాల్లో వాడుకోవచ్చు.

మొక్కల పెరుగుదలను అభివృద్ధి పరిచే జీవన ఎరువులు

ఈ జీవన ఎరువు ఒక మిశ్రమ సముదాయంతో కూడి ఉన్నది. ముఖ్యంగా బాసిల్లస్ మరియు సూడోమోనాస్ జారి బ్యాక్టీరియాను మిశ్రమంగా తయారుచేసి భూమిలో ఎరువుగా వాడుకోవచ్చు. ఈ ఎరువు, మొక్కలకు వివిధ పోషకాలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాక మొక్క పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను అందింస్తుంది. ఈ ఎరువులను అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు.

పొటాషియం మరియు జింకు కరిగించే సూక్ష్మజీవులు

ఈ సూక్ష్మజీవులు మొక్కకు అందుబాటులో లేని పొటాషియం మరియు జింకును అందుబాటులోకి తెస్తాయి. ఇవి ఇటీవల కాలంలోనే పరిగణలోకి వచ్చినవి. వీటిని అన్ని పంటలలో వాడుకోవచ్చును.

సేంద్రియ ఎరువును తయారు చేసే జీవన ఎరువులు:

వివిధ రకాల శిలీంద్రాలు మరియు బ్యాక్టీరియా సేంద్రియ ఎరువు త్వరితంగా తయారు కావటానికి, దానిలో ఉన్న వివిధ పదార్ధాలను విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడతాయి. వివిధ పంట పొలాల్లోని వ్యర్థ పదార్థాలను కోత తరువాత ఎరువుగా తయారుచేయడానికి వాడుకోవచ్చు.

జీవన ఎరువులు వాడుకునే విధానం

 1. విత్తనాలకు పట్టించుట ద్వారా: 200 మి.లీ. నీటిలో 10గ్రా ల పంచదార/బెల్లం/గంజి పౌడరును కలిపి 10 ని. మరగ బెట్టి చల్లార్చాలి. ఈ ద్రావణాన్ని 10 కిలోల విత్తనాల పై జల్లి దానికి 200గ్రా కావలసిన జీవన ఎరువులను కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలి. తరువాత ఈ విత్తనాలను అరగంట నీడలో ఆరబెట్టి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు విత్తుకోవాలి.
 2. పంట పొలాల్లో వెదజల్లడం: ఎకరానికి 2 కిలోల అజటోబాక్టర్ లేదా ఫాస్ఫో బాక్టీరియాను ఏదైనా జీవన ఎరువు లేదా బాగా తయారైన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుతో (200 కిలోలు) కలిపి చెట్టు క్రిందిఅ ఒక వారం రోజుల వరకూ కుప్పగా పోసుకొని రోజు నీళ్ళు చిలకరిస్తూ మనం కలిపిన సూక్ష్మజీవుల పెరుగుదలను గమనించి తయారైన ఎరువును దుక్కిలో గాని, మొక్కల సాళ్ళల్లో పడేట్టు వేసుకోవాలి. సమయం తక్కువగా ఉన్నట్లైతే జీవన ఎరువును, ఎరువుతో కలిపిన తర్వాత వెంటనే కూడ వాడుకోవచ్చును.
 3. a. నారుద్వారా: నారు పీకిన తరువాత చిన్న చిన్న కట్టలుగా కట్టి 1 కిలో జీవన ఎరువును 10లీ. నీటిలో కలుపుకొని ఈ జీవన ఎరువు నీళ్ళల్లో అరగంట నానబెట్టిన తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.

జీవన ఎరువులు వాడకంలో జాగ్రత్తలు

 1. జీవన ఎరువులను వేడి, వెలుతురు గల ప్రదేశంలో ఉంచకూడదు, చల్లని, నీడ ప్రదేశంలో నిల్వ చేయాలి.
 2. జీవన ఎరువులను పురుగు మందులతోను, రసాయన ఎరువులతోను కలిపి వాడకూడదు.
 3. విత్తన శుద్ధి చేయదలచినప్పుడు మొదటగా కీటక నాశనితో శిలీంధ్ర నాశనం తర్వాత శుద్ధి చేసిన 24 గంటల తర్వాత జీవన ఎరువును పట్టించాలి.
 4. ప్యాకెట్లపై సూచించిన గడువు తేది మరియు పంటను గమనించి జీవన ఎరువును వాడుకోవాలి. గడువు ముగిసిన జీవన ఎరువులు వాడరాదు.
 5. జీవన ఎరువు సమర్ధవంతంగా పని చేయటానికి మంచి నాణ్యత గల కల్చర్ లను వాడాలి.
 6. పైరుకు నిర్ధేశించ బడిన జీవన ఎరువును మాత్రమే వాడాలి.

వివిధ పంటలలో జీవన ఎరువుల ఎంపిక మరియు వాడుకునే పద్దతి

జీవన ఎరువు వాడుకో తగిన పంటలు పద్దతి
రైజోబియం వేరు శనగ, సోయాబీన్ , పెసర, కంది, శనగ, అలసంద, బఠాణి, మినుము విత్తనాలకు పట్టించడం
నీలి ఆకుపచ్చనాచు వరి
అజొల్లా వరి
అజటోబ్యాక్టర్ ప్రత్తి, కూరగాయలు, మల్బరి, జొన్న, ప్రొద్దుతిరుగుడు వెదజల్లడం
అజోస్పైరిల్లమ్ వరి, చెఱకు, ప్రత్తి, చిరుధాన్యాలు చెఱకు నారుమడి
మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447
3.0546875
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు