హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక / పంటలలో ఉపపోషక పదార్ధముల లోపాలు,నివారణ చర్యలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంటలలో ఉపపోషక పదార్ధముల లోపాలు,నివారణ చర్యలు

పంటలలో ఉపపోషక పదార్ధముల లోపనికి నివారణ

పంటలలో ఉపపోషక పదార్ధముల లోపములు - తదుపరి నివారణ జాగ్రత్తలు

పంట

ఉప పోషక పదార్ధము

తీసుకోవలసిన చర్యలు తదుపరి నివారణ

ఆరుతడి వరి

(వర్షాధారము)

జింకు

2గ్రా. జింకు సల్ఫేట్ ఒక లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు-మూడు సార్లు పిచికారి చేయాలి. తదుపరి పంటకు భూసార పరీక్షకు అనుగుణంగా జింకు సల్ఫేటు వాడాలి. (20కిలోలు ఎకరానికి), క్రమము తప్పకుండా సేంద్రియ ఎరువులను వాడాలి.

వరి నారు మడి

జింకు

లీటరు నీటికి 1-2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున పిచికారి చేయాలి.

నాట్లు వేయబోయే పొలములో భూసార పరీక్ష చేయించు కుంటే మంచిది.

నాట్లు వేసిన వరి

జింకు

2గ్రా. జింకు సల్ఫేట్ ఒక లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు-మూడు సార్లు పిచికారి చేయాలి. తదుపరి పంటకు భూసార పరీక్షకు అనుగుణంగా జింకు సల్ఫేట్ వాడాలి.( 20కిలోలు ఎకరానికి), క్రమము

తప్ప కుండా సేంద్రియ ఎరువులను వాడాలి.

మొక్కజొన్న, పప్పు దినుసు పంటలు నూనెగింజపంటలు ప్రత్తి, మిరప, కూరగాయలు

 

2గ్రా. జింకు సల్ఫేట్ ఒక లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు-మూడు సార్లు పిచికారి చేయాలి. తదుపరి పంటకు భూసార పరీక్షకు అనుగుణంగా జింకు సల్ఫేట్ వాడాలి.( 20కిలోలు ఎకరానికి), క్రమము

తప్ప కుండా సేంద్రియ ఎరువులను వాడాలి.

ఆరుతడి వరి

ఇనుము

లీటరు నీటికి 2గ్రా. అన్నభేది వారం వ్యవధిలొ రెండు నుంచి మూడు సార్లు పిచికారి చేయాలి. పిచికారికి ముందు ఒక ట్యాంక్ ద్రావణము నకు ఒక నిమ్మ చెక్క తప్పనిసరిగా పిండాలి. ఆరుతడి వరి (వర్షా ధారము)లో ఇనుము లోపము తరచుగా కనిపిస్తుంటుంది. దీనికి కారణం తడి మరియు బెట్ట వెంట వేంటనే కలుగుట వలన పిచికారి శ్రేయస్కరం

వేరుశనగ

ఇనుము

పంట దశను బట్టి లీటరునీటికి 1-2 గ్రా. అన్నభేది వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారి చేయాలి. పిచికారికి ముందు ఒక ట్యాంక్ ద్రావణానికి ఒక నిమ్మ చెక్క తప్పనిసరిగా పండాలి.

కార్శి చెఱకు పంట

ఇనుము

లీటరు నీటికి 2-5 గ్రా . అన్నభేది వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారి చేయాలి. పిచికారికి ముందు ఒక ట్యాంక్ ద్రావణానికి ఒక నిమ్మ చెక్క తప్పనిసరిగా పండాలి.

వివిధ పంటలు

బోరాన్

బోరాన్ లోపము వలన పూత సరిగారాక లేక కాయలు చిన్నవిగా ఉండడం లేక గింజలు తాలుగా కనిపిస్తాయి. ఇటువంటి సందర్భము లో బోరాన్ వేయడము లేక పిచికారి చేయడము వలన తగినంత లాభాలు వుండవు. తదనుగుణంగా వార్షిక పంటలకు నాలుగు కిలోల బోరాక్స్ ను ఎకరానికి ఆఖరి దుక్కిలో తదుపరి పంటకు వేయాలి. కొబ్బరికి ఒక చెట్టుకు 75-100గ్రా. బోరాక్స్ ను పాదులలో వేయాలి. మామిడికి కూడ చెట్ల వయసును బట్టి 100-150 గ్రా వరకు మొదటి దఫా ఇతర ఎరువులు వేసేటప్పుడు వేయాలి.

చీనీ, నిమ్మ

బహు ఉప పోషక పదార్ధ లోపాలు

సున్నము అధికముగా గల నేలల్లో చీనీ, నిమ్మ పండ్ల తోటలకు జింకు, ఇనుము, బోరాన్ ఇత్యాది బహు ఉప పోషక పదార్ధాల లోపాలు ఉమ్మడిగా ఒకేసారి పంట మీద కనిపిస్తాయి. దీని కోసము 10లీ. నీటికి 50గ్రా. అన్నభేది, 20గ్రా. మాంగనీసు సల్ఫేటు, 10 బోరాక్స్. 60గ్రా. కాల్షియం కార్బోనేట్ (సున్నము) ను కలిపి సంవత్సరంలో నాలుగు సార్లు (జూన-జూలై, జనవరి-ఫిబ్రవరి మాసాల్లో) పిచికారి చేయాలి. ఇలా వీలుకాని ఎడల మార్కెట్ లో లభ్యమయ్యే బహు ఉప పోష్కాల మిశ్రమము  (ఫార్ములా – 4) ను వినియోగించవచ్చును.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.02040816327
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు