অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పశుగ్రాస పంటలు – పచ్చి మేత – ప్రాముఖ్యత

మన తెలంగాణ రాష్ట్రంలో 70% జనాబా యొక్క జీవవాధారము వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నది. చిన్న, సన్నకారు రైతులు వర్షాధారంగా పంటలసాగు చేప డుతున్నారు. ఇప్పుడు ఎదుర్కుంటున్నటువంటి వర్షాభావ పరిస్థితులైతే నేమి లేక తుఫానులు, వడ్లగండ్ల వానలతో రైతు సోదరులు ఒక్క ఆహార పంటల సాగుపైనే ఆధారపడ కుండా, పాడిపశువుల పోషణ – పాల ఉత్పత్తి, మేకలు,గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా చేపట్టడానికి, ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా పశుపోషణలో మేపు ఖర్చు 70 శాతం అవుతుంది. చౌకగా అభ్యమయ్యే పశుగ్రాసపంటలను పచ్చుమెతగా వాడడం వల్ల మేపు ఖర్చుతగ్గి, పాలఉత్పత్తి పెరిగి పశుపోషణ లాభదాయకంగా ఉంటుంది.పచ్చిమేత తినటానికి సులువుగా, రుచిగా ఉండటమే కాకుండాఅధికపోషక విలువలను కలిగి సులభంగా జీర్ణమౌతాయి. అధిక పాల ఉత్పత్తి సామర్ధ్యమున్నటువంటు సంకరజాతిఆవులు, పాల గేదెలకు అధిక దిగుబడికై పచ్చిమేత అవసరమెంతైనా ఉంది. అ6దువల్ల రైతు సోదరులు అధిక పచ్చి మేత దిగుబడి ప్రణాళిక బద్దంగా పశుగ్రాస పంటల సరళిని ఎన్నుకుని పండించుకోవాలి.

పశువులకు మేతగా ఉపయోగించే పంటలలో ధాన్యపుజాతి, గడ్డిజాతి మరియు పప్పుజాతి పంటలు ముఖ్యమైనవి, సంవత్సరము లోపల పంట కాలము పూర్తి చేసుకొనే పంటలను ఏకవార్షికాలని,సంత్సరము కంటే ఎక్కువ పంటకాలమున్న పంటలను బహువార్షికాలని అంటారు.

  1. ధాన్యపు జాతి పశుగ్రాస పంటలు a.ఏక వార్షికాలు: జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఓట్స్ b. బహు వార్షికాలు: బాజ్రా నేపియర్ హైబ్రిడ్ లు
  2. పప్పుజాతి పశుగ్రాసాలు ఏక వార్షికాలు: బొబ్బెర్లు, ఉలవలు, గోరుచిక్కు డు, పిల్లిపెసర, జనుము, బర్సీమ్ బహు వార్షికాలు: ల్యూసర్న్ , స్టైలో, దశరధ గడ్డి.
  3. గడ్డిజాతి పశుగ్రాసాలు: గినీగడ్డి, పారాగడ్డి,దీనా నాధ్ గడ్డి, అంజన్ గడ్డి, రోడ్స్ గడ్డి, క్రైసోపోగాన్,సెహి మాగడ్డి, సిగ్నల్ గడ్డి మొ” ని.
  4. సాగుకు అనికూలమైన పశుగ్రాసపు చెట్లు  : సుబాబుల్ , అవిశ, విప్ప

వివిధ కారణాలవలన ఆహారపంటల సాగుకు అనికూలంగా లేని సమస్యాత్మక భూముల్లో ఈ క్రింది వివరించిన పశుగ్రాస పంటలను సాగు చేసుకొని రైతులు లబ్దిపొందవచ్చు.

 

పంట

ఆమ్లనేలల్లో

మొక్కజొన్న (రకము ఆఫ్రికన్ టాల్ ,) బాజ్రా నేపియర్ హైబ్రిడ్ లు, గినీగడ్డి – (రకము హమిల్ )

చౌడునేలల్లో

రోడ్స్ గడ్డి, సూడాన్ గడ్ది (రకము- ఎస్ .ఎస్ .జి -59 -3) ఓట్స్ (కెంట్ ,ఓ.యస్ -6), బాజ్రా నేపియర్ హైబ్రిడ్లు, సజ్జ (యన్ .డి.ఎఫ్ .డి -2 ), లూసర్న్ (టి-9) దశరధగడ్డి (హైడ్జ్  లూసర్న్ ), పారాగడ్డి, బర్సీమ్ (మెస్కావి)

సున్నపునేలల్లో

జొన్న (పి.సి -6 ) సజ్జ (రాజ్ కోబాజ్రా ) బాజ్రానేపియర్ హైబ్రిడ్లు

నీరు నిలువ ఉండే నేలల్లో

పారాగడ్డి, బాజ్రానేపియర్ హైబ్రిడ్లు (కొన్ని రోజులవరకు తట్టుకుంటుంది) బంజరు, పడావు భూముల్లో స్టైలో, అంజన్ గడ్ది.

ధానపు జాతి పసుగ్రసాలు

గడ్డి జాతి పసుగ్రసాలు

పప్పు జాతి పశుగ్రాసాలు

173 టన్నుల పచ్చిమేత ఉత్పత్తికి ఒక హెక్టారు పొలంలో 60% ను బహువార్షికాలయిన బాజ్రా నేపియర్ హైబ్రిడ్ , లూసర్ను, హెడ్జ్ ల్యూసర్న్ వంటి బహు వార్షికాల ను సాగుచేసుకోవచ్చును. మిగతా ఒక ఎకరంలో జొన్న, మొక్క జొన్న, సజ్జ, అలసంద, గోరుచిక్కుడు వంటి ఏక వర్షికాలను సాగు చేయాలి.

ఒక పాడి పశువుకు ఒక రోజుకు కావల్సిన పచ్చి మేత:40 కిలోలు 10 పాడి పశువులకు ఒకరోజుకు కావల్సిన పచ్చిగడ్డి : 14*10= 400కిలోలు ఒక సంవత్సరానికి 10 పాడి పశువులకు కావల్సిన పచ్చి గడ్డి: 400*365 = 146 టన్నులుఒక దూడకు ఒక రోజుకు కావల్సిన గడ్డి : 15 కిలోలు 5 దూడలకు ఒక రోజుకు కావల్సిన గడ్డి: 15*5 = 75కిలోలు5 దూడలకు ఒక సంవత్సరానికి కావల్సిన గడ్డి: : 75*365 = 27.42 టన్నులు10 పశువులు, 5 దూడలకు సాలుకి కావల్సిన పచ్చి గడ్డి: 146+27.42 = 173 టన్నులు.

10 పాడి పశువులు, 5 దూడలకు సంవత్సరానికి కావల్సిన పచ్చిమేత ఉత్పత్తికి ఒక హెక్టారులో (2.5 ఎకరాల్లో) పశుగ్రాసాల సాగును ఈ క్రింది విధముగా చేపట్టటన్ను వచ్చును. పాడి పశువులను కొనడానికి 2-3 మాసాల ముందే పశుగ్రాసాలను సాగు చేయాలి..15 ఎకరంలో: బాజ్రా నేపియర్ హైబ్రిడ్ లను జూనె మొదటి వారంలో నాటాలి. ఈ పంటలో హెడ్జ్ ల్యూసర్న్ బహువార్షి కపు పప్పుజాతి పంటను అంతర పంటగా3:1 నిష్పత్తిలో సాగు చేసుకొనవచ్చును. మొదటి కోతను 70 రోజులకు, తదుపరి కోతలను 45 రోజులకు తీసికొనిన ఆఉర్ కోతల్లో 1.125 ఎకరానికి 112 టన్నులు పచ్చిమేత వస్తుంది. అదేవిధంగా అంతరపంట అయిన హెడ్జ్ ల్యూసర్న్ 8.0 టన్నుల దిగుబడినిస్తుంది.


ఒక ఎకరంలో: ఖరీఫ్ లో అర ఎకరంలో పలు కోతలుజొన్నను సాగు చేసుకొనిన మూడు కోతలలో 20టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. మిగతా అర ఎకరంలో అలసంద (బొబ్బెర) పశుగ్రాసపు పంటను రెండు విడతలుగా అంటే జూన్ మొదటి వారంలో ఒక తడవ, మళ్ళీ ఆగష్టు మొదటి వారంలో రెండవ విడత విత్తుకొనిన 10 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది.

రబీ

అదే ఎకరంలో రబీలో అర ఎకరంలో జొన్న తర్వాత నవంబరు రెండవ వారంలో పశుగ్రాసపు మొక్కజొన్న పంటను విత్తుకొనిన, మూడు నేలల్లో ఫిబ్రవరిలో 10 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. మిగతా అర ఎకరంలోఅలసంద (బొబ్బెర) తర్వాత ల్యూసర్న్ పంటను అక్టోబరుమొదటి వారంలో విత్తుకొనిన మొదటి కోత 60-65రోజులకు, తరువాత 25-30 రోజులకు కోత చొప్పున డిశంబర్ 25 నుండి కోతలు తీసుకోవచ్చు. సంవత్సరానికి 8-10కోతలతో అర ఎకరంలో 15 టన్నుల పచ్చిమేత వస్తుంది.

వేసవిలో

రబీలో మొక్కజొన్న పంట తరువాత వేసవిలో ఫిబ్రవరి రెండవ వారంలో సజ్జ పంటను పశుగ్రాసముకొరకుసాగు చేసుకోవచ్చు. తక్కువ నీటి తడులతో, తర్వాత పెరిగి మూడు కోతలలో అధిక పచ్చిమేత దిగుబడి నిస్తుంది. అందువల్ల వేసవికి అనువైన పశుగ్రాసపు పంటగా సజ్జను చెప్పుకోవచ్చు. విత్తిన 50 రోజులకు మొదటికోతను, తదుపరి కోతలను 30రో. వ్యవధిలో కోసుకోవాలి.మూడు కోతలలో జూన్ వరకు అర ఎకరంలో 15 టన్నులపచ్చిమేత దిగుబడి వస్తుంది.

ఈ విధంగా 2.5 ఎకరాల్లో ‘190’ టన్నుల పలురకాల పశుగ్రాసాలను పొందవచ్చు. 10 పాడిపశువులకు, 5 దూడలకు కావలసిన పచ్చిమేత ‘173’ టన్నులు పోగా మిగిలిన17 టన్నుల గ్రాసాన్ని మాగుడు గడ్డిగా (సైలేజి) భూమిలో పాతర వేసి నిల్వ చేసుకోవచ్చును.

పశుగ్రాసాల సాగు కొరకు ప్రత్యేకంగా పొలంను కేటయించలేని చిన్న, సన్న కారు రైతులు, తమకున్న పొలంలోనే ఆహారధాన్యపు పంటలలో అంతరపంటలుగా లేదా పంటలమధ్య కాలములో గాని పశుగ్రాస పంటలని ఈ క్రింది విధముగా సాగు చేసుకోవచ్చు.

  • మధ్య, స్వల్పకాలిక వరి వంగడాలను పండించే రైతు సోదరులు ప్రధాన పొలంలో నాటుటకు ముందున్న 45-60 రో”ల కాలంలో స్వల్పకాలిక పప్పుజాతి పశుగ్రాస పంట అయిన అలసందని సాగు చేసుకొనవచ్చు.
  • వరి కోసిన తరువాత నిల్వౌన్న తేమతో జనుము, పిల్లి పెసర ప్సంటలన సాగు చేయవచ్చు.
  • కందిలో అంతరపంటగా స్వల్పకాలిక పశుగ్రాసపు సజ్జ పంటను సాగు చేసి 50 రో”లలో కోత తీసుకోవాలి.
  • మొక్కజొన్నలో అలసందను అంతరపంటగా సాగు మొక్కజొన్నలో అలసందను అంతరపంటగా సాగు చేయాలి.

తోటల్లో పశుగ్రాసాల సాగు

అంజన్ గడ్డి, స్టైలో గడ్డివిత్తనాలను 2:1 నిష్పత్తిలో కలిపి తోటల్లో చల్లితే 3 నెలల నుంచి పచ్చిమేత దిగుబడి మొదలై, ఎకరాకు 10 టన్నుల చొప్పున పచ్చిమేత లభిస్తుంది. తోటల నీడలో గినీగడ్డిని కూడా సాగు చేసుకోవచ్చు.

  • పొలముచుట్టూ, పశువుల పాక చుట్టూ సుబాబుల్ అవిసె వంటి చెట్లను పెంచితే పశుగ్రాసముతో బా టు పశువులకు చలి, వేడి గాలుల నుంచి రక్షణ లభిస్తుంది.
  • కాల్వ గట్లపైన, పంట పొలాల గట్లపైన, బాజ్రా నేపి యర్ హైబ్రిడ్ లను , హైడ్జ్ ల్యూసర్న్ లను పశు గ్రాసంగా పెంచుకోవచ్చు.

పశుగ్రాస నిల్వ పద్దతులు

అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని పాతర గడ్డి (సైలేజి), ఎండుగడ్ది (హే) గా నిలువచేసు కొని పశుగ్రాసము కొరత ఉండేసమయంలో(మార్చి వాడుకోవచ్చును.

సైలేజి (పాతర గడ్డి)

చిన్న ముక్కలుగా చేసి గుంతలొ పాతరసికాని,ట్యాంక్ లో నింపి కాని లేదా ఈ మధ్యన సైలేజిపాలిథీన్ సంచులలో నింపి, గాలి లేకుండా పులియబెట్టి, నీరు కూడా లేకుండా ఉండే స్థితిలో నిలవచేయడాన్ని “సైలేజి” అని అంటారు. రంగులోఉండి త్వరగా జీర్ణ మయ్యే స్వభావము కలిగి ఉంటుంది దీన్ని ప్రతి పశువుకు 20 కిలోలుల, 10 కిలోల ఎండుమేతతో కలిపి పాలు పితికిన తరువాత లేదా పిండడానికి నాలుగు గంటల ముందు పాడిపశువుల కు మేపాలి. ముదురు గోధుమ నలుపు రంగు కలిగి, పులుపు వాసన ఉన్న సైలేజిని వినియోగించకూడదు.

సైలేజి నిల్వచేసుకోవడానికి మొక్కజొన్న, జొన్న,సజ్జ, పశుగ్రాసాలను గింజలు పాలుపోసుకున్న తర్వాత కోసి వినియోగించుకోవాలి. అదేవిధంగా బాజ్రా నేపియర్ ,గని గడ్డి,పచ్చి ప్యారా గడ్డిలను పూత దశలో కోసి సైలేజికి ఉపయోగించాలి.పశుగ్రాసాలలో తేమ 65-75% మించి ఉండకూడదు.

సైలేజి చేసే విధానం: నీటి వూటలేని ఎత్తైన ప్రదేశంలో పాతర తవ్వివాటి అడుగు భాగాన, ప్రక్కలకు సిమెంటు గోడల కట్టాలి.చాఫ్ కట్టర్ తో సన్నగా నరికిన మేతను పాతరలో నింపి, ట్రాక్టరుతో నడిపి పాతరలో గాలి లేకుండా చేయాలి. ప్రతిటన్ను గడ్డికి 2-3 కిలోల బెల్లపు మడ్డి మరియు 1 కిలో రాతి పచ్చిమేత పొరల మధ్య చల్లాలి. పాతరను భూమికిఎత్తు 2-3 అడుగుల వరకు నింపి, దానిపై మందపాటిగాని పరచి మట్టి, పేడ మిశ్రమంతో పూత పూసి (అలికి) ఏపాలి థీన్ షీట్ లేదా వరిగడ్డిని మాత్రం గాలి, వర్షపు నీరుగొతులను పాతరలోకి పోకుండా జాగ్రత్త పడాలి. నింపేముందు గోతుల అడుగు భాగం, ప్రక్కలకు వరి గడ్డి వేసినఎడల పాతర గడ్డి వృధాకాకుండా ఉంటుంది. లేనిచో గాలి,నీరు సొకిన పాతరగడ్డి బూజుపట్టి చెడిపోతుంది.

సైలేజి ఎప్పుడు తియాలి: ఇలా నిలువచేసిన గడ్డి రెండుమూడు నెలలకు మాగి కమ్మటి వాసన కలిగిన సైలేజిగాతయారవుతుంది. దీన్ని అవసరాన్ని బట్టి ఎప్పిడైన తీయవచ్చు. అవసరంలేకుంటే 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా సైలేజిని నిలువ ఉంచుకోవహ్చు. సైలేజి గుంత తెరుచిన తరువాత నెలరోజుల లోపు వాడుకోవాలి. లేనియెడల ఆరిపోయి చెడిపోతుంది. మొత్తం కప్పునంతా ఒక సారి తీయకుండా ఒక ప్రక్క నుంచి బ్రెడ్ ముక్కలు లాగా తీసి వాడుకోవాలి.

పొడి పశువిలున్న రైతుకు 4 నెలల వరకు సైలేజి మేపాలంటే తయారు చేసుకోవలసిన సైలేజి పరిమాణము:మొక్కజొన్న పంటతో రైతు సైలేజి తయారు చేసుకోవాలంటే అవసరమయ్యే సైలేజి పరిమాణాన్ని మరియు సైలేజి గుంతలన్నీ ఈ క్రింది విధముగా లెక్కించవచ్చు. ఒక ఘనపుట డుగు గుంతలో తయారు చేయబడిన సైలేజి బరువు 15 కేజీలు. ఒక కిలో సైలేజ్ కి 1 ½ కిలోల పచ్చి మేత అవసరమవుతుంది.

  • సైలేజి అందించాల్సి వుండే కాలం -4  (మార్చి నుండి జూన్ వరకు).
  • 10 పశువులకు 120 రోజులకు కావలసిన అవస రమయ్యే సైలేజి – 24,000 కిలోలు120 రోజులు X20 కిలోలుX10 పశువులు).
  • 1 కేజి సైలేజి తయారీకి కావలసిన పరిమాణం -20 కిలోలు.
  • 24,000 కిలోల సైలేజి తయారికి కావలసిన పరిమాణం – 36,000 కిలోలు.
  • ఒక ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న పశుగ్రాస దిగుబడి సుమారుగా – 20,000 కిలోల.
  • 36,000 కేజీలకు మొక్కజొన్న పశుగ్రాసంసాగు చేయు విస్తీర్ణం, కావలసిన ఎకరాలు -2 ఎకరాలు
  • 15 కేజీలకు పచ్చిమేతను సైలేజి తయారీకి కావలసిన స్థలం -1 ఘ.చ.అ
  • 36,000 కేజీల పచ్చిమేతను సైలేజి తయారీకి కావలసిన స్థలం -2400 ఘ.చ. అ.
  • 1నెలకు కావలసిన సైలేజీ గుంత తయారీకి కావలసిన గుంత పరిమాణం -600 ఘ.చ.అ.

కావలసిన ఒక గొయ్యి సైజు పొ 20Xవె10X లోతు3 (9000 కేజీ సైలేజి పరిమాణం ) సైలేజి పాతర ప్రారంభించిన నెలలోపు వాడుకోవాలి కాబట్టి ఈ సైజులో 4 గొయ్యి ల్ని తయారు చేసుకొని ప్రతి నెలా ఒక గోతిని మాత్రమే తీసి ప్రతిరోజు 20కిలోల చొప్పున 30 రోజులు అందించాలి.ఈవిధంగా 4 మాసాల పాటు సైలేజి సరిపోయే విధంగా ఎలాంటి సమస్య లేకుండా అంధించడం సాధ్యమవుతుంది.

‘హే’ గా తయారు చేయుట: ధాన్యపు జాతి గడ్డిని గాని గడ్డిజాతి పంటలను గానీ, లేదా పప్పుజాతి పంటలను గాని పూత దశ కంటే ముందు దశలో కోసి, వాటిని ఎండబెట్టి, కొరత కాలంలో వాడుకోవడాన్ని, ‘హే’ గడ్డి అంటారు. ఇది లేత ఆకుపచ్చ రంగులో వున్న ఆకులు, కొమ్మలతో తడి లేకుండా వుంటుంది. ఎక్కువగా వున్న పశుగ్రాసాన్ని నిలువచేసే పద్దతుల్లో ఇది చాలా తేలికయినది. ఈ పద్దతితో కాండంలోని నీటి శాతం బాగా తగ్గేవరకు దానిని ఎండనివ్వాలి. పులిడం, బూజు పట్టకుండా వుండేలా తేమ శాతాన్ని తగ్గించాలి.పప్పుజాతి రకాలతో కలిపి లేదా కలపకుండా‘హే’ ను తయారు చేయవచ్చును.

పశుగ్రాస పంటల సాగులో రైతులు గుర్తించుకోవలసిన

  • గడ్డిజాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్న విగాఉంటాయి. కావున వాటిని విత్తునప్పుడు లోతు 2 సెం.మీ. కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త వహించాలి.
  • నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందా లంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోయాలి.
  • పశువుల మేతలో, మూడు వంతుల గడ్డిజాతిపశు గ్రాసంతో పాటు ఒక వంతు పప్పుజాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడము వలన అధిక పోషక విలువలున్న పచ్చిమేత లభిస్తుంది.
  • పశుగ్రాసాన్ని కోసిన తరువాత, చాఫ్ కట్టర్ (కత్త రింపు యంత్రము) ద్వారా చిన్న ముక్కలుగా చేయ డము వల్ల పసువులు తీసికొనే ఆహార పరిమాణము పెరుగుతుంది. అంతేగాక పశుగ్రాస నష్టము తక్కువ గా ఉంటుంది.
  • జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తరువాత మాత్ర మే పశుగ్రాసంగా ఉపయోగించాలి. లేనిచో పశువుల కు నామువ్యాధి సోకే అవకాశముంది.
  • పొలం చుట్టూ పశుగ్రాస చెట్లయిన సుబాబుల్ , అవిశె మొ.నవి పెంచడం వలన వేసవి కాలంలోపశు వుల మేతను సమృద్దిగా అందించ వచ్చును. అంతే కాకుండా మన పరిసరాలలో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనము, దురిశెన, ఇప్పచెట్లు, రావిచెట్లు, మర్రిచెట్టు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు వంటి చెట్లనుపయోగిం చుకొని వేసవిలో పశుగ్రాస కొరతను అధిక మించ వచ్చు.
  • ల్యూసర్న్ లో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమాజిత పైర్ అనే కలుపు మందులను2మి.లీ/1లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. పంట మార్పిడి చేసుకోవాలి.
  • చీడ పీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందు         లను కోతకి 15-20 రో. ల ముందే పిచికారి చేసుకోవాలి లేక పోతే మందు అవశేషాలు  పశువులకు హాని కలిగించే అవ కాశముంది. ఈ విధంగా రైతు సోదరులు పశుగ్రాస పంటల ను సాగు చేసి, అధిక పాల దిగుబడికి తోడ్పడాలని భావిస్తు నాము.
  • బాజ్రా నేపియర్ హైబ్రిడ్ లను మొదటి కోత 70 రో జులకు మరియు తదుపరి కోతలను 45 రోజులకు కోసుకోవాలి. ఈ గ్రాసములో 3 సం. ల తర్వాత దుబ్బుకు 50-70 పిలకలు ఏర్పడతాయి. వాటిని అట్లే వుంచినంట్లయితే వేసిన ఎరువులు అన్నిపిలకలకు సరిపోక పచ్చిమేత దిగుబడి తగ్గిపోతుంది.అందుకని వాటిలో మంచిగా వున్న 4-5 పిలకల నుంచి మిగతా వాటిని తీసి వేరే చోట నాటుకోవాలి.
  • స్టైలో విత్తనాలను 80డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడినీటిలో 45ని. లు నానబెట్టి ఆ తర్వాత ఒక రాత్రంతా చల్లటినీటిలో నానబెట్టి విత్తుఅకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా వుంటుంది.
  • తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా వున్నందున ఓట్స్ పంటను పశుగ్రాసంగా సాగుచేసుకొని 2 ½ నెలల్లో 14-16 టన్నుల పచ్చిమేత దిగుబడిని పొందవచ్చును.
  • వేసవి కాలంలో సాగు చేసుకోవాటానికి పశుగ్రాసపు సజ్జ అనువైన పంట తక్కువ తడులతో త్వరగా పెరిగి మూడు కోతల్లో ఎకరానికి 30 టన్నుల దిగుబడినిస్తుంది. పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి, వెన్న శాతము పెరుగుతుంది.
  • పచ్చిక బయళ్ళు, బీడుభూములను సిల్విరుగా (పశుగ్రాసపు చేట్ల వరుసల మధ్య పచ్చిక పెంచడాన్ని “సిల్వి వాశ్చర్” అంటారు). అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా, పశువులకు పచ్చి మేత లభిస్తుంది. ఉదాహరణకు సుబాబుల్ , అవిస ఇప్పచెట్టు మొదలైన పశుగ్రాసపు చెట్లను పెంచు కొని వాటిలో గడ్డిజాతి పశుగ్రాసాలైన్ బాజ్రా నేపి యర్ లేదా అంజన్ గడ్డి లేదా గినిగడ్డిలను మరియు పప్పు జాతి పహుగ్రాసాలైన్ దశరథ గడ్డి (“హెడ్జ్ ల్యూసర్న్”), స్టైలో లను అంతర పంటలుగా వేసు వెసుకోవాలి.
  • సమీకృత దాణాకు ప్రత్యామ్నాయం – అజోల్లా: పశు పోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దాణా ను వాడటము వల్ల పా ఉత్పత్తి వ్యయము గణనీ యంగా పెరిగే అవకాశము ఉన్నందున ప్రత్యామ్నా యం గా చుకగా లభించే అజొల్లాని ఉపయోగించు కోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడు, నత్రజని స్వీక రిస్తు పెరిగే ఒక నాచుమొక్క. వీటికి వేర్లు, కాండము లేకుండా కేవలము ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు (25 – 35%), విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని ‘పోషకాలగని’ అని చెప్పవచ్చును. రైతులు ఇంటి దగ్గర నీటి అవసరము అంతగా లే కుండా, స్వల్ప విస్తీర్ణంలో, తక్కువ కాలములో, చౌక గా అధిక దిగుబడితో సాగు చేసుకోవచ్చు.
  • నేల అవసరము లేకుండా హెడ్రోఫోనిక్ విధానంలో పశు గ్రాసాల సాగు: నేల అవసరము లేకుండ నీటితో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్దతిని ‘హెడ్రోవోనిక్స్ అంటారు. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాల్ని హైడ్రో ఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగుచేస్తారు.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి,  పశుగ్రాస పరిశోధనా కేంద్రం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/26/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate