హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక / పురుగు మందుల పిచికారిలో పాటించవలసిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పురుగు మందుల పిచికారిలో పాటించవలసిన జాగ్రత్తలు

పంటల సాగులో సస్యరక్షణ ప్రధానం.

పంటల సాగులో సస్యరక్షణ ప్రధానం. మిత్ర పురుగులు, బడనికలకు హాని జరగకుండా నష్టపరిచే పురుగులు ఉనికిని కనిపెట్టే అవి స్ధాయికి మించి ఉంటేనే పురుగు మందులు వాడాలి. తెగుళ్ళ మందులు, పురుగులకు, పురుగుల మందులు తెగుళ్ళ నివారణకు పనికిరావు. మందుల పిచికారీ వాడే స్ప్రేయర్లు వాడాల్సిన మందు పరిమాణం కొన్ని సమయాల్లో పురుగు, తెగుళ్ళ మందులు కలిపి పిచికారీ చేయాల్సిననప్పుడు దిగువజాగ్రత్తలు తీసుకోవాలి.

  • బోర్డో మిశ్రమం పిచికారీ చేసేటప్పుడు నీటిలో కరిగే గంధకం, డైధయోకార్బోనెట్స్ తప్ప మరే ఇతర పురుగు మందులను కలుపరాడు. వీలైనంత వరకు బార్డో మిశ్రమాన్ని అప్పటికప్పుడు తయారు చేసి శీలింధ్రనాశినిగా వాడుకోవాలి. జింక్ సల్ఫేట్, యూరియా లాంటి పోషకాలను కలుపుకోవచ్చు.
  • జింక్ సల్ఫేట్ – సున్నం మిశ్రమాన్ని పిచికారీ చేసేటప్పుడు రాగి ధాతువు, గంధకం సంబంధ పధార్ధాలు, బోర్డో మిశ్రమం తప్ప ఇతర పురుగు మందులు కలుపరాదు.
  • లైమ్ – సల్ఫర్ కు నీటిలో కరిగే గంధకం తప్ప ఏ ఇతర పురుగు మందులు కలుపరాదు.
  • బ్యాక్టిరియా తెగుళ్ళ నివారణకు స్ట్రెప్టోమైసిన్ పిచికారీ చేసేటప్పుడు బోర్డో మిశ్రమం, డైకోఫాల్ తప్ప ఇతర పురుగు, తెగుళ్ళ మందులు కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
  • మామిడి, బత్తాయి నిమ్మలో పిందేరాలడం అరికట్టడానికి పిచికారీ చేసే 2,4 – డి రసాయనాన్ని పైరెత్రిన్ మందులు తప్ప ఇతర పురుగు మందులు, తెగుళ్ళ మందులు, యూరియా, సుక్ష్మపోషక పదార్దాలతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మందుల్ని కలిపిన వెంటనే పిచికారీ చేసుకోవాలి. నిల్వ ఉంచితే దాని ప్రభావం తగ్గుతుంది.
  • లోవాల్యూమ్ స్ప్రేమర్లు అంటే పవర్ స్ప్రేయర్లు, హైవాల్యుమ్ స్ప్రేయర్లు అంటే మామూలు కంప్రేషర్స్ స్ప్రేయర్లు. ఈ రెండింటిలో ఏది వాడినా ఎకరానికి వాడాల్సిన మందు పరిమాణంలో తేడా ఉండదు. అయితే పవర్ స్ప్రేయర్లు వాడినప్పుడు నీటి పరిమాణం మూడవ వంతుకు తగ్గించవచ్చు. అందుకే మామూలు స్ప్రేయర్లతో కంటే పవర్ స్ప్రేయర్లు వాడినప్పుడు మందు మూడు రెట్లు అధికంగా కలపాలి.
  • వృక్ష సంబంధిత పదార్ధాలు ముఖ్యంగా వేప గింజల ద్రావణం చల్లడం వల్ల పైరుపైన పురుగులు గుడ్లు పెట్టడం తగ్గుతుంది. చిన్న పురుగుల్లో పెరుగుదల లోపిస్తుంది.
  • పురుగు మందులు వాడేటప్పుడు టిపాల్ సబ్బుపొడి, ఇతర జిగురు పదార్ధాలు కలపడం వల్ల మందు ద్రావణం పైరు ఆకులకు పట్టుకొనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పురుగు మందులలో వంట నూనెలు కలిపి చల్లినప్పుడు మందులు ప్రభావం అధికంగా ఉంటుంది.
  • చేతి పంపులతో పిచికారీ చేస్తే ద్రావణం చిన్న చిన్న తుంపర్లలాగా ఆకుల పై పడి సమనగా వ్యాపించక పురుగుల, తెగుళ్ళ నివారణ సరిగా జరగదు. అదే పవర్ స్ప్రేర్లతో పిచికారీ చేస్తే మందు ద్రావణం పొగలాగా మొక్కలోని అన్ని భాగాలకు వ్యాపించి పురుగు, తెగుళ్ళ నివారణ బాగా జరుగుతుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.01435406699
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు