హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక / మల్బరి సాగు మరియు పట్టుపురుగుల పెంపకంలలో ఆధునిక పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మల్బరి సాగు మరియు పట్టుపురుగుల పెంపకంలలో ఆధునిక పద్ధతులు

ఈ విభాగం లో రాష్ట్రంలోని యువ రైతులకు మల్బరి సాగు మరియు పట్టుపురుగుల పెంపకంలలో ఆధునిక పద్ధతులు లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు గురించి వివరించడం జరిగింది

మల్బరి సాగు

పట్టు పురుగుల జీవితకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని నాణ్యమైన మాల్బరీ ఆకులతో వాటిని పోషించాలి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కల్పించి పురుగుల మరియు తెగుళ్ళనుండి వాటిని రక్షించుకోవాలి. వీటి పెంపకానికి ప్రత్యేకమైన పెంపక గృహాలను ఏర్పాటు చేయాలి. ఒక ఏడాదిలో 5 నుండి 10 సార్లు ఉత్పత్తులను పొందవచ్చు. ఒక్కొక్క ఉత్పత్తికి 70 నుండి 80 రోజులు పడుతుంది.

రకాలు

 • మరియు – 36 అధిక దిగుబడుల నిచ్చు రకాలు. పట్టు పురుగులకు కావలసిన నాణ్య మైన పౌష్టిక మైన ఆకులను పొందవచ్చును .
 • S– 36: దీని ఆకులు లేత ఆకుపచ్చరంగులో ఉండి, దశసరిగా హృదయాకారంలో ఉంటాయి. అధిక పౌష్టిక విలువలు మరియు తేమశాతం కలిగి ఉంటాయి. ఒక ఎకరానికి ఒక ఏడాదిలో సుమారు 15-18 వేల కిలోల మల్బరీ ఆకును పొందవచ్చును.
 • V-1: ఈ రకం 1997 లో విడుదలయి చాలా ప్రాచుర్యం పొందింది. ఆకులు ముదురు ఆకు పచ్చ రంగులో ఉండి దళ సరిగా వెడల్పుగా వృత్తాకారంలో ఉంటుంది. ఒక ఏడాది లో ఒక ఎకరానికి 20-24 వేలకిలోల మల్బరి ఆకును పొందవచ్చును.

సాగు పద్ధతి

 • జత వరుసల మధ్య దూరం 150 సెం.మీ. కలిగి ఉండి ఈ రెండు వరుసల మధ్య దూరం 90 సెం.మీ మరియు మొక్కల్ మధ్య 60 సెం.మీ దూరం ఉండేటట్లు చూడాలి. ఈ విధంగా నాటినట్లైతే రెండు వరుసల తర్వాత పవర్ టిల్లర్ నడుపుటకు మరియు ఆకుల రవాణాకు వీలుంటుంది. ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చును

ఎరువుల వాడకం

 • పశువుల 20 మెట్రిక్ టన్నులు ఒక హెక్టారుకు ఒక ఏడాదిలో రెండు సమ బాగాలుగా చేసి వేసుకోవాలి. V-1 రకానికి నత్రజని, భాస్వరము మరియు పొటాష్ 350:140:140 కిలో/హె/సం. మరియు S-36 రకానికి 300:120 కిలో/హె/సం. ఈ మొత్తాన్ని 5 సమభాగాలుగా చేసి వేసుకోవాలి. వారానికి ఒకసారి 80 నుంచి 120 మి.మీ చొప్పున నీరు పెట్టుకోవాలి.

పట్టుపురుగుల పెంపకము

 • రకాలు: బైవోల్టెన్ హైబ్రిడ్ – CSR-2 x CSR4 మరియు కృష్ణ రాజా అనే సంకర రకాలు అనువైనవి. చాకీ పురుగుల పెంపకము: గుడ్ల దశ నుండి పెద్దపురుగుల దశవరకు పట్టుపురుగులు 5 దశలలో పెరుగును. మొదటి రెండు దశలను చాకీ పురుగులందురు. వీటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నందువలన వీటి పెంపకం లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర వివరాలకు చాకీ పురుగుల పెంపకము. పెద్ద పురుగుల పెంపకము: మూడవ దశ నుండి ఇవి బాగాతింటాయి.
 • పెంపక గృహాలు: పట్టు పురుగులకు అవసరమైన వాతావరణ పరిస్థితులు అనగా 24-27 డిగ్రీ C ఉష్ణోగ్రత, 70-85 శాతం గాలిలో తేమ తప్పని సరిగా కల్పించాలి. పట్టుపురుగుల పెంపకానికి ముందు గదిని 5 % బ్లీచింగ్ పౌడరు (ముందు పంట అయిన వెంటనే) రెండవ సారి 2.5% సానిటెక్ (క్లోరిన్ డయాక్సైడ్ ) ద్రావణాన్ని పంట మొదలవడానికి రెండు రోజుల ముందు వేసుకోవాలి. పెంపకపు గృహాలలో ఆకు నిల్వ ఉంచడానికి చాకీ పెంపకానికి తగినంత సదుపాయం కలిగి ఉండాలి. 400 చ.అ.గది 100 DFN ల పెంపకానికి సరిపడుతుంది. 100 DFN(50,000లార్వాలు) పెంపకానికి కావలసిన
 • పరికరాలు: 1. స్టాండులు (40 x 5) – 5 అరలు– 1, 2. చంద్రికలు –R - 35,3. పవర్ స్ప్రేయర్ - 1 4 హైగ్రోమీటర్
రోజులు వరుసగా చేయ వల్సిన పనులు పనులు
ముందు పంట అయిపోయిన 1 తెగులు సోకిన ఆకులను, పాడైపోయిన గూళ్ళను సేకరించి తగుల బెట్టాలి.
2 చంద్రికలను, గదిని వ్యాధిరహితం చేయాలి
3 పరికరాలను శుభ్రపరుచుకోవాలి.
బ్రషింగ్ లు 5 రోజులు ముందు 4 గదులను కడగాలి
5 పరికరాలను ఎండలో ఆరబెట్టాలి
బ్రషింగ్ లు 4 రోజులు ముందు 6 0.3% సున్నంతో శుభ్రపరుచుకోవాలి
7 గదిని మరియు పరికరాలను రెండువ సారి
బ్రషింగ్ లు 3 రోజులు ముందు 8 వ్యాధిరహితం చేయాలి.
బ్రషింగ్ లు 2 రోజులు ముందు 9 నడిచే దారిలో మరియు పెంపకపు గది ముందు వ్యాధిరహిత పొడిని చల్లాలి.
10 గాలి, వెలుతురు కోసం గది తలుపులను
బ్రషింగ్ లు 1 రోజు ముందు 11 కిటికీలను తెరవాలి.
బ్రషింగ్ కు తయారు చేసుకోవాలి.

పెద్ద పురుగుల పెంపకము

 • ఈ దశలో మల్బరీ ఆకుల బదులుగా చిన్న చిన్న కొమ్మలతో ఆఖరి మూడు దశ లను పెంచుతారు. ఈ పద్ధతి ద్వారా 40% కూలీల ఖర్చు తగ్గుతుంది. తెగుళ్ళు వ్యాప్తి కూడా తగ్గుతుంది. పరి శుభ్రమైన పరిసరాలను కల్పించవచ్చు. బెడ్లలో గాలి, వెలుతురు సమకూర్చవచ్చు. నాణ్యమైన పట్టు గూళ్ళను పొందవచ్చు. చల్లని వాతావరణంలో భూమికి 3-4 అడుగుల ఎత్తులో 50-55 రోజుల కొమ్మలను కోసి పురుగు లకు అందించాలి. 5వ దశ పురుగులకు 60-65 రోజుల కొమ్మలను పెట్టవచ్చును. కోసిన కొమ్మలను గదిలో నిలు వుగా పెట్టి శుభ్రమైన తడిసిన గోనె సంచిలతో కప్పాలి. బై వోల్టెన్ పట్టు పురుగులకు 4వ దశలో 460 కిలోల కొమ్మలు, 5వ ధశలో 2880 కిలోల మల్బరి కొమ్మలు అవసరమవుతాయి. రోజుకు 3 సార్లు అనగా ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2గం. రాత్రి 10 గంటలకు తిండి పెట్టాలి. బాగా ముదిరిన ఆకులు లేదా కొమ్మలను పెట్ట రాదు.
 • ప్రతి సారి బెడ్లలో లార్వాలను సమానంగా ఉంచాలి. చిన్న పురుగులు మరియు వ్యాధి సోకిన పురుగులను ఎప్పటికప్పుడు తీసివేసి 2% బ్లీచింగ్ పౌడరు లో ఉంచాలి.
 • మూడవ దశ పురుగులకు 26 డిగ్రీ C నాల్గవ దశ పురుగులకు 25 డిగ్రీ C మరియు 5 వ ధశ పురుగులకు 24 C అవసరమవుతుంది. గాలిలో తేమశాతం 3వ దశకు -80%, 4వ దశకు, మరియు 5వ దశకు 70% అవసరమవు తుంది. ఈ విధమైన వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు కల్పించాలి. పట్టు పురుగు మౌల్టింగ్ దశలో గాలి, వెలుతురు సమంగా ఉండాలి.

పరిశుభ్రత

 • పెంపక గృహాల లోనికి వెళ్ళే ముందు కాళ్ళు, చేతులను వ్యాధి నిరోధక ద్రావణంలో శుభ్ర పరచుకోవా లి. ముందుగా కాళ్ళు, చేతులను సబ్బుతో రుద్దుకొని, ఆ తర్వాత ద్రావణంలో ముంచాలి. (2.5% సానిటిక్ /సెరి క్లోర్ 0.5% సున్నపు ద్రావణంలో (లేదా)0.3% సున్నపు నీళ్ళలో, 2% బ్లీచింగ్ పౌడర్ ) బెడ్ క్లాన్ చేసి తర్వాత, వ్యాధి సోకిన పురుగులను తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

రోగ నిరోధక మందులు

 • పట్టు పురుగుల తెగుళ్ళ నివారణకు విజేత, విజేత గ్రీన్ మరియు అంకుష్ ను ఎక్కువగా వాడతారు. పలుచటి గుడ్డలో పొడి మందును తీసుకొని మౌల్ట్ అయిన ప్రతిసారి/చ.అ.5 గ్రా.వేయాలి. వర్షాకాలం మరియు చలి కాలంలో మస్కార్డిన్ వ్యాధి నిర్మూలనకు విజేత సప్లిమెంట్ ను వాడుతారు. కాని ఈ మందును తినే మల్బరి ఆకుల మీద, మరియు మౌల్ట దశ లోను చల్ల కూడదు. పొడిని చల్లిన 30 నిమిషాల తర్వాత పురుగులకు మల్బరి ఆకులను పెట్టవచ్చును.
 • నాణ్యమైన పట్టు గూళ్ళకు నాణ్యమైన చంద్రిక లను ఏర్పాటు చేసుకోవాలి. 5వ దశలో 7వ రోజున లార్వా పురుగులు పక్వదశకు వచ్చి గూళ్ళు పెట్టడానికి స్థలాన్ని వెతుక్కుంటాయి. ఆ దశలో పురుగులను సేకరించి చంద్రికలపై ఉంచాలి. ఒక్కొక్క చంద్రికపై సరి పడినన్ని పురుగులను మాత్రమే ఉంచాలి. 100 DFLలకు 35 రోటరీ చంద్రిక అవసరమవుతాయి.
 • తయారైన గూళ్ళను 6వ రోజున సేకరించాలి. పాడైపోయిన గూళ్ళను తీసివేసి నాణ్యమైన గూళ్ళను బట్టి గ్రేడింగ్ చేసుకోవాలి. చలికాలంలో ఒక రోజు ఆలస్యంగా గూళ్ళను సేకరించాలి

మార్కెటింగ్

 • 7వ రోజున సేకరించిన గూళ్ళను చల్లని వాతావరణంలో రవాణా చేసుకోవాలి. నైలాన్ సంచులలో వదులుగా వేసి మార్కెట్ చేసుకోవాలి.
 • గూళ్ళ దిగుబడి: 100 DFLల నుండి సుమారు 60, 70 కిలోలు వస్తుంది. ఒక ఏడాదిలో ఒక ఎకరా మల్బరి తోట నుండీ 700-900 కిలోల గూళ్ళ దిగుబడి పొందవచ్చు.

100 DFLల

సమయము పొడి మందు గ్రా/చ. అ. 100 DFLలకు మోతాదు
మూడవ దశ విజేత/విజేత గ్రీన్ 5 900
తర్వాత అంకుష్
4వ ధశ విజేత సప్లిమెంట్ 600
మూడవరోజు విజేత/విజేత గ్రీన్
4వ ధశ తర్వాత విజేత సప్లిమెంట్ 3 1200
5వ దశలోని విజేత సప్లిమెంట్ 3 1300
2వ రోజు
5వ దశలోని4వ రోజు విజేత/విజేత గ్రీన్ 5 3000
5వ దశలోని 6వ రోజు విజేత సప్లిమెంట్ 3 1800

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.01595744681
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు