పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ముందస్తు వాతావరణ సూచనలు

ప్రసారమాధ్యమాల ద్వారా ముందస్తు వాతావరణ సూచనలు

ముఖ్య ఉద్దేశ్యాలు / లక్ష్యాలు

  • వివిధ రకాల ముందస్తు వాతావరణ సూచనలను గురించి తెలుసుకోవడం
  • ముందస్తు వాతావరణ సూచనలు అనుసరించి పంటల ఎంపిక సూచనలు సాగు పద్దతులు, నీటి మరియు ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ, పంటకోత విషయాలలో నిర్ణయం తీసుకొనుట.
  • వివిధ రకాల ముందస్తు వాతావరణ సూచనలు తెలియ జేయు మాధ్యమాలు, రైతులకు సమాచారం చేరవేయు

భారత వాతావరణ విభాగం వారు వివిధ రకాల ముందస్తు వాతావరణ సూచనలు అందజేస్తారు. ముందస్తు వాతావరణ సూచనలు కాలపరిమితిని బట్టి వివిధ రకాలుగా విభజించడ మైనది.

  1. yfm1అతి స్వల్ప కాలిక ముందస్తు వాతావరణ సూచనలు (6గంటల నుండి 24 గంటల వరకు)
  2. స్వల్పకాలిక ముందస్తు వాతావరణ సూచనలు (1 నుండి 3 రోజుల వరకు)
  3. మధ్యకాలిక ముందస్తు వాతావరణ సూచనలు (4 నుండి 10 రోజుల వరకు)
  4. ధీర్ఘకాలిక ముందస్తు వాతావరణ సూచనలు (10 రోజుల నుండి 4 నెలల వరకు)

పైన తెలిపిన ముందస్తు వాతావరణ సూచనలు వివిధ రకాల పంటలలో ఏ విధంగా ఉపయోగపడుతాయో కొన్ని ఉదాహరణలు క్రింద వివరించబడినవి.

అతి స్వల్పకాలిక ముందస్తు వాతావరణ సూచనలు (6గంటల నుండి 24 గంటల వరకు)

ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నప్పుడు

ఎరువులు వేయుట, పురుగు మందులను పిచికారి చేయుట, పంట కోతలు మరియు పంటను మార్కెట్ కు తరలించుట వాయిదా వేసుకోవలను

నీటి తడులను వాయిదా వేసుకోవాలి

కలుపు మందులు పిచికారి చేసిన తర్వాత కనీసం 4-6 గంటలు వర్షం

గరిష్ట ఉష్నోగ్రత 33o సి

కనిష్ట ఉషోగ్రత 24o సి

వర్షపాతం 30-40 మి.మీ.

భారీ వర్ష సూచన

స్వల్పకాలిక ముందస్తు వాతావరణ సూచనలు (1 నుండి 3 రోజుల వరకు)

  • వర్షపాత సూచనలు ఉన్నప్పుడు

*.పొలాన్ని దున్నుకోవడం *.విత్తనాలను సమకూర్చడం

లేదా విత్తుకోవడం

*. నీటి తడులను వాయిదా           వేసుకోవడం

పురుగు మందుల పిచికారి వాయిదా వేసుకోవడం

 

 

  • వర్షపాత సూచనలు లేనప్పుడు

బెట్ట పరిస్థితులలో నీటి తడులు ఇవ్వడం

నీటి వసతి లేని ప్రదేశాలలో అంతర కృషి చేయవలెను.

పంటను కోసుకోవడం మరియు ఎండ బెట్టడం

ధాన్యాన్ని మార్కెట్ కు తరలించుకోవడం

బెట్ట పరిస్థితుల్లో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకు పురుగు మందులను పిచికారి చేయాలి.

ఆకాశం నిర్మలంగా ఉంటుంది.ఉష్ణోగ్రత 34 సి/23 సి

 

ఆకాశం పాక్షికంగా మేఘావృతం, ఉష్ణోగ్రత

30 సి/19 సి

ఆకాశం మేఘావృతంగా ఉండి తేలిక పాటి వర్షం ఉష్ణోగ్రత 28 సి /18 సి

మధ్యకాలిక మొందస్తు వాతావరణ సూచనలు (5 రోజుల వరకు)

వర్షపాత సూచనలు ఉన్నప్పుడు

పొలాన్ని చదును చేసి విత్తడానికి సిద్ధం చేయడం

పంట కోతలను వాయిదా వేసుకోవాలి

ఎరువులను వేసుకోవచ్చు

నీటి తడులను ఇవ్వరాదు.

అంతర సేద్యం చేసుకోవచ్చు

వర్షపాత సూచనలు లేనప్పుడు

పంట కోతలను చేపట్టి ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్ కు తరలించడం

పంట కీలక దశలో నీటి తడులను క్రమ బద్దీకరించాలి

గాలి వేగం ఎక్కువగ ఉన్నప్పుడు పురుగు మందులు పిచికారీ వాయిదా వేసుకోవాలి.

1వ రోజు

2వ రోజు

3వ రోజు

4వ రోజు

5వ రోజు

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై వాతావరణం పొడిగా ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 31/22 సెల్సియస్

yfm17

వాతావరణం పొడిగా ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 35/24 సెల్సియస్

ఆకాశం మేఘావృతమై  ఉండి తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయి.. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 31/22 సెల్సియస్ గాలి వేగం 2-12 కి.మీ/గం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై వాతావరణం పొడిగా ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 31/22 సెల్సియస్ గాలి దశ నైరుతి/ఈశాన్య గాలి వేగం 5-9కి.మీ/గం

ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షం  ఉష్ణోగ్రత 28సి/18సెల్సియస్ లు 31/22 సెల్సియస్ గాలి దశ నైరుతి/ ఈశాన్య గాలి వేగం 2-14కి.మీ/గం

ధీర్ఘకాలిక ముందస్తు వాతావరణ సూచనలు (10 రోజుల నుండి 4 నెలల వరుకు)

సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్ష పాత సూచనలు ఉన్నచో

వరి పంటను ఎక్కువ విస్తీర్ణంలో వేసుకోవచ్చును.

నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ముందుగా సేకరించవలెను

ఎక్కువమోతాదులో ఎరువులను సేకరించు కోవడం

వర్షపాతం  వర్గీకరణ

దక్షిణ భారతదేశం

సాధారణ వర్షపాతం(%)

ముందస్తు వాతావరణ సూచన

సాధారణ వర్షపాతం కన్నా తక్కువ( %) వర్ష పాత సూచనలు ఉన్నచో

<93

50

సాధారణ వర్షపాతం (%)

93-107

35

సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ (%)

>107

15

 

సాధారణ వర్షపాతం సూచనలు ఉన్నచో

1.సాధారణ విస్తీర్ణంలో ఆరుతడి పంటలు మరియు వరి పంటనువేయవచ్చును మార్క్ట్ట్ట్ ధరను బట్టి సాధారణ పంటను వేయవచ్చును

 

సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్ష పాత సూచనలు ఉన్నచో

1.ఋతు పవనాలు ప్రవేశించిన తర్వాత 60-70 మి.మీ వర్షపాతం కురిసిన తర్వాత పంటలను విత్తు కోవాలి.

వర్షాధారపు పంటలను నేల పూర్తిగా తడిచిన తర్వాత అనగా 15 సెం.మీ. నేల తడిచిన తర్వాతనే విత్తుకోవాలి.

నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను,బెట్ట పరిస్థితులను తట్టుకునే పంట రకాలను వేసుకోవాలి. అంతర పంటలను సాగు చేయాలి

 

 

వివిధ రకాల ముందస్తు వాతావరణ సూచనలను తెలియజేయు మాధ్యమాలు, రైతులకు సమాచారం చేరవేయు విధానాలను గురించి తెలుసుకొనుట

భారత వాతావరణ విభాగం వారు అందజెసిన ముందస్తు వాతావరణ సూచనలను రైతులకు ఈ క్రింద మాధ్యమాల ద్వారా చేరవేయుబడుతాయి.

1.ఆకాశవాణి కేంద్రం, హైదరాబాద్

ప్రతి మంగళ మరియు శుక్రవారాలలో సాయంత్రం 6 గంటల 55 నిమిషములకు తిరిగి ఉదయం 6 గంతల 35 నిమిషములకు ముందస్తు వాతావరణ సూచనలతో పాటు వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు ప్రసారం చేయబడుతాయి

2. దూరదర్శన్ కేంద్రం యాదగిరి

ప్రతి మంగళ మరియు శుక్రవారాలలో సాయంత్రం 6;00 గం. ముందస్తు వాతావరణ సూచనలతో పాటు వాతావరణాధారిత వ్యవసాయ సలహాలను ప్రసారం చెయడం జరుగుతుంది

3. ఇతర వాణిజ్య దూరదర్శన్ ప్రసారాలు
CVR వార్తలు రైతే రాజు
ETV  అన్నదాత
C)  TV5  
4.వార్తాపత్రికలు                                                    
a)ఈనాడు          d)ఆంధ్రజోతి                   b).సాక్షి            e) నమస్తే తెలంగాణ           c) ప్రజాశక్తి
5.Web site
a)www.imdagrimet.gov.in
b)www.agromet.ts.nic.in
c)www.imd.gov.in d)www.agrisnet.tg.nic.in
6. లఘు సందేశాలు (sms)

a)www.farmers.gov.in
b) www.mkisan.gov.in

7.వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు బులెటిన్                                        ఈ తరహా బులెటిన్ లను వ్యవసాయ వాతావరణ కేంద్రం, రాజేంద్రనగర్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశొధన స్థానం, జగిత్యాల నుండి ప్రతి మంగళ మరియు శుక్రవారాలలో రాబోవు ఐదు రోజులకు విడుదల చేయడం జరుగుతుంది.
8.రైతు సమాచార కేంద్రం    సంప్రదించవలసిన ఫోన్ నెం.18004251110,18001801551,18004254440.
9.మాసప్రతికలు

దీర్ఘకాలిక వాతావరణ సూచనలు మరియు పంటల సరళి అందజేయబడును.

10.వాతావరణ మరియు పంటల మార్కెట్ ధరల ముందస్తు  సూచనలు ఉగది రోజున దీర్ఘకాలిక వాతావరణ సూచనలు మరియు పంటల మార్కెట్ ధరల ముందస్తు  సూచనలు తెలియజేయబడతాయి.
11. ముందస్తు వాతావరణ సమాచారం తెలుసుకోనుటకు సంప్రదించవలసిన పోన్ నెం. 1. డా. డి. రాజి రెడ్డి9959625220 2. డా  జి. శ్రీనివాస్ వ్యవసయ వాతావరణ పరిశోధన కేంద్రం,   పోన్ నెం . 9000407408,040-24016901

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.01526717557
Ravi Oct 26, 2017 10:48 PM

Capsicum gurinchi తెల్సపండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు