హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక / యువ రైతులకు వ్యవసాయం మరియు ఇతర అనుబంధ రంగాలలో శిక్షణ.
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

యువ రైతులకు వ్యవసాయం మరియు ఇతర అనుబంధ రంగాలలో శిక్షణ.

యువరైతుల వ్యవసాయ శిక్షణ పాఠ్య ప్రణాళిక

కోర్స్ పరిచయం

తెలంగాణ రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల జనాభా సుమారు 86 శాతం ఉంటుంది. రాబోయే 2020 సం. నాటికి ఒక రైతు సరాసరి సాగు బూమి .68 హె.కి పడిపోతుందని అంచనా. ఈవిధంగా జరిగితే వ్యవసాయంలో వార్షికవృద్ధి 4% సాధించడం చాలా కష్టమవుతుంది. వాతావరణంలో మార్పులు, వ్యవస్సయ పై ఆసక్తి తగ్గుతోంది. ఎందుకంటే ఇది మనదేశ ఆహార భద్రతకే పెను సవాలుగా మారే అవకాశముంది. ఈ నేపధ్యంలో రైతుల్లో ఆసక్తిని పంచి నైపుణ్యతను పెంచడం ఎంతైనా అవసరం

ఈ దిశగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయంలోఅగ్రగాములుగా చేసి రాష్ట్ర ప్రగతికిదోహదపడేలా చేయాలనే ఉద్ధేశ్యంతో ఎఆ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.

ముఖ్య ఉద్ధేశ్యము

 • రైతాంగం వ్యవసాయంలో నేర్చుకోదలచిన పలునూతన సాంకేతిక అంశాలపై నైపుణ్యతను పెంపొందించడం.
 • శాస్త్రవేత్తలతో మరియు విస్తరణ అధికారులతో నేరుగా సంప్రదించి మరుగైనవ్యవసాయం చేసేలా ప్రోత్సహించడం.
 • సమిష్టీగా పనిచేయడానికి రైతులకు వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాలైన ఉద్యాన పంటలు, పశుపోషణ, చేపల పెంపకం మరియు ప్రభుత్వ రంగ సంస్థల నుండి పొందే సదుపాయాలపై అవగాహన కల్పించడం.
 • ముఖాముఖి చర్చలు మరియు అనుభవ భాగస్వామ్యం
 • వీడియో క్లిప్పింగులు/ప్రత్యక్ష ప్రదర్శనలు
 • మొబైల్ / అంతర్జాలంతో వ్యవసాయ సమాచారాన్ని పంపడం మరియు వారి సందేహాల నివృత్తి.

ఆచరణత్మాకంగా నేర్చుకోవాల్సిన పద్ధతులు

 1. విత్తన శుద్ధి
 2. వివిధ సేద్య పద్ధతులపై ప్రత్యక్ష
 3. పోషక లోపాలను గుర్తించడం
 4. ఆశించే చీడ పీడలను ఫుర్తించడం
 5. వివిధ పంపులను వాడేటప్పుడు, పివ్హికారిలో నేర్చుకోవాల్సిన మెళకువలు
 6. మేలుచేసే సహజ శత్రువులను గుర్తించడం మరియు వాటి సంరక్షణ వివిధ సేద్య పతులపై ప్రత్యక్ష అవగాహన

లాభాలు

 • యువ రైతుల్లో సమిష్టితత్వాన్ని పెంపొందించడం ద్వారా వ్యవసాయ సమాచార విస్తరణను ప్రభావ వంతంగా చేరవేయడం.
 • నూతన సాంకేతిక విజ్ఞానం తెలుసుకోవడం ద్వారా దిగుబడులను పెంపొందించుకోవడం
 • సరైన యాజమాన్య పద్ధతులు పాటించి ఖర్చులను తగ్గించుకుని అధిక ఆదాయం పొందడం
 • గ్రామాల్లోని తోటి రైతులకు ఈ నూతన  పోకడలను పరిచయం చేసి వారిని కూడా ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దడం
 • పలు పంటల్లో విలువ ఆధారిత ఉత్పత్తులను గ్రామ స్థాయిలో చేపట్టి ఆర్ధికంగా, సామాజికంగా పరిపుష్టం కావడం

స్వీకరించే వారు:తెలంగాణ 31 జిల్లాలలోని యువ రైతులు/రైతు మహిళలు

ఎంపిక కోసం ప్రమాణాలు

 • చదివే మరియు వ్రాసే సామర్థ్యాలు కల్గిన యువ రైతులు/రైతు మహిళలు.
 • వ్యవసాయంలో ఆసక్తి కనబరిచే యువత
 • గ్రామీణ మహిళలు, స్వయం సహాయక యానిమేటర్లు

 

కాల వ్యవధి : 90 రోజులు 10–12 తరగతులు (రోజుకు 6 గంటలు)

కార్యక్రమం అందించే పద్ధతి

 • తరగతి గదిలో శిక్షణ (రోజులో 3 గంటలు)
 • క్షేత్ర సందర్శన మరియు ఆచరణాత్మకంగా నేర్పే పద్ధతులు (రోజులో 3 గంటలు)
 • తెలుగులో ముద్రించిన చేతి ప్రతులు / ప్రచురణలు


యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక

కాల వ్యవధి: 10 రోజులు

క్రమ సంఖ్య

విషయం

 

ఉద్దేశ్యము

తరగతి గదిలో బోధించే అంశాలు

క్షేత్ర స్థాయిలో బోధించే అంశాలు

కాల వ్యవధి

1

2

3

4

5

6

1

 

ముందస్తు వాతావరణ  సూచనలు

వివిధ రకాల ముందస్తు వాతావరణ సూచనలను మరియువాటి ప్రాముఖ్యతను తెలుసుకోవదడం

వివిధ రకాలైన అతి స్వల్పకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక వాతావరణ సూచనలు

అంతర్జాలంలో అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు వాతావరణ సూచనలకు అనుగుణంగా పంటల ప్రణాళిక, ప్రత్యేక సేద్య పద్ధతులను ప్రత్యక్షంగా ప్రదర్శనల ద్వారా తెలియ జేయడం.

1 వ రోజు

2

ఆపత్కాల పంటల ప్రణాళిక

 

- ముందస్తు వాతావరణ సూచనలను అనుసరించి వివిధ నేలల్లో / వనరులను దృష్టిలోఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవటం

- ప్రతికూల పరిస్థితులలో చేయాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం

తెలంగాణ జిల్లాల్లో వివిధ ఆపత్కాల పంటల ప్రణాళికలు, వాటి ఆవశ్యకత మరియు ప్రతికూలపరిస్థితులలో చేయాల్సిన యాజమాన్యం

 

 

క్షేత్ర స్థాయిలో పలు పంటల ప్రణాళిక పద్ధతుల ను ఏర్పాటు చేసి తగిన సాంకేతిక సమాచారాన్ని రైతులకు తెలియజేయడం

 

 

1వ రోజు

3.

 

వ్యవసాయంలో సమర్ధ సాగు నీటి యాజమాన్యం

తక్కువ నీటిని వినియోగించి వివిధ పోషకాలను వృధా చేయకుండా,మంచి భూములు క్రమంగా చౌడు భూములుగా మారకుండా చేయాల్సిన నీటి ఆదా పద్ధతుల పైన అవగాహన కల్పించడం

జల వనరుల పై సమగ్ర, నీటి యాజమాన్యం పై నూతన సాగు నీటి పద్ధతుల పైన మరియు వాటి నిర్వహణ లో చేయాల్సిన,అంశాలు తెలియ జేయుట

 

వివిధ పంటలలో నీటి అవసరాలు, నీటి ఆదా పద్ధతులు, సూక్ష్మసాగు నీటి పద్ధతులు వాటి వాడకంలో చేపట్టాల్సిన మెళకువలను చూపించడం

1 వ రోజు

4.

వివిధ పంటలలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు

వివిధ పంటలలో అధికోత్పత్తికి పాటించాల్సిన శాస్రీయ విధానాల పైన అవగాహన కల్పించుట

వివిధ పంటలకు అవసరమైన నేలలు, రకాల ఎంపిక, విత్తన మోతాదు, విత్తే విధానం, ఎరువులు, కలుపు నీటి మరియుచీడ పీడల యాజమాన్యం, పంట కోత, కోత అనంతరం నిల్వ చేసే పద్ధతులు

ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సిన క్రింది అంశాలను ప్రదర్శన ద్వారా వివరించడం విత్తన శుద్ధి నైపుణ్యతతో నేర్చుకోదగిన సేద్యపు పద్ధతులు, చీడ పీడలను గుర్తించుట మరియు అవి కలుగ చేసే లక్షణాలను, నష్టాన్ని తెలియ జేయుట నివారణ పద్ధతులను మరియు మేలు చేసే  అంశాలు పురుగులను గుర్తించుట.

2 వ రోజు

5.

సమగ్ర వ్యవసాయం

వనరుల లభ్యతను బట్టి శాస్త్రీయ పద్ధితిలో సమగ్ర వ్యవసాయం పద్ధతులను చేపట్టి అధిక దిగుబడి మరియు నికరాదాయం పోందే మార్గాలను తెలుసుకోవటం

సమగ్ర వ్యవసాయం ద్వారా వివిధ వనరుల క్రింద ఎంపిక చేసుకునే పంటలు మరియు అనుబంధంగా గొర్రెలను, కోళ్ళను పెంచుకోవటం, వాటి నిర్వహణలో పాటించాల్సిన అంశాలు, సమగ్ర వ్యవసాయం ద్వారా కలిగే ఆదాయ వ్యయాలను విశ్లేషించుకోవటం

క్షేత్ర స్థాయిలో చేపట్టిన సమగ్ర వ్యవసాయ పద్ధతులను వాటిలో నెలకొన్న సాంకేతిక సమస్యలను గుర్తించడం, ఆయ వ్యయాలను లెక్కించడం, రైతులకు స్వతహాగ సమగ్ర వ్యవసాయదా పద్ధితిని ఎంపిక చేసుకోవడంలో శిక్షణ

6వ రోజు

 

6.

అటవీ వ్యవసాయం

రైతులు నిత్యం పండించే ఆహార పంటలలో వాణిజ్యపరంగా పెంచే చెట్లను/పండ్ల తోటలు/ ఔషధ మొక్కలను వినియోగించి అటవీ వ్యవసాయంపై అవగాహన కల్పించటం

వివిధ అటవీ వ్యవసాయ పద్ధతులు: అగ్రిసిల్వికల్చర్ ,అగ్రి హార్టికల్చర్ , హార్టి పాస్చ్యురల్ ,సిల్వి పాస్చ్యురల్ ,సిల్వి మెడిసినల్ .బ్లాక్ ప్లాంటేషన్ పై అవగాహన, వీటి నిర్వహణలో తీసుకోవాల్సిన మెళకువలపైన అవగాహన

వివిధ అటవీ వ్యవసాయ పద్ధతులను క్షేత్ర స్థాయిలో రైతులను వివరించటం

6వ రోజు

 

7

$$<óŠ |Ÿ+³\ýË $ÔáïHÃÔáÎÜï

ÂsÕԐ+>±“¿ì  $ÔáïHÃÔáÎÜï¿ì ¿±e*àq

HîÕ|ŸÚD«ÔáqT  eT]jáTT  kÍ+¹¿Ü¿£

dŸeÖ#s“• n+~+#áT³

వివిధ పంటలలో విత్తనోత్పత్తికి కావల్సిన అంశాలను మగ-ఆడ రకాలను పంచుటలో చేపట్టాల్సిన అంశాలను, కేళీలను గుర్తించుట వివిధ పంటలలో విత్తనోత్పత్తికి పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు తెలియ జేయుట

వివిధ పంటలలో విత్తనో త్పత్తి కి కావల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను ప్రత్యక్షంగా చూపించడం - వివిధ పంటలలో కేళీలను గుర్తించుటం - నాణ్యత ప్రమాణాలను తెలుసుకొనుట

6వ రోజు

 

 

 

8

పంటలలో సమగ్రపోషక యాజమాన్యం

సేంద్రియ ఎరువులు వాడక పోవడం వలనకలిగే నష్టాలు  కంపోస్టు./పశువులఎరువుల తయారి భూసార/నీటి పరీక్షల ఆవశ్యకత సూక్ష్మ పోషక లోపాలు – వాటి సవరణ     ఎరువుల వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివిధ రకాల జీవన ఎరువులు, వాటి వలన లాభాలు జీవన ఎరువుల మోతాదు నీటి వాడకంలో అవలంభించాల్సిన మెళకువలు

జల వనరులపై సమగ్ర, నీటి యాజమాన్యంపై, నూతన సాగు నీటి పద్ధతుల పైన మరియు వాటి నిర్వహణలో చేయాల్సిన అంశాలు తెలియ జేయుట సమగ్ర వ్యవసాయం ద్వారా వివిధ వనరుల క్రింద ఎంపిక చేసుకునే పంటలు మరియు అనుబంధంగా గొర్రెలను, కోళ్ళను పెంచు కోవటం, వాటి నిర్వహణ లో పాటించాల్సిన అంశాలు సమగ్ర వ్యవసాయం ద్వారా కలిగే ఆదాయ వ్యయాలను విశ్లేషించుకోవటం

వివిధ పంటలలో నీటి అవసరాలు, నీటి పద్ధతులు, సూక్ష్మసాగు నీటి పద్ధతులు, వాటి వాడకంలో చేపట్టాల్సిన మెళకువలను చూపించడం క్షేత్ర స్థాయిలో చేపట్టిన సమగ్ర వ్యవసాయ పద్ధతులను వాటిలో నెలకొన్న సాంకేతిక సమస్యలను గుర్తించడం, ఆదాయ వ్యయాలను లెక్కించడం,రైతులకుసొంతంగా సమగ్ర  వ్యవసాయ పద్ధతిని ఎంపిక చేసుకోవడంలో శిక్షణ

7వ రోజు

 

9.

జీవన ఎరువులు

జీవన ఎరువులు అవశ్యకత మరియు వివిధ పంటలలో వాడాల్సిన సాంకేతిక సమాచారం పై అవగాహన కల్పించుట

వివిధ రకాల జీవన ఎరువులు, వాటి వలన లాభాలు జీవన ఎరువులు మోతాదు, వీటి వాడకంలో అవలంబించాల్సిన మెళకువలు

క్షేత్ర స్థాయిలో జీవన ఎరువులు వాడకం, నైపుణ్యతను తెలుసు కోవడం

7వ రోజు

 

10.

సమగ్ర సస్యరక్షణ

పర్యావరణ సమతుల్యతి దెబ్బ తినకుండా వివిధ పంట లలో ఆశించే చీడ పీడలను అంచనావేసి వివిధ సమగ్ర పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో అధికోత్పత్తి సాధించుట

సమగ్ర సస్యరక్షణ ఆవశ్యకత, సమగ్ర  పద్ధతులపై అవగాహాన, జీవ నియంత్రణ పద్ధతులు      సమగ్ర పద్ధతుల వినియోగంలో చేపట్టవలసిన అంశాలు.  జీవ రసాయన వాడకంలో చట్టపరమైన అంశాలు

క్షేత్ర స్థాయిలో సమగ్ర పద్ధతులను  ప్రదర్శన ద్వారా చూపించడం  జీవ నియంత్రణలో మేలు చేసే పురుగులు,బదనికలు, వరాన్న జీవులను గుర్తించుట నకశేరుక  చీడల యాజమన్యం జీవ రసాయనాల వాడకంలో నైపుణ్యత అంశాలను తెలుసుకొనుట

8వ రోజు

 

11.

వినూత్న సస్య రక్షణ మందుల –పురుగు మందుల వాడకం లో మెళకువలు

వినుత్న పురుగు మందుల వల్ల కలిగే ద్రుష్పలితాలను తెలియ జేయుట పురుగు మందుల వాడకంలో అవగాహన కల్పించుట

వివిధ రకాల వినూత్న హాని కారక మందులు స్ర్పేయర్ల  వినియోగం వాటి వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

వివిధ రకాల పురుగు మందుల వలన కలిగే ద్రుష్భలితాలను క్షేత్ర స్థాయిలో గుర్తించుట వివిధ రకాల స్ర్పేయర్ల  వాడకంలో మరియు వాటి నిర్వహణలో పాటించాల్సిన  అంశాలు, నేర్చుకొనుట

 

8వ రోజు

 

12.

వ్యవసాయ యాంత్రీకరణ

వివిధ పంటలలో యాంత్రీ కరణ ఆవ్యశకతపై అవగాహన కల్పించుట

 

వివిధ పంటలలో విత్తనం విత్తే దగ్గర నుండి పంట కోతవరకు వాడుకో దగిన పనిముట్లు మరియు యంత్రాలు, లాభాలు వాటి పని సామర్థ్యం మొదలగు అంశాలను తెలియ జేయడం

క్షేత్ర స్థాయిలో వివిధ పనిముట్లు/ యంత్రాలను వినియోగించుట వాటిలో నైపుణ్యత అంశాలను తెలుసుకొనుట

8వ రోజు

13.

పంట కోత అనంతర పరిజ్ఞానం

పంట కోత తర్వాత దిగు నష్టాలను తగ్గించుకోవడం విలువ ఆధారిత ఉత్పత్తు లను తయారు చేసుకొని తద్వారా నికరాదాయాన్ని పెంపొందించు కొనుట

పంట కోతలలో వివిధ కారకాల వల్ల కలిగే నష్టాలు, పంట కోత, కోత అనంతరం నిల్వ చేసే సమయంలో పాటించాల్సిన మెళకువలు, విత్తన నిల్వ పద్ధతులు, విత్తన శుద్ధి, ఆవశ్యకత

క్షేత్ర స్థాయిలో వివిధ కారణాల వలన పంట కోత అనంతరం ఏర్పడే నష్టాలను వివరించడం విత్తన నిల్వ పద్ధతులు చూపించడం విత్తన శుద్ధి పద్ధతులను  నేర్పడం

8వ రోజు

14.

వ్యవసాయ  వ్యాపార నిఘా (నెట్ వర్క్ ప్రాజెక్టు ఆన్ మార్కెట్ ఇంటెలిజెన్స్)

పంటల ధరలను సేకరించి, విశ్లేషించి సంబంధిత సమాచారాన్ని, మార్కెట్ పోకడలను మరియు ధరల అంచనాలను సూచిస్తుంది.

పంటల సరళిని నిర్ణయించుటకు మరియు ఏ సమయంలో విక్ర  యించాలో మొదలగు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం బాగా ఉపయోగ పడుతుంది. ధాన్యంను మార్కెట్ కు తిసుకువచ్చేటపుడు తీసుకో వలసిన జాగ్రత్తలు మరియు ముఖ్యమైన మార్కెట్లు

ధరల అంచనాలను ప్రాంతీయ పత్రికలు, ఆంగ్ల దినపత్రికలు, మాస పత్రికలు, టీ.వి., రేడియోల ద్వారా చేరవేస్తుంది. ఈ సమాచారం అంతార్జాలంలోని వివిధ సంస్థల వెబ్ సైట్ల ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది.

8వ రోజు

15.

పాడి పరిశ్రమ అవశ్యకత, పాడి, పశువుల ఎంపిక, దాణా నిర్మాణం – పరిశుభ్రత

రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువుల పెంపకాన్ని చేపట్టాల్సిన అవసరం, అధిక పాల ఉత్పత్తికి పాటించాల్సిన శాస్త్రీయ విధానాలపై అవగాహన, పాడిపశువులకు కల్పించాల్సిన గృహ వసతి, ఆవశ్యకత, పాక నిర్మాణం, స్థల ఎంపికపై అవగాహన కల్పించుట

రైతుల పాడి పశువులను పెంచ వలసిన అవసరం, లాభాలు అధిక పాల ఉత్పత్తకి పాటించవలసిన నియమాలు

 

 

క్షేత్ర స్థాయిలో అధిక పాల ఉత్పత్తికి తోడ్పడే నైపుణ్యతను నేర్చుకోవడం వివిధ పశుజాతుల లక్షణాలు గుర్తించుట ఎంపికలో  కావల్సిన నైపుణ్యత పశువుల గృహవసతిని ఏర్పర్చే విధానాలు, వాటి పరిశుభ్రత గురించి నేర్చుకొనుట.

9వ రోజు

16

చెరువులో చేప పిల్లల పెంపకం వాటిలో మెళకువలు

రైతులకు అందుబాటు లో వున్న చెరువులలో చేపల పెంపకంలో శాస్త్రీయ సాంకేతికతను పెంపొందించడం

చెరువులో పెంచే చేప పిల్లల వివరాలు వీటి ఎంపికలో, నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపలకు ఆశించే వ్యాధులు, వాటి లక్షణాలు – చికిత్సా విధానాలు.

వివిధ నీటి తలములతో ఉండే చేపలను గుర్తించుట చెరువులలో చేపల పెంపకంలోని నైపుణ్యతను, పాటించాల్సిన అంశాలను తెలుసు కొనుట చేపలను ఆశించే వ్యాధులను గుర్తించుట, వాటి చికిత్సా విధానంలోని నైపుణ్యతలను గుర్తించుట.

9వ రోజు

17

మల్బరి సాగు మరియు పట్టు పురుగుల పెంపకం లో ఆధునిక పద్ధతులు

మల్బరి సాగులో  పట్టు పురుగుల పెంపకంలో సాంకేతికతను పెంపొందించడం

మల్బరి ఆకు వాటి ఆవశ్యకత సాగు పద్ధతిలో మెళకువలు, పట్టు పురుగుల పెంపకంలోని మెళకువలు

క్షేత్ర స్థాయిలో  మల్బరి సాగు, సాంకేతిక నైపుణ్యత అంశాలను నేర్పుట

9వ రోజు

18

విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటి తయారీలో ఆచరించాల్సిన అంశాలు

వివిధ పంటలలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో అవగాహనను కల్పించుట

వివిధ పంటలలో విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటి తయారి విధానాలు

విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నైపుణ్యతలను వినియోగించడం

10వ రోజు

19

సహకార సంఘాలు – వాటి ఆవశ్యకత

యువ రైతులకు సహకార సంస్థల్లోని విలువలను, వాటి ఆవశ్యకత పై అవగాహన కల్పించుట

సహకార సూత్రాలు, సభ్యత్వ అరహతలు, సభ్యత బాధ్యతలు, సహకార సంఘాల పాత్ర వాటి మధ్య సహకారం

క్షేత్ర స్థాయిలో యువ రైతులకు సహకార సంఘాలలో సభ్యత్వం కొరకు తోడ్పడుట రైతు సేవలో సహకార సంఘాలు / సభ్యుల పాత్ర వాతి ద్వారా శిక్షణను కల్పించుట

10వ రోజు

20

రైతుకు అందుబాటులో వివిధ వ్యవసాయ సేవలు, సమాచార మాధ్యమాల వివరాలు మరియు నెట్ వర్క్ మార్కెటింగ్ వివరాలు

రైతాంగానికి నేరుగా నూతన సాంకేతిక సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా అందించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పెంపొందించడం

 

 

విస్తరణలో ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, కిసాన్ కాల్ సెంటర్ , వ్యవసాయ సాంకేతిక సమాచార కేంద్రం, ఎలక్ట్రానిక్ మీడియా వింగ్ పాత్ర, వివిధ పరిశోధనల అధిపతులు సలహాలను నివృత్తి చేయటం, ఆకాశవాణి ద్వారా రైతులకు అందుబాటులో వున్న కార్యక్రమాలు, అంతర్జాలంలో అందుబాటులో వున్న వివిధ అనుబంధ సంస్థ వెబ్ సైట్ల వివరాలు

క్షేత్రస్ఠాయిలో రైతుల సమస్యలకు నివారణోపాయాలను అందించడం నూతన సాంకేతిక సమాచారాన్ని వివిధ విస్తరణ ప్రతుల ద్వారా సీడీల ద్వారా అందచేయుట.

10వ రోజు

 

21.    మూల్యాంకనము మరియు అభిప్రాయ సేకరణ

10వ రోజు

 

రోజు వారి పాఠ్య ప్రణాళిక

తరగతి గదిలో శిక్షణ

రోజు

9.30-10.30

10.30-11.30

11.30-12.30

1వ రోజు

ముందస్తు వాతావరణ సూచనలు

ఆపత్కాల పంటల ప్రణాళిక

వ్యవసాయంలో సమర్థ సాగు నీటి యాజమాన్యం

2వ రోజు

వివిధ పంటలలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు.

వరి, మొక్కజొన్న

చిరుధాన్యాలు

 

3వ రోజు

అవసరాలు

నూనె గింజలు – 1

నూనె గింజలు – 2

4వ రోజు

ప్రత్తి

చెఱకు

మిరప

5వ రోజు

కూరగాయ పంటలు-1

కూరగాయ పంటలు-2

పశుగ్రాసాలు

6వ రోజు

సమగ్ర వ్యవసాయం

అటవీ వ్యవసాయం

వివిధ పంటలలో విత్తనోత్పత్తి

7వ రోజు

పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం

జీవన ఎరువులు

సమగ్ర సస్య రక్షణ – జీవ నియంత్రణ పద్ధతులు

8వ రోజు

వినూత్న సస్యరక్షణ మందులు-పురుగు

వ్యవసాయ యాంత్రీకరణ

పంట కోత అనంతర పరిజ్ఞానం, నెట్ వర్క్ ప్రాజెక్టు ఆన్ మార్కెట్ ఇంటెలిజెన్స్

9వ రోజు

పాడి పశువుల యాజమాన్యం

చెరువులో చేప పిల్లల పెంపెకం వాటిలో పరిశుభ్రత మెళకువలు

మల్బరి సాగు ,మరియు పట్టు పురుగుల పంపకంలో ఆధునిక పద్ధతులు

10వ రోజు

విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటి తయారీలో ఆచరించాల్సిన అంశాలు

సహకార సంఘాలు – వాటి ఆవశ్యకత

రైతుకు అందుబాటులో వివిధ వ్యవసాయ సేవలు, సమాచార మాధ్యమాల వివరాలు మరియు  నెట్ వర్క్  మార్కెటింగ్ వివరాలు

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.01534526854
Narose Ramesha chary Aug 03, 2020 10:45 AM

యువ రైతులకు ఏ సమయంలో శిక్షణ ఇస్తారో పూర్తి వివరాలు తెలియజేయగలరు.

చంద్రశేఖర్ Mar 26, 2018 01:33 PM

దరఖాస్తు ఎలా చేసుకోవాలి, వివరంగా తెలియపరచాలని
కోరుతున్నాం

గోపాలకృష్ణ Oct 01, 2016 05:07 PM

దరఖాస్తు ఎలా చేయాలి.90 రోజులు శిబిరానికి ఏవిధంగా రావలో తేలియజేయగలరు.ఎక్కడకు రావలో తేలియజేయగలరు 99*****76

ప్రదీప్ Aug 02, 2016 07:14 PM

90 రోజుల యువ రైతుల కార్యక్రమంలో పాల్గొనడానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి


90 రొజుల శిబిరనికి రావటనికి ఎవిదంగా వెళ్లాలొ తెలియజెయగలరు 90*****08

సురేందర్ Jul 23, 2016 11:54 PM

91*****25

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు