অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రైతుకు అందుబాటులో వున్న వివిధ వ్యవసాయ సేవలు మరియు సమాచార మాధ్యమాల వివరాలు

రైతుకు అందుబాటులో వున్న వివిధ వ్యవసాయ సేవలు మరియు సమాచార మాధ్యమాల వివరాలు

 1. ఏరువాక కేంద్రాలు
 2. కృషి విజ్ఞాన కేంద్రాలు
 3. వాతావరణ సూచనలు
 4. కిసాన్ కాల్ సెంటర్
 5. వ్యవసాయ సాంకేతిక సమాచార కేంద్రం (ATIC)
 6. ఎలక్ట్రానిక్ మీడియా వింగ్
 7. డాట్ సంటర్లు
 8. కృషి విజ్ఞాన కేంద్రాలు
 9. ప్రధాన శాస్త్రవేత్తలు
 10. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల అధిపతులు
 11. ఆకాశవాణి ద్వారా రైతులకు అందుబాటులో వున్న వ్యవసాయ కార్యక్రమాలు
 12. టెలివిజన్
  1. వివిధ టి.వి.ఛానళ్ళలో ప్రసారమవుతున్న వ్యవసాయ మరియు అనుబంధ రంగాల కార్యక్రమాల వివరాలు
 13. సెల్ ఫోన్ ద్వారా వ్యవసాయ సమాచార సేకరణ
 14. ఎ. టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లు
 15. సంక్షిప్త సమాచారం (ఎస్.ఎంఎస్)
 16. సి. వాట్స్ యాప్ (whatsapp)
 17. డి. యూ.ట్యూబ్
 18. అంతర్జాలం (internet) లో అందుబాటులో వున్న వివిధ వ్యవసాయ అనుబంధ సంస్థల వెబ్ సైట్ల వివరాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర రైతాం గానికి బాసటగా నిలిచే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫె సర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యాన్ని ఏర్పటు చేసింది. ప్రభుత్వ ఆకాంక్షను స్ఫూర్తి గా తీసుకొని వ్యవసాయ విశ్వ విద్యాలయం రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలెన్నో చేపడుతున్నది.

రాష్ట్రం లో పండించే అన్ని వ్యవసాయ పంటల మీద విస్తృత పరిశోధనలు చేపట్టడం, విద్యార్ధులకు ఉత్తమ విద్యను అందించి అగ్రగాములుగా నిలపడమే కాకుండా, నేరు గా రైతులకు శాస్త్రవేత్తల ద్వారా సేవ లను అందించడం కోసం ఎన్నో కార్యక్రమాలను అభి వృద్ధి చెందడానికి ఈ విశ్వవిద్యాలయం అందించే సేవ లను తెలుసుకొని ఉపయోగించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది.

ఏరువాక కేంద్రాలు

ప్రతి జిల్లాలో, జిల్ల స్థాయి మార్కెట్ యార్డ్ లో ముగ్గురు వ్యవసాయ శాస్త్ర వేత్త లను రైతులకందు బాటులో వుండేట్లు చేసింది. వీరు నేరుగా గాని, పోన్ ద్వారా గాని రైతుల కు సలహాలు అందించడం, శిక్షణ తరగతులను నిర్వహించడం, ఆధు నిక పరిజ్ఞానాన్ని రైతులకు చూపేందుకు రైతు పొలా ల్లో ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయడం, సమస్యా త్మక పొలాలను సందర్శించి సలహాలివ్వడం, జిల్లా వ్యవసాయ అధికారులకు ఎప్పటికప్పుడు విశ్వవిద్యా లయంలో రూపొందించిన పరిజ్ఞానం గురించి వివరించ డం, రైతు సమస్యలను పరిశోధనా విభాగానికి అందించి వాటికి పరిష్కారం కనుగొనడం మొదలైన ఎన్నో కార్యక్రమాల ద్వారా రైతులకు సేవచేస్తున్నారు. జిల్లాలోని వివిధ యాజమాన్య పద్ధతుల గురించి చీడ పీడల ఉధృతి గురించి స్థానిక వార్తా పత్రికల ద్వారా, దూరదర్శన్ ద్వారా రైతులకు సమాచారం చేరవేస్తు న్నారు.

కృషి విజ్ఞాన కేంద్రాలు

దాదాపు అన్ని జిల్లలలోను కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి, అన్నిశాస్త్రీయ విభాగాలకు సంబంధించిన శాస్త్రవేత్తలను అందుబాటు లో ఉంచారు. వీటి ద్వారా రైతులకు స్వయం ఉఫాధి పెంపొందించుకొనే దీర్ఘకాలిక శిక్షణా తరగతులునిర్వహి స్తున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనివివిధ ప్రాంతాలలో రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వారి దగ్గరవున్న 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శనా క్షేత్రాలుగా ఏర్పటు చేస్తారు. ఈ కేంద్రాలలో రైతులు బస చేయటానికి హాస్టల్ వసతి, ఉచితంగా భోజన వసతి సౌకర్యం వుంటుంది. కావున రైతులు ఏవైనా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం వారికి కావలసిన విషయ పరిజ్ఞానం శిక్షణ పొందవచ్చు.

వాతావరణ సూచనలు

 1. దూరదర్శన్ (యాదగిరి)ద్వారా ప్రతి మంగళ, శుక్రవారాలలో రాబోయే 5 రోజులకు వాతావరణ సూచనలు మరియుపంతల పరిస్థితులపై సూచనలు చేయడంతోపాటు ఇదే సమాచారాన్ని బులి టెన్స్ రూపంలో విడుదల చేసి అన్ని సమాచార ప్రచు రణ, ప్రసార మాధ్యమాల ద్వారా రైతుకు చేరవేయడం జరుగుచున్నది.
 2. ఈ కాలం వాతావరణ క్లబ్ లను వివిధ ప్రాంతాలలో నెలకొల్పి రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ ఆదా రిత వ్యవసాయ మెళకువలను అందచేయడం జరుగు చున్నది.

కిసాన్ కాల్ సెంటర్

రైతులు తమ సమస్యలు పరిష్క రించుకోవడం కోస6 ఏరువాక కేంద్రాలకు కాని, కృషి విజాఘన కేంద్రాలకు కాని, పరిశోధన సంస్థలకు కాని ఫోను చేసి నేరుగా శాస్త్రవేత్తలను సంప్రదించి వారిసమ స్యకు పరిష్కారం కనుగొనవచ్చు. ఈ సౌకర్యాన్నిమరిం త అందుబాటులోకి తెచ్చేందుకు మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు ఉచిత ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయడమైనది. కావున 1800-425-1110, 1800-180-1551 నంబర్లకు ఫోన్ చేసి శాస్ట్రవేత్తలతో, తమ సమస్య ల గురించి చర్చించి పరిష్కార్ మార్గాలు పొందవచ్చు. ఈ ఫోన్ నంబర్లలో నైపుణ్యం కలిగిన, అన్ని విభాగా లకు సంబంధించిన శాస్ట్రవేత్తలు రైతులకు ఉదయం నుండి రాత్రి వరకు అందుబాటులో వుంటారు.

వ్యవసాయ సాంకేతిక సమాచార కేంద్రం (ATIC)

ఇది యూనివర్సిటీ కేంద్రమైన రాజేంద్రనగర్ , హైదరాబాద్ లో వుంది. ఇందులో విశ్వవిద్యాలయం ద్వారా రైతు లకవసరమైన ప్రచురణలు రూపొందించి అమ్మడం, వివిధ పరిశోధన స్థానాలలో రూపొందించి విత్తనాలను రైతులకు అందుబాటులో వుంచడం, యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి సమాచారం అందించడం, రైతు లకు సాంకేతిక సలహాలందించడం దీనిముఖ్యఉద్దేశ్యం. ఈ కేంద్రంలో నమూనాలను, వ్యవసాయ పనిముట్లు, ఇతర సాంకేతిక అంశాల ఫోటోలు, నమూనా రూపంలో వుంచి సమాచార, ప్రదర్శనా కేంద్రంగా తీర్చిదిద్దడం జరిగింది. నూతన పరిశోధన ఫలితాలను ఎప్పటి కప్పుడు రైతులకు తెలియపరిచే ఉద్ధేశంతో ప్రతినెల ‘వ్యవసాయం’ పేరుతో ఒక మాస పత్రికను ముద్రించి రైతులకు రూ.200ల సంవత్సర చందాతో అమ్మడం జరుగుతుంది.అన్నివ్యవసాత, ఉద్యాన, పాడిపశువుల సంపూర్ణ సమాచారాన్ని పొందుపరచిన వ్యవసాయ పంచాంగం మరియు వివిధ పంటలకు సంబంధించిన ఫోటోలతో పొందు పరచిన డయాగ్నస్టిక్ బులిటెన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచార కేంద్రాన్ని 040-24015380 లేదా 9989625242 నంబరు ద్వారా సంప్రదించ వచ్చు.

ఎలక్ట్రానిక్ మీడియా వింగ్

దేశంలో ప్రప్రధమంగాఇటు వంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఆధునికవ్యవ సాయ పరిజ్ఞానాన్ని దూరవిధ్య ద్వారా అందుబాటులో కి తేవడం జరిగింది. ఈకేంద్రం ద్వారా విశ్వవిద్యాలయం వారు దూరదర్శన్ , ఇతర తెలుగు టీవి చానళ్ళద్వారా వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని దృశ్య, శ్రవణ రూపంలో చిత్రీకరించి ప్రసారం చేయడం జరుగు తుంది. ఇంతేకాకుండా ప్రతి పంటకు సంబందించిన పూర్తి సాగు పద్ధతులను‘డివిడి’ ల రూపంలోతయారు చేసి రైతులకు అందుబాటులో వుంచడం జరుగు తున్నది. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా దూరదర్శన్ లో ప్రతి బుధ, శుక్ర వారాలలోను టీవి-5 ఛానల్ లో ప్రతి శుక్రవారం, వి-6 లో ప్రతి సోమవారం మరియు మహా టివిలో ప్రతి మంగళవారం వివిధ పంటలకు సంబంధిం చిన శాస్త్రవేత్తలతో రైతులు తమ సమస్యల గురించి టీవిలో నేరుగా మాట్లాడుకొను ఏర్పాటు చేయబడినది. అలాగే రేడియో ద్వారా రైతులకు ప్రతి రోజు సాయంత్రం 6.50నుండి 7.00 వరకు వ్యవసాయ వార్తలు అందజే యడం జరుగుతున్నది.

డాట్ సంటర్లు

కరీంనగర్ 0878-222151, 9989623818
ఖమ్మం 08742-256188, 9989623818
నల్గొండ 08682-226547, 9989623815
నిజామాబాద్ 08462-223575, 9989623817
మహబూబ్ నగర్ 08542-279156, 9989623820
వరంగల్ 0870-2445410,9989623814
సంగారెడ్డి,మెదక్ 08455-278277, 9989623819
రంగారెడ్డి 040-24012668, 9989623821

కృషి విజ్ఞాన కేంద్రాలు

మల్యాల్ , వరంగల్ 9949988231
రుద్రూర్ , నిజామాబాద్ 9989623830
వైరా, ఖమ్మం 9989623831
కంపాసాగర్ , నల్గొండ 7702544771
పాలెం, మహబూబ్ నగర్ 7702366110
గడ్డిపల్లి, నల్గొండ 9849716205
జమ్మికుంట, కరీంనగర్ 9848573710
మహబూబ్ నగర్ 9440835658
మెదక్ 9949192116

ప్రధాన శాస్త్రవేత్తలు

వరి 9849059291
మొక్కజొన్న 8008123671
ప్రత్తి 9866962634
సోయాబీన్ 9441167821
మిశ్రమ వ్యవసాయం 9440019024
నీటి యాజమాన్యం 9866875739
కలుపు యాజమాన్యం 9866458165
పప్పు దినుసులు 9849133793
పశుగ్రాసాలు 9849152482
చెఱకు 9989625218

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల అధిపతులు

జాయింట్ డైరెక్టర్ , ఉద్యాన శాఖ 874449091
తెలంగాణ పశుసంవర్థక శాఖ 040-2331636
తెలంగాణ వరి విజ్ఞానం, తెలంగాణ 040-24591295
కృషిమీడియా, తెలంగాణ 040-24016702-709
మత్స్యశాఖ, తెలంగాణ c 040-24000100
పట్టుపరిశ్రమ, తెలంగాణ 040-23541547
ఏ.పి.సీడ్స్ 040-23236088,23234295
సీడ్ నెట్ 011-23381067
వ్యవసాయ పనిముట్లు 011-23388911
జీవనియంత్రణ ప్రయోగశాల 9848921791
సూక్ష్మపోషక పదార్థాల ప్రయోగశాల 24011456
సస్యరక్షణ మందుల అవశేషాల విభాగం 7702636891
రేడియో ట్రేసర్ లేబొరేటరె 040-24014404
వ్యసాయ సంబంధిత పక్షి విభాగం 040-24015754
నాణ్యత నియంత్రణ కేంద్రం 040-24013456
విత్తన పరిశోధన కేంద్రం 040-24015382.

ఆకాశవాణి ద్వారా రైతులకు అందుబాటులో వున్న వ్యవసాయ కార్యక్రమాలు

రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా ఆకాశవాణి ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రూపాలలోవ్యవసాయ సమాచారాన్ని రైతులకు రేడియో ద్వారా అందించడం జరుగుతున్నది.

 • ఉదయం 6.30 – 6.45:పొలం పనులు
 • మధ్యాహ్నం 1.20 – 1.30 : పాడిపంటలు
 • సాయంత్రం 6.40 – 6.50 : గ్ర్రామా సీమలు (ప్రతి ఆధివారం)
 • సాయంత్రం 6.50 – 7.00 : వ్యవసాయ సూచనలు
 • రాత్రి 7.15 – 7.45 : ఇల్లు, వాకిలి

ఇల్లు, వాకిలి కార్యక్రమంలో ప్రతి సోమవారం రాత్రి 7.15-7.45 వరకు వ్యవసాయ పాఠశాల, ప్రతి గురువారం రాత్రి 7.15-7.45 వరకు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఈ అన్ని కార్యక్రమాలలో కూడా ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పాల్గొని సేవలందించడం జరుగుతున్నది.

టెలివిజన్

ఆధునిక జీవన శైలిలో టెలివిజన్ ప్రసారాల వీక్షణ అత్యంత పాముఖ్యమైనది. తెలుగు ప్రసారం చేసే ఛానళ్ళు దేశంలో ఎక్కువగా వున్నాయి. అంతేకాకుండా దాదాపు 14 తెలుగు ఛానళ్ళు ప్రస్తుతం వ్యవసాయ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వీటి ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని చేరవేయుటకు వ్యవ సాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

వివిధ టి.వి.ఛానళ్ళలో ప్రసారమవుతున్న వ్యవసాయ మరియు అనుబంధ రంగాల కార్యక్రమాల వివరాలు

టి.వి ఛానల్ కార్యక్రమం పేరు ప్రసార సమయం
యాదగిరి రైతుస్నేహం సా.6.00 – 7.00(సోమ-శని) బుధ మరియు శుక్ర వారాలలో లైవ్
ఈ.టీ,వి అన్నదాత సా. 6.30 -7.00 ఆది నుండి సోమ వరకు
ఈ.టీ.వి- 2 జై కిసాన్ సా. 6.30 -7.00 ఆది నుండి సోమ వరకు
టీ.న్యూస్ చేను-చలక సా. 6.30 -7.00 ఆది నుండి సోమ వరకు
టి.వి – 5 అన్నపూర్ణ సా.5.30-6.00 సోమ నుండి శుక్ర వరకు శుక్రవారం లైవ్
మహా టి.వి రైతన్న సా.5.30-6.00 సోమ నుండి శుక్ర వరకు మంగళవారం లైవ్
ఎన్ – టి.వి ఏరువాక సా. 6.00 -6.30 శని మరియు ఆదివారా లలో
హెచ్ ఎం.టి.వి పసిడి పంటలు సా. 6.00 -6.30 సోమ నుండి శుక్ర వరకుఉ. 6.30-7.00
సాక్షి టి.వి రైతన్న రాజ్యం సా.6.00-6.30 సోమ నుండి శుక్ర వరకు
సివిఆర్ న్యూస్ రైతే రాజు సా. 6.30-7.00 సోమ నుండి శుక్ర వరకు
సివిఆర్ హెల్త్ రైతే రాజు సా.6.00-6.30 ఆదివారం మాత్రమే
జెమిని న్యూస్ వ్యవసాయం సా.6.30-7.00 సోమ నుండి శుక్ర వరకు సోమవారం లైవ్
వి 6 టి.వి సాగుబడి సా.5.30-6.00 సోమ నుండి శుక్ర వరకు గురువారం లైవ్
ఎక్స్ ప్రెస్ న్యూస్ పాడి పంటలు సా.5.30-6.00 సోమ నుండి శుక్ర వరకు గురువారం లైవ్

సెల్ ఫోన్ ద్వారా వ్యవసాయ సమాచార సేకరణ

ప్రస్తుత కాలంలో యువతలో సెల్ ఫోన్ వినియోగం చాలా ఎక్కువగా వున్నది. ఈ సెల్ ఫోన్ ద్వారా అందు బాటులో వున్న వివిధ సేవలను క్రింద వివరించడం జరిగింది.

ఎ. టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లు

వివిధ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ శాఖల వారు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని రైతులు తమకు కావ ల్సిన సమాచారాన్ని నేరుగా ఆయా శాఖల ద్వారా తెలుసుకొనవచ్చును.

కిసాన్ కాల్ సెంటర్ 1800 180 1551
వాతావరణ వివరాలు 1800 180 1717
ఫార్మర్స్ కాల్ సెంటర్ 1800 425 1110, 1800 425 4440
ఉద్యానశాఖ 1800 425 0040,1800 425 0080
పశుసంవర్థక శాఖ 1800 425 3004
పట్టు పరిశ్రమ 1800 425 0010

సంక్షిప్త సమాచారం (ఎస్.ఎంఎస్)

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ లోని శాస్త్రవేత్తలకు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవ సాయశాఖ మరియు అనుబంధ శాఖల అధికారులకు ఎస్ ఎంఎస్ లు పంపడం ద్వారా పలు సమస్యలకు పరిష్కారం పొంద వచ్చును. క్రింద ఇవ్వబడిన సైట్లలో వారిపేరు నమోదు చేసుకుంటే ప్రతిరోజు వారికి నేరుగా ఎస్ ఎంఎస్ ల రూపం లోను మరియు వాయిస్ మెసేజ్ ల ద్వారా కూడా వివిధ పంటలు, స్కీంలు, రైతులకు అందుబాటులో వుండే సేవల గురించిన వివరాలను అందజేయడం జరుగుతుంది1. Agrosmet.tg.nic.in 2. mkisan. gov.in 3. farmer.gov.in

సి. వాట్స్ యాప్ (whatsapp)

రైతులు పొలంలో గమనించిన పురుగులు, తెగు ళ్ళు, సూక్ష్మ్ ధాతు లోపాలు మరియుఇతర ఏసమస్య లకైనా సంబంధించిన పోటోలను వీడియోలను ఫోన్ లో తీసి సంబంధిత శాస్త్రవేత్త;అలి ఈ whatsapp పంపించడం ద్వారా సమస్య నిర్ధారణకు సులభంగా దోహదపడి ఖచ్ఛితమైన నివారణ మార్గాలను పొంద వచ్చును.

డి. యూ.ట్యూబ్

రైతులు మొబైల్ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ ను క్లిక్ చేయడం ద్వారా వ్యవసాయ సంబంధిత సమా చారాన్ని ఫోటోలు మరియువీడియోలరూపంలోచూడ వచ్చును. రైతులు తమకు కావాల్సిన సమాచారాన్ని యూట్యూబ్ లో టైప్ చేసి వాటికి సంబంధించిన వీడి యోలు, ఫోటోలను చూసుకోవడమే కాకుండా తమకు న్న సమస్యలను వాటితో సరిపోల్చుకొని నివృత్తి పొందవచ్చును.

అంతర్జాలం (internet) లో అందుబాటులో వున్న వివిధ వ్యవసాయ అనుబంధ సంస్థల వెబ్ సైట్ల వివరాలు

రైతులు ఈ వెబ్ సైట్ల ద్వారా మన రాష్ట్రం, దేశం మరియు ప్రపంచంలో జరుగుతున్న ఆధునిక వ్యవ సాయ పరిజ్ఞానాన్ని తెలుసుకొనవచ్చును. ఫేస్ బుక్ అనే సోషల్ మీడియా ద్వారా ప్రొఫెషనల్ గ్రూప్స్ లోమెంబర్ కావడం వలన తమకు కావలసిన సమచారాన్ని ఎప్పటికప్పుడు పొందవచ్చును. ఉదా. ఇండియన్ అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్ గ్రూపు (ఐఏపి).

వెబ్ సైట్ పొందగల సమచారం
www.pjtsau.ac.in పంటల సాగు వివరాలు
www.angrau.ac.in పంటల సాగు వివరాలు
www.apagrisnet.gov.in పంటల సాగు వివరాలు
www.agrisnet.tg.nic.in పంటల సాగు వివరాలు
www.agritech.tnau.ac.in పంటల సాగు వివరాలు
www.ikisan.com పంటల సాగు వివరాలు
www.krishiworld.com పంటల సాగు వివరాలు
http://farmer.gov.in పంటల సాగు వివరాలు
www.indianspices.com సుగంధద్రవ్య పంటలు (పసుపు, అల్లం మిరియాలు మొ.)
http://apagros.org పనిముట్లు మరియు ఇతర వివరాలు
http:.//apseeds.nic.in విత్తన సరఫరా
http://apssca.ap.nic.in విత్తన ధృవీకరణ
http:.//markfed.ap.nic.in వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు-అమ్మకాలు
http://www.wunderground.com వాతావరణ వివరాలు
www.accuweather.com వాతావరణ వివరాలు
www.imdagrimet.gov.in వాతావరణ వివరాలు
www.market.ap.nic.in మార్కెట్ వివరాలు
http://tgmarket.nic.in మార్కెట్ వివరాలు
www.nabard.org ఋణాలు-రాయితీలు
http://ahfd.ap.nic.in పశుపోషణ
www.tgahd.nic.in పశుపోషణ
www.apfisheries.com చేపల పెంపకం
www.apfisheries.egg.gov.in చేపల పెంపకం
http://nfdb.gov.in చేపల పెంపకం
www.seri.ap.gov.in పట్టు పరిశ్రమ
www.seri.telangana.gov.in పట్టు పరిశ్రమ
http://www.agricultureinformation.com వ్యవసాయ అమ్మకాలు – కొనుగోలు సమాచారము
http://iffco.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.agropedia.iitk.ac.in వ్యవసాయ నిఘంటువు
www.rd,ap.gov.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.mkisan.gov.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.agricoop.nic.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.horticulture.tg.nic.in ఉద్యాన పంటల వివరాలు
www.nhb.co.in ఉద్యాన పంటల వివరాలు
www.drysrhu.edu.in ఉద్యాన పంటల వివరాలు
www.rkmp.co.in వరి విజ్ఞానం
www.krishivideoadvise వ్యవసాయ సంబంధిత సమాచారము
www.vikaspedia.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.icrisata.org మెట్ట పంట  సమాచారము
www.mail.gov.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.elabs.gov.in ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందుల వివరాలు
www.meeseva.gov.in వ్యవసాయ పనిముట్ల వివరాలు
www.indg.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.seednet.gov.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.urvarak.co.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.apeda.gov.in ఎరువుల సమాచారము
www.nhm.nic.in ఉద్యాన పంటల వివరాలు
www.dacnat.nic.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.farmech.gov.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.icar.org.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.dac.kkms.gov.in వ్యవసాయ సంబంధిత సమాచారము
www.efreshglobal.com వ్యవసాయ సంబంధిత సమాచారము
www.digitalgreen.org వ్యవసాయ సంబంధిత వీడియోలు

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: కో-ఆర్డినేటర్, ఎలక్ట్రానిక్ మీడియా వింగ, రాజేంద్రనగర్ , హైదరాబాద్.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate