অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరి విత్తనోత్పత్తి

పలు పంటలలో దిగుబడిని ప్రభావితం చేసే వివిధ,అంశాల్లోమొదటిది నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించడం,నాణ్యమైన విత్తనం అంటే కనీస నాణ్యతా ప్రమాణాలను అనుసరించి, అధిక జన్యుస్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి,అతి తక్కువ జడ పదార్ధం, తక్కువ సంఖ్యలో కలుపు,ఇతర పంటల విత్తనాలను కలిగి తెగుళ్ళ బారిన పడనటువంటి విత్తనం.

వరి విత్తనోత్పత్తి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 లక్షల హెక్టార్లవరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని విత్తనాభివృద్ధి సంస్థగాని, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనాస్థానాలు గాని లేదా ప్రైవేట్ విత్తన సంస్థలు గాని సరఫరాచేయలేవు. కావున రైతులు తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వరిస్వపరాగ సంపర్క మొక్క, ప్రస్తుతం రైతుల పొలాల్లో సాగులో ఉన్నవన్నీ రకాలే కావున రైతులు ఒకసారి ధృవీకరింపబడిన విత్తనం కొనుగోలు చేసి రైతు స్థాయిలోనే తక్కువ ఖర్చుతో నాణ్యమైన్ విత్తనాన్ని తయారుచేసుకొని తమ అవసరాలకు ఉపయోగించుకో వచ్చును.

సాధారణంగా ఒకే విత్తనాన్ని కొంతకాలం సాగుచేసిన తర్వాత వరి వంగడం దిగుబడి తగ్గుతుందనే అపోహరైతుల్లో ఉంది. కాని దానికి ముఖ్య కారణం విత్తనంలో కల్తీజరిగి జన్యు స్వచ్ఛత తగ్గడం, జన్యు స్వచ్ఛత అనేది ఇతర రకాలతో కల్తీ జరగడం వల్ల, పరపరాగ సంపర్కంవల్ల, స్వల్ప జన్యు పరమైన మార్పులు, యాంత్రిక కల్తీవల్ల, ఆశించే తెగుళ్ళ ప్రభావం వల్ల జరుగుతుంది. కాబట్టివిత్తనాలలో కల్తీలను నివారించి, జన్యుస్వచ్ఛతనుకాపాడటం ద్వారా నాణ్యమైన విత్తనాన్ని పొందుటకు కొన్ని మెళకువలు పాటించాలి.

నాణ్యమైన విత్తనం కొరకు పాటించాల్సిన మెళకువలు

 • ఖరీఫ్ , రబీ వాతావరణ పరిస్థితులకు కాలపరిమితిని బట్టి అనువైనyfm114రకాలను సాగు చేయాలి. ఆవిధంగా చేస్తే రకాల్లో లక్షణాలు ప్రస్ఫుటంగా వ్యక్తీకరింప బడతాయి.
 • విత్తనోత్పత్తి సారవంతమైన, మంచినీటి వసతి ఉన్న పొలాల్లోనే చేపట్టాలి. లేనిచో విత్తన నాణ్యత దెబ్బతినే అవకాశ వుంది.
 • విత్తనోత్పత్తి అంతకు ముందు పంటకాలంలో అదే రకం వేసిన పొలంలో  లేదా వేరే పంట వేసిన పొలం లో సాగు చేయటం వల్ల, స్వయం ఉత్పత్తి మొలకల వల్ల కల్తీ జరగకుండా జాగ్రత్త పడవచ్చు.
 • విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ అదే పంటకి చెందిన వేరే రకం ఉంటే కనీసం 3 మీటర్ల అంతర దూరం పాటించాలి.
 • నారుమడిని పోసేటప్పుడు నేలను బాగా దున్ని కలుపు లేకుండా చేసి, నారు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలు ఎర్పాటు చెసుకొవాలి.
 • నారుమడిలో పశువుల ఎరువు: పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియ దున్నాలి. దుక్కిలో సిఫార్స్ చేసిన నత్రజనిలో సగభాగం, మొత్తం భాస్వరం, పొటాష్ లను వేసిన తర్వాత రెండో భాగం నత్రజనిని విత్తిన 12-15 రోజుల మధ్య పైపాటుగా వేయాలి.
 • నాట్లు వేసేటప్పుడు 25-30 రోజుల  వయస్సు గల నారును, రకాల కాలపరిమితిని బట్టి నాటాలి.
 • కుదురుకి 2-3 మొక్కల చొప్పున పైపైన నాటాలి. దీర్ఘ్ కాలిక రకాలైతేచ.మీ.కి 33 కుదుర్లు, స్వల్పకాలిక రకాలైతే 44 కుదుర్లు ఉండేలా చూడాలి.
 • ప్రతి 2 మీ., ఊడ్పుకి 20సెం.మీ. కాలిబాటలు వేయాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా తగిలి, దోమ ఉధృతి తగ్గుతుంది.
 • వీలైన చోట్ల నాటు యంత్రాలను ఉపయోగించి కూడా నాట్లు వేయవచ్చును.
 • పైరు నాటిన 40 రోజుల వరకు, పొలంలో కలుపు లేకుండా చూడాలి.
 • కలుపు నివారణకు నాటిన 3-5 రోజుల వ్యవధిలో ప్రిటలక్లోర్500మి.లీ లేదా ఆక్సాడయార్జిల్ 35గ్రా/ ఎకరానికి 20కిలోల పొట్టి ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. కలుపు మందు వేసేటప్పుడు పలుచగా నీరుండాలి. కలుపు మందు      వేసిన తర్వాత 2-3రోజుల వరకు నాటిన చేలో నీటిని నిలగట్టాలి.
 • భూసార పరీక్షననుసరించి, సిఫార్సు మేరకు ఎరువు లు వేయాలి.భాస్వరం గాని, భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు గాని పైపాటుగా వేయరాదు.
 • విత్తిన పంటకు మామూలు వాణిజ్య పంటవలె నీటి యాజమాన్యం పాటించాలి., కీలక దశలైన అంకురం ఏర్పడుట, పూత దశ,  గింజ పాలుపోసుకుని, గింజ గట్టిపడే దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఈ దశ ల్లో పైరు నీటి ఎద్దడికి గురైతే దిగుబడితో బాటు, విత్తన నాణ్యత లోపిస్తుంది.

కేళీల ఏరివేత

విత్తనోత్పత్తిలో ప్రధాన అంశం పంటలో కేళీలను తీయుట. ఈ కేళీల ఏరివేత ముఖ్యంగా 3 దశల్లో చేపట్టాలి. అవి ఏమిటంటే?

 • పైరు దుబ్బు చేసే సమయం.
 • పూత దశ.
 • గింజ గట్టిపడినప్పుడు (వెరికోతకు ముందు) దుబ్బు చేసే సమయం.

మనం సాగుచేసిన రకం భౌతిక లక్షణాలనుబట్టి అంటే పైరు ఎత్తు, ఆకు రంగు, దుబ్బుచేసే గుణం మొదలగు లక్షణాలకు భిన్నంగా, గా లేదా పొడుగుగా, ఆకు రంగులో మార్పు,ఇతరత్రా భౌతికంగా వేరుగా ఉండే మొక్కలను పూర్తిగా వేర్లతో సహా తీసివేయాలి.

పూత దశ

ఈ సమయంలో ముందుగా పూతకు వచినవి లేదాఆలస్యంగా పూతకు వచ్చేవి, పోటాకు అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసివేయాలి.

ధృవీకరణ వరి విత్తన నాణ్యతా ప్రమాణాలు (శాతాల్లో)

జన్యు స్వచ్ఛత

98

భౌతిక స్వచ్ఛత

98

జడ పదార్ధం

2

మొలకశాతం (కనీసం)

80

తేమ శాతం

13

ఇతర పంటలు లేదా రకాల విత్తనాలు

20 గింజల్లో/కిలో

పైపొట్టులేని గింజలు

2

గింజ గట్టిపడే దశ :వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను సమూలంగా తీసివేయాలి.

పై విధంగా 3 దశల్లోను కేళీలను తీసివేయాలి.

విత్తనం నిల్వ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • వరి కోత కోసినప్పుడు, నూర్పిడి సమయాల్లో యాంత్రిక కల్తీ అనగా యంత్రాల ద్వారాగాని, మనుషుల ద్వారా పనిముట్ల ద్వారా గాని, ఇతర రకాల గింజలు కలువ కుండా జాగ్రత్త వహించాలి. నూర్పీడి యంత్రాల ద్వారా విత్తన విత్తన కల్తీ జరుగుతుంది. కావున ఎలాంటి పరిస్థితుల్లోను విత్తనోత్పత్తి చేలలో యంత్రాలను వాడరాదు.
 • విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం 13 శాతాని కి చేరుకునేవరకు బాగా ఎండలో ఎండబెట్టాలి. కల్లాల్లో యాంత్రిక కల్తీ లేకుండా చూడాలి.
 • విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనె సంచులను లేదా కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. అలాగే నిల్వ చేసేటప్పుడు అధిక తేమ శాతం, అధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
 • విత్తనాన్ని గాదెల్లో గాని, పాతరల్లోగాని లేదా ఎరువుల సంచుల్లోగాని నిల్వ ఉంచరాదు. విత్తనాన్ని నిల్వ ఉంచిన చోట ఎరువులను గాని, పురుగు మందులను గాని ఉంచకూడదు.
 • విత్తనోత్పత్తి గ్రామస్థాయిలో లేదా ఒక రైతు సహకార సంస్థ స్థాయిలో చేసేటప్పుడు, ఒక ప్రాంత రైతులందరూ తమకు కావల్సిన విత్తనాన్ని ముఖ్యంగా ఒకే రకానికి చెందినదై ఉండే విత్తనాన్ని ఉత్పత్తి చేయడం మంచిది.
 • ఈ విధంగా మెళకువలు పాటిస్తే పైన వివరించిన లక్షణాలు గల నాణ్యమైన విత్తనాన్ని రైతులు తమ తమ   పొలాల్లో తామే స్వయంగా తయారుచేసుకొని, విత్తనాలు ఖర్చు తగ్గించుకోవడమే కాక, కల్తీ విత్తనాల బారిన పడకుండా తమను తాము రక్షించుకొని, అధిక దిగుబడులను సాధించగలరనడంలో ఎలాంటి సందే సందేహం లేదు.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate