অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆముదం

నేలలు

చౌడు నేలలు తప్ప నీరు ఇంకే అన్ని రకాల

 • ఆముదం ఎక్కువగా ఖరీఫ్ లో వర్షాధారంగా మహబూబ్ నగర్, నల్గొండ మరియు రంగారెడ్డి  జిల్లాలోని తేలికపాటి నేలల్లో సాగు చేస్తున్న ప్పటికి దిగుబడులు అంత ఆశాజనకంగా లేవు.
 • కానీ తక్కువ నీటి సౌకర్యంతో అతి తక్కువ సాగు ఖర్చుతో ఆరుతడి పంటగా రబీలో ఆముదం పొందవచ్చు.

రకాలు

పరిస్థితి

సూటి రకాలు

హైబ్రిడ్స్

 

బెట్టను తట్టుకునేవి

క్రాంతి, కిరణ్

జిసిహెచ్ – 4, డిసిహెచ్ -177

ఎండు తెగులు

హరిత, జ్యోతి, జ్వాల

పిసిహెచ్ -111,  పిసిహెచ్ -222, డిసిహెచ్ -519

విత్తన మోతాదు

సీజన్

రకాలు

బరువు నేలలు(కి./ఎ)

బరువు నేలలు(కి./ఎ)

ఖరీఫ్

సూటి రకాలు

2-2.5

4.0

సంకర రకాలు

2.0

2.5

రబీ

సంకర రకాలు

2.0

2.0

విత్తే దూరం

నేలలు

ఖరీఫ్

రబీ

బరువు

90x60 సెం.మీ

120x90 సెం.మీ

తేలిక

90x45 సెం.మీ

90x90 సెం.మీ

విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బండాజిమ్ లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తనశుద్ధి చేయాలి.

విత్తే సమయం: ఖరీఫ్ జూన్ 15 నుండి జూలై 31 వరకు రబీ: అక్టోబ్ ర్.

పోగుంతలు మరియు ఒత్తు మొక్కలు పీకి వేయుట

 • విత్తనం మొలవని చోట పోగగుంతలు పెట్టుకోవాలి.
 • విత్తిన 15-20 రోజులకు పొలంలో విత్తిన చోట ఒకే యొక్క ఉండేటట్లుగా చూసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం

 • సూటి రకాలను 12కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం 12కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి.
 • పై పాటుగా 6 కిలోల నత్రజనిని విత్తిన 30-35 రోజులకు మిగిలిన 6 కిలోల నత్రజని 60-65 రోజులకు వేసుకోవాలి.
 • సంకర రకాలకు అదనంగా 6 కిలోల నత్రజని విత్తిన 90-95 రోజులకు వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం

 • పెండిమిథాలిన్ 1.3-1.6లీ లేదా అలాక్లోర్ 0.8-1.0లీ చొప్పున విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటితో కలిపి పిచికాతి చేయాలి.
 • క్విజాలాఫాప్ పి ఇథైల్ లేదా ఫినోక్సిఫ్రాప్ పి ఇథైల్ లేదా ప్రొపాక్విజాపాప్ 1.5మి.లీ లేదా సైహలో పాప్ పి బ్యుటైల్ 1.25 మి.లీ లీటరు నీటికి కలిపి గడ్డిజాతి కలుపును (3-4 ఆకుల దశ) నివారించవచ్చు.

నీటి యాజమానయం

 • ఖరీఫ్ లో వర్షాధారంగా పండించినప్పటికి నీటి వసతి వున్న ప్రాంతాలలో స్ప్రింకర్స్ ద్వారా 15-20% దిగుబడి పెరుగుతుంది.
 • రబీలో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 12-15 రోజుల వ్యవధిలో, జనవరి నుండి పెరిగే ఉష్ణోగ్రతలను బట్టి 8-10 రోజుల వ్యవధిలో బోదెలు/కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి.
 • ముఖ్యంగా మొక్కలు పుష్పిచే మరియు కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి.

చీడపీడల నివారణ

 • ఆముదంలో ఆశించే వివిధ చీడపీడల నివారణకు సమగ్ర  యాజమాన్యం పద్ధతులు పాటించాలి.
 • వడలు తెగులు ఆశించే ప్రాంతాలలో తట్టుకొనే రకాలు సాగు  చేయాలి.
 • భూమిలోని శిలీంద్ర బబీజాలు పెరగకుండా 5 కిలోల ట్రైకోడెర్మా పొడి మందుకు 100 కిలోలు భాగా మాగిన పశువుల ఎరువు మరియు 2 కిలోల వేప పిండి కలిపి అభివృద్ధి పరిచి చాళ్ళలో వేసుకోవాలి.
 • కాయ కుళ్ళు, బూజు తెగులు నివారణకు తుఫాను సూచనలు తెలిసిన వెంటనే, వర్షం కురవటానికి కనీసం 6-8 గం. ముందుగా కార్బండాజిమ్ 1గ్రా./లీ. నీటికి కలిపి ఎకరానికి 200లీటర్ల్ మందు ద్రావణాన్ని గెలలు తడిచేటట్లు పిచికారి చేయాలి. వర్షం తగ్గిన వెంటనే మరో సారి పిచికారి చేయాలి.
 • వర్షాలు తగ్గిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా +10 కిలోల పొటాష్ ను అదనంగా పైపాటుగా వేయాలి.

పంట కోత

 • గెలలో 80% కాయలు ముదిరి ఆకుపచ్చ నుండి లేత పసుపు రంగుకు మారినప్పుడు ఆ గెలల ను కోయాలి.
 • గింజలలో 9-10% తేమ ఉండేటట్లుఎండనివ్వాలి.
చేయవల్సినవి చేయకూడనివి
• ఆముదంను రబీలో నీటి పారుదల క్రింద మాత్రమేసాగు చేయాలి.
• రబీలో అక్టోబర్ మొదటి వారంలో ఆముదం విత్తుకొని అధిక దిగుబడిని పొందవచ్చును.
• మొక్కల సాంద్రత తగ్గకుండా చూసుకుంటూ పై పాటుగా వేసే ఎరువులను భూమిలో తగినంత తేమ వున్న సమయంలోనే వేయాలి.
• విత్తిన 40-60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి.
• ఎర్రగొంగళి పురుగుకు ఎర పంటగా పొలం గట్ల పైన అక్కడక్కడ దోస నాటి వాటి మీద పురుగును గమనించ గానే నివారణ చేపట్టాలి.• నీరు నిల్వ వుండే భూములలో ఆముదాన్ని సాగు చేయరాదు.
• ఆగష్టు, సెప్టెంబర్ , నవంబర్ మాసాల్లో మైక్రోప్లైటిన్ , యూప్లైక్టిన్ అను పరాన్నజీవులు దాసరి పురుగును ఆశించి అదుపులో ఉంచుతాయి. కావున  ఈ దశలో వాటికి హీని చేసే పురుగు మందులైన కార్బరిల్ , క్లోరిపైరిఫాస్ మొదలగు వాటిని వాడరాదు.
• దీనికి బదులుగా హానిచేయని వేపసంబంధిత లేదా వేప నూనె లేదా నొవాల్యురాన్ వంటి మందులను వాడాలి.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ఆముదం పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate