অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మొక్కజొన్న

నేలలు

  • నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతివున్న ఎర్రనేలలు లేదా ఒండ్రు కల్గిన ఇసుక నేలలు అనుకూలం.
  • నీరు ఇంకని నల్ల భూములు, వర్షాధారిత ఎర్రనేలలు, ఆమ్ల క్షార మరియు చౌడు భూములు మొక్కజొన్న సాగుకు అనుకూలం కావు.

రకాల ఎంపిక: యూనివర్సిటీ విడుదల చేసిన మధ్యకాలిక రకాలలో డి.హెచ్ . ఎమ్ .117 మరియు 119 మంచి దిగుబడి నిస్తాయి.  ఇవికాక సిఫారసు చేయబడిన అధిక దిగుబడినిచ్చే ప్రైవేట్ సంకర రకాలను సాగు చేయవచ్చు.

పేలాల మొక్కజొన్న రకం: అంబర్ పాప్ కార్న్

తీపి మొక్కజొన్న రకాలు : కాంపొజిట్ రకాలు : మాధురి, ప్రియ, అల్ మోరా, విన్ ఆరంజ్

హైబ్రిడ్ రకాలు : షుగర్ 75, బ్రైట్ జీన్,హెచ్.ఎస్.సి.1

విత్తే సమయం : ఖరీఫ్ : జూన్ – జూలై , రబీ : అక్టోబర్ – నవంబర్

విత్తు పద్ధతి : దుక్కి చేసిన నేలల్లో 75 సెంమీ. లేదా 60 సెం.మీ. ఎడం ఉండునట్లు తూర్పు-పడమర లకు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని బోదెకు ఒక వైపు 1/3 వంతు ఎత్తులో 2సెం.మీ. లోతులో విత్తుకోవాలి.

విత్తన మోతాదు, విత్తేదూరం, మొక్కల సాంద్ర

రకాలు కిలోలు/ ఎకరాకు విత్తే దూరం మొక్కల సాంద్రత (ఎ)
సంకర రకాలు
తీపి మొక్కజొన్న
పేలాలమొక్కజొన్న
బేబి కార్న్
7
4
5
10
60x20
60x20
60x20
45x15
33,333
33,333
33,333
59,259

ఎరువుల మోతాదు

వర్షాధారంగా
(కి/ఎ) 
(నీటిపారుదల క్రింద) కి/ఎ
నత్రజని
భాస్వరం
పొటాష్
జింక్ సల్ఫేట్
72
24
24
10
80-96
24-32
24-32
20

ఎరువులు వేసే సమయం

ఖరీఫ్ : నత్రజని ఎరువును 3 దఫాలుగా 1/3 వంతు వత్తే సమయంలో, 1/3 వంతు30-35 రోజులకు, మిగిలిన 1/3 వంతు 50-50 రోజులకు మొక్కకు 5 సెం.మీ దూరంలో మరియు 5 సెం.మీ లోతులో వేయాలి.  మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎరువును విత్తే సమయంలోనే వేసుకోవాలి.

రబీ: నత్రజనిని 4 దఫాలుగా (విత్తేటప్పుడు, 30-35 రోజులకు, 45-55 రోజులకు ) వేసుకోవాలి.  మొత్తం భాస్వరం మరియు 1/2 వంతు పొటాష్ ను విత్తేటప్పుడు మిగిలిన పొటాష్ ను 45-55 రోజులకు  వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం

  • అట్రజిన్ @ 800-1200గ్రా/ఎకరాకు.
  • అట్రజిన్ @ 800-1200గ్రా. (వరి మాగాణులలో) + గ్రామాక్సిన్ @ 1.0లీ/ఎకరాకు.
  • విత్తిన 35 రోజులకు అంతర కృషి చేసి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి.

నీటి యాజమాన్యం

  • విత్తిన 30-40 రోజులలోపు వున్న లేత పైరుకు అధిక నీరు హానికరం.  ఆ దశలో నీరు నిల్వ కుండా చూసుకోవాలి.
  • మొక్కజొన్నలో తేమ సున్నిత దశలు అనగా పంట మోకాలు ఎత్తుదశ, పూతదశ, గింజ పాలు పోసుకొనే దశ, గింజ నిండే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

చీడపీడల యాజమాన్యం

• కాండం తొలుచు పురుగులు రెండు రకాలు. మొదటిది ఖరీఫ్ పంటలో ఎక్కువగా వచ్చే మచ్చల/చారల కాండం తొలుచు పురుగు, రెండవది రబి పంటను ఎక్కువగా నష్టపరిచే గులాబి రంగు కాండం తొలుచు పురుగు.
• వీటి నివారణకు గాను సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
• ఎర్ పంటగా మొక్కజొన్న చుట్టూ 4-5 వరుసల జొన్న విత్తుకొని 45 రోజుల తర్వాత తీసివేయాలి.
• మొక్కజొన్నలో బొబ్బర్లను అంతర పంటగా, నేపియర్ గడ్డిని ఎరపంటగా వేసుకోవాలి.
• అంతర పంటలుగా కంది,సోయాచిక్కుడు సాగుచేసి సహజ శత్రువులును పెంపొందించాలి.
• మొలకెత్తిన 10-15 రోజులలోపు క్రింది 3-4   ఉన్న గ్రుడ్లను గమనించి నాశనం చేయాలి.
• ఆకుసుడులలో 25 -30 రోజులలోపు పురుగు ఉధృతిని గమనిస్తే కార్బోప్యూరాన్ 3జి గుళిక లను ఎకరానికి 3 కిలోలు మొవ్వులో వేయాలి.
• ఆకు మాడు తగులు నివారణకు గాను మాంకోజెబ్ @ 2.5గ్ర్ర/లీ. పిచికారి చేయాలి.

. పైరులో పురుగు ఆశించిన మొక్కలలో ఎండిపోయిన మొవ్వులను (డెడ్ హార్ట్స్ ) గమనించ వచ్చు.  పీకితే ఇవి సులభంగా ఊడి వస్తాయి. ఈ పురుగు యొక్క జీవెత చక్రం 30-45 రోజుల్లో పూర్తవు తుంది.

 

కాండం కుళ్ళును కల్గించే శిలీంధ్ర బీజాలు నేలలో మరియు మొక్కల్ అవశేషాలలో జీవించి ఉండి, నేలలో తేమశాతం తగ్గినప్పుడు మరియు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తీవ్రంగా నష్టం వాటిల్లు తుంది. కావున పూత దశ నుండి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు ఇవ్వాలి. 5కిలోలు ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని 100 కిలోలు పశువుల ఎరువులో వృద్ధి చేసి వరుసగా 3-4 సంవత్సరములు భూమిలో కలపాలి.

మచ్చల/చారల కాండం తొలుచు
మచ్చల లేదా చారల కాండం తొలుచు పురుగు ఖరీఫ్ పంటను ఎక్కువగా ఆశించి మార్చి నుండి అక్టోబరు నెల వరకు వృద్ధి చెందుతుంది.  ఆకులపై సన్నగా, గుండ్రని రంద్రాలు వరుస క్రమంలో ఏర్పడ తాయి.  ఆకులు పెరిగిన కొద్దీ ఈ రంద్రాలు స్పష్టంగా కనిపిస్తాయి

గులాబి రంగు కాండం తొలుచు పురుగు.                               ఈ పురుగు ముఖ్యంగా రబీ పంటకాలంలో మొక్కజొన్నను ఆశించి నష్టపరుస్తుంది.  తల్లి పురుగు 2-3 వరుసలో ఆకు మొదలు మరియు కాండం మధ్య భాగంలో ముత్యాల వంటి గుడ్లను 7-20 రోజులలో పెడుతుంది. ఒక సముదాయంలో 30 – 100 గుడ్లు గ్రుడ్లు సముదాయము, మొక్కను తొలుస్తున్న గొంగళి వారంరోజుల్లో గుడ్లు పగిలి గులాబి రంగు శరీరంతో ఎర్రని తల కలిగిన పిల్లపురుగులు కాందాన్ని తొలచి లోపలికి ప్రవేశించి అంకుగాన్ని తింటాయి.  ఆకుల పైన అగ్గిపుల్ల మందం పొడవాటి చిల్లులను వరుసల్లో గమనించవచ్చు.  కాండం లోపల ‘ఎస్ ‘ ఆకారంలో సొరంగాలు ఏర్పడతాయి. మొవ్వను ఆశించుట వలన మొక్కలు చనిపోతాయి.

ఆకు ఎండు తెగుళ్ళు

మొక్కజిన్నను ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనవి ఆకు ఎండు తగుళ్ళు. ఇవి రెండు రకాలు. మొదటి రకం తెగులులో ఆకుఅలపై మచ్చలు కోలగా ఉండి, నీటితో తడిచినట్లుగా అనిపిస్తాయి. క్రమంగా ఈ మచ్చ్ల పరిమాణం పెరిగి, ఆకంతా  వ్యాపించి ఆకులు పూర్తిగా ఎండి పోతాయి.  ఎక్కువ తేమ గల వాతావరణంలో మొక్కలు చనిపోతాయి.  రెండవ రకం ఆకు ఎండు తగులులో ఆకులపై చిన్న చిన్న కోలగా ఉండే బూడిద లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చల పరి మాణం పెరిగి దీర్ఘ చతుర స్రాకారంలో మారుతాయి.  వాతావరణంలో తేమ మరియు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నపుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది

నివారణ:
మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి ఆకు ఎండు తెగుళ్ళను నివారించుకోవచ్చు.

బూజు తెగులు

మొక్కజొన్న పంటను బూజు తెగులు ఆశించిన ట్లైతే ఆకులు వంకర తిరిగి, ముడతలు పడటం వంటి లక్షణాలు గమనించవచ్చు.

నివారణ
• టలాక్సిల్ 4 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.
• మొక్కలపై తెగుళ్ళ లక్షణాలు గమనించి నప్పుడు మెటలాక్సిల్ 2గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి

కాండంకుళ్ళు తెగులు

మొక్కజొన్నలో ఈ తెగులు పూత దశ నుండి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  కాండంపై గోధుమ రంగు చారలు ఏర్పడి పంట కోతకు రాక ముందే కాండం భాగం విరిగి నేలపై పడిపోతుంది.  ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం కుళ్ళి నలుపు రంగుకు మారుతుంది.

నివారణ
• ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలు.
• పంటకోసిన తరువాత తెగులు ఆశించిన మొక్కల భాగాలను కాల్చి వేయాలి.

పంట కోత పక్వదశను క్రింది విధముగా గుర్తించాలి

  • కండెల పైపొరలు ఎండినట్లు కనిపిస్తాయి.
  • బాగా ఎండిన కండెలు మొక్కల నుండీ క్రిందికి వేలాడుతూ కనిపిస్తాయి.
  • కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు గట్టిగా వుండి నొక్కులు ఏర్పడవు

నేలను దున్న కుండా మొక్కజొన్న సాగుచేసే పద్దతులు

  • తెలంగాణలో అయితే నవంబరు, డిశెంబరు మధ్య వరి కోతల అనంతరం విత్తుకోవాలి.  ఆ తరువాత విత్తితే దుగుబడి తగ్గుతుంది.
  • దుక్కి దున్నడం అవసరం లేదు.
  • వరి కోసిన తరువాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలిక పాటి తడి ఇచ్చి 2-3 రోజు లలో వరి కొయ్యల మధ్య 2-3 సెం.మీ లోతులో మొక్కజొన్నను విత్తుకోవాలి.
  • తాడును ఉపయోగించి కానీ విత్తనం వేసే యంత్రంతో గాని వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ. మొక్కకు మొక్కకు మధ్య 20సెం.మీ. దూరము ఉండేటట్లు విత్తుకోవాలి.
  • వరి మాగాణులలో భూమిని దున్నడం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది.  దీని నివారణకు ఎకరాకు 1.0 కిలో అట్రజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటలలోపు నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.  వరి దుబ్బులు చిగురు వేసినట్లయితే సగం మోతాదు అట్రజిన్ + సగం మోతాదు పారాక్వాట్ (1/2 కిలో అట్రజిన్ + ½ లీటరు పార్వాక్వాట్ / 200 లీటర్ల నీటిలో) కలిపి పిచికారి చేయాలి.
  • మిగతా యాజమాన్యం పద్ధతులు ముఖ్యంగా ఎరువులు,సస్యరక్షణ మొదలగునవి. రబీ మొక్కజొన్న పంటకు ఆచరించినట్లుగానే పాటించాలి.
చేయవల్సినవి చేయకూడనివి
• ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును లేదా కంపోస్టును వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి.
• బెట్ట పరిస్థితులలో నత్రజని లోపం ఏర్పడినప్పుడు 2% యూరియా(20గ్ర్ర/లీ) ద్రావబణాన్ని 2-3 సార్లు పిచికారి చేయాలి.
• పరపరాగ సంపర్క దశలో భాస్వరం లోపం వలన పీచు సరిగ్గా బయటకి రాక చిన్న కండెలు ఏర్పడ తాయి. ఈ లోప సవరణకు డి.ఎ.పి.2% ద్రావణాన్ని  4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
• అంతర పంటలుగా పప్పుజాతి పంటలను విత్తినప్పుడు సిఫారసు చేసిన అంతర పంటకు భాస్వరం మరియు పొటాష్ ఎరువులను 15-25% మేర పెంచి వేసుకోవాలి
• నీటి వసతి లేని ఎర్ర చల్క నేలల్లో మొక్కజొన్న సాగు చేయరాదు.
• భాస్వరం, జింక్ సల్ఫేట్ ఎరువులను కలిపి దుక్కిలో వేయరాదు.
• కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా వేయరాదు.
• యూరియాతో కలిపి పురుగు మందులను కలిపి పిచికారి చేయరాదు.
• జింక్ స్ల్ఫేట్ లో పురుగు మందులను కలిపి పిచికారి చేయరాదు.
• మొక్కజొన్న మరియు కందిని అంతర పంటగా వేసినప్పుడు అట్రజిన్ కలుపు మందును వాడరాదు

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate