অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రాగి

నేలలు : తేలిక రకం ఇసుక నేలలు మరియు బరువు నేలల్లో పండించవచ్చు.

రకాలు

సీజన్ స్వల్పకాలిక మధ్యకాలిక
ఖరీఫ్ మారుతి, చంపావతి సప్తగిరి, కళ్యాణి, భారతి, శ్రీ చైతన్య
రబీ మారుతి, చంపావతి సప్తగిరి, కళ్యాణి, భారతి, గోదావరి, వకుళ, హిమ

విత్తేసమయం: ఖరీఫ: జూన్ – ఆగస్టు: రబి: నవంబరు –డిశంబర్ జనవరి – ఫిబ్రవరి.

విత్తన మోతాదు : 2 కిలోలు (నాటే పద్ధతిలో) 3,2 కిలోలు (వెదజల్లే పద్ధతి)

విత్తన శుద్ధి: కార్బండైజిమ్ 2గ్రా/కి లేదా మ్యాంకోజెబ్ 3గ్రా./కిలో నానికి.

విత్తేదూరం: స్వల్పకాలిక రకాలు: 15*10 సెం.మీ.దీర్ఘ కాలిక రకాలు:15-20*15 సెం.మీ.

నాటటం

  • స్వల్పకాలిక రకాలకు (80-90రోజుల): 21 రోజుల వయస్సు కలిగిన మొక్కలు నాటాలి.
  • దీర్ఘకాలిక రకాలకు (105-120రోజుల): 30 రోజుల వయస్సు కలిగిన మొక్కలు నాటాలి.

ఎరువుల యాజమాన్యం

నారు మడికి (5 సెంట్ల నారుమడికి): 64గ్రా. నత్రజని +140గ్రా.భాస్వరం+48గ్రా. పొటాష్ నిచ్చే ఎరువులు.

దుక్కిలో

12కిలోల నత్రజని+12కిలోల భాస్వరం + 8 కిలోల పొటాష్ నాటేటప్పుడు వేయాలి.

కలుపు యాజమాన్యం

  • విత్తనం వేయడానికి మరియు నాటటానికి ముందు పెండ్మిధాలిన్ 30%  ఎకరాకు 600మి.లీ చొప్పున 200 లీ.నీటితో కలిపి పిచికారి చేయాలి.
  • నాటిన 25,30రోజులకు కలుపు మొక్కల నివారణకు 400గ్రా 2,4–డి సోడియం సాల్ట్ 80% పొడి మందు 200లీ. నీటిలో కలిపి  పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం

  • నాటిన పైరు భాగా వేర్లు తొడిగిన తర్వాత 10 రోజుల వరకు వేసవి  నీరు పెట్టరాదు.
  • పూత గింజ పాలు పోసుకునే దశలో పైరు నీటి ఎద్దడికి   గురికాకుండా చూడాలి.

పంట కోత

గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు వెన్నుకువిత్త దగ్గర ఆకులు పండినట్లుగా ఉన్నప్పుడు పంటను కోయాలి.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate