సోయా చిక్కుడు పంట నేలను సారవంతము చేయును. ఈ పంట కోత దశకు చేరిన తరువాత ఆకులను పూర్తిగా రాల్చడం వలన నేలకు సేంద్రియ పదార్ధం అందుతుంది. అలాగే రైజోబియం జపానికమ్ బాక్టీరియా ద్వారా నేలకు నత్రజనిని కూడా ఇస్తుంది. ఈ పైరును పూర్తిగా పంటగా లేదా అంతర పంటగా కూడా సాగు చేయవచ్చును. అన్ని పంటల సరళిలో ఇముడుతుంది. సుమారు 100-110రోజులలో 8-12 క్వి. 3000-4000 వరకు ఉన్నది. ఈ పైరును ఖరీఫ్ లో మరియు విత్తనం కొరకు రబీలో సాగుచేయవచ్చును.
జె.యస్.335: ఈ పంట కాలం 90 నుండి 95 రోజుల్లో పూర్తికావస్తుంది. దిగుబడి గరిష్టంగా 8 నుండి 10 క్వింటాళ్ళుకాయపై నూగు ఉండదు. గింజ మొలక శక్తి ఎక్కువ.కాయలు చుట్లటం తక్కువ. మొవ్వు కుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. | యల్.యస్.బి.3: 110 నుండి 115 రోజులు పంట కాలంఎకరానికి దిగుబడి 6 నుండి 7 క్వి, కాయలపై రాగి రంగుసాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా (పియస్.బి) కలిపినీడలోఆరబెట్టి విత్తుకోవాలి .నూగు ఉందును. కాయలు చిట్లుట తక్కువబాక్టీరియా పొక్కు మరియు మొగ్గ మాడుదలను తట్టుకొనును. |
పి.కె.1029: 100 నుండి 110 రోజుల పంట కాలం. ఒక ఎకరానికి దిగుబడి 7 నుండి 8 క్వింటాళ్ళు. నిటారుగా మధ్యస్థఎత్తుగా పెరుగుతుంది. కాపు వత్తుగా కాస్తుంది. పూతతెల్లుపు రంగు. త్రుప్పు తెగులును తట్టుకోంటుంది. కాయచిట్లుట తక్కువ. | జె.యస్.93-05: 90 రోజుల పంటకాలం. ఒక ఎకరానికి దిగునడి 7 నుండి 8క్వి. ఆకులు పొడవుగా ఉంటాయి.ఎండిన తరువాత కాయలు నల్లగా కనిపించును. కాయలపై నూగు ఉండదు.ఒక్కొక్క కాయలో 3-4 గింజలు ఉందును. |
యం.ఎ.సి.యస్.450: 100 నుండి 110 రోజుల పంట కాలంఒక ఎకరానికి దిగుబడి 8 నుండి 10 క్వి. నిటారుగా మధ్యస్థ ఎత్తుగా పెరుగుతుంది.కాయలపై గోధుమ రంగు నూగు కలిగి ఉంటుంది. | యల్.యన్.బి.18 (భీమ): 105 నుండి 110 రోజులపంటకాలం. ఒక ఎకరానికి దిగుబడి 12క్వి. ఖరీఫ్ పంటకు అనుకూలం. ఆకుమచ్చ, తుప్పు తెగులుకుళ్ళు తెగులు మరియు మొజాయిక్ తట్టుకుంటుంది. కాయ తొలుచు పురుగు నుండి కొంత వరకు మరియు ఆకుచుట్టు పురుగు నుండి పూర్తిగా తట్టుకుంటుంది. |
యల్.యస్.బి.1: ఇది 65 రోజుల పంత కాలం. ఒక ఎకరానికి దిగుబడి 6 క్వి. స్వల్పకాలిక పొట్టి రకం. కాపు గుబురుగా వత్తుగా కాస్తుంది. ప్రత్తి, కంది పైర్లలో అంతర పంటగా అనివైనది. | ఎ.యస్.బి.22(బాసర): 105 నుండి 110 రోజుల పంట కాలం. ఒక ఎకరానికి 12 నుండి 13 క్వి. ఖరీఫ్ కాలానికి అనివైనది. అధిక దిగుబడినిచ్చు రకం. 8-10 రోజుల ఆలస్యంగా నూర్పిడి చేసిన కాయ చిట్లటం జరగదు. |
మధ్యస్థ నేలలు మరియు బరువు నేలలుచాలా అనికూలం. నీటి వసతి ఉన్నచో అన్ని రకాల నేలల్లో పండించవచ్చును. పై రకాలన్నీ రబీ పంటకాలానికి అనివైనవిగా గుర్తించినప్పటికీ తెలంగాణాప్రాంతంలో అధిక చలి కారణంగా సాధారణ దిగుబడులు కంటే తక్కువ దిగుబడులు వచ్చును. విత్తన వృద్ధి మాత్రమే రబీలో చేయుట మంచిది.
ఎకరాకు 25-40 కిలోలు. విత్తన మోతాదుగింజ పరిమాణం మరియు మొలక శాతంపై ఆధారపడి ఉంటుంది.
ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రా. థైరమ్ + 1 గ్రా, కార్బెండిజమ్ మందుతోతరువాత 5మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 30గ్రా, కార్బోసల్ఫాన్ తో విత్తనశుద్ది చేయాలి. లేదా10గ్రా. టైకోడర్మా అనువైనది.ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200గ్రా. రైజోబియం జపా నికం కల్చర్ ను మరియు భాస్వరం.
ఖరీఫ్ : జూన్ 15 నుండి జులై 15 వరకురబీ: సెప్టెంబర్ –అక్టోబర్ , వేసవ్ 15 జనవరి –ఫిబ్రవరి.
నల్లరేగడి భూములలో 45x5 సెం.మీ, తేలిక భూముల్లో 30x7.5 సెం.మీ. చ.మీ.కు 40 మొక్కల చొప్పున ఎకరాకు లక్ష అరవై వేల మొక్కలు ఉండాలి.
ఎకరాకు 12 కిలోల న్త్రజని 24 కిలోల భాస్వరం మరియు 16కి. పొటాష్ చివరి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును సంగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే కూడా లభ్యమవుతుంది. తేలిక పాటి నేలలో 50% నత్రజని 30 రోజుల తరువాత వేయాలి. గింజ ఎదుగుదలకు పూత దశలో 20% యూరియాను 15 రోజులలో రెండు పిచికారి చేసుకోవాలి
విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు ;చొప్పున పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% 1.4 లీ. చొప్పున విత్తిన వేంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.
సోయాచిక్కుడు వర్షాధారపు పంట. నీటి సౌలభ్యం ఉన్నచోట విత్తిన 15-20 రోజులకు ఒకసారి కాయ దశలో మరోసారి నీటి తడులను ఇచ్చి అధిక దిగుబడులనుసాధించవచ్చు
సోయాచిక్కుడు-మొక్కజొన్న-పెసర,సోయాచిక్కుడు- పెసర – మొక్కజొన్న, మొక్కజొన్న - చిక్కుడు-శనగ/ ధనియాలు/గోధుమ/ఆవాలు/మినుముమొదలగు పంటల సరళి శ్రేష్ఠమైనది.
సోయాచిక్కుడు +కంది (7:1) సోయా చిక్కుడు +ప్రత్తి /జొన్న/మొక్కజొన్న(1:1) మరియు పండ్ల తోటలు.
చిత్త పురుగులు, రసం పీల్చు పురుగులు ఆకుల్లోని రసం పీల్చడం వలన ఆకులు పసుపు మరియు గోధుమ రంగులోనికి మారి దిగుబడులుతగ్గుతాయి. తమర పురుగుల ద్వారా మొవ్వుకుళ్ళు ,తెల్ల దోమ ద్వారా మొజాయిక్ తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకు పురుగు మందుతో విత్తన శుద్ధిచేయాలి. పైరు పై ఆశించినప్పుడు ఎసిఫేట్ 1.0గ్రా.లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
![]() |
![]() |
కాండం తొలిచే ఈగ: ఈ పురుగులు లేత ఆకులపై గుంటలు చేసి గుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుండి ;వెలువడిన లార్వాలు కాండంలోనికి చేరి తినడం వలన మొక్కలు వడలి సమూలంగా నాశనమవుతాయి.ఇమిడాక్లోప్రిడ్ మందు 5-7 గ్రా. ఒక కిలో విత్తనానికి శుద్ధి చేయాలి. పైరుపై ఆశించి నప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రాలీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి | ![]() |
ఆకుగూడు పురుగు: ఈ పురుగు ఆకులను కలిపిగూడులా కట్టుకొని దానిలో ఉండి ఆకులలోని పత్రహరితాన్ని గీకి తింటాయి. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. | పెంకు పురుగు : ఈ పురుగు కాండం మీద అర్ధ చంద్రా కారంలోరంధ్రము చేసి లోపలికి పోయి ప్రధాన కాండమును, ప్రక్క కొమ్మల లోపలి పదార్ధమును తినుట వలన కొమ్మల చివర భాగం ఎండిపోతుంది. మోనోక్రోటోఫాస్ 1.6మి,లీ లేదా క్వినాల్ ఫాస్ 2.0మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
పొగాకు లద్దె పురుగు: ఈ పురుగులు ఆకులలోని పచ్చని పదార్ధాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మరు తాయి. ఆకులను పూర్తిగా తింటుంది. పువ్వులను, కాయలను కూడా తింటుంది. నివారణకు పురుగు మొదటిరెండు దశలలో క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వివిధ దశల నివారణకై సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలి. |
మొవ్వుకుళ్ళు తెగులు: తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు. తెగులు సోకిన లేత మొక్కల ఆకులు గిడసబారి పోతాయి. మొక్క మొవ్వు నుండి ఎండిపోతుంది. చేనులో మొక్కలసాంద్రత సరిగా చూసుకోవాలి. తామర పురుగుల నివారణకై విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి.. పైరుపై ఆశించినాప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మి,లీ లేదా డైమిథోయేట్ 2.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. | ఎల్లోమొజాయిక్ తెగులు: తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు, తెగులు సోకిన మొక్కల్ ఆకులుకాయల మీద పసుపు పచ్చ పొడ ఏర్పడి మొక్క పసుపురంగు లోకి మారుతుంది. నివారణకు లీటరు నీటికి 1.0గ్రా ఎసిఫేట్ లేదా ట్రయజోఫాస్ 2.0మి.లీ లేదా ఎసిటమిప్రిడ్ 0.3గ్రా. పిచికారి చేసి తెగులు మినుములో వ్యాప్తి చేసే పురుగులను నివారించవచ్చు. |
ఆకుపచ్చ తెగులు: ఆకులపై గోధుమ రంగు మచ్చలుఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 3గ్రా. మాంకో జెబ్ లేదా 1గ్రా. కార్బెండిజమ్ లేదా 2గ్రా. క్లోరోథలోనిల్ ను కలిపి 10 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి పిచికారి చేయాలి. | ![]() |
బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు:ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు గోధుమ రంగు లోకి మారు తాయి. నివారణకు 10లీటర్ల నీటికి 1.5గ్రా.పౌషామైసిన్+30గ్రా.కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి 2,3 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి .యన్ బి.1యం.ఎ.సి.ఎస్ .58,పి.కె.472 రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి. | సోయాబీన్ మొజాయిక్ వైరస్ తెగులు : విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ పేనుబంక పురుగు ద్వారా ఒక మొక్కనుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది.తెగులు సోకిన మొక్కలలో కాయలు సరిగా ఏర్పడవుకాయలు ఏర్పడిన విత్తనాలు చిన్నవిగా ఉండి మొల కెత్తే శక్తిని కోల్పోతాయి. నివారణకు లీటరు నీటికి2.0మి.లీ లేదా డైమిథోయేట్ పిచికారి చేయాలి. |
కుంకుమ తెగులు : ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్ర దశలో త్రుప్పు రంగు పొడ నాశిని ఏర్పడుతుంది. నివారణకు లీటరు నీటికి 2.0మి.లీ హెక్సాకొనజోల్ లేదా 1.0మి.లీ ప్రొపికొనజోల్ వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు పిచికారి చేయవలెను. | ![]() |
మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, సోయా చిక్కుడు పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/26/2020