హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక / వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువలు సమకూర్చే సాంకేతిక పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువలు సమకూర్చే సాంకేతిక పద్ధతులు

వ్యవసాయ ఉత్పత్తులకు అదనపువిలువలు సమకూర్చే సాంకేతికత

ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు వంటి వ్యవసాయ మరియు పుట్ట గొడుగులు వంటి వ్యవసాయేతర అనుబంద ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చేసాంకేతిక విధానాల వలన ముఖ్యంగా గ్రామీణ మహిళలు అనుబంధ పరిశ్రమలుగా ఏర్పరచుకొని ఆహార భద్రత మరియు ఆదాయము పెంపొందించుకోవచ్చు.

ఇందులో భాగంగా వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటిగా ఎన్నోరకాల అదనపు విలువలు చేకూర్చే సాంకేతిక విధానాలపైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయములో పరిశోధనలు చేసారు.

వరద ముంపుకు గురైన వరి ధాన్యం

 • వరదముంపుకు గురైన వరిధాన్యం రంగు, రుచి, వాసనల మార్పుల వల్ల రైతుకు నష్టం కలిగిస్తున్నాయి. అలాంటి వరి ధాన్యంతో అదనపు విలువలు ఉన్న సేమియా, రైస్ మిల్క్ ఎక్స్ ట్రూడెడ్ స్నాక్ మొదలైన ఎన్నోరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు.
 • కావలసిన యంత్రములు - గొట్టములు తయారు చేయు యంత్రము (ఎక్స్ ట్రూడెడ్ మిషన్)
 • పంపిణీ చేయువారు -బేసిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ , కలకత్తా.
 • ఖరీదు - రూ. 20,000/- (ఇరవై లక్షల రూపాయలు మాత్రమే)

చిరుధాన్యాలతో విలువనాపాదించే ఉత్పత్తులు

 • చిరుధాన్యాలు శరీరానికి అవసరమయిన ముఖ్యమైన ఖనిజ లవణాలు, పీచుపదార్ధము మరియు పోషకే తర పదర్ధాలు కలిగివున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్న పోషక లోపాల్ని ఈపదార్ధాలను తీసుకోవడం వల్ల నివారించవచ్చును. చిరుధాన్యాలతో అనేక ఆహార ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. జొన్నలు, కొర్రలు మరియు సజ్జల నుండి పొట్టుతీసిన పిండీ, రవ్వను తయారు చేసుకోవడం వలన ఎన్నో విలువైన ఆహారపదార్ధాల తయారీకి అనువుగా ఉంటుంది.
 • కావలసిన యంత్రములు – పొట్టు తీసే యంత్రము
 • పంపిణీ చేయువారు – మెధెసిన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ , హైదరాబాదు.
 • ఖరీదు – రూ.1,50,000/- (లక్ష యాబై వేలు రూపాయలు మాత్రమే)

రాగి మాల్ట్

 • రాగులలో చాలా విలువైన ఖనిజ లవణాలు అయిన కాల్షియం మరియు ఐరన్ ఉన్నాయి. రాగి మాల్ట్ అన్ని వయసుల వారికి ఇవ్వదగిన ఆహారము. ఇది తయారు చేయడానికి ఇంట్లో ఉండే పెద్ద గిన్నెలు సరిపోతాయి అదనంగా ఒక చిన్న పిండిమిల్లు ఉంటే సరిపోతుంది. దీని ఖరీదు 50,000 రూపాయలు ఉంటుంది.

చిరుధాన్యాలతో అల్పాహారాలు

 • సాధారణంగా బియ్యంతోచేసే అన్నిరకాల అర్పాహారా లైన మురకులు, చెక్కలు మరియు నమక్కపర లాంటివి కూడా పొట్టు తీసిన జొన్నలు, సజ్జలు, కొర్రలు మరియు రాగులతోను తయారు చేసుకో వచ్చును. దీనికి అదనంగా ఎలాంటి వస్తువులు అవసరం లేదు. ఇంటి దగ్గర సాధారణంగా వాడుకొనే గిన్నెలు, మురుకుల చట్రం మరియు మూకుడు లాంటివి సరిపోతాయి.

జొన్నలతో అటుకులు (ఫ్లేక్స్)

 • అధే విధంగా జొన్నలతో, బియ్యం మాదిరిగానే అటుకులు చేసుకోవచ్చును.
 • కావలసిన యంత్రములు- అటుకులు తయారు చేయు యంత్రము
 • పంపిణీ చేయువారు – మెధెసిన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటేడ్ , హైదరాబాదు.
 • ఖరీదు – రూ.1,50,000/- (లక్ష యాబై వేలు మాత్రమే)

పప్పుదినుసులు

 • పెసలు,శనగలు, గుగ్గిళ్ళు మొదలగు ప్పుదినుసు లను మొలకెత్తించిమాల్ట్ మిశ్రమాలతో కలిపి అను బంధాహార పదార్ధాలు తయారు చేసుకోవచ్చు.
 • సోయ గింజలతో పాలు, పన్నీరు, లడ్డు మొదలగు విలువ ఆధారిత పదార్ధాలను తయారు చేసుకోవచ్చు.

పండ్లు కూరగాయలు

 • వివిధ కాలాల్లో వివిధ పండ్లు, కూరగాయలు విరివిగా చౌకగా లభిస్తాయి. ఒక్కొక్క సీజనులో అసలు లభ్యంకావు కావున వాటిని సీజనులో నిల్వ ఉంచుకొన్నచో అన్ని కాలాల్లో వాడుకోవచ్చు.
 • బొప్పాయి,టొమాటాలు, చింతపండు, జామ, మామిడి, ఉసిరి నిమ్మవంటి వివిధ పండ్లతో సజ్జ, తాండ్ర, శీతల పానీయాలు, నెక్టరు, వరుగులు, మురబ్బాలు, పొడులు టాఫీలు, సూఫ్ మిక్స్ లు తయారు చెసుకోవచ్చు.
 • పండ్లు కూరగాయలను నిర్జలీకరణ ప్రక్రియ ద్వారా మరియు ఎండబెట్టడం ద్వారా కూడ నిల్వ చేసుకోవచ్చు.
 • కావలసిన యంత్రములు – గుజ్జు తయారు చేయు యంత్రము, మందపాటి గిన్నె
 • పంపిణీ చేయు వారు – గురునానక్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటేడ్ హైదరాబాదు.
 • ఖరీదు (రెంటికి) – రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయలు మాత్రమే)

పుట్టగొడుగులు

 • పుట్టగొడుగులతో పొడి, ఊరగాయ, సూఫ్ , వరుగులు మొదలగు విలువ ఆధారిత పదార్ధాలను తయారు చేసుకొనవచ్చును.
 • ఇంతేకాక వివిధ ప్రాంతాలలో దొరికే తక్కువ వాడకం ఉండే ఎక్కువ పోషకాలు కలిగి ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో రకాలు గుమ్మడి, తామర కాడలు, గార్డెన్ క్రెస్ గింజలు, వివిధ రకాలు ఆకుకూరలు మరియు అశ్వగంధ, అలోవీర, బ్రింగరాజా వంటి ఔషద గుణాలున్న ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను పెంపొందించు కొనవచ్చును.

ముఖ్య సూచన

 • ఆహార పదార్ధాలను తయారు చేయడంతో పాటు వాటికి సరైన ప్యాకింగ్ చేసుకోవడము, ప్యాకింగ్ పైన వాటిలో వాడిన పదర్ధాలు, వాటిలోని ముఖ్యమైన పోషకాలు, అవి తయారు చేసిన ఖరీదు తదితర వివరాలు తెలిపినచో వ్యవసాయ ఉత్పత్తులకు ఇంకా విలువలు పెంపొందించుకోవచ్చు.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రొఫెసర్ మరియు హెడ్ , ఆహారము పోషణ విభాగము మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసర్చు సెంటర్ , రాజేంద్రనగర్ , హైదరాబాద. ఫోన్ నెం. 9949500753

3.01789264414
వెంకటేష్ Sep 09, 2016 10:02 PM

మినుములు పొట్టు తీసిన mission గురించి వివరంగా
రాయండి
99*****19

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు