অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయంలో సమర్ధ సాగునీటి యాజమాన్యం

వ్యవసాయంలో సమర్ధ సాగునీటి యాజమాన్యం

ఉపోద్ఘాతం

రాష్ట్రం సాహయ్యే భూమిలో (4.0 మి.హె ) సుమారు 60% వ్యవసాయం వర్షాధారంగా జరుగుతుంది. కేవలం 1.6 మి.హె సాగు భూమికి మాత్రమే సాగునీటి వసతి బావులు,కాలువలు మరియు చెరువుల ద్వారా కల్పించబడినది.రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు (జూన్ – సెప్టెంబర్ )వలన సంవత్సరానికి సగటున 850 మి.మీ వరకు వర్షా పాతం నమోదు ఆవుతుంది. సాగునీటి వాడకంపై సరై న అవగాహాన లేకపోవడం వల్ల, నీరు అవసరానికి మించివాడినందువల్ల లాభమేమి లేకపోగా, అత్యంత విలువైన నీటిని మరియు పోషకాలను వృధాచేయడమేకాకమంచి భూములు క్రమంగా చౌడు భూములుగా మారుతాయి.

ఉద్ధేశ్యం

 • పాఠకులకు రాష్ట్రంలోని జలవనరుల స్థితిగతులపై అవగాహన కల్పించుట.
 • సమగ్ర నీటి యాజమాన్యం పై ప్రాధమిక అవగాహన కల్పించుట.
 • నూతన సాగునీటి పద్ధతులు –బిందు మరియు తుంపర నీటి యాజమాన్యంపై అవగాహన.
 • బిందు సాగులో ఎరువులు వాడకం మరియు సాగు నీటి నాణ్యత ప్రమాణాలు.

పంటల నీటి అవసరాలు

ముఖ్యంగా నేల స్వభావం పైరు గుణగణాలు వాతావరణ పరిస్థితులపై ఆధరపడి ఉంటుంది.ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఎక్కువగా సాంప్రదాయ నీటిపారుదల పధ్ధతులనే అవలబిస్తున్నారు.

 1. పాదుల పద్ధతి.
 2. పొడవైన మళ్ళ పద్ధతి
 3. మడుల కట్టి నీరు పారించే పద్ధతి.
 4. బోదెలు కాలువలు పద్ధతి.

నీటి ఆదా పద్ధతులు

కాలువ విడిచికాలువ నీటి తడుల పద్ధతి.జీవ తడుల (పైరు తీవ్రమైన బెట్టకు గురియినప్పుడు పైరును బ్రతికించుకొనుటకు నీరు పారించుట)సాంప్రదాయ నీటి పారుదల పద్ధతులలో మొత్తం పెట్టిన నీటిలో 35-40 శాతం నీటిని మాత్రమేపంట ఉపయోగించుకొని, 33 శాతం మేరకు మాత్రమే భూమిని సమాంతరంగా తడుపుతుంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానముగల ఈ క్రింద తెలిపిన నీటి పారుదల పద్ధతుల

 1. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్)
 2. తుంపర్ల సేద్యం(స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్)

బిందు సేద్యపద్ధతి (మైక్రో ఇరిగృషన్ సిస్టమ్లో నీటిని ప్లాస్తిక్ గొట్టాలు మరియు ఇతర పరికరాలతో బిందువుల రూపంలో అన్ని చెట్లకు సమానంగా మొక్క యొక్క వేరు భాగానికి కావలసినంత అందించడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా భూమిలో ఎప్పుడూ తేమ ఉండేటట్లు చేయడం జరుగుతుంది.వివిధ నీటి పారుదల పద్ధతులలో పారుదల సామర్ధ్యం ఈ విధంగా ఉంటుంది.

బిందు పద్ధతి 90%
తుంపర్ల పద్ధతి 80%
ఉపరితల నిటిపారుదల 50%

బిందు సేద్యపద్ధతిలో వేసే పంట రకమును బట్టి ఐదు పద్ధతులున్నాయి.

ఆన్ లైన్ డ్రిప్పు సిస్టమ్

ఈ పద్ధతిలో నీరు బొట్టు రూపంలో మొక్క వేర్లకుచేరుతుంది. ఈ పద్ధతిని ఎక్కువగా మొక్కల మధ్యదూరం ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి మామిడి,బత్తాయి,నిమ్మ, దాక్ష, కొబ్బరి మరియు అరటి తోటలకు వినియోగించడం జరుగుతుంది.

ఇన్ లైన్ డ్రిప్పు సిస్టమ్

ఈ పద్ధతిలో డ్రిప్పర్లు లేదా ఎమిటర్ లు లేటర్ల్ లైనులోపల మిషన్ మీదనే సమాన దూరంలో అమర్చుతారు. మొక్కల మధ్య దూరంను బట్టి ఎమిటర్లు అమర్చినలేటరల్ లైనును ఎన్నిక చేసుకోవాలి. ఎమిటర్ల మధ్యదూరంను 30 సెం.మీ. 40 సెం.మీ. 50 సెం.మీ., 60సెం.మీ, 75 సెం.మీ. 100 సెం.మీ. మరియు 120 సెం.మీ.అమర్చిన లేటర్ల్ లైనులు మనకు మార్కెట్ లోలభ్యమవుతున్నాయి. ఈ పద్ధతి ముఖ్యంగా చెఱకు,ప్రత్తి కూరగాయలు మరియు పూల తోటలకు ఉపయోగించడం జరుగుతుంది.

మైక్రో జెట్ ఇగిగేషన్ సిస్టమ

ఈ పద్ధతిలో నీటిని స్ప్రే రూపంలో భూమినుండి50 సెం.మీ. ఎత్తు మించకుండా వృత్తాకారంగా లేతరల్లైన్ అమర్చిన జెట్స్ ద్వారా మొక్కకు అందించడంజరుగుతుంది.

ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో మరియు ఎక్కువ నీరు ఇంకిపోయే భూములలో ఎత్తు పంటలైననటువంటి మామిడి, కొబ్బరి, నిమ్మ, పామాయిల్ తోటలకు, గ్రీన్ హాస్ మరియు షెడ్ నెట్లలో వేసే నర్సరీలకుపూల మొక్కలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.

మిని మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్

ఈ పద్దతి కూడా మైక్రో జెట్ ఇరిగేషన్ పద్ధతిమాదిరిదే. కాని ఈ పద్దతిలో లేటరల్స్ పైన అమర్చినమైక్రో స్ప్రింక్లర్ కు అటు ఇటు తిరిగే పరికరము అమర్చబడి ఉంటుంది.

మిస్ట్ ఇరిగేషన్ సిస్టమ్

పద్దతిలో లెటరల్ పైన మిస్ట్ (పొగ రూపంలోవెదజల్లేది ) అనే పరికరాన్నిఅమర్చుతారు. ఈ పద్ధతిలో గా హరిత గృహలు (గ్రీన్ హౌస్ ) లోపల హరిత గృహలు పొగ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ పద్ధతిని ఎక్కువ (గ్రీన్ హౌస్ ) లోపల ఎల్లపుడు తేమ ఉండతానికి వాడుతారు ఈ బిం దు సేద్య పద్ధతిలో నీటిని మొక్క వేరువరకు చేరవేయదానికి ఈ క్రింది పటంలో చూపబడిన పరికరాలు తప్పకుండా ఉండాలి.

బిందు సేద్యం రూపకల్పన చేస్తున్నపుడు పంటకు ఎంత నీరు అవసరము మరియు ఎంతనీరు బిందు పద్దతి ద్వారా పంపిస్తున్నామో తప్పకుండా తెలుసు కోవాలి.పంటకు కావలసిన నీటి పరిమాణం ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆధార పడుతుంది.1. పంట రకము 2. మొక్కల భాష్పోత్సేకము3. పొలము విస్తీర్ణం 4. నీరు కట్టే ఋతువు.

భాష్పోత్సేకము మరియు నీరు ఆవిరిగామారడం ఎండా కాలంలో ఎక్కువగా వుంటుంది. అందువలన బిందు పద్ధతిని ఎండాకాలంలో పంటకు అత్యధిక నీటి అవసరం, సరిపడనీరు అందించే విధంగా రూపొం దించాలి.

బిందు సేధ్యపద్దతి లో ఎరువులు వాడకం

 • నీటితో పాటు రసాయనిక ఎరువుల్ని నిర్ణీతమోతాదు లో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించవచ్చు. ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయలు, పూలు, వాణిజ్య పంటలైనటువంటి ప్రత్తి, చెఱకు, మిరప మరియు ఔషద మొక్కలను తక్కువ నీటితో డ్రిప్  ఈ పద్దతిని లాభసాటిగా పండించవచ్చు. నీటిని పారించ డంలోనే కాకుండా ఎరువులను వేయడంలో కూడా నీరు విప్లవాత్మకమైన మార్పును తెచ్చినప్పుడే డ్రిప్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందే అవకాశం వుంది.
 • ద్రవ రూపంలో ఎరువుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్ లే కాకుండా సూక్ష్మ పోషక పదార్ధాలను కూడ అందించ వచ్చును.
 • ఫర్టిగేషన్ పద్దతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. లేకుంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్ప్రు రంధ్రాలకు అడ్డుపడి మూసివేస్తాయి.
 • ఫర్టిగేషన్ పద్దతిలో పొడి రూపంలో లేదా ద్రవ రూపం లో ఉన్న ఎరువులను వాడుకొనవచ్చు. అయితే ఎరు వులకు నీటితో కలిసిన తక్షణం కరిగి పోయే స్వభావం ఉండాలి. మంచి నాణ్యత మరియు దిగుబడులను సాధించటానికి క్లోరైడ్ లు లేనటువంటి ఎరువులను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

ఫర్టిగేషన్ పద్ధతి యాజమాన్యంలో కీలకమైన అంశాలు

 • ఫర్టిగేషన్  ద్వారా పంటల యాజమాన్యంలో వివిధ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని, వాటికి అనుగుణం గా పోషకాలను ఏ దశలో ఎంత మోతాదులో విడుదల చేయాలి అనే అంశాలను నిర్ణయించటం జరుగుతుంది ఫర్టిగేషన్ ను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు:
 • ఫర్టిగేషన్ ద్వారా పంట (రకం, పంట ఎదుగుదల దశ ) నిర్ణీత విస్తీర్ణంలో మొక్కల సాంద్రత, పంట పోషకాలను తీసుకొనే విధానం, లక్ష్యంగా పెట్టుకున్న దిగుబడులు)
 • సాగు విధానం (సాధారణ సాగు, గ్రీన్ హౌస్ లో సాగు, మట్టి లేకుండా ఇతర మాధ్యమాలలో సాగు)
 • భూభౌతిక మరియు రసాయనిక లక్షణాలు (నేల స్వభావం లవణ పరిమాణ సూచిక (సి.ఇ.సి) ఉదజని సూచిక, బంకశాతం, సేంద్రియ కర్బనం, భూసారం)       

వాతావరణ పరిస్థితులు

 • సాగినీటి నాణ్యత (ఉదజని సూచిక, ఇసి) పైన సూచించిన విధంగా ఫర్టిగేషన్ యాజ మాన్యం వివిధ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఫర్టిగేషన్ ద్వారా పంటలకు పోషకాలను అందించే ప్రణాళికలను తయారు చేసేటప్పుడు క్రింద సూచించిన సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
 • మధ్యస్థం నుండి లోతైన రేగడి భూముల్లో ఫర్టిలైజర్ ట్యాంకు పరికరాన్ని వాడుకోవాలి. అలాగే తేలికపాటి భూముల్లో ఫర్టిలైజర్ ఇంజెక్టరు వాడుకోవాలి.
 • ప్రతి రోజు ఫర్టిగేషన్ ద్వారా పోషకాలను అందించటం అత్యంత శ్రేయస్కరం వీలుకాక పోతే, వారానికి రెండు సార్లన్నా ఫర్టిగేషన్ చేసుకోవాలి.
 • పంట యొక్క పోషకాల అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొనే ఎరువు పోషకాలను అందించటమే కాకుండా అవసర మైతే నీటి ఉదజని సూచికను కూడా సవరించేదిగా ఉండాలి.
 • ఎంపిక చేసే రసాయనిక ఎరువు, సాగునీటి నాణ్యత కు అనువుగా ఉండాలి. (లేకుంటే అవక్షేపాలు ఏర్పడి డ్రిప్పర్లు మూసుకుపోతాయి.)
 • సాగునీటిలో ఎక్కువ మోతాదు కాల్షియం, మెగ్నీ షియం, సల్ఫేట్లు, ఇనుము లేదా మాంగనీసు గనక ఉంటే అవి ఎరువులతో చర్య జరిపి ఎరువుల సామ ర్ధ్యాన్ని తగ్గిస్తాయని రైతులు గుర్తించుకోవాలి.
 • సాధారణంగా దొరికే యూరియా,తెల్లరకం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు నీటిలో కరిగేకాంప్లెక్స్ఎరువు లతో కలపడం వల్ల పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ల అవసరాలను తీర్చుకోవచ్చు.
 • ఒకే ట్యాంకులో కలిపిన వివిధ రసాయనిక ఎరు వులు ఒక దానితో మరికటి తేలికగా కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఫాస్ఫేటు లేదా ఇనుము ధాతువును భాస్వరపు ఎరువుతో, భాస్వరపు ఎరువులను ఇనుము మరియు మెగ్నీ షియంతో, సూక్ష్మపోషకాలను పూర్తి పంట కాలంలో అందించే విధంగా రోజూవారి మోతాదును లెక్కగట్టుకోవాలి.
 • పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంట కాలంలో అందించే విధంగా రోజువారి మోతా దునులెక్కగట్టుకోవాలి.
 • ద్రవ లేదా పొడి రూపంలో ఉండే రసాయనిక ఎరువు లనుట్యాంకులో కెలిపేటప్పుడు ట్యాంకులో 50-75 శాతం నీళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి.
 • ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించాలి. దీని వల్ల పొలం అంతటా సమా నమైన ఒత్తిడితో నీరు విడుదల అవుతుంది.
 • డ్రిప్ సిస్టంమ్ ను కొద్దిసేపు నడిపి, నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిగేషన్ ను ప్రారంభించాలి. దీని వల్ల సిస్టంలో దూరంగా ఉన్న డ్రిపర్లు కూడా సమాన పీడనం నీటిని, పోషకాలను మొక్కలకు అందివ్వ గలుగుతాయి.
 • ఫర్టిగేషన్ తరువాత నెర్ణీత వ్యవధిలో డ్రిప్ వ్యవస్థను కొద్ది సేపు నడిపించాలి. దీని వల్ల పైపులలో మరియు డ్రిప్పర్ల లో మిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగి వేయబడ తాయి. నిర్ణీత వ్యవధికన్నా మరీ ఎక్కువ సేపు గనుక నీటిని పంపితే మొక్కల వేర్ల దగ్గరలో ఉన్న పోష్కాలు లీచింగు ద్వారా భూమిలోపలి పొరల్లోకి ఇంకిపోతాయి,
 • ఫర్టిగేషన్ కార్యక్రమాన్ని సాఫీగా కొనసాగించడానికి మరియు మొక్కలను ఎప్పటికప్పుడు అవసరమైన పోషకాలను అందించదానికి మొక్క కణజాలము మరి యునేల, సారునీరు, మురుగు నీటిలో పోషకాల స్థాయిని నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా విశ్లేషించి సవరించుకోవాలి.

ద్రవ రూపంలో ఉన్న ఎరువులను బిందు సేద్య వ్యవస్థ ద్వారా కలిపే పద్ధతి.

ఈ పద్ధతిలో డ్రిప్పర్ల ద్వారా నీటితో పాటు ఎరువులు కూడ మొక్కల వేరు భాగంలో పడి మొక్కలకు అందుబాటులో ఉంటాయి. వీటిని డ్రిప్ నీటిలో కలిపేందుకుమూడు రకాల పరికరాలు ఉన్నాయి.1. వెంచురీ 2. ఫెర్టిలైజర్ పంపు 3. ఫెర్టిలైజర్ ట్యాంక్

వెంచురీ

వెంచురీ ఉన్నప్పుడు. సిస్టమ్ ను శుభ్రపరిచేందుకే కాకుండా డ్రిప్ తో పారే నీటిలో కలిపేందుకుకూడా ఉపయోదించ వచ్చును.

ఫర్టిలైజర్ (బూస్టర్ పంపు) పంపు

ఒక ట్యాంకులో అవసరమైన ఎరువులను వేసి ట్యాంకుకు ఒక బూస్టరుపంపు బిగించి, పంపు యొక్క అవుట్ లెట్ ను స్క్రిన్ఫిల్టరుకు ముందుగాని, శాండ్ ఫిల్టరుకు ముందుగాని అమర్చాలి. ఈ పద్ధతిలో కూడా ద్రవ ఎరువులుఒకే విధంగా, సమానంగా మొక్కలకు లభ్యమవుతాయి.

ఫర్టిలైజర్ ట్యాంకు

ద్రవ ఎరువును ఒక ట్యాంకులో వేసి ట్యాంకు ఇన్లెట్ ను మైయిన్ లైను అవుట్ లెట్ కు కలపాలి.మైయిన్ లైను ఇన్ లెట్ మరియు అవుట్ లెట్ కుమధ్య కంట్రోల్ వాల్వును వెంచురీలో అమర్చినట్టుఅమర్చాలి. వాల్వును కంట్రోల్ చేయడం వల్ల మెయిన్ ఇన్ లెట్ నుండి నీరు ద్రవ ఎరువులోకలిసి ట్యాంకు అవుట్ లేట్ ద్వారా డ్రిప్పు సిస్టంలోకి ప్రవేశించి డ్రిప్పర్ల ద్వారా మొక్కల వేళ్ళకు అందు బాటులోనికి వస్తుంది.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate