పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమగ్ర వ్యవసాయం

శాస్త్రీయపద్దతిలో వ్యవసాయవిధానాలవల్ల ఆదాయం

తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల హెక్టార్ల భూమిని వివిధ పరిస్థితుల్లో సాగు చేసున్నాము. మొత్తం 55.44 లక్షల. కుటుంబ కమతాలుంటే, అందులో85% రైతులుచిన్న,సన్నకారు రైతులే. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపసువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం చేపడుతూ ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాకుండా పశువుల పేడను పొలంలో వేయడం ద్వారాభూసారాన్ని కూడా కాపాడారు. క్రమంగా వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. కొంత మంది రైతులు ఒకే ఒక వాణిజ్య పంట సాగుచేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు, కాబట్టి వ్యవసాయాన్ని అతి శాస్త్రీయబద్ధంగా చేపడుతూ, క్షేత్ర వనరులను సమర్థవంతంగా వినియోగించు కోవడం అత్యావశ్యకం.రాష్ట్రంలో వివిధ సాగు పరిస్థితులల్లో వ్యవసాయం చేపడుతున్నాం. ఆయా పరిస్థితులు, వనరుల లభ్యతనుబట్టి శాస్త్రీయ పద్ధతులలో సమగ్గ్ర వ్యవసాయం చేపట్టిఖచ్ఛితమైన దిగుబడులు, ఆదాయం పొందే మార్గాలను విశ్లేషిద్దాం.

వర్షాధార తేలిక భూములు

కేవలం నైరుతి ఋతుపవనాలే ఈ పరిస్తితుల్లో చేసే వ్యవసాయానికి ఆధారంరైతులు కేవలం ఖఈఫ్ సీజన్ లో జొన్న,మొక్కజొన్నఆముదం, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, ప్రత్తి, కంది, పెసర, సజ్జ, పంటలను సాగుచేస్తున్నారు. సగటుభూమి 2-3 ఎకరాలు, అందులో ఇంటికవసరమైనచిరు ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలనుసాగుచేసి, ఈ పంటల ద్వారా వచ్చిన చొప్ప, పొళ్ళుతోపాడి పసువులను పెంచి సద్వినియోగం చేసుకోవచ్చు సన్నకారు రైతులకు సగటున 10 టన్నుల జొన్న,చొప్ప,1 టన్ను కంది పొట్టు, 4 టన్నుల వేరుశనగమొదళ్ళు, 4 టన్నుల రాగి మొదళ్ళు, 3 టన్నులఆముదం కుదుళ్ళు ఉత్పత్తి అవుతాయి. అదనంగాపొలం గట్లపైన సూబాబుల్ , తుమ్మ,సెస్బేనియా,గ్లైరెసీడియం లాంటి బహువార్షికాలను కూడా పెంచుకొని పచ్చి మేతను పొందవచ్చు. అదేవిధంగా మెట్ట ప్రాంతంలో ఫలాలనిచ్చే రేగు, సీతాఫలం,నేరేడు మొక్కలు కూడ గట్లపైన వేసుకోవచ్చు.

పంట/అనుబంధ రంగం

విస్తీర్ణం/సంఖ్య

మొత్తం ఆదాయం (రూ)

నికర ఆదాయం (రూ)

జొన్న+కందులు

ఒక ఎకరా

20,000

10,000

వేరుశనగ

ఒక ఎకరా

20,000

10,000

రాగులు

అర ఎకరా

6,000

3,000

ఆముదం

అర ఎకరా

10,000

5,000

పాడి పశువులు(మేలైన జాతి ముర్ర)

ఒక ఎకరా

2

70,000

10,000

మేకలు (లోకల్ )

4 (ఆడ) +1 (మగ)

32,000

16,000

పెరటికోళ్ళు(వనరాజా/గిరిరాజా/గ్రామ ప్రియ)

500 ప్రతి బ్యాచుకు

(7 బ్యాచ్ లు)

1,00,000

35,000

 

మొత్తం

2,67,500

97,000

పట్టిక 1: సమగ్ర వ్యవసాయం ద్వారా పర్షాధార తేలిక నేలల్లో ప్రతి మూడు ఎకరాలకు ఆదాయ వ్యయాలు.

పశువులకు మేతగా ఉపయోగపడని పంటల కుదుళ్ళను, కాల్చివేయకుండా కంపోస్టుగా లేదా వర్మీకంపోస్ట్ గా తయారు చేసుకొని పంటలకు వేసుకొన్న ట్లైతే భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు.పట్టిక (1) లో ఇచ్చిన విధంగా సమగ్ర వ్యవసాయం చేపట్టి రైతులు మూడు ఎకరాల సాగు భూమి నుండిసంవత్సరానికి సుమారు లక్ష రూపాయల నికర ఆదాయాన్ని పొందవచ్చు. ఈ ఆదాయానికి అదనంగా పశువుల పేడ, ఆముదం కుదుళ్ళ నుండి 13-14 టన్నులసేంద్రీయ ఎరువులను పొందవచ్చు. ఇది 3 ఎకరలకుసరిపోతుంది. ఈ రకంగా భూసారాన్ని కాపాడుకుంటూకుటుంబ ఆహార మరియ్ పోషక భద్రతను సాధించి,ఆదాయాన్ని క్రమ బద్ధంగా సంవత్సరం పొడవునాపొందడమే కాకుంద అననుకూల వాతావరణ పరిస్థితులలో కూడా అనుకున్న ఆదాయం పొందుతూవ్యవసాయాన్నిలాభసాటిగా చేపట్ట వచ్చును.

వర్షధార నల్లరేగడి నేలలు

ఈ పరిస్థితులల్లో రైతులు ప్రతి, మొక్కజొన్న, కంది, పెసర-జొన్న, పెసర-శనగలలాంటి పంటలు విత్తుకుంటారు,. మేకలు పశువులపచ్చిమేత కోసం గట్లపైన సుబాబుల్ , తుమ్మ, గ్లైరిసీడియ మరియు సెస్బేనియా లాంటి బజువార్షికాలుకూడ గట్లపైన వేసుకోవాలి. రేగు, సీతాఫలం, నేరేడు,ఉసిరిలాంటి ఫల వృక్షాలు కూడా గట్ల పైన వేసుకోవాలి.మొక్కజొన్న. జొన్నచొప్పను, కందిపొట్టును, శనగపొట్టును జాగ్రత్తగా నిల్వ చేసుకొని 3 పశువులకు సమర్థవంతంగా మేపవచ్చు. గట్లపైన బహువార్షికాలు మేకలకు సరిపోతాయి. ఈ విధానంలో కూడ రైతు 3ఎకరాలకుకావాల్సిన 15 టన్నుల సేంద్రీయ ఎరువును పొలంలో ప్రతి సంవత్సరం వేయడం ద్వారా ఎల్లప్పుడు నేల సారాన్ని కాపాడుకోవచ్చు. పట్టిక (2) లో చూపించిన విధంగా ఖచ్చితమైన ఆదాయంతో ఒడిదుడుకులు లేని జీవితాన్ని గడప వచ్చు.

బోరు బావుల క్రింద సాగు

నీటివసతి ఉన్నప్పుడు,తేలిక నేలల్లోను, నల్లరేగడి నేలల్లోను ప్రణాళిక బద్ధంగాఖరీఫ్ – రబీలో పంటలు-ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఖచ్ఛితమైన ఆదాయాన్నిపొందొచ్చు.

మేకల కోసం పొలం గట్లపైన సుబాబుల్ , సెస్బేనియా,గ్లైరెసీడియం, తుమ్మ మొక్కలను నాటుకోవాలి. అలాగే గట్ల పొడవున కారోండ మొక్కలు నాటుకున్నట్లయితే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ తరహా వ్యవసాయంలో పరిస్థితులు రైతుకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరం పొడవునా పని పొందడమే కాకుండాఅదనంగా 400పని దినాలను ఇతరులకు కల్పించవచ్చు. ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు, పశువులకు, మేకలకు, కుందేళ్ళకు, కోళ్ళకు మేతసమృద్ధిగాలభిస్తుంది. ప్రతి సంవత్సరం 15 టన్నుల సేంద్రీయ ఎరువు ఉత్పత్తి అవుతుంది. కనుక దీర్ఘకాలి కంగా నేల సారవంతంగా ఉంటుంది. పసువుల పేడ తోగోబర్ గ్యాస్ ప్లాంట్ నెలకొల్పి, గృహ అవసరాలకు కావాల్సిన ఇందనాన్ని, విద్యుతును తయారు చేసుకోవచ్చు.ఇందుకు గాను NEDCAP ద్వారా సబ్సిడీ కూడా పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సోలార్ పంపుసెట్ల ను కూడా సబ్సిడీ ద్వారా ఏర్పాటు చేసుకొని విద్యుత్ సమస్యను అధిగమించి ఖచ్చితమైన దిగుబడులను పొందవచ్చు. రైతులు వర్మీకంపోస్ట్ , వర్మీవాష్మరియు పంచమృతము వంటివి సొంతంగా తయారుచేసుకొని వాడుకోవచ్చు. అన్ని అనుబంధ రంగాలనుఅనుసంధానం చేసి సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే స్థిరమైన రాబడిని పొందుతూ పది మందికి పనినికల్సిస్తూ, పర్యావరణాన్ని, తద్వారా మానవాళి మనుగడను కాపాడుతూ రైతు ఆర్ధికాభివృద్ధి సాధించవచ్చు.(పట్టిక 3).

పంట/అనుబంధ రంగం

విస్తీర్ణం/సంఖ్య

మొత్తం ఆదాయం (రూ)

నికర ఆదాయం (రూ)

పెసర+కంది

అర ఎకరా

10,000

5,000

రాగి-వేరుశనగ

అర ఎకరా

30,000

15,000

వరి-మొక్కజొన్న

అర ఎకరా

70,000

35,000

పశుగ్రాసాలు

(ఎపిబిఎన్–1)

అర ఎకరా

--

--

లూసర్న్ గడ్డి

అర ఎకరా

కుందేళ్ళ మేత

 

జామతోట

అర ఎకరా

18,000

10,000

పాడి పశువులు (స్వచ్ఛమైన జాతి ముర్ర)

3

2,58,000

50,000

మేకలు (లోకల్ )

4(ఆడ)+1 (మగ)

32,000

16,000

పెరటికోళ్ళు(వనరాజా/గిరిరాజా

/గ్రామ ప్రియ)

50

15,000

11,000

కౌజు పిట్టలు

500 (7 బ్యాచ్ లు)

1,00,000

35,000

కుందేళ్ళు

10 (ఆడ) + 2 (మగ)

1,20,000

50,000

 

మొత్తం

6,53,000

2,27,000

ఆయకట్టు ప్రాంతం

ప్రాజెక్టులు, చెఱువుల క్రింద రైతులంతా ఎక్కువగా వరి సాగుచేస్తున్నారు.అక్కడక్కడలో తట్టు ప్రాంతాల్లో మురుగునీటి సౌకర్యం లేక వరిదిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరి తోపాటు బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేసుకునే అవకాశమున్నందున పాడి పరిశ్రమ చాల ఆశాజనకంగాఉంటుంది. అదేవిధంగా నీటి ముంపు ప్రాంతాల్లో చేపలపెంపకం కూడా చేపట్టవచ్చు. పట్టిక (4)లో చూపించిన విధంగా వరి, మొక్కజొన్నపైర్లతో పాటు పాడి పశువులు, చేపలు, పెరటికోళ్ళుమరియు కుందేళ్ళ పెంపకాన్ని చేపట్టి వ్యవసాయాన్నిలాభసాటిగా చేసుకోవచ్చు.

పంట/అనుబంధ రంగం

విస్తీర్ణం/సంఖ్య

మొత్తం ఆదాయం (రూ)

నికర ఆదాయం (రూ)

వరి-వరి

ఒక ఎకరా

70,000

35,000

వరి –మొక్కజొన్న

ఒక ఎకరా

80,000

40,000

పచ్చి గడ్డి(ఎపిబిఎన్ -1) లేదా పారా గడ్డి

అర ఎకరా

n

n

లూసర్న్ గడ్డి

అర ఎకరా

n  -

---

పాడి పశువులు(మేలైన జాతి ముర్ర)

3

2,58,000

50,000

కుందేళ్ళు

10 (ఆడ) +2        (మగ)

1,20,000

50,000

పెరటికోళ్ళు(వనరాజా/గిరిరాజా/గ్రామ ప్రియ)

50

15,000

11,000

చేపల చెరువు (3మీ.వెడల్పు, 1.5మీ లోతు)

వరి పొలం చుట్టూ

50,000

25,000

 

మొత్తం

5,93,000

2,11,000

  • పట్టిక 4 ఆయకట్టు ప్రాంతంలో మిశ్రమ వ్యవసాయం ద్వారా ఆదాయ వ్యయాలు

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.0147601476
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు