పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సమగ్ర సస్యరక్షణ

సమగ్ర సస్యరక్షణ విధానాలు

ఉపోద్ఘాతం: సమగ్ర సస్యరక్షణ అనగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా వివిధ పంటలను ఆశించే చీడ పీడలను ఎప్పటికప్పుడు అంచనా వేసి పంటలకు ఏ విధమైన నష్టం వాటిల్లకుండా తక్కువ ఖర్చుతో సేధ్య, యాంత్రిక, జీవ నియంత్రణ పద్దతుల ద్వారా మరియు చివరగా సస్యరక్షణ మందులు వాడి అధిక దిగుబడులను సాధించటం

సమగ్ర సస్యరక్షణ ఎందుకు?

 • నాణ్యమైన ఆరోగ్యవంతమైన పంటలను పండించేందుకుక్
 • పురుగుల సహజ శత్రువలను కాపాడేందుకు
 • వాతారవణ సమతుల్యాన్ని కాపాడేందుకు
 • పంటల సాగు ఖర్చు తగ్గించేందుకు
 • సస్యరక్షణ మందులు చల్లుటవలన చనిపోగా మిగిలిపోయిన పురుగుల సంతతి వృద్ధి చెందకుండా ఉండేందుకు
 • సస్యరక్షణ మందుల వాడకం తగ్గించి మనుషులకు వచ్చే కేన్సర్ , కీళ్ళ జబ్బులు, జీర్ణాశయంలో వచ్చే గడ్డలు, చర్మం, గుండె సంబంధమైన రోగాలను తగ్గించడానికి
 • చీడ పీడలలో పురుగు మందులను తట్టుకునే శక్తి పెరగకుండా ఉండేందుకు
 • పంట రకాలలో చీడపీడలకై ఉండే నిరోధక శక్తి తగ్గకుండా ఉండడానికి

సమగ్ర సస్యరక్షణ వలన లాభాలు

 • తక్కువ ఖర్చుతో చీడపీడలను అదుపులో ఉంచవచ్చు.
 • సహజ శత్రువులను కాపాడవచ్చు.
 • వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చు.
 • అధిక నికరాదాయం పొందవచ్చు.

సమగ్ర సస్యరక్షణ ద్వారా వివిధ పంటలలో ఖర్చును తగ్గించుకునే పద్దతులు

 • వేసవిలో లోతుగా దుక్కి చేయడం వలన భూమి లోపల, కొయ్యకాళ్ళలో కలుపు మొక్కలలో ఉన్న పురుగుల కోశస్థ దశలు, వ్యాధి జనకాల సిద్ధ బీజాలు భూమిపైకి వచ్చి పక్షుల బారిన పడటం లేదా ఎండ వేడిమికి లోనై నశిస్తాయి. దీని వలన రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు.
 • ఆయా ప్రాంతాలకి అనువైన చీడపీడలను/తెగుళ్ళను తట్టుకునే వంగడాలను సాగు చేసుకోవాలి.
 • ఒకేరకమైన పంటను ఏళ్ళ తరబడి సాగు చేయకుండా ప్రాంతాన్ని బట్టి, నీటి వసతిని బట్టి పంట మార్పిడి చేసుకోవాలి.
 • విత్తనశుద్ధి విధిగా పాటించాలి.
 • వీలైనంత మేరకు ఆయా ప్రాంతాలలో లభ్యతను బట్టి సేంద్రియ ఎరువులను వాడాలి. పచ్చిరొట్ట పైరులను వేసి సకాలంలో పొలంలోను, గట్ల మీద కలుపు లేకుండా జాగ్రత్త పడాలి.
 • సిఫారసు చేసిన మేరకు వివిచ పంటల్లో మొక్కల్ సాళ్ళ మధ్య మరియు మొక్కల మధ్య ఎడం ఉండేటట్లు చూసుకొని మొక్కల సాంద్రత సరిగ్గా ఉన్నచో చీడ పీడల ఉధృతి తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చు.
 • సిఫారసు మేరకు రసాయనిక ఎరువులను / సూక్ష్మపొషకాలను అందించాలి.
 • అధిక మోతాదులో నత్రజని వేసినటైతే చీడపీడల ఉధృతి పెరుగుతుంది.
 • సూచించిన మేరకు అంతర పంటలను/ ఎర పంటలను/కంచె పంటలను వేయాలి.
 • ప్రతి నిత్యం పైరులో పురుగు/తెగుళ్ళని గమనిస్తూ అవి నష్ట పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే సస్య రక్షణ చర్యలు చేపట్టాలి.
 • పురుగులపై నిఘా ఉంచేందుకు వీలుగా సిఫారసు చేసిన పంటలలో లింగాకర్షక బుట్టలు, జిగురు పూసిన అట్టలు వంటివి అమర్చుకోవాలి.
 • అవసరాన్ని బట్టి మేలుచేసే పురుగులు, సహజ శత్రువులు, గ్రుడ్లు పరాన్నజీవులు, బదనికలు వంటి వాటిని సంరక్షించుకొని లేదా వాటిని పంట పొలాల్లో వదిలి హానికారక పురుగు ఉధృతిని తగ్గించాలి.
 • పురుగు, తెగుళ్ళ మందులను సిఫారసు మేరకు ఆర్ధిక నష్ట పరిమితి దాటిన తర్వాత మాత్రమే పిచికారి చేసు కోవాలి.
 • రెండు, మూడు రకాల మందులను కలిపి పిచికారి చేయకూడదు.
 • ఒకే పురుగు/తెగులు నివారణకి 2-3 సార్లు మందులు వాడవలసి వస్తె వేరే తరగతికి చెందిన మందును మార్చి వాడాలి.
 • కొన్ని రకాల పురుగులు/తెగుళ్ళు పంటలోని నీటి లభత ఆధారంగా ఎక్కువ అవడం తగ్గడం జరుగుతుంది. కావున సూచించిన మేరకుక్ నీటి యాజమాన్యంలో తగు జాగ్రత్త వహించాలి.
 • పురుగుల ఉధృతికి దోహదం చేసే సిథటిక్ పైరిథ్రాయిడ్ లేదా సిఫారసు చేయని మందులను వాడరాదు.
 • పంటను కోసేటప్పుడు భూ మట్టానికి సాధ్యమైనంత దగ్గరగా కోసుకోవాలి.
 • వైరస్ తెగుళ్ళ లేదా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ బారిన పడిన పంటను పంటకోత అనంతరం వాటి మోళ్ళను లోతుగా దున్ని సేకరించి ఆ తర్వాత పూర్తిగా కాల్చి వేయాలి.
మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త, జీవ నియంత్రణ పరియోజన, రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫోన్ నెం. 9848421791
3.00948766603
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు