অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సహకార విలువలు – సూత్రాలు – సహకార సంఘాలలో సభ్యత్వం

సహకార విలువలు – సూత్రాలు – సహకార సంఘాలలో సభ్యత్వం

సహకార సంస్థ విలువలతో కూడిన వ్యవస్థ, సామాజిక, ఆర్ధిక, ఏకీభావం అనే విలువలను ఈ వ్యవస్థ అందిస్తుంది. సహకారం యొక్క ముఖ్య విలువలువిశ్వజనీతంగా అనుసరించబడుతున్నాయి. గుర్తింపు ;ప్రకటన (1995) ప్రకారం సహకార సంస్థల్లో ‘విలువల’ అనేవి స్వయం సహాయము, స్వయం బాధ్యత, ప్రజాస్వామ్యం, సమానత్వం, సమత, ఏకీభావం అనే విలువలపై ఆధారపడును. నిజాయితీ, నిష్కపటం, సాంఘిక బాధ్యత, పరోపకారం అనే నైతికవిలువ లను సహకార సభ్యులు విశ్వసిస్తారు.

సహకార సూత్రాలు

వీటిని పాటించడం ద్వారా పైన పేర్కొన్న సహకార విలువలు కార్యరూపం దాల్చబడతాయి.

స్వేచ్ఛాపూర్వక (ఐచ్చిక), సార్వజనిక సభ్యత్వం

 • సహకార సంస్థలు స్వచ్ఛంద సంస్థలు, వాటి సేవలు వినియొగించగోరి, సభ్యత్వ బాధ్యతలు నిర్వహించ దలచిన వారికి లింగ, సాంఘిక, జాతి, రాజకీయ, మత విచక్షణ లేకుండా సభ్యత్వం లభించును.

సభ్యులచే ప్రజాస్వామ్య నియంత్రణ

 • సహకార సంస్థలు సభ్యులచే నిర్వహించబడే ప్రజాస్వామ్య సంస్థలు, విధానాల రూపకల్పన, నిర్ణయాలు తీసుకోవడంలో సభ్యులు చురుకుగా పాల్గొనాలి. ప్రతినిధులుగా ఎంపికైన పురుషులు, మహిళలు సభ్యులకు పూర్తిగా జవాబుదారీగా ఉండాలి. ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యులందరెకీ సమాన ఓటింగ్ హక్కు ఉంటుంది. ఇతర స్థాయిల్లోని సహకార సంస్థలు కూడా ప్రజాస్వామ్య ప్రాతిపదికపైనే నిర్వయించబడతాయి.

సభ్యుల ఆర్ధిక భాగస్వామ్యము

 • సహకార సంస్థల మూలధనం సభ్యులచే న్యాయసమ్మతంగా చెల్లించబడి, ప్రజాస్వామ్య ప్రాతిపదికపై నిర్వహించబడుతుంది. సభ్యులు వారు సభ్యత్వం పొందేందుకు చెల్లించాల్సిన వాటాధనం పై సాధారణంగా పరిమిత వడ్డీయే ఉంటుంది. సభ్యులు క్రింద పేర్కొన్న అవసరాలకు లేదా కార్యక్రమాలకు దేనికైనా సంఘం ఆర్జించిన మిగులును కేటాయిస్తారు. వారి సంఘాభివృద్ధికి, సంఘంలో సభ్యులు చేసిన వ్యాపార నిష్పత్తిలో ఫలితాలను పంచడం, సభ్యులామోదించిన ఇతర కార్యక్రమాలకు మద్దతునివ్వడం.

స్వతంత్ర ప్రతిపత్తి స్వేచ్ఛ

 • సహకార సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన, స్వయం పోషక సంస్థలు. అవి వాటి సభ్యులచే నిర్వ హించ బడతాయి. సహకార సంస్థలు ఇతర సంస్థల తో గాని, ప్రభుత్వంతో గానిఏదైనా ఒడంబడిక ఏర్పర చు కున్నప్పుడు లేదా ఇతర మార్గాల ద్వారా మూల ధనాన్ని సమీకరించటానికి గాని, వాటి సభ్యుల ప్రజా స్వామ్య నియంత్రణకు, సంఘ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం వాటిల్లని రీతిలో ఒప్పందం కుదుర్చుకోవాలి.

విద్య శిక్షణ, సమాచారం

 • సహకార సంస్థలు తమ అభివృద్ధికి తోడ్పడే టందుకు సభ్యులు, వారిచే ఎన్నికైన ప్రతినిధులు, మేనేజర్లు మరి ఇతర ప్రయోజనాల గురించి సామా న్య ప్రజలకు ముఖ్యంగా యువకులు, ప్రభావితం జేయు నాయకులకు తెలియజేస్తాయి.

సహకార సంఘాల మధ్య సహకారం

 • సహకార సంస్థలు తమ సభ్యులకు సమర్థ వంతమైన సేవలందించేందుకు, సహకారోద్య మాన్ని పట్టిష్టపరచేందుకు స్థానిక, జాతీయ, ప్రాంతీయ, అంత ర్జాతీయ వ్యవస్థల ద్వారా కలసి కట్టుగా పనిచేయాలి.

సమాజ శ్రేయస్సు

 • సహకార సంస్థలు సభ్యులు ఆమోదించిన విధానాల ద్వారా వారి సమాజాల సుస్థిరాభివృద్దికి కృషిచేస్తాయి.

సభ్యత్వ అరహతలు: (సెక్షన్ 19)

 • ఎవరేని వ్యక్తి మేజరై ఉండి (18 సం.ల నిండిన) మతిస్ధితిమితం కలిగి, సంఘ బైలాల ప్రకారం ఏ వర్గం వ్యక్తుల కొరకు ఆ సంఘం ఏర్పాటు చేయబడిందో ఆ వర్గానికి చెంది ఉండి పిఎసిఎస్ లలో సభ్యత్వం కోరు వారు సంఘం యొక్క వ్యావహారిక విస్తీర్ణంలో యజ మానిగా లేదా కౌలుదారుగా వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి.

సహసభ్యుడు

 • సెక్షన్ 19లో ఏమి చెప్పబడినప్పటికీ సెక్షన్ 20 ప్రకారం ఒక సంఘం వ్యవహారిక విస్తీర్ణంలోవ్యవసాయ దారుల సంక్షేమానికి పనిచేయుచున్న ఏదేనిస్వయం సహాయక బృందం, రైతు మిత్ర గ్రూపు, ప్రభుత్వేతర సంస్థను సహసభ్యుడిగా చేర్చుకోవచ్చును. అయితే అట్టి సహసభ్యుడికి ఓటు హక్కు ఉండదు.వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో వ్యవసాయ భూమిని కలిగి వుండకుండా సభ్యులుగా చేరే వారినిసహసభ్యు లుగా పరిగణిస్తారు. సెక్షన్ 20ఎ ప్రకారం సహసభ్యుని కి ఇచ్చిన రుణం కూడా చట్ట బద్ధమైనది గానే పరి గణించబడును. పిఎసిఎస్ లలో కొన్ని నిబంధనలకు లోబడి సహసభ్యులైన డిపాజిట్ దారులు, ఋణ గ్రహీత గ్రూపులకు ఓటు హక్కు కలదు.

సభ్యత్వ అనరహతలు: (సెక్షన్ 21)

 • సెక్షన్ 19 లో చెప్పిన అరహతలను కలిగి ఉన్నప్పటికీ ఈ క్రింద సూచించిన అనరహతలు ఒక వ్యక్తి సభ్యునిగా చేరుటకు గాని లేదా సభ్యునిగా కొన సాఫుటకు గాని అరుహుడు. ఎ) దివాలాదారుగా నిర్ణయింపబడుటకు దరఖాస్తు చేసుకొని ఉన్నా లేక దివాలాదారుగా ప్రకటింపబడి విమిక్తి పొందకపోయినా,
 • నీతి బాహ్యమైన నేరానికి శిక్షింపబడి అట్టి శిక్ష కొనసాగుతున్నా లేక శిక్ష గడువు ముగిసిన నాటి నుండి మూడు సంవత్సరాలు పూర్తికాకపోయినా,
 • సంఘంలో లేక ఆర్ధిక సహాయ బ్యాంక్ లో లేక అదే ఆర్ధుక బ్యాంకు నుండి సహాయం పొందుతున్న ఇతర సంఘంలో వేతనం తీసుకొనుచున్న ఉద్యోగిగా ఉన్న: లేక
 • ఈ చట్టం క్రింద బహిష్యరింపబడి, బహిష్యరింపబడి న తేదీనుండి ఒకసంవత్సర కాలం పూర్తికాకపోయినా,
 • సంఘ లక్ష్యాలకు లేదా ప్రయోజనాలకు విరుద్ధమైన వ్యాపారంగా రిజిస్ట్రారు ఒక సాధారణ లేక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ప్రకటించబడిన వ్యాపారాన్ని చేయుచున్నా,
 • బైలాలలో నిర్ధిష్ట పరిచిన విధంగా ఒక సంవత్సరంలో కనీస వ్యాపారాన్ని నిర్వహించడంలో లేక కనీస సేవలను పొందడంలో విఫలమైనా,
 • రెండు సంవత్సరాలలో వరుసగా రెండు సర్వసభ్య సమావేశాలకు ముందస్తు అనుమతి లేకుండా గైరాహాజర్ అయినా,
 • బైలాల ప్రకారం సంఘానికి తనకు సంబంధిం చిన సమాచారాన్ని ఇవ్వడంలొ విఫలమైనా: సభ్యునిగా చేరుటకుగాని,

సభ్యుల హక్కులు

 • సేవలు పొందే హక్కు; (సెక్షన్ 22): ఒక సంఘంలో సభ్యత్వం పొందిన వెంబడే ఆ సంఘం అందించే అన్ని సేవలను పొందడానికి పెతి సభ్యునికి హక్కు కొనసాగుటకుగాని అనరుహుదు,

సభ్యుని తొలగింపు

 • సభ్యుత్వ అరహతలు లెకుండా సభ్యత్వం పొంది ఉన్నా లేక పైన చెప్పిన అనరహతలు కలిగి ఉండి సభ్యుడిగా కొనసాగుతున్నా అట్టి సభ్యుణ్ణి మహాజన సభ తనంత తానుగాని లేక ఎవరేని సభ్యుని లేదా సమాఖ్య సంఘం లేదా ఆర్ధిక సహాయ బ్యాంక్ ప్రతిపాదనతో ఒక తీర్మానం ద్వారా తొలగించ వచ్చును. తొలగించడానికి ముందు ప్రతిపాదిత చర్యపై వివరించుకొనుటకు సభ్యునికి ఒక అవకాశం ఇవ్వవలెను. సభ్యుణ్ణి తొలగిస్తూ చేసిన తీర్మానపు ప్రతిని అట్టి సభ్యుడు అందుకున్న తేదీ నుండి ఆ వ్యక్తి సభ్యత్వం రద్దయినట్లుగా భావించబడుతుంది.

సభ్యుల హక్కులు: (సెక్షన్ 22)

 • ఒక సంఘంలో సభ్యత్వం పొందిన వెంబడే ఆ సంఘం అందించే అన్ని సేవలను పొందడానికి ప్రతి సభ్యునికి హక్కు సంక్రమించును. అతడు పాలకవర్గానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత లభ్యతను బట్టి అట్టి సేవలు అందించబడును. సేవలను అందించ డానికి నిరాకరిస్తే నిరాకరణ నిర్ణయం అందిన తేదీ నుండి ముప్పది రోజులలోగా లేదా సంఘానికి దరఖాస్తు చేసిన 60 రోజుల లోపు వివాద పరిష్కారం నిమిత్తం రిజిస్ట్రారుకు దరఖాస్తు చేసుకోవచ్చును. నిరాకరణ సబబు కాదని రైజిస్ట్రార్ భావించిన పక్షంలో ఆ సేవలను అందించాల్సిందిగా సంఘ పాలక వర్గాన్ని ఉత్తర్వు ద్వారా ఆదేశించ వచ్చును.అయితే సెక్షన్ 25 ప్రకారం సభ్యత్వానికి సంబందించిన సహకార సంఘాల చట్టం, రూల్స్ , బైలాలలో పేర్కొనబడి నట్టి మొత్తాలను చెల్లిస్తే తప్ప సభ్యునికి తన హక్కులను వినియోగించే అధికారం సంక్రమించదు.
 • ఓటు హక్కు లేదా పోటీ చేయు హక్కు (సెక్షన్ 25, 115(డి), రూల్ 18): సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి ఓటు హక్కు ఉంటుంది. అయితే చట్టంలోని నిబంధ నలకు లోబడి మాత్రమే ప్రతినిధి ద్వారా కాకుండా స్వయంగా ఓటు హక్కును వినియోగించుకునే అధి కారం సంక్రమిస్తుంది. బైలాలో పేర్కొనబడిన విధంగా ఒక సహకారం సంవత్సరంలో కనీస వ్యాపారం చేసి ఉండవలెను. కనీసం 300/- లను వాటాధనం చెల్లించి ఉండవలెను. బలహీన వర్గాల సంఘాలకు కనీస వాటాధనం రూ.50లు గా రిజిష్ట్రార్ ద్వారా నిర్ణ యించబడమైనది. ఎన్నికల ప్రకటన తేదీ నాటికి 30 రోజుల ముందు సభ్యత్వం పొంది ఉండి, నగదు లేక వస్తురూపేణా సంఘానికి చెల్లించ వలసిన గడువు తేదీనుండి మూడు మాసముల పైబడి చెల్లించకుండా అపరాధిగా మారని సభ్యునికి ఓటు వేసే హక్కుగాని లేక పోటీ చేసే హక్కుగాని ఉంటుంది. అయితే పిఎసి ఎస్ లలో కాలపరిమితి ఒక సంవత్సరం ఉండును. అయితే ప్రాథమిక వ్యవసాయ సహకారరపతిలలోఎన్నికలతేదీకిపూర్వంసాధారణప్రాంతంలో రూ.5000/-అనుసూచిత ప్రాంతంలో రూ.2500/- నిర్దే శించిన ప్రకారం అంతకన్న ఎక్కువ మొత్తము రెండు సంవత్స రాల పాటు నిరవధికంగా డిపాజిట్ ను కలిగి ఉన్న వ్యక్తి లేదా గ్రూపుకు సహసభ్యుడి గా ఓటు హక్కును కలిగి ఉండును. అదే విధంగా ఎన్నికల ప్రకటన విడుదల కు పూర్వం కనీసం 6మాసాల క్రిందట రూ. 10,000/- రుణం తీసుకున్న గ్రూపుచే నామ నిర్దేశం చేయబడిన ప్రతినిధి ద్వారా ఓటు హక్కును వినియోగించు కోన వలెను. అయితే గ్రూపు డిపాజిటర్ లేదా గ్రూపు రుణ గ్రహీత ఆ గ్రూపు చే నామ నిర్ధేశం చేయబడిన ప్రతి నిధి ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవలెను.
 • గమనిక: ఓటు హక్కు లేకపోవడం సంఘ సమావేశా లకు హాజరగుటకు గాని మరియు చర్చల్లో పాల్గొను టకు గాని ప్రతిబందకం కాదు

సభ్యుల భాధ్యతలు

 • సభ్యుడు సంఘ సమావేశాలకు తప్పనిసరిగాహాజ రై, చర్చలలో చురకుగా పాల్గొని తన అభిప్రాయా లను తెలియ పర్చాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు.
 • రిజిస్ట్రార్ , ఆడిటర్ , విచారణ అధికారి, తనిఖీ అధికారిచే కోరబడిన సమాచారాన్ని తనకు తెలిసి నంతవరకు అందజేయాల్సిన బాధ్యత సభ్యునిపై ఉంటుంది.
 • సంఘం నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంతో పాటు, తోటి సభ్యులు కూడా సకలం లో చెల్లించేలా చూడాల్సిన బాధ్యత ఉంటుంది.
 • నీతి, నిజాయితీ, వ్యాపార దక్షత, నాయకత్వ లక్షణాలున్న వారికే ఓటు వేసి సరైన పాలకవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యుని పై ఉంటుంది.
 • పాలకవర్గ సభ్యులుల, ఉద్యోగులు అవినీతి చర్యలకు పాల్పడినట్లు తన దృష్టికి వస్తే సంబందిత సహకార శాఖాధికారులకు తెలియ పరిచి అరికట్టా ల్సిన బాధ్యత సభ్యునిపై ఉంటుంది.
 • పరిమిత పూచీతో ఏర్పాటైన సంఘంలో అట్టి సంఘాన్ని మూసివేసి సందర్భాల్లో సభ్యుడు వాటాలపై చెల్లించిన మూలధనం మరియు చెల్లించుటకు అంగీకరించి ఉంటే ఆ మొత్తమునకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాని అపరిమిత పూచీతో ఏర్పడిన సంఘంలో సంఘానికి చెందిన బాధ్యత లన్నింటికి మరియు ఆస్తుల తరుగుదలకు సభ్యులు ఉమ్మడిగా, విడివిడిగా పూర్తి బాధ్యత వహించవలెను.
 • సంఘం యొక్క బైలాలలో చెప్పబడిన ఒక సహ కార సంవత్సరంలో చేయాల్సిన వ్యాపారమును, పొందాల్సిన సేవలను వినియోగింధుకునే బాధ్యత లను సభ్యుడు నెరవేర్చ వలెను (సెక్షన్ 29)

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: సహకార శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate