অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ బీమా: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.)

వ్యవసాయ బీమా: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.)

ఏం చేయాలి?

 • ప్రకృతి వైపరీత్యాలూ/విపత్తుల నుండీ,చీడ పీడలూ క్రిమికీటకాదుల నుండీ,తెగుళ్ళ బారి నుండీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచుకోండి.
 • మీ మీ ప్రాంతాల్లో అమలులో ఉన్న పంట బీమా పధకాల్లో సరియైన దాన్ని ఎంచుకొని లాభం పొందండి.
 • ప్రధాన మంత్రి పంటల బీమా పథకం (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) (పిఎంఎఫ్బివై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (వెదర్ బెస్ట్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-డబ్ల్యూబిసిఐఎస్) ,కొబ్బరి పంట బీమా పథకం (కోకోనట్ పామ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-సిపిఐఎస్), 45 జిల్లాల్లో ఏకీకృత ప్యాకేజ్ బీమా పథకం (పైలట్ యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్యూపీఐఎస్) అనే నాలుగు బీమా పథకాలు అమలులో ఉన్నాయి.
 • కొన్ని గుర్తించిన పంటల కోసం పంట రుణాలు గానీ తీసుకొంటే పై నాలుగు పధకాల కింద బీమా చేయటంతప్పనిసరి.రుణాలు తీసుకోని రైతులు బీమా చేయించుకోవటం స్వచ్ఛందం.
 • పంట బీమా పథకం కింద లబ్ది పొందటానికి మీకు దగ్గరలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయాధికారిని గానీ, మీ ప్రాంతంలో పనిచేస్తున్న బ్యాంక్/పిఏసిఎస్ లేదా పంట బీమా కంపెనీ కి సంబంధించిన శాఖ లోని వ్యవసాయాధికారిని సంప్రదించండి.

క్ర.సం.

పధకం

సహాయం

1.

ప్రధాన మంత్రి పంట బీమా పధకం

(పిఎంఎఫ్ బివై)

 • ఆహారపు పంటలకూ నూనె పంటలకూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఉద్యాన /వాణిజ్య పంటలకూ బీమా రక్షణ.
 • రైతులందరికీ ఒకే విధంగా వర్తించే గరిష్ట ప్రీమియం
 1. ఖరీఫ్ సీజన్ - బీమా మొత్తంలో 2%
 2. రబీ సీజన్ - బీమా మొత్తంలో 1.5%
 3. వార్షిక వాణిజ్య/ఉద్యాన పంటలు - బీమా మొత్తంలో 5%
 • వాస్తవ ప్రీమియం మొత్తానికీ, రైతులు చెల్లించవలసిన బీమా రేటుకూ మధ్యనున్న తేడా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుని చెల్లిస్తాయి.
 • బీమా చేసిన మొత్తం (Sum Insured- ఎస్ఐ)లో ఎటువంటి గరిష్ట పరిమితి లేదా తగ్గింపు లేకుండా చెల్లింపులు.
 • ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట విత్తకపోతే అందుకుగాను 25% దాకా బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.
 • గుర్తించిన పంటలకు హామీ ఇచ్చిన దిగుబడి కంటే తక్కువ దిగుబడి వస్తే బీమా చేసిన రైతులందరికీ ఏ మేరకు దిగుబడి తగ్గిందో ఆ మేరకు బీమా మొత్తం చెల్లిస్తారు.
 • బీమా చెల్లించవలసిన మొత్తంలో 25 శాతాన్ని తక్షణ సాయంగా ముందస్తుగా చెల్లిస్తారు. ముంపు, వడగళ్ళు, మట్టి కోతల వల్ల జరిగిన నష్టాలను విడివిడిగా ప్రతి పొలానికీ అంచనా కడతారు.
 • పంట కోతల తరువాత పొలంలో ఆరబెట్టిన పంటకు 14 రోజుల వరకు తుఫాను వల్ల కానీ, అకాల వర్షాల వల్ల కానీ జరిగిన నష్టాన్ని బీమా పథకం కింద అంచనా వేస్తారు.
 • బీమా క్లెయిములను త్వరగా పరిష్కరించడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని, డ్రోన్ లను వినియోగిస్తారు.

ఈ పథకాన్ని అమలు చేసే సంస్థను రాష్ట్ర ప్రభుత్వం వేలం ద్వారా ఎంపిక చేస్తుంది.

2.

వాతావరణ ఆధారిత పంటల బీమా పధకం (వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్- డబ్ల్యూ.బిసి.ఐ.ఎస్)

 • కొన్ని గుర్తించిన ఆహార పంటలకు, నూనె పంటలకు, వార్షిక ఉద్యాన/ వాణిజ్య పంటలకు.
 • పిఎంఎఫ్ బివై వలెనే రైతులందరికీ ఒకే విధంగా వర్తించే గరిష్ట ప్రీమియం
 1. I.        ఖరీఫ్ సీజన్ - బీమా మొత్తంలో 2%
 2. II.        రబీ సీజన్ - బీమా మొత్తంలో 1.5%
 3. వార్షిక వాణిజ్య/ఉద్యాన పంటలు - బీమా మొత్తంలో 5%
 • వాస్తవ ప్రీమియం మొత్తానికీ, రైతులు చెల్లించవలసిన బీమా రేటుకూ మధ్యనున్న తేడా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుని చెల్లిస్తాయి.
 • వాతావరణ సూచికలు (వర్షపాతం/ఉష్ణోగ్రత/తేమ/గాలి వేగం) వంటివి గుర్తించిన ఆయా పంటలకు అవసరమైన వాటికంటే (హామీ ఇచ్చిన దాని కంటే) తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటే ఎంత అయితే తేడా వచ్చిందో ఆ మేరకు నోటిఫైడ్ ప్రాంతం లోని రైతులందరికీ సమానంగా రైతులకు చెల్లింపులుంటాయి.
 • వడగళ్ళ వాన వల్ల కానీ, అకస్మాత్తుగా కురిసిన కుంభవృష్టి వల్ల కానీ జరిగిన నష్టాన్ని విడివిడిగా పొలం స్థాయిలో అంచనా వేస్తారు.

ఈ పథకాన్ని అమలు చేసే సంస్థను రాష్ట్ర ప్రభుత్వం వేలం ద్వారా ఎంపిక చేస్తుంది.

 

3.

కొబ్బరి పంట బీమా పధకం (కోకోనట్ పామ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ సిపిఐఎస్)

 • కొబ్బరి తోటల పెంపకందార్లకు బీమా రక్షణ
 • కొబ్బరి మొక్కలను బట్టి 4 నుండి 15 సంవత్సరాల మొక్కలకు మొక్కకు తొమ్మిది సహాయం రూపాయల చొప్పున 16 నుండి 60 సంవత్సరాల వయసున్న మొక్కలకు మొక్కకు 14 రూపాయల చొప్పున బీమా ప్రీమియం ఉంటుంది.
 • అన్ని రకాల రైతులకు ప్రీమియంలో 50 నుండి 75 శాతం దాకా సబ్సిడీ ఉంటుంది.
 • నోటిఫైడ్ ప్రాంతంలో బీమా చేసిన మొక్కలకు నష్టం జరిగినప్పుడు పెట్టుబడి నష్టం తో సమానమైన మొత్తాన్ని బీమాదారులకు చెల్లిస్తారు.

 

4.

45 జిల్లాల్లో పైలట్ పధకంగా ఏకీకృత బీమా పధకం (పైలట్ యూనిపైడ్ ప్యాకేజ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-యూ.పి.ఐ.ఎస్)

 • రైతుల పంటలనూ, ఆస్తులనూ, జీవితాలనూ, విద్యార్థుల రక్షణనూ కవర్ చేస్తూ ఆర్థిక రక్షణనందించే సమగ్రమైన బీమా
 • పైలట్ లో ఏడు విభాగాలు ఉంటాయి. పంటల బీమా (పి.ఎం.ఎఫ్.బి.వై./డబ్ల్యూ.బి.సి.ఐ.ఎస్.), జీవిత బీమా (పి.ఎం.జె.జె.బి.వై.), ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం (పి.ఎం.ఎస్.బి.వై.), విద్యార్థి రక్షణ, గృహం, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్.
 • పంటల బీమా తప్పనిసరి. అయితే మిగిలినవాటినుండి రైతులు ఏవైనా రెండింటిని ఎంచుకోవచ్చు.
 • రైతులు సరళమైన ఒకే దరఖాస్తు ద్వారా, ఏక గవాక్షం ద్వారా అవసరమైన అన్ని బీమా పధకాలను పొందవచ్చు.
 • ఆస్తుల బీమాతో పాటు రెండు ప్రముఖ ప్రభుత్వ పథకాలైన పి.ఎం.ఎస్.బి.వై., పి.ఎం.జె.జె.బి.వై. లను కూడా వీటితో జతచేయబడినాయి.
 • ఏక గవాక్షం ద్వారానే పైలట్ పథకాన్ని అమలు చేస్తారు.

పంట బీమా పథకాన్ని తప్పించి మిగిలిన యిమ్లన్నింటినీ వ్యక్తుల క్లెయిమ్ రిపోర్ట్ ఆధారంగానే సెటిల్ చేస్తారు.

ఎవరిని సంప్రదించాలి ?

దగ్గరలో ఉన్న బ్యాంక్/పిఏసిఎస్ లేదా ఆ ప్రాంతానికి గుర్తింపు పొందిన సాధారణ బీమా కంపెనీలకు సంబంధించిన శాఖలను జిల్లా వ్యవసాయాధికారిని/బ్లాక్ డేవలప్ మెంట్ అధికారిని సంప్రధించండి. లేదా www.agri-insurance.gov.in ను సంప్రదించండి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate