హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / రైతులకు శక్షణ - విస్తరణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రైతులకు శక్షణ - విస్తరణ

రైతులకు శిక్షణ, సామర్థ్యం నిర్మాణానికి సహాయం. నైపుణ్యతను పెంచే కార్యక్రమాలు.

ఏం చేయాలి ?

 • raitulakuబ్లాక్ స్థాయిలో, అంతకన్నా కింది స్థాయిలో ఆత్మ ప్రాజెక్టు (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మంట్ ఏజెన్సీ - ఆత్మ) ద్వారా సమర్థవంతంగా వ్యవసాయ విస్తరణ సేవలు అందించడానికి వ్యవసాయ విస్తరణ, సంస్కరణలలో భాగంగా బ్లాకుకు 24000 చొప్పున (1 బి.టి.ఎం. + 3 ఎ.టి.ఎం.) సిబ్బందిని కేటాయించారు. వారిని గాని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సిబ్బందిని గాని, అనుబంధ విభాగాల సిబ్బందిని గాని సంప్రదించి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రైతులు తమ ప్రాంతానికి సంబంధించి గానీ, తమ పొలానికి సంబంధించికాని, వివిధ పథకాలు/కార్యక్రమాల వివరాలు, వారి ప్రాంతాలకు అనుకూలమైన సాంకేతికతకు సంబంధించి సమాచారాన్ని పొందవచ్చు.
 • పొలం బడి, లేదా సందర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం లేదా అందులో పాల్గొనడం.
 • వెబ్ సైట్ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని పొంది, మీ పొలాన్ని హ్యాండ్ హెల్త్ డివైస్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
 • అధునాతన సమాచారం, విజ్ఞానం కోసం దూరదర్శన్ (18 ప్రాంతీయ ఛానెళ్లు, 1 జాతీయ ఛానెల్, 180 'లో - పవర్' ట్రాన్స్ మీటర్లు) 96 ఎఫ్ఎం రేడియోలు, కిసాన్ ఛానల్ లేదా ఇతర ప్రైవేటు ఛానళ్లను దర్శించవచ్చు.
 • రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సందేహాల నివృత్తి కోసం దగ్గరలో ఉన్న కిసాన్ కాల్ సెంటర్ ను (కే.సి.సి) టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1551 పై సంవత్సరంలోని 365 రోజుల్లోనూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు సంప్రదించవచ్చు. కే.సి.సి. ప్రతినిధుల ద్వారా / సీనియర్ నిపుణుల ద్వారా రైతులు తమ ప్రశ్నలకు శాస్త్రవేత్తల సమాధానాలు పొందవచ్చు.
 • వ్యవసాయ విద్యార్థులకు రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణ లభిస్తుంది. వారు బ్యాంకు లోను సహాయంతో 36% రాయితీతో అగ్రి క్లినిక్ / అగ్రి బిజినెస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. (షె.కు. షె.తె. లకు,/ ఈశాన్య, పర్వత ప్రాంతాలలోని వారికి / మహిళలకు రాయితీ 44%).
 • ఆధునిక రైతులు శిక్షణలో / అవగాహనా సందర్శనలలో పాల్గొనాలి. మొబైల్లో ఇంటర్నెట్ లేకుండానే ఇంటరాక్టివ్ ఎస్.ఎం.ఎస్. (USSD) ద్వారా ఎంపిక చేసిన సమాచారాన్ని, సేవలను వెబ్ ద్వారా పొందవచ్చు.
 • ప్రత్యక్షంగా రైతుల పోర్టల్ నుండి కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్/ ఉమ్మడి సేవా కేంద్రం ద్వారా ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సమాచారాన్ని (సాగు పద్ధతులు, డీలర్ల పట్టిక, పంటలకు సంబంధించిన సలహాలు వగైరా ) పొందవచ్చు. కిసాన్ కాల్ సెంటర్ ద్వారా లేదా ఉమ్మడి సేవాకేంద్రం ద్వారా లేదా పుల్ ఎస్ఎంఎస్ ద్వారా రైతులు తమ పేరు నమోదు చేసుకొని ఎస్ఎంఎస్ పోర్టల్ నుండి లాభం పొందవచ్చు. (51969 లేదా 9212357123 పై KISAN REG<మీ పేరు>, మీ రాష్ట్రం పేరు లోని మొదటి నాలుగు అక్షరాలు> మీ జిల్లా పేరులోని మొదటి నాలుగు అక్షరాలు> మీ బ్లాకు పేరులోని మొదటి నాలుగు అక్షారాలు>)

మీకేం లభిస్తుంది?

ఎ. రైతులకు శిక్షణ, సామర్థ్యం నిర్మాణానికి సహాయం

క్ర. సం.

సహాయ వివరాలు

కార్యకలాపానికి సహాయ సరళి

పథకం/విభాగం

1.

50 – 150 రైతుల బృందానికి విత్తన ఉత్పత్తి, విత్తన సాంకేతిక పై శిక్షణ

బృందానికి రూ. 15,000/-

గ్రామీణ విత్తన ఉత్పత్తి కార్యక్రమం (ఎస్.ఎం.ఎస్.పి. – ఎస్.ఎం.ఎ.ఇ.టి.)

2.

50 – 150 రైతుల బృందానికి విత్తన ఉత్పత్తి, విత్తన సాంకేతికత పై శక్షణ కొరకు సహాయం

ఒక శిక్షణ కార్యాక్రమానికి రూ. 15,000/-

 1. పంటను విత్తే సమయంలో – విత్తనోత్పత్తి టెక్నిక్, ఉంటాల్సిన దూరం, విత్తే పద్ధతులు ఇతర సాగు పద్ధతులు
 2. పంట పుష్పించే సమయంలో
 3. పంట కోతల తరువాత, విత్తన శుద్ధి సమయంలో

గ్రామీణ విత్తన ఉత్పత్తి కార్యక్రమం (ఎస్.ఎం.ఎస్.పి. – ఎన్.ఎం.ఎ.ఇ.టి.) ద్వారా నూనె గింజలు, పప్పు ధాన్యాలు, పశుగ్రాసం, పచ్చి రొట్ట పంటలు, ధృవీకరించిన విత్తనాల ఉత్పత్తి.

3.

గుర్తింపు పొందిన సంస్థలలో రైతులకు శిక్షణ (స్టైఫెండ్, భోజన, వసతి, రాను పోను ఖర్చులు రైతులకు లభిస్తాయి.)

ఒక్కొక్క రైతుకు నెలకు రూ. 5,200/-

పంటకోతల అనంతర సాంకేతిక నిర్వహణ

4.

రైతులకు శిక్షణ

30 మంది రైతుల బృందానికి 2 రోజుల శిక్షణ కార్యక్రమానికి రూ. 24,000/- (ఒక్కొక్క రైతుకు రోజుకు రూ. 400/-)

ఎన్.ఎం.ఒ.ఒ.పి.

5.

40 మంది రైతుల బృందానికి సస్యరక్షణ చర్యలపై శిక్షణ

 1. ఎన్.జి.ఓ.లు/ ప్రైవేటు సంస్ఠలు రైతులకు నిర్వహించే పొలంబడికి రూ.29,200/-
 2. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రూ. 26,700/-

సస్యరక్షణ పథకం

6.

ఎంపిక చేసిన వ్యవసాయ యంత్రాలు, పరికరాల మరమత్తు, నిర్వహణ, ఉపయోగించు పద్ధతి, పంటకోతల అనంతర నిర్వహణ పై శిక్షణ

వారానికి ఒకరికి రూ. 4,000/-

వ్యవసాయ యాంత్రీకరణ పై ఉపమిషన్ (ఎస్.ఎం.ఏ.ఎం.)

7.

కూరగాయల పెంపకం సంబంధిత రంగంలో రైతులకు రెండు రోజుల శిక్షణ

ఒక రైతుకు ఒక కార్యక్రమానికి రూ. 1,500/- (రవాణా ఖర్చులు కాక)

వెజిటేబుల్ ఇనీషియేటివ్ ఫర్ అర్బన్ క్లాస్టర్స్ (వి.ఐ.యూ.సి.)

8.

15-20 మంది రైతుల బృందాలను/ సంఘాలను ఏర్పరిచి ఫైనాన్స్ సంస్థలు, అగ్రిగేటర్స్ తో అనుసంధానించడం

3 యేళ్లలో వాయిదాల పద్ధతిలో ఒకొక్క రైతుకు రూ. 4,075/-

(వి.ఐ.యూ.సి.)

9.

జైపూర్ లోని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ ద్వారా గ్రామీణ్ భండార్ యోజన పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహణ (3 రోజుల వ్యవధి)

కార్యక్రమానికి రూ. 30,000/-

గ్రామీణ్ భండార్ యోజన

10.

బ్లాకుకు 50 పని దినాల వ్యవధిలో రైతులకు రాష్ట్రం వెలుపల శిక్షణ

రవాణా ఖర్చులు, భోజనం, వసతి ఖర్చులు కలుపుకొని ఒక్కొక్క రైతుకు రోజుకు రూ. 1,250/-

ఆత్మ పథకం, ఉప-పథకాలు, ఎం.ఐ.డి.హెచ్. కింద ఎన్.హెచ్.ఎం. /హెచ్.ఎం.ఎన్.ఇ.హెచ్

11.

రాష్ట్రం లోపల (బ్లాకుకు 100 పనిదినాల వ్యవధిలో) రైతులకు శిక్షణ

రవాణా ఖర్చులు, భోజనం, వసతి ఖర్చులు కలుపుకొని ఒక్కొక్క రైతుకు రోజుకు రూ. 1,000/-

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.)

12.

జిల్లాలో (బ్లాక్ కు 1000 పనిదినాల వ్యవధిలో) రైతులకు శిక్షణ

అక్రమ శిక్షణ అయిన పక్షంలో రవాణా ఖర్చులు, భోజనం, వసతి ఖర్చులు కలుపుకొని ఒక్కొక్క రైతుకు రోజుకు రూ. 400/-, బయట నుండి హాజరవుతున్న సందర్భంలో రోజుకు రూ. 250/-

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.) ఉప-పథకాలు, ఎం.ఐ.డి.హెచ్. కింద ఎస్.హెచ్.ఎం. / హెచ్.ఎం.ఎస్.ఇ.హెచ్

13.

ప్రదర్శనల నిర్వహణ (బ్లాకుకు 125 ప్రదర్శనల చొప్పున)

ఒక్కొక్క ప్రదర్శన స్థలానికి రూ. 4,000/- వరుకు (0.4 హెక్టార్)

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.)

14.

ఒక ఋతువు కాలంలో 25 మంది రైతులకు శిక్షణ. (పంట కాలంలోని 6 కీలక సమయాలలో)

ఒక పొలం బడికి రూ. 29,414/-

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.)

15.

రాష్ట్రం వెలుపల 7 రోజుల పాటు అవగాహన యాత్రలు (బ్లాకుకు 5 గురు రైతులు చొప్పున)

రవాణా ఖర్చులు, భోజనం, వసతి ఖర్చులు కలుపుకొని ఒక్కొక్క రైతుకు రోజుకు రూ. 800/-

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.)

16.

రాష్ట్రం లోపల 5 రోజుల పాటు అవగాహన యాత్రలు (బ్లాకుకు 25 మంది రైతులు)

రవాణా ఖర్చులు, బోజనం, వసతి ఖర్చులు కలుపుకొని ఒక్కొక్క రైతుకు రోజుకు రూ. 400/-

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.)

ఉప-పథకాలు, ఎం.ఐ.డి.హెచ్. కింద ఎస్.హెచ్.ఎం/హెచ్.ఎం.ఎన్.ఇ.హెచ్.

17.

జిల్లాలో 3 రోజులకు మించకుండా అవగాహన యాత్రలు (బ్లాకుకు 100 మంది రైతులు చొప్పున)

రవాణా ఖర్చులు, భోజనం, వసతి ఖర్చులు కలుపుకొని ఒక్కొక్క రైతుకు రోజుకు రూ. 300/-

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.)

18.

i. రైతులకు సామర్థ్య నిర్మాణం, నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకోవటం, ఇతర సహాయక సేవలు (బ్లాకుకు 20 బృందాలు)

ii. ఆదాయం చేకూర్చే కార్యకలాపంగా ఈ బృందాలకు ఒక్కసారికి మాత్రం విత్తన సొమ్ము అందజేయడం.

iii.ఆహార భద్రత బృందాలు (బ్లాకుకు 2 బృందాలు)

 1. బృందానికి రూ. 5,000/-
 2. బృందానికి రూ. 10,000/-
 3. బృందానికి రూ. 10,000/-

 

ఆత్మ పథకం (ఎన్.ఎం.ఎ.ఇ.టి.)

19.

భూ సార పరీక్షణ ప్రయోగశాలల ద్వారా ఎంపిక చేసిన గ్రామాలలో ప్రథమ స్థాయి ప్రధర్శనలు (ఎఫ్.ఎల్.డి.). ప్రథమ స్థాయి ప్రదర్శనలు (ఎఫ్.ఎల్.డి)

 

ఐసిఏఆర్ సంస్థలు నిర్వహించే ప్రథమ స్థాయి ప్రదర్శనలు (ఎఫ్.ఎల్.డి.)

ప్రదర్శనకు రూ. 20,000

 

ఐ.సి.ఎ.ఆర్. కు ఇక్రిశాట్ కు 100% సహాయం. వేరుశనగ హె.కు రూ. 8,500/- మించకుండా, సోయా చిక్కుళ్ళు కు అవిసె గింజలకు (రేవ్ సీడ్), ఆవాలకు, పొద్దుతిరుగుడుకు హె.కు రూ. 6,000/-, నువ్వులు, కుసుమలకు, నైజర్, లిన్ సీడ్, ఆముదాలకు హె.కు రూ. 5,000/-, వేరుశనగ మీద ఐసిఏఆర్ చే పాలిధీన్ మల్చ్ సాంకేతిక పై ప్రథమ స్థాయి ప్రధర్శనకు హె.కు రూ. 12,500/- ప్రతి పంటకు హెక్టారుకు, ఒక రైతుకు గరిష్టంగా ఒక ప్రదర్శన అనుమతిస్తారు. ప్రథమ స్థాయి ప్రదేశ పరిమాణం ఒక హెక్టారు కానీ 0.4 హెక్టారుకు తగ్గకూడదు.

భూసారం, ఆరోగ్యాల నిర్వహణపై జాతీయ ప్రాజెక్టు

 

ఎన్.ఎం.ఒ.ఒ.పి.

 

i. వరి, గోధుమ, పప్పు ii. ధాన్యాలు

2.కే.వి.కే. ల ద్వారా పప్పు ధాన్యాల ప్రథమ స్థాయి ప్రదర్శనలు (ఎఫ్.ఎల్.డి.)

i. హె.కు రూ. 7,500/-

ii. హె.కు రూ. 5,000/-

iii.హె.కు రూ. 7,500/-

 

 1. ఎన్.ఎఫ్.ఎస్.ఎం.
 2. ఎన్.ఎఫ్.ఎస్.ఎం.
 3. ఎన్.ఎఫ్.ఎస్.ఎం.

20.

రాష్ట్రాల ఆచరణలతో మెరుగుపరిచిన ప్రదర్శన ప్యాకేజీలు

 1. వరి, గోధుమ
 2. పప్పు ధాన్యాలు
 3. ధాన్యాలు

పంట పద్ధతి ఆధారిత ప్రదర్శనలు (రాష్ట్రాలిచే మాత్రమే)

 1. వరి
 2. గోధుమ, పప్పుధాన్యాలు
 3. హె.కు రూ. 7,500/-
 4. హె.కు రూ. 7,500/-
 5. హె.కు రూ. 5,000/-

 

 

 1. హె.కు రూ. 12,500/-
 2. హె.కు రూ. 12,500/-

 

 1. ఎన్.ఎఫ్.ఎస్.ఎం., బి.జి.ఆర్.ఇ.ఐ
 2. ఎన్.ఎఫ్.ఎస్.ఎం.
 3. ఎన్.ఎఫ్.ఎస్.ఎం.

 

 

 

 1. ఎన్.ఎఫ్.ఎస్.ఎం. బి.జి.ఆర్.ఇ.ఐ
 2. ఎన్.ఎఫ్.ఎస్.ఎం.

 

21.

నానబెట్టి నార తీసేపద్ధతులలో ప్రత్యూమ్నాయ సాంకేతికతలపై క్షేత్ర స్థాయి ప్రదర్శన (ఎఫ్.ఎల్.డి) (జనుము)

ప్రదర్శనకు రూ. 20,000/-

(ఉత్పాదకాలకు రూ. 17,000, ఆకస్మిత ఖర్చులకు రూ. 3,000/-)

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. వాణిజ్య పంట జనుము

22.

ఉత్పత్తి సాంకేతికలపై క్షేత్ర స్థాయి ప్రదర్శన/అంతరపంట (జనుము)

హె.కు రూ.8,000/- (ఉత్పాదకాలకు రూ. 7,000/-)

ఆకస్మిత ఖర్చులకు రూ. 1,000/-

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. వాణిజ్య పంట జనుము

23.

సమగ్ర పంట నిర్వహణ పై ప్రథమ స్థాయి ప్రదర్శమ (ఫ్రంట్ లైన్ డెమోస్)

హె.కు రూ.7,000/- (ఉత్పాదకాలకు రూ. 6,000/-)

ఆకస్మిత ఖర్చులకు రూ. 1,000/-

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. వాణిజ్య పంట పత్తి

24.

ఈ.ఎల్.ఎస్. పత్తి. ఈ.ఎల్.ఎస్. పత్తి విత్తనాల ఉత్పత్తి పై ప్రథమ స్థాయి ప్రదర్శన

హె.కు రూ.8,000/- (ఉత్పాదకాలకు రూ. 7,000/-)

ఆకస్మిత ఖర్చులకు రూ. 1,000/-

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. వాణిజ్య పంట పత్తి

25.

అంతర పంటలపై ప్రథమ స్థాయి ప్రదర్శన

హె.కు రూ.7,000/- (ఉత్పాదకాలకు రూ. 6,000/-)

ఆకస్మిత ఖర్చులకు రూ. 1,000/-

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. వాణిజ్య పంట పత్తి

26.

అధిక సాంద్రత నాట్ల పద్ధతిపై ప్రయోగాలు

హె.కు రూ.9,000/- (ఉత్పాదకాలకు రూ. 8,000/-)

ఆకస్మిత ఖర్చులకు రూ. 1,000/-

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. వాణిజ్య పంట పత్తి

27.

చెరకు పై అంతర పంటలు, సింగిల్ బడ్ సాంకేతికతలపై ప్రదర్శన

హె.కు రూ.8,000/- (ఉత్పాదకాలకు రూ. 7,000/-)

ఆకస్మిత ఖర్చులకు రూ. 1,000/-

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. వాణిజ్య పంట చెరకు

28.

4 సెషన్ల పంట ఆధారిత శిక్షణ

సెషన్ కు రూ. 3,500/- చొప్పున శిక్షణకు రూ. 14,000/-

ఎన్.ఎఫ్.ఎస్.ఎం. బి.జి.ఆర్.ఇ.ఐ.

29.

ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాల ఎంపిక, వాడకం, నిర్వహణ

వారం నుండి 6 వారాల వ్యవధి గల ఉపయోగపు స్థాయి కోర్సులకు రానూ బోనూ ఖర్చులు, ఉచిత వసతితో సహా స్టైఫెండ్ ఒక్కొక్క రైతుకు రూ. 1,200/-

శిక్షణ, పరీక్షణ, ప్రదర్శనల ద్వారా వ్యవసాయ యంత్రాల ప్రోత్సాహం, బలోపితం.

30.

క్షేత్రాలలో బ్లాకు స్థాయి ప్రదర్శన

వేరుశనగకు, హె.కు రూ. 7,500/-, సోయా చిక్కుళ్ళుకు హె.కు రూ. 4,500/-, అవిసె (రేవ్ సీడ్), ఆవాలు, నువ్వులు, లీన్ సీడ్, నైజర్ లకు హె.కు రూ. 3,000/-, పొద్దుతిరుగుడుకు హె.కు. రూ. 4,000/-

ఎన్.ఎం.ఒ.ఒ.పి

31.

క్షేత్రప్రదర్శనలతో సహా రైతులకు శిక్షణ, రైతులకు/ మదుపుదారులకు క్షేత్ర సందర్శనాల ద్వారా సమగ్ర వ్యవసాయం గురించిన అవగాహన, సామర్థ్యం నిర్మాణం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మలుచుకోవడం, మట్టి, నీళ్ళు, పంటల నిర్వాహణలో మంచి వ్యవసాయ ఆచరణలలో శిక్షణ

20 మంది లేదా అంతకన్నా ఎక్కువ మందికి శిక్షణ కోసం సెషన్ కు రూ. 10,000/-

50 మంది లేక అంతకన్నా ఎక్కువ మంది ఉన్న బృందానికి ప్రదర్శనకి రూ. 20,000/-

ఎన్.ఎం.ఒ.ఒ.ఎ

32.

పొలంపై నీటి నిర్వాహణ/ మైక్రో ఇరిగేషన్ లపై శిక్షణ కార్యక్రమం

2 – 3 రోజుల వ్యవధితో 30 మంది కి శిక్షణ కార్యక్రమానికి రూ. 50,000/-

ఎన్.ఎం.ఒ.ఒ.ఎ

33.

మట్టి ఆరోగ్యం పై శిక్షణ, ప్రదర్శన

రైతులకు క్షేత్ర ప్రదర్శనలతో సహా శిక్షణ, 20 మందికి లేదా అంతకన్నా ఎక్కువ మందికి శిక్షణ సెషన్ కు రూ. 10,000/- ప్రధమ స్థాయి ప్రదర్శనకు రూ. 20,000

ఎన్.ఎం.ఒ.ఒ.ఎ

ఎవరిని సంప్రదించాలి?

జిల్లా వ్యవసాయ అధికారి/ జిల్లా ఉద్యాన అధికారి/ ఏటిఎంఏ (ఆత్మ) ప్రాజెక్ట్ సంచాలకులు

నైపుణ్యతను పెంచే కార్యక్రమాలు

ముఖ్య లక్షణాలు:

 • వ్యవసాయ రంగంలో, దాని అనుబంధ రంగాలలో నిపుణులను తయారు చేసుకోవటానికి గ్రామీణ యువజనులకు, రైతులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోర్సులు.
 • వేతన సహిత ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధిని సంపాదించే దిశగా 200 గంటలు ఆపైన అవధి గలిగిన శిక్షణ తరగతులు.
 • నైపుణ్య శిక్షణా కోర్సుల కోసం భారత వ్యవసాయ నైపుణ్యతా మండలివారు అభివృద్ధి చేసి, వ్యవసాయ, సహకార , రైతు సంక్షేమ శాఖ స్వీకరించి ఉన్న అర్హతా ప్యాకులు.
 • ఎంపిక చేసిన కె.వి.కె. లు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగపు సంస్థలు 2017-18 సంవత్సరానికి గాను 200గంటల (25-30 రోజుల) నైపుణ్యతా అభివృద్ధి కోర్సులను నిర్వహిస్తాయి.
 • అర్హత, యోగ్యతలు కలిగిన శిక్షకుల ద్వారా శిక్షణ.
 • భారత వ్యవసాయ నైపుణ్యతా మండలి ద్వారా తృతీయ పక్షంలో అంచనా.
 • వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ నైపుణ్యతా మండలి (ఏ.ఎస్.సి.ఐ.) ద్వారా ధృవీకరణ.

సహాయ సరళి:

 • గ్రామీణ యువతకు, రైతులకు ఈ కోర్సులన్నీ ఉచితం. సంబంధిత శిక్షణా సంస్థలు (కె.వి.కె.లు/ వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం అభ్యర్థులను ఎంపిక చేస్తాయి.

ఎవరిని సంప్రదించాలి?

 • జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన కె.వి.కె.ల ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్లను.
 • భారత వ్యవసాయ నైపుణ్యతా మండలి (ఏ.ఎస్.సి.ఐ.)ని- www.asci.india.com
2.97701149425
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు