పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రూఫ్ గార్డెన్

ఇంటి పైకప్పు / మేడపై కూరగాయల,పండ్లు,పువ్వుల సాగు

తుమ్మేటి రఘరోత్తమ్ రెడ్డి గత ఏడు సంవత్సరాలుగా ఇంటి పైకప్పు / మేడపై కుటుంబానికి సరిపడా కూరగాయలను, కొన్ని పండ్లను, పువ్వులను కూడా పండిస్తున్నారు. చాలా చిన్న స్థలంలో ఎంత వైవిధ్యాన్ని సాగుచేసి చూపించవచ్చో అదంతా చేసి చూపిస్తున్నారు.

roofgardenఆయనకి వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్నా ఆయన వ్యవసాయంలో స్థిర పడలేదు. ఇంటర్మీడియట్ విద్యను లా పూర్తిచేయకుండానే సింగరేణి బొగ్గు గనిలో కార్మికుడిగా జీవితం ప్రారంభించి కొనసాగారు. అయితే ఆయనకు చిన్నప్పటినుంచి వ్యవసాయం పట్ల మక్కువ. తన ఆసక్తిని ఆయన ఈకాలమంతా కొనసాగిస్తూనే ఉన్నారు. భూమిలోని బొగ్గునూ పైకి తీసారు, ఇప్పుడు మేడపైన పూలు, పండు, కూరగాయలనూ తీసి చూపిస్తున్నారు. అంతే కాకుండా తన అనుభవాలను, పరిశీలనలను తాత్వికతతో కూడిన కొటేషన్స్గా ఇప్పటికే 13 వేలకు పైగా రాశారు.

వారి రూఫ్ గార్డెన్లో టమాట, వంకాయ, కాలీఫ్లవర్, క్యాబేజి, ఉల్లి, దొండ, నేతిబీర, మిరప, మునగ, చేమగడ్డ వంటి కూరగాయలు కరివేపాకు, పుదినా వంటి సుగంధ ద్రవ్యాలు తోటకూర, బచ్చలి, గంగవాయిలి కూర వంటి ఆకు కూరలు, సీతాఫలం, రామాఫలం, అల్లనేరేడు, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, పంపర పనస, సపోటా, బొప్పాయి, మామిడి ఇలా పండ్ల మొక్కలు, ఇంటిలోని కోళ్ళ కోసం కొర్ర, సజ్జ, జొన్న వంటి గింజనిచ్చే వెుక్కలు పెంచుతున్నారు.

ఇక పూల విషయానికొస్తే ములకబంతి, నిత్య వరహాలు, చంద్రకాంతలు, సీతజడలు, బిళ్ళగన్నేరు, మల్లి, రంగు రంగుల మందారాలు, గులాబి, జాజి, రంగురంగుల బోగన్ విలియాలు పెంచుతున్నారు. 160 గజాల మేడ స్థలంలో "హారిజాంటల్గా అంటే సమతలంగానే కాక, వెర్టికల్‌గా అంటే లంబంగా పైకి తీగల పందిరి సహకారంతో సాగును కొత్త అడుగులు వేంు నున్నారు. ఇంటి అవన రాలకు ఉపయోగించుకుంటూ, ఎక్కువ వచ్చిన ఫలసాయాన్ని ఇరుగు - పొరుగులతో పంచుకుంటున్నారు. ఈ పనిని ఆయన సొంత అభిరుచి, స్వయంకృషితో కొనసాగిస్తున్నారు. ఎవరినుంచి ఎటువంటి సహకారం తీసుకోలేదు.

"మట్టి ఆరోగ్యంతోనే మనిషి ఆరోగ్యం" అన్నమాట మనమంతా విన్నదే. ఆయన మరొక అడుగు ముందుకు వేసి "మట్టి, పర్యావరణ ఆరోగ్యాలతో కేవలం మనిషే కాదు సమస్త విశ్వ ఆరోగ్యం" అని అంటారు. అందువల్ల ఆయన మానవ కళ్యాణం అనే మాటకు బదులుగా "విశ్వకళ్యాణం" అనే మాటను వినియోగిస్తారు.

అటువంటి దృష్టితో ఆయన ఎటువంటి రసాయన పరుగు మందులు, ఎరువులు వాడకుండా తన రూఫ్ గార్డెన్ కృషిని కొనసాగిస్తున్నారు. పశువుల పెంట, మేకల పెంట, కోళ్ళ పెంట వంటివి ఎరువులుగా వినియోగిస్తున్నారు. వేరుపరుగు, తెల్ల చీమలు వంటి వాటికి వేపపిండి, వేపనూనె వినియోగిస్తున్నారు. ఇంక ఇతరత్రా పురుగులను ఎప్పటికప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా మొక్కలను సంరక్షిస్తున్నారు. ఎండిపోయిన, రోగంతో వడలిపోయిన వాటిని తుంచి తొలగిస్తున్నారు.

roofgrdn

రూఫ్ గార్డెన్ - తుమ్మేటి రఫరోత్తమ్ రెడ్డి అభిప్రాయాలు:

రూఫ్ గార్డెన్ వలన క్రిమి సంహారక మందులు వాడని తాజా కూరగాయలు, పండు లభిసాంు. ఆరోగ్యపరంగా వీటి విలువ ఇంత అని చెప్పలేము. ఇంటిలోపల చల్లగా ఉంటుంది. కూలర్, ఎ.సి.లు వాడనక్కర లేదు. విద్యుత్ ఆదా అవుతోంది. అందరికీ మండు వేసవి అయితే రూఫ్ గారైన్ చల్లదనంతో తమకు పండు వేసవి. కంటికి పచ్చని ప్రకృతి కనిపిస్తుంది. మంచిగాలి, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. మనలో సృజనాత్మకత పెంచుతుంది. ఇంటిలో అనవసర గొడవలు సమసి కొంత శాంతి నెలకొంటుంది. తద్వారా ఇంటిల్లి పాదికి, మనతో సంబంధాలు ఉన్న అందరికీ ప్రశాంతత లభిస్తుంది. ఇట్లా కంటికి కనిపించని బహుళ ప్రయోజనాలు రూఫ్ గార్డెన్ల వలన సిద్ధిస్తాయి.

మా ఇంటి అడుగు స్థలం 163 గజాలే! మూడున్నర సెంట్లకు కొంచెం తక్కువ. అరఫీటు అటు ఇటుగా రూఫ్కూడా అంతే విస్తీర్ణం. స్థలం ఖరీదు అధికం కనుక కూరగాయ మొక్కల కోసం స్థలం కొనడం మానుకుని, ప్లాటు ఎంతుందో అంత స్థలాన్ని రూఫ్ మీద నిర్మించుకోవాలనుకున్నాను.

ఇంటి నిర్మాణ సమయంలోనే, రూఫ్ గట్టిదనం, వాలు గురించి శ్రద్ధ తీసుకున్నాను. ఇవి సాధారణంగా అందరూ తీసుకునే జాగ్రత్తలే. రైతుకుటుంబం నుంచి వచ్చినవాన్ని కనుక, సేద్యం నా అభిరుచిగా మారింది. రైతుకుటుంబం నుండి వచ్చినవాన్ని కనుకనే వ్యవసాయోత్పత్తులు క్రిమిసంహాకర మందులతో ఎంత విషతుల్యం అవుతున్నాయో తెలుసు. ఇంటర్ చదివే రోజుల్నుంచీ కూరగాయల పెంపకం పట్ల ఆసక్తిని పెంచుకున్నాను. నేను సింగరేణి క్వార్టర్స్‌లో ఉన్నన్ని సంవత్సరాలు స్థలం సమస్యలేకుండె. హైదరాబాద్‌కు మారాలనుకున్న తర్వాతనే నాకు పెరటి తోటకు స్థలం సమస్య ఎదురైంది. రూఫ్ గార్డెన్ ఆలోచనలతో స్థలం సమస్యని అధిగమించాను.

ఏడు సంవత్సరాల క్రితం రూఫ్ గార్డెన్‌ని నిద్దె మీద ప్రారంభించాను. సుమారు ఇరవై వేల రూపాయలు ఖర్చుచేసి ఉంటాను. బరువు పనులు విషయంలో మా అబ్బాయి తిలక్ సాయం మినహా ఒక్క కూలీని కూడా వాడుకోలేదు. రూఫ్ గార్డెన్‌ని మించిన వ్యాయామశాల లేదు.

గత ఏడు సంవత్సరాలుగా బయట మార్కెట్లో కూరగాయలు కొనలేదు. రసాయన ఎరువులు పరుగు మందులు లేని కూరగాయల్ని పొందుతున్నాం. పెస్టిసైడ్స్ కొట్టని కూరగాయలు - అది చాలా చాలా ముఖ్యమైన విషయం.

అనేక విషయాల పట్ల, సామాజిక విషయాల పట్ల పట్టింపు ఉన్నవాళ్ళు కూడా తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ఆహారం విషయంలో మరీ అధ్వానం. ఆహారం ఎంత కలుషితమవుతోందో, దాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఎన్ని విషాలను క్రిమిసంహారక మందుల పేరుతో ఉపయోగిస్తున్నారో అందరికీ తెలుసు. తినేవాళ్ళ ఆరోగ్యం చెడిపోవడమే కాదు,ఆయుఃప్రమాణం తగ్గిపోతోంది. అన్నీ తెలిసిన వాళ్ళు, వనరులు ఉన్నవాళ్ళు స్థలం లేకపోయినా రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని, మంచి కూ యాగాయులను , వండ ను పండించుకోవచ్చు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా, సమాజ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కేవలం పండ్లు, కూరగాయలే కాదు ఇంతకు ముందు చెప్పకున్న అనేక కనబడని ప్రయోజనాలు రూఫ్ గార్డెన్తో ముడిపడి ఉన్నాయి. మన కృషినిబట్టి, అవగాహన శక్తిని బట్టి అవన్నీ మన అనుభవంలోకి వస్తాయని రఘటోత్తమ్ అంటూరు.

మన రైతుల వలనే రఘరోత్తమ్ మంచి విత్తనాల కోసం అవస్థ పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి తనంతట తానే విత్తనాలను కూడా ఉత్పత్తి చేసుకుంటున్నారు. సూల పోషకాలు, సూక్ష్మపోషకాలు, మట్టినాణ్యత సమస్యలు, విత్తనాల సేకరణ - పరిరక్షణ, చీడపీడలకు సంబంధించి వ్రత్యామ్నాయు యూజమాన్య వద్దతులకై అన్వేషిస్తున్నారు. మొక్కలకోసం ఉపయోగించే తొట్టెలు, నిర్మించుకున్న తొట్టెలు, ఉపయోగించిన మట్టి అన్నింటిని చాలా సూక్ష్మంగా పరిశీలించి తగిన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వ్యవసాయానికి మూల సూత్రం "పునః చంక్రమణం (రీసైక్లింగ్) కాబట్టి, ఆ సూత్రాన్ని పదార్థ వినియోగంలో, యాజమాన్యంలో మెళకువతో ఉపయోగిస్తున్నారు. వనరులు వృథా కాకుండా పరిరక్షిస్తున్నారు. రఘరోత్తమ్ గారి అభిరుచి, కృషికి ఆయన సహచరి రూప గారు, అబ్బాయి తిలక్‌ల ఉంది. అంటే ఇంటిల్లిపాది పూనుకుంటే ఇలాంటి ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోవచ్చు.

మొత్తంగా ఇవాళ నగర ప్రాంతాల్లోని సమాజం ఇటువంటి 'రూఫ్ గార్డెన్' వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. గాలి, నీరు, మట్టి, శబ్దం, తినే ఆహారం అన్నీ కలుషితమైపోతున్న ఈ పరిస్థితుల్లో సమాజ, పర్యావరణ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. సమస్త ప్రాణికోటికి ముప్ప వాటిల్లుతోంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సర్వసాధారణమయిపోయి మనుషులు ప్రాణాంతక వ్యాధుల బారినపడి అర్గాంతర, అసహజ మరణాల పాలవుతున్నారు.

ప్రజల్లో రకరకాల కాలుష్యాలపైన అవగాహన పెరగడం, ఆరోగ్యకరమైన ఆహారం పట్ల దృష్టి పెరగడం వారు రూఫ్ గార్డెన్ల గురించి ఆలోచించడానికి కారణమవుతోంది. గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రాసెసింగ్‌కు, నిల్వచేయడానికి అనుకూలమైన రకాలను పరిశోధనలతో తయారు చేస్తున్నారు. ఆకర్షణీయంగా కనబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రుచికరమైన మన దేశవాళి రకాలు అన్ని పంటల్లోను కనుమరుగయి పోతున్నాయి. రూఫ్ గార్డెన్ల ద్వారా మనవైన రకాలను మనం అభివృద్ధి చేసుకోవచ్చు. రూఫ్ గారైన్లతో కుటుంబాలకు స్వావలంబనతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మార్కెట్ నిండా కృత్రిమ రంగులు, దారుణమైన విషపూరిత మందులతో నిండిపోయిన పదార్ధాలే మనకు లభిస్తున్నాయి. ఇవన్నీ దీర్ఘకాలంలో మనిషేనే కాదు మొత్తంగా పర్యావరణాన్ని నాశనంచేసే పరిస్థితి ఉంది. మన పూర్వీకులు మనకు ఆరోగ్యకరమైన, పునరుత్పత్తి శక్తికలిగిన భూమిని, గాలిని, నీటిని, పర్యావరణాన్ని మనకందించారు. మరి మనం అలాంటి నాణ్యతతో, పునరుత్పత్తి శక్తితో ఉన్న పర్యావరణాన్నే మన భవిష్యత్ తరాలకు అందిస్తున్నామా ? అనేది మనమంతా ప్రశ్నించుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం పట్ల మన దృష్టి మారాల్సి ఉంది. లాభాపేక్ష నుండి సుస్థిర ప్రకృతి సేద్యం వైపు మరలాల్సి ఉంది. ఇలాంటి వేయి ఆలోచనలు కలిగించడంలో వ్యవసాయ సంస్కృతిని ముందుకు తీసుకుపోవడంలో, మొక్కలతో సంభాషించడంలో రూఫ్ గార్డెన్లు తోడ్పడతాయి.

మన పిల్లలు ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఆటలలో పందాలే తప్ప సమిష్టి భావన లేదు. ఒకరినొకరు ఎదుర్కోవడానికి ప్లాస్టిక్ గన్నులే ఆడుకునే వస్తువులు. అందరిని తొక్కేసి పైకి ఎదిగే 'బిజినెస్' , 'మోనోపలి' లాంటి ఆటలు ఆడుకుంటున్నారు. వారికి కష్టించి మొక్కలను పెంచడం, వాటిని పరిశీలించడం, ఫలితాన్ని పొందడం, నలుగురితో పంచుకోవడం, మొక్కల్ని కాపాడుకోవడం వంటి విలువల్ని రూఫ్ గార్డెన్ల ద్వారా మనమే నేర్పించాలి. మన రైతుల కష్టంపై గౌరవం కలిగి, వారి సాగు సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలిగే ఇంటింట పంటల పరిశోధనలకు మనమంతా వేదికలు కావాలి.

ఇటువంటి తరుణంలో రఘాత్తమ్ 'రూఫ్ గార్డెన్' ల ప్రత్యామ్నాయాన్ని ఎంతో సృజనాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు. ఇది ఆశాజనకం, మంచి పరిణామం. దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 20 లక్షల ఇళ్ళు ఉన్నాయి అని అనుకుంటే, సగటున 100 గజాలు (2సెంట్లు) మేడపైన స్థలం ఉంటుందనుకుంటే ఆ స్థలంలో ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ చేయవచ్చు, 20 లక్షల ఇళ్ళు X 2 సెంట్లు = 40,00,000 సెంట్లు అవుతాయి. అంటే వంద సెంట్లు ఒక ఎకరం కాబట్టి, నగరంలో దాదాపు 40 వేల ఎకరాలలో ఈ రూఫ్ గార్డెన్ సాగు సాధ్యమవుతుంది. సునిశితంగా ఆలోచించి ఆచరణకు దిగితే అంతకన్నా రెట్టింపు స్థలమే సాగుకు లభ్యమౌతుంది.

రూఫ్ గార్డెన్ మొక్కల పెంపకంలో జాగ్రత్తలు :

డాబా పైకప్పు బలంగా మొక్కల బరువు మోయగలిగేలా ప్రణాళిక చేసుకోవాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మరుగు నీటి పారుదల సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. ప్రణాళికా బద్ధంగా మొక్కలు నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు ఉండేలా చూసుకోవాలి. నీళ్ళ ట్యాంక్‌ను పైనే అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. గాలి వేగాన్ని తగ్గించే మొక్కలను చుటూ పెంచాలి. కుండీలను సూర్యరశ్మి సోకే విధంగా ఏర్పాటు చేయాలి. లోతుగా పెరిగే వేర్లు ఉన్న మొక్కలను పెద్ద కుండీలలో, పైపైన పెరిగే వేర్లున్న మొక్కలను చిన్నకుండీలలో పెంచాలి. బరువైన పెద్దకుండీలను భవనం బలమైన భాగాలలో (బీమ్‌లపై) ఉంచాలి. కుండీలో తేమ పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు నీరందించాలి. కుండీలలో కలుపు మొక్కలు, మొక్కలపై పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా చూడాలి. కుండీలను గాలిసోకే విధంగా ఒకదానికొకటి ఎడంగా ఉండేటట్లు అమర్చాలి. విషప్రభావం ఉన్న రసాయనాలను, కాపాడుకుందాం. మందులను పిచికారీ చేయకూడదు.

అయితే ఉద్యానశాఖ వారు ఇటువంటి రూఫ్‌గార్డెన్‌లు పెంచాలనుకునే వారికి 2012 నుంచీ సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నగరంలో దాదాపు తొమ్మిది, పదివేల మంది దాకా ఇలాంటి ప్రయతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అయితే నగరంలోని ఇళ్ళ సంఖ్యతో పోల్చి చూస్తే, ఈ సంఖ్య ఒక శాతం కూడా కాదు. వీరిలో చాలామంది ఫేస్ బుక్ మాధ్యమంలో "మన ఇంటిపంట" గ్రూప్ గా ఏర్పడి, ఒకరికొకరు సలహాలు, సహకారం అందించుకుంటున్నారు. సర్వసాధారణంగా ఎక్కువ మంది మంచి విత్తనాలు, ఎరువులు విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చీడ పీడల నివారణ విషయంలో ప్రత్యామ్నాయ మెళకువల కోసం వెదుకులాటలో ఉన్నారు. కొంత మంది దిగుబడి అంత ప్రోత్సాహకరంగా లేదని భావిస్తున్నారు. సరైన విత్తనాలు, ఇతర అవసరమైన సాంకేతిక సహకారం వారికి చేరవేయగలిగితే ప్రతి ఒక్కరూ రూఫ్గార్డెన్లను పెంచగలుగుతారు. పచ్చని కాంతులు, మనసులను చల్లబరిచే వాతావరణం తమ సాంతం చేసుకోగలుగుతారు. ఆ దిశగా అందరం దృష్టి సారించాల్సి ఉంది.

రూఫ్ గార్డెన్ల ప్రయత్నాన్ని స్థలాభావం ఉండే నగరాలు, టౌన్లలో చేపట్టడం ఎంతో ఉపయోగకరం, అవసరం. రూఫ్ గార్డెన్లపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటే నిరుద్యోగ యువత ఈ రంగంలో స్వయం ఉపాధికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఎంతో మంది రూఫ్ గార్డెన్ తమకు ఏర్పాటు చేయడంలో. సహకరిపై ఈ ఆలోచనని ముందుకు తీసుకుపోగలమనే ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఆలోచనలు ముదుకు తీసుకుపోవడంలోనే మనందరి భవిష్యత్తు, శ్రేయస్సు, మనుగడ ముడిపడి ఉన్నాయి. అందువల్ల మానవ కళ్యాణ పరిధిని దాటి విశ్వకళ్యాణానికి బాటలు వేద్దాం. మనిషిని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.95744680851
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు