హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / వరి, మొక్కజొన్న,ఇతర పంటలలో జింక్ లోప నివారణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వరి, మొక్కజొన్న,ఇతర పంటలలో జింక్ లోప నివారణ

జింక్ ధాతువు లోపనివారణ,చర్యలు

varimokkajonnaజింక్ ధాతువు మోక్కలకెంతో అవసరమైన ఎంజైములు ఆక్సీకరమలో చురుకుగా పాల్గొనడమే కాకుండా హార్మోన్ల (ఆర్సీన్) పెరుగుదల సంశ్లేషణలో కూడా ఎంతో అవసరమైనది. క్లోరోఫిల్ నిర్మాణంలోనూ, కిరణజన్య సంయోగ క్రియలోనూ, మెటబాలిక్, శక్తినిచ్చే క్రమంలోనూ కూడా జింక్ ధాతువు ప్రభావం అధికంగా ఉంటుంది.

మన దేశంలోని అన్ని రకాల నేలల్లోను, వివిధ పంటలను జింక్ లోపం తీవ్రంగా విస్తరించి ఉంది. జింక్ లోపం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగక, కురచగా మారుతాయి. తక్కువ దుబ్బు కట్టడం, ఆకులు పసుపు పచ్చగా మారడం జరిగి, దిగుబడులు తగ్గే అవకాశాలు చాలా అధికం.

జింక్ ధాతు లోపానికి కారణాలు

 • లవణ సాంద్రత ఎక్కువగా ఉన్న నేలలు.
 • నేలలో సేంద్రీయ కర్బన శాతం తక్కువగా ఉండడం.
 • కేవలం రసాయన ఎరువులపైనే ఆధారపడి సేంద్రీయ ఎరువులను పూర్తిగా విస్మరించడం.
 • సమగ్ర ఎఁరువుల యాజమాన్యాన్ని విస్మరించడం.

వరిలో జింక్ లోప లక్షణాలు

 • సాధారణంగా వరి నాటిన రెండు నుండి నాలుగు లేదా ఆరు వారాల్లో అంటే దుబ్బు కట్టే దశలో ఈ ధాతు లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 • పైనుండి మూడు లేదా నాలుగు ఆకుల్లో ముఖ్య ఈనె పాలిపోతుంది.
 • ముదురాకు చివర్లో మధ్య ఈనె ఇరు పక్కల తుప్ప లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి.
 • ఆకులు చిన్నవిగా, పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి.
 • మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రదని ఎరువులు వేసినప్పటికి పైరు పచ్చపడదు.

మొక్కజొన్నలో జింక్ లోప లక్షణాలు

మొక్కలు మొలకెత్తిన 20 రోజుల తర్వాత, జింక్ లోపం వల్ల మొక్కల ఆకులు అన్ని తెలుపు వర్ణంలోకి మారి గిడసబారిపోతాయి.

నివారణ చర్యలు

 • వరి ఏక పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి రెండు పంటలు పండించినట్లయితే ప్రతీ రబీ సీజన్ లో, ఆఖరి దుమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.
 • వరి, మొక్కజొన్నలో జింక్ లోపం గమనించగానే లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
 • భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేట్ ను కలిపి చేయరాదు. కనీసం వేస్తే రసాయనిక చర్య వల్ల ఫలితం ఉండదు.
 • జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేదా తెగుళ్ళ మందు కలుపరాదు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు