హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / వివిధ కూరగాయ పంటలలో వైరస్ తెగుళ్ళ యాజమాన్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వివిధ కూరగాయ పంటలలో వైరస్ తెగుళ్ళ యాజమాన్యం

వివిధ కూరగాయ పంటలలో వైరస్ తెగుళ్ళ యాజమాన్యం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 2 లక్షల హెక్టార్లలో పలు రకాల కూరగాయలు పండిస్తున్నారు. మన ఆహారంలో కూరగాయలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మన శరీరానికి కావలసిన పోషకాలతో ముఖ్యంగా విటమిన్లు, లవణాలు కూరగాయల ద్వారా అందుతాయి. నిపుణుల సలహా మేరకు ప్రతి మనిషికి రోజుకు 280 గ్రా. కూరగాయలు అవసరం కాగా 92 గ్రా. మాత్రమే లభ్యమవుతాయి. అయితే తక్కువ కమతాలు కలిగిన రైతులు (అంటే సన్నకారు) కూడా కూరగాయలు పండించి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ఏ పంటైనా ఎక్కువ చిస్తీరణంలో క్రమం తప్పకుండా పండిస్తున్నప్పుడు చీడపీడల సమస్యలు అధికమవుతాయి. మిగతా పంటలతో పోలీస్ కూరగాయ పంటల్లో తెగుళ్ళ వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో పండిస్తున్న కూరగాయ పంటల్లో ముఖ్యమైనవి టమాటా, బెండ, వంగ మరియు మిరప. ముఖ్యమైన పంటల్లో వచ్చే వైరస్ తెగుళ్ళు ఏమిటో వాటి నివారణ చర్యలు ఏమిటో చూద్దాం.

టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్

దీన్నే తలమడు లేదా మచ్చల మాడు అని కూడా అంటారు. ఈ తెగులు తమర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల పైన మొదట ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. లేత ఆకులూ కంచు రంగులో కనిపిస్తాయి. తరువాత దశలో ఈ మొక్కల లేత కండవు భాగాల పైన, తొడిమలు పైన కూడా నిలుపు చారల వలె ఉన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. క్రమంగా లేత చిగుళ్ళు మాడి పెరుగుదల నిలిచిపోయి పై నుండి కిందకు మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. తెగులు సోకినా మొక్కలలో పూత, కాయ గణనీయంగా తగ్గిపోతుంది. కాయల పైన ఉంగరాలు వంటి లేత పసుపు రంగు వలయాలు ఏర్పడుతాయి. పండిన కాయలలో ఈ వలయాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

బెండలో పల్లాకు తెగులు

ఈ తెగులు వైరస్ ద్వారా సోకుతుంది. తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కలు బాగా గిడసబారి పూత, కాయ గణనీయంగా తగ్గిపోతుంది. ఇట్టి మొక్కల పైన వచ్చే కొద్దీ పాటి కాయలు కూడా పూర్తి పెరుగుదల లేక చిన్నవిగా ఉంది పసుపు రంగులో ఉంటాయి. ఒకవేళ ఈ తెగులు గింజలు మొలిచిన 20 రోజులలోపే ఆశించినట్లయితే దిగుబడిలో చాలా ఎక్కువ నష్టం కలుగుతుంది.

వంగలో చిట్టాకు తెగులు (లిటిల్ లీఫ్)

ఈ తెగులు మొక్కల కొమ్మల చివర్లలో లేతాకు పచ్చ వర్ణంలో ఉన్న చిన్న చిన్న ఆకులు గుత్తులు ఏర్పడతాయి. ఇలాంటి మొక్కలలో సాధారణంగా వచ్చే పూత ఉండదు. తద్వారా మెక్కలు గొడ్డుబారి పోతాయి. పచ్చదోమ తెగులును వ్యాపింపచేస్తుంది.

మిరపలో కుకుంబర్ మేజయక్ వైరస్

ఈ వైరస్ పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా తెగులు సోకిన మొక్కలు గిడసబారి గొడ్డు బారతాయి. ఆకులు పాలిపోయి లేత ఆకుపచ్చ రంగులోకి మారతాయి. కొన్ని సందర్భాల్లో ఆకులు సన్న బారడం పసుపు వర్ణంలోకి మారడం, నల్లటి మచ్చలు ఏర్పడడం వంటి లక్షణాలను చూపిస్తాయి. కాయల పై నల్లటి వలయాలేర్పడతాయి.

మొవ్వు కుళ్ళు తెగులు

తెగులు ఆశించిన మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండం పై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చర్యలుగా మారతాయి.

ఆకులు పై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు తమర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్ట పరిస్ధితులలో అధిక నత్రజని మేతాడు వలన తమర పురుగు ఉదృతి ఎక్కువై నీటి ద్వారా వైరస్ ను మొక్కలకు వ్యాప్తి చేస్తాయి.

మిరప ఆకు ముడత తెగులు (జెమిని వైరస్)

ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన ఆకులు మడత బడడం పసుపు వర్ణంలోకి మారడం, మొక్కలు గిడసబారడం తెగులు యెక్క ముఖ్య లక్షణాలు. తెగులు సోకిన మొక్కలలో కణుపులు ఆకుల పరిమాణం తీవ్రంగా తగ్గుతుంది. ఆకులు అంచుల పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల అంచులు లేత ఆకుపచ్చ రంగు నుండి కాంతివిమతమైన పసుపు రంగుకు మారతాయి. ఆకులు ముడుచుకున్నప్పుడు బొబ్బలుగా కన్పిస్తాయి. కనుక దీన్ని బొబ్బర తెగులు అని కూడా అంటారు.

పందిరి తీగ కూరగాయలలో వెర్రి తెగులు

ఈ వైరస్ తెగులును పేనుబంక వ్యాప్తి చేస్తుంది. ఆకుల ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి, గిడస బారిపోయి పూత, పిండే ఆడిపోతుంది.

వైరస్ తెగుళ్ళ నివారణ

వైరస్ సోకిన మొక్కలను పైకి కాల్చి వేయాలి. పొలంలో గట్ల మీద వైరస్ ఆశ్రయ మిచ్చే కలుపు మొక్కలను పీకి వేసి శుభ్ర చేసుకోవాలి. తప్పని సరిగా విత్తనశుద్ధి చేయాలి. ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా. ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసిన ఎదల తొలిదశలో రసం పీల్చే పురుగుల నుండి మొక్కలకు రక్షణ కల్పించవచ్చు. ఎరువుల సమతుల్యత పాటించాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వాడాలి. నత్రజని ఎరువులను ఎక్కువగా వాడరాదు. పొలంలో అక్కడక్కడా గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను ఉంచడం వల్ల తెల్లదోమ ఉదృతి తగ్గించవచ్చు. 5 శాతం వేపసింహల కాషాయం 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి. లీటరు నీటికి 5 మీ.లి. వేపనూనెను వాడి నివారించవచ్చు. వేపనూనెతో పాటు లీటరు నీటికి 1 గ్రా. సబ్బా పొడి కొంత సర్ఫ్ పాడినా కలపాలి. ఇవి కలప కుండా వేపనూనె వాడినట్లయితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. వేపనూనెను పురుగు మందులతో కలిపి వాడరాదు.

ఆధారం : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.09375
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు