অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆముదం

నేలలు

నీరు ఇంకిపోయే అన్ని  నేలలు అనుకూలం. వేసవిలో 2 లేదా 3 సార్లు దున్ని గుంటకతో చదును చేయాలి.

విత్తే సమయం

జూన్ 15 – జూలై నెల ఆఖరు వరకు విత్తుకోవచ్చును.  నీటి వనరులు ఉన్నచో సెప్టెంబర్ మొదటి పక్షములో రబీ పంటగా విత్తుకోవచ్చును.  పంట కాలము  120 – 180 రోజులు.

రకాలు

రకం పంటకాలం (రోజులు) దిగుబడి (క్వి.హెక్టారుకు) గుణగణాలు
జ్యోతి (డి.సి.ఎస్9) 90 - 150 12.5 – 15 ఎండు తెగులును తట్టుకుంటుంది
క్రా0తి(పి.సి.ఎస్ 4) 90 - 150 13.75 – 16.25 బెట్టను తట్టుకుంటుంది. త్వరగా కోతకొస్తుంది
జ్వాల (48 – 1) 90 - 180 12.5 – 15 ఎండు తెగులును కొంతవరకు బూజు తెగులును తట్టుకుంటుంది
కిరణ్ (పి.సి.ఎస్136) 90 - 150 12.5 – 15 బెట్టను తట్టుకుటుంది. బోడి కాయల వల్ల బూజు తెగులు తాకిడి తక్కువగా ఉంటుంది.
హరిత 90 - 180 13.75 – 16.25 ఎండు తెగులును తట్టుకుంటుంది
జి.సి.హెచ్ 4 90 - 180 13.75 – 17 వేరుకుళ్ళు, ఎండ తెగుళ్ళను తట్టుకుంటుంది
పి.సి.హెచ్ 1 90 - 180 13.75 – 17.5 బెట్టను తట్టుకుంటుంది
డి.సి.హెచ్ 177 90 - 180 15 – 18.75 బెట్టను, ఎండు తెగులును తట్టుకుంటుంది

విత్తనం – విత్తేపద్దతి

హెక్టారుకు రకాలయితే 5 – 7  కిలోలు, సంకర జాతి రకాల యితే 5 కిలోల విత్తనం కావాలి.

విత్తన శుద్ధి

కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా 3 గ్రా.కాఫ్టాన్ లేద 1 గ్రా.కార్బన్ డైజిమ్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. దీని వలన ఆకుమచ్చ తెగులు, మొలక కుళ్ళు తెగులు, కొంతవరకు వడలు  తెగులును నివారించవచ్చును.

విత్తన దూరము

  • రకాలకు – 90 సె0.మీ.(3 అడుగులు) X 60 సె0.మీ.(2 అడుగులు)
  • హైబ్రిడ్ – 90 సె0.మీ.(3 అడుగులు) X 90 సె0.మీ.(2 అడుగులు)

ఎరువులు

పశువుల ఎరువు హెక్టారుకు 5 టన్నులు దఉక్కిలో వేయాలి.


నత్రజని భాస్వరము పొటాష్
రకాలకు హెక్టారుకు 40 – 60 40 30
సంకర జాతి (హైబ్రిడ్) రకాలకు హెక్టారుకు 80 – 100 40 30
నత్రజని  ఎరువులు రెండు దఫాలుగా సగం విత్తే ముందు మిగిలిన సగం 35 – 40 రోజులకు నేలలో తేమను బట్టి వేసుకోవాలి.

అంతర పంటలు

ఆముదం + కంది ( 1 : 1 ), ఆముదం + బొబ్బర్లు ( 1 : 2 ), ఆముదం + పెసర/మినుములు ( 1 : 2 ), ఆముదం + వేరుశనగ ( 1 : 5 ), ఆముదం + గోకర( 1 : 1 ), ఆముదం + ఉలవలు( 1 : 8 ).

అంతర కృషి

విత్తిన 60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి.  విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45% (హె||) 2.5 లీ. లేదా అలాక్లోర్ 50 శాత0 1.5 కిలోల (హె||)  కలుపు మొలవక ముందు వాడి కలుపును నివారించవచ్చును.

సస్యరక్షణ

ఎర్ర గొంగళి పురుగు

తొలకరి వర్షాలు పడిన రెండవ రోజు పురుగులు వెలువడి గ్రుడ్లు పెడతాయి.  జూన్ – జూలై నెలల్లో ఈ పురుగు ఉద్భతి ఉంటుంది.  ఈ పురుగులు మొదట పత్రహరితాన్ని తిని, తరువాత ఆకులను, కాడలను, ఈనెలనుతిని కొమ్మలను మాత్రమే మిగిలుస్తాయి.

నివారణ :

  • తొలకరి వర్షాలు పడిన మరుసటి రోజు నుండి వరుసగా 2 – 3,  సాయంత్రం 7 గం|| సమయంలో పొలములో సామూహికంగా రైతులందరు మంటలను వేయాలి.
  • జిల్లేడు, లోట్టపీచు మరియు అడవి ఆముదము / ఆకులను/కొమ్మలను పొలంలో అక్కడక్కడ వేసి ఆకర్షించబడిన పురుగులను ఏరి నాశనంచేయాలి.
  • పొలం చుట్టు లోతైననాగటి సాలును తీసి మిథైల్ పెరథియాన్ 2 : 1 లేదా ఎండోసల్ఫాన్  పొడి మందును వేయుట వలన ఎదిగిన గొంగళి పురుగులు ఒక పొలం నుండి వేరొక పొలంలోకి పోకుండా నివారించవచ్చు.
  • ఎదిగిన పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ. లేదా డైమిథోయేట్ 2.0 మి.లీ. లేదా వేప నూనె 5 మి.లీ. ఒక లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

దాసరి పురుగు/నామాల పురుగు

ఈ పురుగు ఉథృతు ఆగస్ట్ – అక్టోబర్ వరకు ఉంటుంది.  ఈ పురుగు మొదటి దశలో ఆకులను గోకి తింటుంది.  తరువాత దశలో, ఆకులను, కొమ్మలను, పూత కాతను తిని నష్టం కలుగ చేస్తాయి.

నివారణ:

  • సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఎకరానికి 10 పంగకర్రలను నాటిన పొలంలోకి పిట్టలు వచ్చి పురుగులను ఏరితింటాయి.
  • కార్బరిల్ 50 శాతం 3 గ్రా.లేదా మోనోక్రోటోఫాస్ 36 శాతం 1.5 మి.లీ. ఒక లీ. నీటికి కలిపి ఆకు అడుగుభాగం తడిసేలా పిచికారి చేసి దాసరి పురుగును నివారించవచ్చును.

పొగాకు లద్దె పురుగు

ఈ పురుగు సెప్టెంబర్ – నవంబర్ వరకు పంటను ఆశిస్తాయి.  లద్దె పురుగులు మొదటి దశలో గుంపులు, గుంపులుగా ఆకు క్రిందకు చేరి ఆకులను గోకి తిని జల్లెడలాగ చేస్తాయి.  తరువాత దశలో ఆకులను, కొమ్మలను తిని పంటను నాశనం చేస్తాయి.  ఈ పురుగులు పగటివేళల్లో మట్టిబెడ్డల క్రిందా లేదా భూమి నెర్రెలో దాక్కొని రాత్రి వేళల్లో పైరును నాశనం చేస్తాయి.

నివారణ:

వేసవిలో పొలాన్ని లోతుగా దున్ని దుక్కి చేయాలి.  జల్లెడగ మారిన ఆకులను లద్దె పురుగులతో సహా ఏఇ నాశనం చేయాలి. ఎకరానిఇ 4 – 5 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేయాలి.  తొలిదశలోని లద్దె పురుగు నివారణకు వేపనూనె 5 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి లద్దె పురుగును నివారించవచ్చును. పెద్ద లద్దె పురుగులను విషపు ఎరలతో అరికట్టాలి.

విషపు ఎరను తయారు చేయు పద్ధతి: తవుడు 5 కిలోలు, బెల్లం 0.5 కిలో, మోనోక్రోటోఫాస్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి ఉండలు తయారు చేసి ఒక ఎకరం పొలంలో సాయంత్రం మొక్కల మొదళ్ళలో ఉంచితే పురుగులు తిని చస్తాయి.

బూజు తెగులు లేక కాయ కుళ్ళు తెగులు

ఇది వర్షాలు అధికంగా పడి గాలిలో  తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గెలల మీద కాయల మీద బూజు లాగా కనిపిస్తు0ది. తెగులు సోకిన భాగాల పైన దూది గింజలాంటి బూడిద లేక గోధుమ వర్ణపు శిలీంద్రపు పెరుగుదల కనిపిస్తుంది. నివారణ: విత్తనము  90X90 సెం.మీ. దూరములో విత్తుకోవాలి.  కొంతవరకు తట్టుకునే రకాలైన కిరణ్ మరియు జ్వాల రకాలు విత్తుకోవాలి. వాతావరణ హెచ్చరిక అనుసరించి వర్షానికి 6 గం|| ము0దు కార్బన్ డైజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి ముఖ్యంగా గెల పై పిచికారి చేస్తే ఈ తెగులు ఉధృతిని అరికట్టవచ్చును.  వ్యాధి సోకిన గెలలను తీసి నాశనం చేసి తేమ ఉన్న యెడల ఎకరాకు 10 కిలోల యూరియా వేసిన, క్రొత్త కొమ్మలు వచ్చి దిగుబడి పెరుగుతుంది.

వడ తెగలు

ఈ తెగలు విత్తిన 20 – 60 రోజుల మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది.  ఈ తెగలు సోకిన మొక్కలు వడలి ఎండిపోతాయి.  కాండము చీల్చి చూస్తే తెల్లటి బూజు లాటి శిలీంద్రము పెరుగుదల కనిపిస్తుంది.

నివారణ: నీరు నిలుచు నేలలు మరియు పల్లపు ప్రాంతాల్లో ఆముదం సాగు చేయరాదు. పంట మార్పిడి పాటించి సజ్జ పంటను వేసుకోవాలి.  తెగులు సోకిన మొక్కలను తీసి నాశనం చేయాలి. తెగులును తట్టుకునే రకాలైన జ్యోతి, క్రాంతి, జ్వాల, డి.సి.హెచ్ . 32 జి.సి.హెచ్ . 4 లాంటి రకాలను ఎన్నుకోవాలి.  కార్బన్ డైజిమ్ 3 గ్రా.ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.  తెగులు సోకిన మొక్కలపై ఒక  లీటరు నీటికి కార్బన్ డైజిమ్ కలిపిన మందు నీటికని మొక్కల మొదళ్ళు తడిసేటట్లు చల్లాలి. అంతర పంటగా కంది వేసుకోవాలి.

ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/9/2022



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate