অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కుసుమ

నేలలు

నీరు నిలువని, బరువైన, తేమని నిలుపుకొనే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్ర గరప నెలలు ఈ పంటకు అనుకూలం.

విత్తే సమయం

సెప్టెంబర్ ఆఖరు వారము నుండి అక్టోబర్ మొదటి వారము లోపల విత్తవలెను.

రాయలసీమలో అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. కుసుమను ఏక పంటగానూ, అంతర పంటగాను పండింవచ్చును. అంతర పంటగా  -

  1. శనగలు+కుసుమ (3:1 లేక 2:1),
  2. గోధుమలు+కుసుమ (3:1లేక 2:1), ధనియా+కుసుమ (3:1లేక2:1) స్వల్పకాలిక ఖరీఫ్ పంట తరువాత కుసుమ పంట తరువాత కుసుమ పంట వేసుకోవడము లాభదాయకం. ఆహారపంట తరువాత గాని, పప్పుధాన్యపు పంట తరువాత గాని కుసుమ సాగు చేసిన లాభదాయకం.

విత్తనం – విత్తే పద్ధతి

విత్తనము ఎకరాకు 4 కిలోలు (పూర్తి పంటకు) 1.5 కిలోలు (అంతర పంటకు), నాగటి సాళ్ళతో విత్తనాన్ని 5 సెం.మీ. లోతుళొ విత్తుకోవాలి,

విత్తనశుధ్ధి

విత్తన సంబంధమైన, భూమి నుంచి వచ్చే తెగుళ్ళును నివారించుటకు 3గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా కార్బండైజిమ్ కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.

విత్తే దూరం

వరుసల మధ్య 45 సెం. మీ. మరియు వరుసల్లోమొక్కల మధ్య 20 సెం.మీ.  ఉండేటట్లు విత్తుకోవాలి ,

ఎరువులు

వర్షాధారపు పంటకుహె|| 40 కిలొల నత్రజని 25 కిలోల భాస్వరం ఇచ్చుఎరువులు విత్తనం వేయటానికి ముందు వేసుకోవాలి.

అంతర కృషి

విత్తనం విత్తిన తరువాత 25 – 30 రోజుల మధ్య ఒకసారి, 45 – 50 రోజుల మధ్య ఒకసారి దంతి తిప్పి చేతి కలుపులు తియ్యాలి.

రకాలు

రకం పంటకాలం
(రోజులు)
దిగుబడి (క్వి.హె) గుణగణాలు (క్వి.హె)
మంజీర 120 11 నూనె శాతం 30.
సాగరముత్యాలు 125 14 తుప్పును తెగులును తట్టుకుంటుంది
భీమ (54) 130 16 అధిక దిగుబడి రకం. నూనె శాతం 31
డి.ఎస్ .హెచ.129 130 18 ఎండు తెగులును తట్టుకుంటుంది
ఎమ్ .కె.హెచ్ . 130 18 అన్ని ప్రాంతాలకు అనుకూలమైంది

సస్యరక్షణ

పేనుబంక

ఆలస్యముగా పంటను వేసికొనిన పేనుబంక సమస్య ఎక్కువగా ఉండును.  పిల్ల, పెద్దపేలు, ఆకుల నుండి, కొమ్మల నుండి, మరియు కాండము నుండి రసము పీల్చి తేనె వంటి పదార్థ విసర్జించును.  దానికి నల్లని బూజు సోకి మొక్కలు బలహీనమై ఎదుగుదల తగ్గును. పేనుబంక ఉధృతి ఎక్కువ ఉన్న యెడల మొక్కలు ఎండి చనిపోవును.

నివారణ: 1) పంటను ఆలస్యముగా విత్తరాదు. 2) డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మథైల్ పెరాథియాన్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పికికారి చేయాలి.

కాయ తొలుచు పురుగు

మొక్క లేత దశలో ఈ పురుగు లార్వాలు కొమ్మలను, రెమ్మలను, తొలిచి వేయుట వలన మొక్కలు ఎండిపోతాయి. నివారణ: 1) క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లేదా. క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పికికారి చేయాలి.

ఆకు మచ్చ తెగులు

వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుట వలన మరియు గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండుట వలన గోధుమ రంగు మచ్చ్లు కాండము మీద, ఆకుల మీద ఏర్పడతాయి.తరువాత అవి రంధ్రాలుగా మారి ఎండిపోతాయి.  మొక్క మొదటిలో ఈ తెగులు వచ్చి మొక్క చనిపోవును.

నివారణ:

  1. సరియైన సమయంలో పంట విత్తుకోవాలి.
  2. నీళ్ళు నిలుచు ప్రాంతములో ఈ పంట వేయరాదు.
  3. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనము చేయాలి.
  4. మాంకోజెబ్ 2.5 గ్రా.  లీ.టరు నీటికి కలిపి మచ్చలు కనిపించగానే ఒకసారి, 15 రోజులకు మరొకసారి పిచికారి చేయాలి.

తుప్పుతెగులు

చిన్న వయస్సులో ఆశిస్తే మొక్కలు ఒక ప్రక్కకు ఒంగిపొతాయి. ఆలస్యంగా ఆశిస్తే మట్టి రంగు మచ్చలు ఆకుల మీద ఏర్ప్డి తరువాత నల్లగా మారుతాయి.

నివారణ: 1) సాగర ముత్యాలు రకము ఈ తెగులును తట్టుకుంటుంది.  మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా సల్ఫేక్స్ 1.2 గ్రా.  లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate