অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జొన్న

నేలలు

తేలిక ఎర్ర నేలలు మరియు నల్లరేగడి నేలలు అనుకూలమైనవి.

విత్తే సమయం

ఋతువు నెల
ఖరీఫ్ జూన్ – సెప్టెంబర్
మాఘీ సెప్టెంబర్ – డిశంబర్
రబీ అక్టోబర్ – జనవరి
లేట్  రబీ నవంబర్ – ఫిబ్రవరి
వేసవి జనవరి – ఏప్రిల్

జొన్న పంట రకాలు

రకము ఋతువు పంటకాలం
(రోజులు)
గింజ దిగుబడి
(క్విం | | . హె.)
చొప్ప దిగుబడి
(క్విం | | . హె.)
ఎస్ పి.వి. 462 ఖరీఫ్, రబీ 110 33 – 36 120 – 130
సి.ఎస్ . వి. 15 ఖరీఫ్ 110 35 – 38 130 – 140
ఎన్.జె.2122 మాఘీ, రబీ 100 30 – 35 135 - 140
ఎన్.జె.2169 ఖరీఫ్ 105 30 – 35 140 -145
సంకర జాతి రకాలు
సి.ఎస్.హెచ్.6 ఖరీఫ్,మాఘీ, రబీ 110 45-50 100-105
సి.ఎస్.హెచ్.16 ఖరీఫ్ 110 42-43 95-105
సి.ఎస్.హెచ్.17 ఖరీఫ్ 105 40-41 85-90
సి.ఎస్.హెచ్.18 ఖరీఫ్ 112 41-42 100-105

విత్తనం  – విత్తేపద్ధతి

తొలకరి వర్షాలు పడిన వెంటనే విత్తుకోవాలి. ఆలస్యం  చేసినచో దిగుబడి తగ్గుతుంది.

  • విత్తనం : హెక్టారుకు 8 కిలోల విత్తనం  వాడాలి. 1,80,000 మొక్కలు ప్రతి హెక్టారుకు ఉండేటట్లు చూసుకోవాలి.
  • విత్తే దూరం: వరుసల మధ్య 45 సెం.మీ వరుసలో మొక్కల మధ్య 12 సెంమీ ఉండేటట్లు విత్తుకోవాలి.
  • విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. ధైరమ్ లేదా కాప్టాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసి విత్తనము ద్వారావచ్చు తెగుళ్ళను నివారించవచ్చును.
  • ఎరువులు: పశువుల ఎరువు హెక్టారుకు 10 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలయదున్నాలి.  40 కిలోల నత్రజని మరియు 40 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు ఒక హెక్టారుకు దుక్కిలో వేయాలి.  పశువుల ఎరువు వేయనిచో 80 కిలోల నత్రజని హెక్టారుకు వేయాలి.  సగం నత్రజని, పూర్తి భాస్వరం దుక్కిలో వేయాలి. మిగిలిన నత్రజనిని విత్తిన 35 – 40 రోజులకు కలుపుతీసిన తరువార పదును మీద వేసి అధిక దిగుబడి పొందవచ్చును. జింకు లోపముగాని, ఇనుము లోపము గాని గమనించిన యెడల జింకుసల్పేటు 1 లీ. నీటికి 2 మి.లీ. లేదా పెర్రస్ సల్పేట్ లీ. నీటికి 1.5 మి.లీ. వంతున కలిపి పిచికారి చేసి 12 శాతం అధిక దిగుబడి పొందవచ్చును.

అంతర పంటలు

జొన్న2:1 నిష్పత్తిలో వేయవలెను.

అంతర కృషి

విత్తనం  విత్తిన 30 రోజులకు దంతిలో అంతర కృషి చేయడము వలన తేమ నిలచి మొక్కలు బాగా పెరుగుతాయి.  విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి.  విత్తిన రెండవ రోజు అట్రజిన్ హెక్టారుకు 0.5 – 1.0 కిలోలు లేదా స్టాంప్ (పెండామిథిలిన్ ), హెక్టారుకు 0.5 కిలోల పొడి మందును 625లీ.చొప్పున నీటిలో కలిపి పిచికారి చేసిన 25 రోజుల వరకు ప0టలో కలుపు ఉ0డదు.

మల్లె నివారణ

జొన్నలో మల్లె వచ్చిన ఎడల లీటరునీటికి 50గ్రా. అమ్మోనియా సల్పేటును గాని 200గ్రా. యూరియా గాని కలిపి పిచికారి చేసి నివారించవచ్చును లేద 2, 4 – డి, 2 గ్రా. ఒక లీ. నీటిలో కలిపి పిచికారి చేసి నివారించవచ్చును.  పంట మార్పిడి ద్వారా అనగా ప్రత్తి, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి పంటలు సాగు చేయడం ద్వారా కూడా మల్లెను అదుపులో వుంచవచ్చు.

సస్యరక్షణ

మొవ్వతొలుచు ఈగ

విత్తనం మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది.  పురుగు ఆశించి మొవ్వ ఎండిపోయి, లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది.

నివారణ:  మొదటి తొలకరి వర్షాలకు విత్తనము విత్తిన ఎడల మొవ్వ తొలుచు ఈగ బారి నుండి పంటను రక్షించుకొనవచ్చు మరియు విత్తిన 25వ రోజు మరియు 35వ రోజు హెక్టారుకు 10 కిలోల కార్బోప్యూరాన్ లేదా ఎండోసల్ఫాన్ 4జి మందును మొక్క యొక్క సుడిలో వేసి ఈ పురుగును నివారించవచ్చును.

కంకి దోమ

గింజ పాలు పోసుకొను దశలో దోమ ఆశించి, గింజల నుంచి పాలను పీల్చడం వలన గింజలలో నొక్కులు ఏర్పడతాయి. నివారణ: హెక్టారుకు 20 కిలోల కార్బోరిల్ పొడి మందును కంకుల మీద చల్లాలి.

తెగుళ్ళు

బూజు తెగులు

విత్తనము తయరయ్యే దశలో  ఎక్కువకాలం  వర్షాలు పడిన ఎడల బూజు తెగులు సోకుతుంది.  ఈ తెగులు సోకిన గింజలు మసక తెలుపు లేదా గులాబి రంగులోకి మారతాయి.

నివారణ: గింజ క్రింద భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోయాలి.  పూత వచ్చినప్పుటి   నుంచి 10 రోజుల విరామంతో 3 సార్లు కార్బండైజిమ్ 1 గ్రా. 1లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

బంక కారు తగులు

తేనె వంటి ద్రవం బొట్లు బొట్లుగా ఈ తెగులుసోకిన కంకి నుంచి కారుతుంది.  తరువాత కంకి పై నల్ల బూజు ఏర్పడి కంకులు నల్లగా మారతాయి.

నివారణ: లీటర్ నీటికి మాంకోజెబ్ 2 గ్రా. లేదా బెన్ లేట్ 1 గ్రా.  కలిపి రెండు సార్లు  పిచికారి చేయాలి. మొదటి సారి 50 శాతం పూత వచ్చినప్పుడు, తర్వాత 15 రోజులకు రెండవసారి పిచికారి చేయాలి.

ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 3/9/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate