హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / వేసవి దుక్కులు - ప్రయెజనాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేసవి దుక్కులు - ప్రయెజనాలు

వేసవి దుక్కులు ప్రయెజనాలు

సాధారణంగా రైతులందరూ ఖరీఫ్, రబి మరియు వేసవి పంటల కోతల అనంతరం మళ్ళి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వర్షాలు మొదలయ్యే వరకు భామిని దున్నకుండా వదిలేస్తుంటారు. అందువల్ల కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భమిలో పెరిగి నీరు, ఇతర పోషక పదార్ధాల కొరత ఏర్పడి, తర్వాత వేసుకున్న పంటలకు అధిక మేతదులో రసాయానికి ఎరువుల ఆవశ్యకత ఏర్పడుతుంది.

రబి మరియు వేసవి పంటల కోతల తర్వాత వేసవిలో కురిసే అడపాదడపా వర్షాలు అనంతరం చేసేటటువంటి లోతు దుక్కులు వేసవి దుక్కులు అంటారు. వేసవి దుక్కుల వల్ల కలిగే.

ప్రయెజనాలలో ముఖ్యంగా

నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుదల: వేసవిలో దుక్కులు దున్నే ముందు నెలలో పశువుల ఎరువుగాని, కంపోస్టుగాని మరియు చెరువు మట్టిని గాని వెదజల్లడం వలన నెల సారవంతమేతుంది. దీనిలో భాగంగా దుక్కికి ముందు పశువుల మండనుగాని, గుజ్జెలు, లేదా మేకల మండనుగాని పొలంలో ఉంచడం వల్ల అవి విసర్జించే మలమూత్రాలు వేలకు చేరి సేంద్రియ పదార్ధం పెరిగి భాసారం పెరుగుతుంది. తద్వారా వేసుకునే పంటల్లో స్ధుల మరియు సుష్మ పోషకాల లోపాలు నివారింపబడతాయి.

అంతేకాక వేసవిలో చెరువు మట్టిని వేసుకోవడం ద్వారా సుష్మ పోషకాల స్ధాయి, భాసరం పెరిగి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. చెరువు మట్టిలో 0.3 శాతం నత్రజని, 0.2 శాతం భాస్వరం మరియు 0.4 శాతం పోటాష్ ఉంటాయి. సాధారణంగా చెరువుల్లో చేరుకొనే వరదనీరు పంట పొలాల మీదగా రావడం వల్ల పైపొరల్లో ఉండే సారవంతమైన నెలలోని పైపొర చెరువులోని ఒండ్రుమట్టిని పొలంలో వేసుకొని భసరం పెంచుకోవచ్చును. ఓండ్ర బతిని వేసుకోవడం ద్వారా నెల యెక్క నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది.

ఈ విధంగా పశువుల లేదా జొజ్జెలు లేదా మేకల ఎరువులను మరియు చెరువు మట్టిని పొలంలో వేసి వేసవి దుక్కులు చేయడం ద్వారా నెలలోని గట్టి పొరలు పగిలి వేళా గుల్లబారి నీరు నేలలోకి ఇంకే సమయం పెరిగి, లోపల పొరల్లో నీటిని నిల్వ ఉంచే సామర్ధ్యం పెరుగుతుంది. భాష్పిభవనం ద్వారా అయ్యే నీటి వృధా కూడా తగ్గుతుంది. అంతేకాక తర్వాత వేసుకునే పంట విత్తనాలు తొందరగా మొలకెత్తి, మొక్క యెక్క వేళ్ళు లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోయి వివిధ పొరల నుంచి పోషక పదార్ధాలు, నీరు ఇతర ఖనిజ లవణాలను గ్రహించి ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులనిస్తాయి. నీటి నిల్వ సామర్ధ్యం పెరగడం వలన సుష్మ జీవుల సంఖ్య కూడా పెరిగి భాసారా వృద్ధికి తోడ్పడతాయి.

కలుపు నివారణ : కలుపు మొక్కలు భూసారాన్ని త్వరగా గ్రహించి ప్రత్యక్షముగా నష్టం కలిగించడంతో పాటు పరోషంగా చీడ పీడలకు ఆశ్రయ మిచ్చి పంట నష్టానికి కరణ మవుతున్నాయి. వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన కలుపు మొక్కలు, వాటి అవశేషాలు, విత్తనాలు నశించి బడతాయి. మెండి జాతికి చెందిన తుంగ వంటి కలుపు మొక్కలు అన్ని రకాల నెలల్లో, అన్ని పంటల్లోను మొక్కలతో పోటీ పది పెరిగి సమస్యాత్మకంగా మారుతున్నవి. వేర్లు వద్ద దుంపల్లో ఆహారాన్ని నిల్వ చేసుకొని భూసారాన్ని విష్ణుతాన్ని కలుగజేస్తాయి. ఇలాంటి తుంగ మొక్కల దుంపలు లోతు దుక్కులు చేయడం వలన సూర్య రష్మీకి బహిర్గతమై అధిక ఉష్ణగ్రతల వల్ల చినిపోతాయి.

సస్యరక్షణ : పంట సాగు చేసేటప్పుడు వివిధ రకాల పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగుల యెక్క జీవిత చక్రంలో పంటకు నష్టం కలుగచేసేవి లార్వాలు మాత్రమే. ఈ చీడపీడల లార్వాలు తల్లి పురుగులుగా మారె క్రమంలో కోశస్ధా (ప్యూపా) దశకు చేరుకుంటాయి. ఈ కోశాస్ధ దశలు పంటకు ఎలాంటి నష్టం కలుగచేయపు. వేసవిలో ఈ పురుగులు ఆహారం లభించక కోశాస్ధ దశలో గాని, సుప్తావస్ధలో గాని ఇతర కలుపు మొక్కల మీద ఆశ్రయం పొందుతుంటాయి. చెడుకు, వేరుశనగ, పండ్లతోటలు ఆశించే వేరు పురుగులు ఇంకా ప్రత్తి, కంది, మరియు అపరాల పంటలను ఆశించే లద్దె, పచ్చపురుగు, దాసరి పురుగు కోశాస్ధ దశలు వేసవిలో భమిలో ఆశ్రయం పొందుతాయి.

అంతేకాకుండా వరిని ఆశించే కాండం తొలుచు పురుగు యెక్క కొసస్ధ దశలు వరి మేల్లిలో ఉంటాయి. ఇలా ఆశ్రయం పొందుతున్న వివిధ రకాలు చీడపీడల కోశాస్ధ దశల నుండి తొలకరి వర్షాల అనంతరం రెక్కల పురుగులు బయటకు వస్తాయి. తద్వారా ఈ రెక్కల పురుగులు పంట విత్తే సమయానికి గ్రుడ్లను పెడతాయి. ఇవి లార్వాలుగా మరి పంటలు నష్టం కలుగజేస్తాయి. అందువల్ల తొలకరి వర్షాలకు ముందుగానే వేసవి దుక్కులు చేయడం వలన భూమిలో దాగియున్న చీడ పురుగుల కోశాస్ధ దశలు సూర్యరాశియంకి బహిర్గతమై చినిపోతాయి.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.89743589744
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు