పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ పరపతి

వివిధ వ్యవసాయ రుణాలు పొందువిధానము

ఏం చేయాలి ?

  • వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా, తమను తాము రక్షించుకోవడానికి రైతులు బ్యాంకుల నుండి రుణ సహకారాన్ని పొందాలి.
  • vyavasayaరాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట రుణాల, టర్మ్ రుణాల అవసరాలు తీర్చడం కోసం వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార రుణ సంస్థల విస్తృత నెట్ వర్క్ అందుబాటులో ఉన్నది.
  • బ్యాంకు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చూసుకోవాలి.
  • రైతులు తాము పొందిన రుణ సహకార వివరాలను సరైన పద్దతిలో రికార్డు చేయాలి. బ్యాంకు రుణం ఏ అవసరం కోసం పొందారో ఆ అవసరం కోసమే వినియోగించాలి.

మీకు ఏం లభిస్తుంది?

రైతులకు రుణ సదుపాయం

క్ర.సం.

రుణ సదుపాయం

సహాయ పరిమాణం

1.

వడ్డీ సహాయం

తనఖా/హామీ అవసరం లోని రుణాలు

 

7% వడ్డీ వై రూ. 3లక్షల వరకు పంట రుణం. సమయావధిలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహకాలుగా లభించే 3% వడ్డీ మినహాయింపు వల్ల వడ్డీ రేటు 4% గా మారుతుంది. రూ. 1 లక్ష వరకూ పంట రుణం పై తనఖా/హామీ అవసరం లేదు. అవసరం లేని రుణాలు

 

2.

కిసాన్ క్రెడిట్ కార్డు

రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పంట రుణాలు పొందవచ్చు. సాగు చేస్తున్న ప్రాంతాన్ని బట్టి, వేసిన పంటను బట్టి రుణ పరిమితి నిర్ణయమవుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు 3-5 సంవత్సరాలవరకు చెల్లుతాయి. ప్రమాద వశాత్తు సంభవించే మరణాలకు/వైకల్యాలకు రిస్క్ కవర్ ఉంటుంది. పంట రుణాలకు పంట భీమా పథకాలు వర్తిస్తాయి.

3.

పెట్టుబడి రుణాలు

నీటి పారుదల, వ్యవసాయ యాంత్రీకరణ, భూమి అభివృద్ధి, ప్లాంటేషన్, ఉద్యానవనాలు, పంట కోతల అనంతర నిర్వహణలకు చేసే పెట్టుబడుల కోసం రైతులకు రుణ సదుపాయం లభిస్తుంది.

వ్యవసాయ సరుకుల కొరకు ధర విధానం- మద్దతు ధర పధకం (పి.ఎస్.ఎస్.) కనీస మద్దతు ధర కింద నూనెగింజలు, పప్పు ధాన్యాలు, పత్తి ల సేకరణ

పథకం పేరు

లక్ష్యాలు

లబ్దిదారులు

అమలు పరిచే సంస్థ

పథకం కిందికి వచ్చే సరుకులు

సాగుదారులకు చేకూరగల లబ్ది

సహాయ సరళి

మద్దతు ధర పథకం (సి.ఎన్.ఎస్.)

ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం రబీ, ఖరీఫ్ సీజన్లలో ప్రకటించే కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) కంటే తక్కువగా ధరలు పడిపోయినప్పుడు నూనెగింజలు, పప్పుధాన్యాలు, పత్తి సాగుదార్లకు గ్యారెంటీ/ గిట్టుబాటు ధరలు అందించడం

దేశంలోని నూనెగింజలు, పప్పుధాన్యాలు, పత్తి సాగుదారులందరూ.

1.కేంద్రీయ సంస్థలు-ఎస్.ఏ.ఎప్.ఈ.డి & చిన్న రైతుల అగ్రి-బిజినెస్ కన్సార్షియమ్ (ఎస్.ఎఫ్.ఎ.సి.)

2.రాష్ట్ర ఏజెన్సీలు-రాష్ట్ర సహకార మార్కెటింగ్/సరుకుల ఫెడరేషన్లు, కేంద్ర ఏజెన్సీలు రాష్ట్ర స్థాయిలో నియమించిన ఏవైనా సంస్థలు.

3.కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు, రైతులు, ఉత్పత్తి దారుల సంస్థలు (ఎఫ్.పి.ఒ.లు) వంటి ప్రైమరి సంస్థలు, గ్రామ స్థాయిలోని రైతులు, ఉత్పత్తి దారుల కంపెనీలు

కందులు, పెసలు, మినుములు, వేరుశనగ కాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోయాబీన్, నువ్వులు, శమగలు, మసూర పప్పూ, అవిసె (రేవ్ సీడ్) / ఆవాలు, కుసుమలు, బోరియా, కొబ్బరి కురిడీలు

ఒక సరుకు మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కంటే తక్కువకు పడిపోయిన సందర్భంలో మద్ధతు ధర పధకాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా హామీ ఇస్తుంది.

1.రైతులు-ఒక సరుకు మార్కెట్ ధర కనీస తక్కువకు పడిపోయిన సందర్భంలో కనీస మద్ధతు ధర పూర్తిగా లభిస్తుంది.

2.కేంద్రీయ సంస్థలు కేంద్రీయ సంస్ఠలకు నష్ఠం వాటిల్లినప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా భర్తీ చేస్తుంది. అంతేకాక కొబ్బరి కురిడీలకు సేకరణ ధరలో 2.5%, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, పత్తి లకు 1.5% సేవల ఖర్చులను కేంద్రీయ సంస్ఠలకు చెల్లిస్తుంది.

3.రాష్ట్ర/ప్రాథమిక ఏజెన్సీలకు కనీస మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య తేడాను, స్టోరేజ్ పాయింట్ల ఖర్చులతో సహా కేంద్రీయ సంస్ఠలు/ భారత ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎక్స్.గోడవున్ ధరపై 1% సర్వీసు ఛార్జి చెల్లిస్తుంది.

ఎవరిని సంప్రదించాలి?

  1. సంయుక్త కార్యదర్శి (సహకారం), వ్యవసాయ సహకారం, రైతు సంక్షేమ విభాగం, కృషి భవన్, న్యూఢిల్లీ.
  2. రాష్ట్ర రాజధానులలో నెలకొల్పిన ఎన్.ఏ.ఎఫ్.ఈ.డి, ఎస్.ఎఫ్.ఏ.సి ప్రాంతీయ కార్యాలయాలు.
  3. సహకార మార్కెటింగ్/ సరుకుల ఫెడరేషన్ల జిల్లా స్థాయి కార్యాలయాలు.
  4. తహసిల్ స్థాయిలోని మార్కెటింగ్ సహకార సంస్థలు/ బ్లాకు స్థాయిలోని ఎఫ్.పి.సి.లు.

ఎప్పుడు సంప్రదించాలి?

రైతులు ఆ పంటలను వేసేందుకు ఒక నిర్ణయం తీసుకోగలిగేందుకు రబీ, ఖరీఫ్ పంటలు విత్తడానికి ముందు (సంవత్సరానికి రెండు సార్లు) జూన్, అక్టోబర్ నెలలలో భారత ప్రభుత్వం నూనెగింజలు, పప్పులు, పత్తిల కనిష్ట మద్దతు ధరను ప్రకటిస్తుంది. పంటకోతల సమయంలో రైతులు అప్పటి ధరలను ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరతో పోల్చి చూసుకోవచ్చు. మార్కెట్ ధర మద్దతు ధర కన్నా తక్కువ ఉన్న పక్షంలో అతడు/ఆమె వెంటనే సరుకు కొనుగోలు కొరకు పైన తెలిపిన అధికారులను సంప్రదించవచ్చు.

3.04819277108
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు