హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / వ్యవసాయంలో జీవ ఉత్పత్తుల వాడకం జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయంలో జీవ ఉత్పత్తుల వాడకం జాగ్రత్తలు

వ్యవసాయంలో జీవ ఉత్పత్తుల వాడకం జాగ్రత్తలు

అన్నపూర్ణగా పేరు గాంచిన ఆంధ్రప్రదేశ్ అన్నదాతల. విజ్ఞతకు ఓ పరీక్షా సమయం ఆసన్నమైనది. ప్రకృతి ఆటుపోట్లను తట్టుకుని ...."ఆశావాది" అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిబడిన అన్నదాత నేడు జీవ ఉత్పత్తుల మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుని... విజ్ఞత కోల్పోయి.... నష్టపోతున్న రైతును - చెతన్య పరిచి జీవ ఉత్పత్తుల వాడకంలో అవగాహనా కల్పించామని మన వ్యవసాయశాఖ కమిషనరు శ్రీ కె.మధుసూధనరావు గారి ఆదేశానుసారం రైతులలో జీవ ఉత్పత్తుల వాడకం పై శిక్షణ కార్యక్రమాల ధ్వారా, కరపత్రాల ధ్వారా, పోస్టర్స్ ధ్వారా అవగాహనా కల్పించాలని 'ఆత్మ' ప్రకాశం ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నాన్ని యువత రైతు లోకం సాహుదాయంతో స్వీకరిస్తుందని... ఆచరిస్తుందని... విజ్ఞతతో సుసిధారా వ్యవసాయం వైపు అడుగు వేస్తుందని ఆశిస్తూ......

హరిత విప్లవ ఫలితంగా వ్యవసాయ రంగంలో రసాయన ఉత్పత్తులతో ధిబడి గణనీయంగా పెంచిన రైతు..... విచక్షణ రహితంగా వాడే రసాయన ఉత్పత్తులు ఫలితంగా... పెరిగిన పెట్టుబడులను, తరిగిన లాభాలను చూసి.... మీరు కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని గ్రహించి, ప్రత్యామ్నాయం కొరకు చూస్తున తరుణంలో ....భారత ప్రభుత్వం కొన్ని జీవ రసాయనాలైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, బాసిలిస్ తురంజనిస్ వేప నూనె మొదలగు వాటిని "ఇన్ సెక్రిసైడ్ ఏక్ట్ -1968 " లో పొందు పరచింది. వీటిని ఉత్పత్తి చేయుటకు, అమ్ముటకు వ్యవసాయశాఖ అనుమతించినది. అంతేగాక రైతులకు అవగాహనా కల్పించుటకు రాయితీ మీద సరఫరా కూడా చేయడం జరుగుతుంది రైతులు జీవ రసాయనాల మీద నమ్మకం పెంచుకుంటున్న తరుణంలో.... ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకుని కొన్ని మోసపూరిత పైవేటు సంస్థలు అనుమతి లేనటువంటి జీవ ఉత్పత్తులను దిగునది పెంచుతుందని... పైర్లు పెరుగుతాయని... దుబ్బు బాగా చేస్తుందని.... పూత పిందె  రాలకుండా కాపాడుతుందని.... ఇలా అరచేతిలో స్వర్గం చూపించి రైతులకు అంటగట్టి..... తరువాత మొఖం చాటేస్తున్నారు.

జీవ వుత్తపత్తుల, ఉత్పత్తి మరియు  అమ్మకం గురించి 2006 నుంచి సెప్టెంబర్ 2013 వరకు వ్యవసాయ శాఖకు 1164 కోర్టు ఆర్డర్ రావడం అందడం జరిగింది. ఈ జీవ ఉత్పత్తులను పరీక్షల నిమిత్తము వ్యవసాయ శాఖ ఇప్పటివరకు 1458 జీవ ఉత్పత్తులు నమూనాలను స్వీకరించి విశ్లేషణ విమితం పరీక్షా కేంద్రనికి పంపగా 2013 ఆగస్ట్ నాటికీ 808 విశ్లేషణ ఫలితాలు అందాయి. అందులో ఆశ్చర్యాకరమైన రీతిలో 59 సంస్థలకు సంబంధించిన 296 నమూనాలతో రసాయనిక పురుగుమందులు వున్నట్లుగా గమనించిన వ్యవసాయశాఖ..... నాణ్యమైన జీవ ఉత్పత్తులను రైతులకు అందిచాలని ధృడ సంకల్పంతో శాఖ పరమైన చర్యలు చేపడుతుంది.

ఇలాంటి తరుణంలో రైతులు జీవ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు...... వాడేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలి! లేనిచో జీవ ఉత్పత్తులలో వున్నా రసాయనాలు వలన రైతు నష్టపోవడం... దీర్ఘ కాలికంగా వాడడం వలన పర్యావరణ కాలుష్యం పెరగడం.... అంతేకాదు ప్రకృతి ధ్వారా పొందే జీవ ఉత్పత్తులపై నమ్మకం కోల్పోయి తిరిగి రసాయన ఉత్పత్తుల వైపు మొగ్గుచూపి.... నష్టపోవడం జరుగుతుంది. రైతులు జీవ ఉత్పత్తులను వాడడంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి!

  • జీవ ఉత్పత్తులను విజ్ఞతతో కొనుగోలు చేయాలి !
  • ప్రభుత్వం అనుమతి పొందిన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి !
  • పాకెట్ పై పంజికరణ సంఖ్య (రిజిస్టేషన్ నెం.) తాయారు తేదీ. నిల్వ తేదీ వాడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన వివరాలు గమనించి, కొనుగోలు చేయాలి.
  • నాణ్యత పరమైన తలెత్తినప్పుడు జవాబుదారీ తనం కొరకు లైసెన్స్ పొందిన డీలరు దగ్గరనే కొనుగోలు చేయాలి. రశీదు అడిగి తీసుకోవాలి.!

ఆధారం : 'ఆత్మ' ప్రకాశం జిల్లా

2.97727272727
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు