హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / సమగ్ర సస్యరక్షణ చర్యలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సమగ్ర సస్యరక్షణ చర్యలు

సాగు,యాంత్రిక,జీవనియంత్రణ పద్ధతులు

శాస్త్రసాంకేతిక రంగాలలో మానవుడు ఎంత దూసుకుపోతున్నప్పటికీ పూర్తిగా ఆధునికతను జోడుంచి వేగవంతంగా ఉన్నతమైన విజయాలను సాధించినప్పటికీ, వ్యవసాయ రంగంలో మాత్రం దీనిని పూర్తిగా అన్వయించలేం. సాధ్యం కాదు కూడా. ఆదునికతను అందిపుచ్చుకొని సేద్యం చేయడం అనేది ఒక పక్కన అత్యవసరమే. అయితే వందల సంవత్సరాలుగా రైతులు ఆచరిస్తూ వస్తున్న పద్దతులను సైతం ఆధునికతను అందిపుచ్చుకొని సేద్యం చేయడం అనేది ఒక పక్కన అత్యవసరమే. అయితే వందల సంవత్సరాలుగా రైతులు ఆచరిస్తూ వస్తున్న పద్దతులను సైతం ఆధునికతకు జోడించి సేద్యం చేయడం అనేది విస్మరించకూడని ప్రధానమైన అంశం. ఉదాహరణకు భూమి సారాన్ని కాపాడటానికి రైతులు అనాదిగా పాటిస్తూ వస్తున్న పచ్చిరొట్ట పంటలు పెంపకం, గడ్డి గాడం, పశువుల ఎరువుల వాడకం లాంటివి అప్పుడూ, ఎప్పుడూ ఉండాల్సినవే ఇలా కొన్నింటికి ప్రత్యూమ్నాయాలను సూచించలేం. అలాగే రైతులు శాస్త్రవేత్తలుగా మారి ఆచరిస్తున్న పద్దతులు కూడా వ్యవసాయంలో చిరస్థాయిగా ఉండిపోవాల్సినవే.

ఉదా- సాయంత్రం వేళల్లో పంట చేలల్లో సాముహిక మంటలను వేయడం, వేసవి దుక్కులు చేయడం లాంటివి చెప్పుకోవచ్చు.

కానీ వేగవంతమైన నిర్ణయాలు, కష్టపడే తత్వం నుండి తప్పుకోవడం వలనేమో ఈ రోజుల్లో వ్యవసాయ రంగంలో రైతుకూడా తను అనాదిగా ఆచరించే కొన్ని పద్దతులను విస్మరిస్తున్నాడు. ఇది చాలా బాధాకరం. సమతుల పోషకాల సమర్థ వినియోగానికి వ్యవసాయంలో పాడి ఉంటేనే పంట అని చెప్పక తప్పదు. కానీ నేడు పాడి, కాడి కొరపడి రైతు పూర్తిగా పసాయనిక ఎరువుల పైనే ఆధారపడటం, అదీ ఎక్కువ మొతాదులో వాడటం తద్వారా పంటలు చీడపీడల బారీన పడుతున్నాయి. అయినప్పుటికీ సమగ్ర సస్యరక్షణ పద్దతులను రైతులు విధిగా ఆచరిస్తూ ఉంటే క్రిమి సంహారకాలు వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కావలసినది బాధ్యతను చెప్పి గుర్తుచేయడం వెన్ను తట్టి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలను అందించడం అత్యావశ్యకం. ఎలాంటి పద్దతులను ఆచరించినప్పుటికీ, ఎంతటి తీవ్రమైన క్రిమి సంహారకాలను వాడినప్పటికీ చీడపీడలను పూర్తిగా అరికట్టలేం. పుట్టిన ప్రతీ ప్రాణికి బతికే హక్కు ఉంది. కాని నిక్ణీత ప్రదేశం, సమయంలో ఉండవలసిన స్థాయికంటే అధికంగా (ఆర్థిక నష్టపరిమితి స్థాయి) ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు చుట్టుకుంటాయి. క్రిమి సంహారకాలను విచక్షణారహితంగా వాడటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుకొని సమస్యగా మారుతున్నాయి. సమస్య కంటే ముందుగానే సాగులో సమగ్ర సస్యరక్షణ పద్దతులను ఒక భాగంగా విధిగా చేస్తే మంచి ఫలితాలను అందిపుచ్చుకున్న వారమౌతాయి. ఫలితాలను ఆశించిన స్థాయిలో తప్పక ఉంటాయని చెప్పవచ్చు.

సమగ్ర సస్యరక్షణలో వివిధ పద్దతులను సమస్వయపరచడం-

 1. సాగు పద్దతులు
 2. యాత్రిక పద్దతులు
 3. జీవ నియంత్రణ పద్దతులు
 4. రసాయన మందుల వాడకం

సాగు పద్దతులు: యాజమాన్య/సేద్య పద్దతులు

 • ssoneవేసవిలో లేతు దుక్కులు చేయడం వలన భూమిలో ఉన్న పురుగుపుట్ర, అవశేశాలు బయల్పడి ఎండ వేడిమికి నశించిపోవడమే కాక పక్షులు ఏరుకొని తినడం వలన కూడా, వీటి నిర్మూలన జరుగుతుంది. పైగా భూమి పొరలకు కావల్సిన గాలి పోకుతుంది.
 • గత పంటల తాలుకు మొళ్ళను అనగా పంట అవశేషాలను తొలిగించాలి.
 • భూమిని ముందుగానే సాగుకు అనుకూలంగా తయారు చేయాలి.
 • విత్తనశుధ్ధి తప్పనిసరిగా చేయాలి.
 • sstwoనికర ఆదాయం పొందడానికి అంతర పంటలను సాగు చేయాలి.
 • పురుగులు ఉనికిని తెలుసుకోవడానికి బంతి, ఆవాలు లాంటి ఎర పంటలు విత్తాలి. పురుగుల తాకిడిని అరికట్టడానికి ఎత్తుగా ఉండే రక్షక పంటలను వేయాలి. కొన్ని రకాల పురుగుల ఆవాసమైన ఆముదం చెట్ల పెంపకాన్ని చేపట్టాలి.
 • అంతర సేద్యంలో కలుపును నివారించాలి.
 • ఏ సమయంలో విత్తితే చీడపీడల ఉధృతి లేకుండా పంటను కాపాడవచ్చో సానుకూల సమయాన్ని ఎంపిక చేసుకోవాలి.
 • మొక్కల సాంద్రత తగినంత ఉండేటట్లు జాగ్రత్త పడాలి.
 • సాగునీటి యాజమాన్య పద్దతులపై అవగాహనతో ముందుగానే తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
 • భూమి స్థితిని బట్టి కావల్సిన పోషకాల విషయమై ఎరువుల మొతాదులను నిర్ణయించి వాడాలి. సూక్ష్మధాతు లోప సవరణ చేయాలి.
 • చీడ, పీడలను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి.
 • వానపాములను పెంచి ఎరువును తయారు చేయడం, నేల సారవంతాన్ని కాపాడుటకు పశువుల, కోళ్ళ ఎరువు, వేపపిండి, ఆముదం చెక్క ఎరువులను వాడాలి.
 • పచ్చిరొట్ట పంటలను పెంచి భూమిలో కలియదున్నాలి.
 • పంట మార్పిడి విధానాన్ని పాటించలి.

యాంత్రి పద్దతులు

 • ssthreeశత్రు పురుగుల గుడ్ల సముదాయాలను, లార్వాలను, ప్యూపాలను ఏరి నాశనం చేయాలి. చీడపీడలు ఆశించిన మొక్క భాగాలను తొలిగించాలి. నారుకొనలను (వరిలో) తుంచి నాటాలి.
 • దీపపు ఎరలను ఏర్పాటు చేయాలి. వీటిని సాయంత్రం వేళల్లో (6 నుం డి 7 గంటల మధ్య) వెలిగించాలి. దీని వలన శత్రు పురుగులు ఆకర్షింపబడి ఎర కింద కిరోసిన్ టబ్ లో పడి నశిస్తాయి.
 • సాయంత్రం వేళల్లో గట్లపై సామూహిక మంటలు వేయడం వలన శత్రుపురుగుల నిర్మూలన జరుగుతుంది.
 • లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగుల ఉధృతిని తెలుసుకోవాలి.
 • ఎకరంలో సుమారు 10 వరకు పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. మొదటి పెండు రోజుల పక్షులు ఆగమనం కొరకు అవి తినే ఆహారాన్ని ఉంచాలి.
 • ssfourగ్రీజు, ఆముదం లాంటి జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను గానీ అట్టలను గానీ అమర్చాలి. రసం పీల్చుకునే పురుగులు వీటికి అంటుకొని నశిస్తాయి.
 • చేను, పొలం చుట్టూ కందకం తవ్వాలి. ఒక ప్రాంతం నుండి వలస వచ్చే పురుగులు (లార్వాలు)ను అరికట్టవచ్చు.
 • వలల (నెట్)ను ఏర్పాటు చేసి నారుమడులకు పురుగుల బారినుండి రక్షణ కల్పించాలి.
 • పంటలను అడవి పందులు, పక్షులు బెడద నుండి కాపాడుకోవాలి.

జీవ నియంత్రణ పద్ధతులు

పరాన్న జీవులైన ట్రైకోగ్రామా టెలినోమస్, పరాన్న భుక్కులైన అండబదనికలను (తూనీగలు, సాలీళ్ళు, కందిరీగ, అక్షింతల పురుగు) విడుదల చేయాలి. ఈ మిత్ర పురుగులు పంటకు హాని చేసే గుడ్లు, చిన్న లార్వాలను వేటాడి తిని నిర్మూలన చేస్తాయి. జీవన ఎరువులు – శీలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ సంభందించినవి.

 • ssfiveఅజొల్లా, బ్లూగ్రీన్ ఆల్గే వీటి వలన పంటలకు నత్రజని స్థిరీకరణ జరుగుతుంది.
 • అజొస్పైరిల్లం, అజటోబ్యాక్టర్, అసిటోబ్యాక్టర్ ఇవి కూడా నత్రజనిని స్థిరీకరించగలవు.
 • ట్రైకోడెర్మా విరిడి ఈ జీవన ఎరువు ఆరుతడి పంటలలో తెగుళ్ళ నివారణకు బాగా పనిచేస్తుంది. దీనిని విత్తనశుద్ధిగాను, పశువుల ఎరువుతో కలిపి చేసే తగినంత తేమ ఉన్నప్పుడు చేనులో గానీ చల్లుకోవచ్చు.
 • బ్యాక్టీరియా ఆధారిత సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వరి పంటలలో ఆశించే పాముపొడ తెగులు, అగ్గి తెగుళ్ళను అరికడుతుంది. విత్తనశుద్ధి లేదా నారువేళ్ళకు పట్టించడం, పశువుల ఎరువులో కలిపి పొలంలో చల్లాలి.
 • sssixఫాస్ఫరస్ సాల్యూబుల్ బ్యాక్టీరియా, మైకోరైడాలాంటి జీవన ఎరువులు భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందివేయడం. సూక్ష్మధాతువులను మొక్కలకు అందుబాటులో ఉంచడానికి దోహద పడతాయి.
 • న్యూక్లియర్ పాలీ హైడ్రోసిస్ వైరస్ (ఎన్.పి.వి) – ఈ ద్రావణాన్ని సాయంత్రం, చల్లని సమయంలో పిచికారీ చేయడం వలన లద్దె పురుగులు క్రమేణా జబ్బుపడి మరణిస్తాయి.  వైరస్ ద్రావణం పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగుకు వేరువేరుగా వాడవలసి ఉంటుంది.

సహజ క్రిమి సంహారకాలు

 • వేప నుండి తయారు చేసిన నూనెలు, సీతాఫలం ఆకుల కషాయం, పొగాకు, ఉమ్మెత్త ఆకుల కషాయాలను తయారు చేసి పిచికారీ చేయడం వలన పురుగులను తొలిదశలో నియంత్రించవచ్చు.
 • గో ఆధారిత పంచగవ్య, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వలన చీడపీడలను నియంత్రించి మొక్కలు ఏవుగా పెరగడానికి ఉపయోగపడతాయి.

రసాయన మందులు

ఇవి ప్రమాదకరమైనవి. విచక్షణా రహితంగా వాడటం వలన ఇటు పంట ఉత్పత్తులను విషపూరితమైన మానవుని మనుగడకే సవాలు చేస్తున్నాయి. పర్యావరనానికి హాని కారకులుగా తయారై ఉన్నాయి. వీటిని విచక్షణాతో ఉపయోగించాలి. వాడేటప్పుడు పంటలు, పంట దశలు, వాచావరణం, వాడే విధాసం, సమయాన్ని బేరడువేసి తగిన మోతాదులోనే వాడవలసి ఉంటుంది. ఎంతటి విశపూరితమైన క్రిమిసంహారకాలు పురుగులను పూర్తిగా ఒకసారి నిర్మూలన చేయవు.

కొన్ని అప్పుడే నశించిపోతాయి. మరికొన్ని జబ్బుపడి, క్రమేణా నిర్మూలన అవుతాయి. అన్ని విషయాన్ని రైతులు గుర్తెరగాలి. సింథటిక్ పైరిత్రాయిడ్ లను మాత్రం ఆఖరి దశలో ఒకసారి మాత్రమే, అవసరం మేరకే ఉపయోగించాలి. లేకపోతే రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.95652173913
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు