పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సస్య రక్షణ

సస్య రక్షణ గురించి తెలుసుకుందాం

ఏం చేయాలి ?

 • sr1.pngరసాయనిక పురుగుమందుల స్థానంలో సేంద్రియ పురుగుమందులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
 • పురుగుమందులు వాడేముందు రైతులు చీడ నిరోధక అనుపాతాన్ని అంచనా వేయాలి. వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ విశ్లేషణ (ఏ.ఈ.ఎస్.ఏ) ఆధారిత సమగ్ర చీడ నిర్వహణను అమలుపరచాలి.
 • ప్రధాన పంటకు చుట్టూ/ దగ్గర (అంతర పంటలు/ అంచులలో పంటలు) కీడుచేసే కీటకాలను నియంత్రించే/సంహరించే వ్యవసాయ హిత కీటకాలను ఆకర్షించే పంటలను వెయ్యాలి.
 • వేసవిలో లోతు దుక్కి చేసుకోవాలి.
 • చీడపీడలను తట్టుకోనే రకాలను ఎంపిక చేసుకోవాలి. పంటమార్పిడి. అంతర పంటలు వేసుకోవడం, ఎరపంటలు వేసుకోవడం వంటి పద్ధతులను అనుసరించి చీడపీడలను అదుపుచేయాలి.
 • చీడలను సామూహికంగా ట్రాప్ చేయడానికి, వాటిని పర్యవేక్షించడానికి దీపపు ఎరలను/ జిగురు ఎరలను/ఫెర్మోన్ ఎరలను వినియోగించాలి.
 • జీవ నియంత్రణ పద్ధతులద్వారా పురుగులను అదుపు చేయడానికి పురుగులపై బతికే పరాన్న జీవులను, బదనికలను. కలుపు నియంత్రణకు బయో ఏజెంట్లను వినియోగించాలి.
 • పైన చెప్పిన అన్ని పద్ధతులు పాటించాక తగిన ఫలితం రానప్పుడు మాత్రమే రసాయన పురుగు మందులను వినియోగించాలి. అదికూడా నిపుణులు సిఫారసు చేసిన విధంగా అన్ని జాగ్రత్తలూ తీసుకొని మాత్రమే రసాయన మందులు వినియోగించాలి.

పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు కింది జాగ్రత్తలు పాటించాలి:

 • రసాయన పురుగుమందులు వాడేటప్పుడు సూచించిన అన్ని జాగ్రత్తలను అనుసరించాలి.
 • పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు చేతికి తొడుగులు. ముఖానికి మాస్కులు. ఇతర రక్షణలు అన్నీ వినియోగించాలి.
 • పురుగుమందులు పిచికారీ చేసేటపుడు గాలి వాలును బట్టి పిచికారీ చేయాలి. గాలి వాలు వల్ల మందు చెల్లాచెదురు అవ్వకుండా చూసుకోవాలి.
 • పురుగుమందులను, సస్య రక్షణ సాధనాలను పసిపిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా తాళంవేసి భద్రపరచాలి.
 • పురుగుమందులు కొనేటపుడు ప్యాంకింగ్ను. చెల్లుబాటు అయ్యే లేదని చెప్పకుండా పరిశీలించాలి.
 • పురుగు మందు పిచికారీ వలన విషప్రభావానికి గురయితే వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఉపయోగించిన పురుగుమందు సీసాను. దానితో జతపరిచిన పుస్తకాన్ని డాక్టరు వద్దకు తీసుకుపోవాలి.
 • పురుగుమందులను లేబుల్ పై ఉన్న సూచనలను అనుసరించి వాడాలి.
 • ఉపయోగించిన పురుగుమందుల డబ్బాలను. డబ్బాతో పాటు ఉండే కాగితంతో ఉన్న సూచనలను అనుసరించి నాశనం చేయాలి.

మీకు ఏం లభిస్తుంది ?

క్ర.సం

సహాయ వివరాలు

సహాయ పరిమాణం

పధకం/విభాగం

1.

పర్యానాలోని ఫరీదాబాద్ సస్యరక్షణ సంచాలన క్వారంటైన్ నిలవావిభాగం దేశవ్యాప్తంగా ఉన్న తన 35 కేద్రియ సమగ్ర చీడ నివారణ కేంద్రాల ద్వారా వివిధ కార్యకారమాలను నిర్వహిస్తోంది. ఇవి రైతుల లబ్దికోసమే నడుపుతున్నారు. ఈ కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి.

వ్యవసాయ విస్తరణ సాంకేతికత లపై జాతీయ మిషన్ (ఎన్.ఎం.ఎ.ఇ.టి.) సస్య రక్షణ సస్య క్వారంటైన్ పై ఉప మిషన్ (ఎస్.ఎం.పి.పి.)

ఎ. గ్రామాలోనూ పట్టణాలలోనూ సి.ఐ.పి.ఎం.సి పర్యవేక్షణలో రైతులకు ఎన్.జి.ఓ లకు క్రిమిసంహారాక మందుల డీలర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం.

ఒక శిక్షణ కార్యక్రమానికి రూ. 38600/-

బి. ప్రభుత్వ సంస్ధలలో సిఐ.పి.ఎం.సి పర్యవేక్షణలో ప్రగతిశీల రైతులకు విస్తరణాధికారులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం.

ఒక శిక్షణ కార్యక్రమానికి రూ. 152100/-

సి. కేంద్రీయ సమగ్ర చీడ నివారణ కేంద్రాల ద్వారా పొలం బడి నిర్వహణ.

ఒక శిక్షణ కార్యక్రమానికి రూ. 26700/-

డి. కృషి విజ్ఞాన కేంద్రాల (కే.వి.కే.ల) ద్వారా రైతుల పొలం బడి

2.

సమగ్ర చీడ నివారణ, క్రిమిసంహారకాలు, సమగ్ర పోషక నిర్వహణ, ఫెర్టిగేషన్, ట్రీ గార్డ్ మొదలైనవాటికి సహాయం

ఖర్చులో 50% హెక్టారుకు రూ. 5000/- మించకుండా

పామాయిల్ ప్రాంత విస్తరణ పై ప్రత్యేక కార్యక్రమం

3.

సస్యరక్షణ రసాయనాలు సేంద్రీయ క్రిమిసంహారకాలు/సమగ్ర చీడ నివారణల పంపిణీ

ఖర్చులో 50% లేదా హెక్టారుకు రూ. 500/- (ఏది తక్కువ అయితే అది)

జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం.&బి.ఆర్.ఆర్.ఈ.ఐ)

4.

కలుపు నిరోధకాలు

ఖర్చులో 50% లేదా హెక్టారుకు రూ. 500/- (ఏది తక్కువ అయితే అది)

జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం.&బి.ఆర్.ఆర్.ఈ.ఐ)

5.

ఉద్యాన పంటలలో సమగ్ర చీడ నివారణ

ఒక్కొక్క లబ్ధిదారుకు హెక్టారుకు రూ. 1000/- చొప్పున 4 హెక్టార్లకు మించకుండా.

ఎం.ఐ.డి.హెచ్. కింద ఎన్.హెచ్.ఎం/హెచ్.ఎం.ఎన్.ఇ.హెచ్. ఉప పధకాలు

వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ కింద సస్యరక్షణ పరికరాలు కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సహాయ వివరాలు 5వ అధ్యాయం "యాంత్రీకరణ - సాంకేతికత" లో సస్య రక్షణ పరికరాలులోనూ, నూనె గింజలపై జాతీయ మిషన్ లో మినీ-మిషన్-1 (నూనె గింజలు), పామాయిల్ (ఎన్.ఎం.డి.ఒ.పి.) కిందా లభిస్తుంది.

ఎవరిని సంప్రదించాలి?

sr2.pngజిల్లా వ్యవసాయాధికారి/ ఆత్మ (ఎ.టి.ఎం.ఎ) ప్రొజెక్టు సంచాలకులు.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు