హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / సుస్థిర దిగుబడులు సాధించడంలో భూసార పరీక్షా ఆవశ్యకత
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సుస్థిర దిగుబడులు సాధించడంలో భూసార పరీక్షా ఆవశ్యకత

సుస్థిర దిగుబడులు సాధించడంలో భూసార పరీక్షా ఆవశ్యకత

పందాలలో అధిక దిగుబడి మరియు నాణ్యమైన ఉత్పత్తులు రైతాంగం పొందాలంటే, పంటకు కావాల్సిన 18 రకాల పోషకాలు (కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్యరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సర్ల్ఫేర్ మరియు సుష్మపోషకాలు ఆయన జింకు, ఇనుము, రాగి, మాంగనీస్, మలిబినం, బోరాన్, క్లోరిన్,కోబాల్ట్ (లెగ్యంకు ) సిలికాన్ (వారికీ)మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేయాలి. ప్రస్తుతం త్రీ రకాల పోషకాలు (నత్రజని, భాస్వరం,పోటాష్) మాత్రమే రైతులు పంటలకు వేయడం వలన ముదిత 15 రకాల పోషకాలు భూమి ధ్వారా మొక్కలు తీసుకొని పంటలు పండించటం వరణ భూమిలో నిల్వయున్న, రైతులు వేయని పోషకాలు నానాటికి తగ్గిపోవటం వలన దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అంతేగాక నత్రజని, భాస్వరం,పోటాష్ అను రసాయానికి ఎరుపులు ఏయడం వలన మొక్కకు అందకుండా పోతున్నాయే. ఆలాగే మొక్కలు ఎక్కువ నర్థజాని తీసుకోవడం వలన చీడపీడల ఉధృతి బాగాపెరిగిపోతుంది. అలాగే భూగర్భ జలాలలో రసాయనిక ఎరువులు అయినటువంటి నైట్లెట్లు, ప్లాస్పెట్లుకలిసిపోవడం వలన తగు న ఇరు కూడా కలుషితమైపోతున్నది.

నేడు రైతాంగము ఎక్కువ దిగుబడులు సాధించాలనే అతృతతో, అశాస్త్రీయంగా, విచక్షణ రహితముగా నత్రజని, భాస్వరం, పోటాష్ రసాయనిక ఎరువులు మాత్రమే వాడటం వాళ్ళ సేంద్రియ ఎరువులు అసలు వేయకపోవడం భూములు చెడుబారి పోవటం, కొన్ని మొక్కలు ఎరువులను ఎక్కువగా తీసుకొంటాం, భూమిలో ఉన్న మిగితా 15 రకాల ఎరువులు అందకపోవటం జరిగి, దిగుబడులు,నాణ్యత బాగా తగిపోవటం జరుగుతుంది. అలాగే భూమిలో ఉన్న మొక్కలకు సహాయపడే సూక్మజీవులు, వశపములు, తగ్గి మొక్కలకు హానిచేసే జీవులు పెరిగిపోతున్నాయి. దీనివలన రైతులకు ఎరువుల పైన, పరుగు మందుల పైన ఖర్చు పెరిగి పంట దిగుబడులపైన వచ్చే ఆదాయం తాగి , రైతాంగము నష్టాలూ చవిచూడవలసి వస్తుంది.

కావున రైతాంగము ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి తప్పనిసరిగా "భూసార పరీక్షలు" చేయెంచుకొని భూ బవతికా, రసాయనిక, పోషకాలు స్థాయి తెలుసుకుని, పంటలు వేసుకుంటే,భూములు భూసారాన్ని కొల్పకుండా,నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.

కావున రైతాంగము సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించిన (అంటే "భూసార పరీక్షా" ఫలితాలననుసరించి రసాయనిక ఎరువులు వాడటం, పంటకు ఇచ్చే ఎరువులను సగం సేంద్రియ ఎరువుల రూపంలోనూ,సగం రసాయనిక ఎరువుల రూపంలోనూ ఇవ్వడం పచ్చిరొట్ట ఎరువులను,జీవరా ఎరువులను వాడటం) నాణ్యమైన,ముసిద్రమైన అధిక దిగుబడులుపొంది, తధ్వర వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చును.

భూసార పరీక్షల వాళ్ళ ఏఏవిషయాలు తెలుసుకోవచ్చు ?

 • పోవములో వివిధ పోషకాల స్థాయి తెలుస్తుంది.
 • ఆ పొలాల్లో ఏఏ పంటలు పండించుకోవచ్చో తెలుస్తుంది.
 • ఎరువులను ఎంతోమోతాదులో ఎప్పుడు వేయాలో తెలుస్తుంది.
 • నెల నమస్యలైన కారి, చోడు తెలుస్తాయి. కాబట్టి నివారించవచ్చును.
 • ఎరువుల పై అనవసరపు ఖర్చు తాగించవచ్చు.

మట్టి నమూనాలను ఎప్పుడు సేకరించాలి ?

 • పంటకోత తర్వాత తీయవచ్చును.
 • వేసవిలో పంటలు లేని సమయంలో తీయాలి.

మట్టి సమునాలు ఎక్కడ తీయకూడదు ?

 • ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు తీయకూడదు.
 • నీరు పెట్టిన తర్వాత తీయకూడదు.
 • నిదపడే ప్రదేశాలు, నీటి మలుపు ప్రాంతాలు, పెంటకుప్పల దగ్గర గాట్లు, చెట్లు , రోడ్లు దగర తీయకూడదు.
 • కాలిబాటలలో తీయరాదు.

ఎంత విస్తీర్ణానికి ఒక మట్టి నమూనా తీయాలి ?

 • ఒక పొలానికి ఒక నమూనా తీయాలి. పొలం మరి పెద్దదైతే ప్రతి 5 ఎకరాములకు ఒక నమూనా తీయాలి. నెల నిర్మాణము రంగు, మురుగు పారుదల సావకార్యం, నేలవలు,చావడు, కారి, ఆమ్లగుణాలు పంటల సరళి మొదలగు విషయాల్లో ఏవేవి తేడాలు కనిపిస్తే అన్ని సమునాలు ఆపొలంనుండి తీయవలసి ఉంటుంది.

ఏ పంటకు ఎంత లోతులో మట్టి నమూనాలు తీయాలి ?

 • పైరు పంటలకు 6 అంగుళలు.
 • పండ్ల తోటలకు - 3 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక సమాన.
 • కారి, చావడు , ఆమ్లా నెలలకు - అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి.

మట్టి నమూనా సేకరించే విధానం ?

 • నెల పై ఉన్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేయాలి.
 • అగ్గనూ గని, పరానుగాని సమున తీయడానికి ఉపయోగించాలి.
 • పొలాల్లో 'వి' ఆకారంలో గోతులు తీయాలి.
 • గొయ్యి అంచుల నుండి పరతో గని, ఠపితో గని మట్టిని సేకరించాలి.
 • పొలంలో 8-10 స్థలాల నుండి ఈ పద్దతిలో మట్టిని సేకరించాలి. సేకరించిన మట్టినంతటిని కలిపి నెల మీద పరచి దానిని 4 భాగాలు చేయాలి. మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకుని మిగిలిన మట్టిని పారవేయాలి. ఈ విధముగా 1/2 కేజీ నమూనాను సేకరించాలి. అరకేజీ మట్టిని గుడ్డసంచిలో గని , పాలిథిన్ సంచిలోగాని వేసి రైతు పేరు, ఫోన్ నెం., చిరునామా, సర్వే నెం , పొలం విస్తిరమ్ మెత్త, పల్లం, ఆరుతడి పంటలు, గత మూడు సంవత్సరాలలో వాడుతున్న ఎరువులు, రాబోవు సీజన్ లో వేయవలసిన పంటలు, సంవత్సరాల్లో వాడుతున్న ఎరువులు, రాబోవు సీజన్లో వేయవలసిన పంటలు, సేకరించిన తేదీ మొదలగు వివరాలు జతచేయాలి. సమాచార పత్రంతో కూడిన మట్టి నామానాలను సంబంధిత భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి.

భూసార పరీక్షా ఫలితాలు అందచేయు పద్ధతులు:

 • పరీక్షా ఫలితాల నివేదికను మండల వ్యవసాయాధికారి ధ్వారా రైతులకు అందచేయుట జరుగుతుంది.
 • సంకిప్త సమాచారాన్ని (యస్ యమ్ యస్ ) ధ్వారా రైతు సెల్ ఫోనెకు అందచేయుట జరుగుతుంది.
 • మొత్తం భూసార పరీక్షా ఫలితాన్ని “AGROS NET” (అగ్రిస్ నెట్) ధ్వారా తెలుసునవచ్చు.

ఆధారము : భూసార పరీక్షా కేంద్రం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు