অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం

కేవలం సేంద్రియ పదార్ధాలను వుపయోగించి పంటలను పండించే విధానమే సేంద్రియ వ్యవసాయం అని చెప్పవచ్చు. రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలింద్రణాశీసులు కలుపు మందుల వాడకం ఎంత మాత్రం పనికిరాదు. చివరకు రసాయనాలతో విత్తనశు ధికుండా సేంద్రియ వ్యవసాయంలో నిషాద్ధం. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా, సహజ వనరులతో , సంప్రదాయ పద్దతులతో వ్యవసాయం చేయడమే సేంద్రియ వ్యవసాయం. కృత్రిమ వనరులను ఏ పరిస్థితులలోను వినియోగించడానికి వీలులేదు జీవసంబంధ పద్ధతులు, యాంత్రిక పద్దతులను మాత్రం ఉపయోగించవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇది పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే కానీ, కృత్రిమవసరుల వినియోగం కాదు.

1965-2000 మధ్యకాలంలో విచ్చకాలంలో విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం జరిగింది. వీటివల్ల భవిష్యత్తులో ముప్పు తప్పదని హెచ్చరికలు చేస్తున్నా ఎవరు ఖాతరు చేయలేదు. అధికోత్పత్తి, లాభదాయకత మీదనే దృష్టిపెట్టారు . దీనివల్ల సత్పలితాలతో పాటు దుష్ఫలితాలు కూడా చవిచూడవల్లివచ్చింది . పీల్చేగాలి, తాగేనీరు, పందిచే పంట, తీసుకొనే ఆహరం కలుషితమయ్యాయి. విచక్షణారహితంగా, రసాయన ఎరువుల వాడకంవల్ల నెల ఉత్పాదక శక్తి , నెల ఆరోగ్యం క్రీనించింది. నెల, నీటి కాలుష్యం పెరిగింది. అలాగే పురుగు మందుల వాడకంవల్ల పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహరం, వీటి ఫలితంగా ఆరోగ్యహానికలిగింది. పురుగు మందుల వాళ్ళ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విష ప్రభావానికిలోనే మరణించిన వరి సంఖ్య లక్షల్లో వుంటుంది. అనారోగ్యానికి గురైన వారికి కలిగిన నష్టం అపారం. పశుపస్యాధ్యులకు , పెపుడు జంతువులకు, చేపలకు ఎంతో హాని కలిగింది. తేనె టీగలు, వానపాములు గణనీయంగా నశించిపోయాయి. స్వాతంత్యం వచ్చేనాటికి మనదేశ జనాభా 33 కోట్లు అప్పటి ఆహరం ధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ టన్నులు 2010 -11 నాటికీ పెరిగిన దేశజనబా 115 కోట్లు పెరిగిన ఆహరం ధాన్యాల ఉత్పత్తి 235 మిలియన్ తన్నులు. హరిత విప్లవం వల్లనే ఇదంతా సాధ్యమైంది. అయితే దీనివల్ల చాల దుష్ఫలితాలను కూడా చవిచూశాం. క్రమంగా వ్యవసాయ ఖర్చులు పెరిగి నికర ఆదాయం తగ్గిపోవడం ప్రారంభమైంది. మనది అధిక జనబావున్న దేశం. కనుక మన అవసరాలకు అనుగుణంగా అధికోత్తత్తితోపాటు ఉత్పత్తుల నాణ్యత, ఆరోగ్యమైన ఆహరం అనే అంశాల పై దృష్టి పారించాలి. మరోవైపు ప్రపంచ వాణిజ్యసంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్ లో పోటీకి నిలబడడానికి నాణ్యమైన ఉత్తత్తులను తక్కువ ధరకు అందించాల్సిన ఆవశ్యకత అంతకన్నా ఎక్కువగా వుంది. ఈ సవాలును ఎదుర్కోవడానికి జాతీయ ప్రభుత్వ సిపారసుచేసిన పద్ధతులు సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు సమగ్ర సస్యరక్షణ విధానాలు. ఈ విధానాల మీద ఇప్పటికే విస్తృత పరిశోధనలు జరిగాయి. ఈ విధానాల ధ్వారా అధికోత్పత్తితోపాటు నాణ్యమైన ఉత్తత్తులను, సాధించవచ్చని ఋజువైంది. జాతీయ ఆహార భద్రత, రైతుల ఆర్ధిక, సామజిక స్ధితిగతులను పరిగణనలోనికి తీసుకుని, సేంద్రియ వ్యవసాయం ధ్వారా ఇది సాధ్యమైతుందా అనేది మనముందున్న పెద్ద సమస్య.

మనదేశానికి గని, రాష్టానికి గని సేంద్రియ వ్యవసాయం కొత్తకాదు. 60 సంవత్సరాలకు పూర్వం మన రైతాంగం చేసినది సేంద్రియ వ్యవసాయమే. అప్పటి రాయితీలు తమకు అందుబాటులో వున్నా పశువుల ఎరువు, సేంద్రియ వ్యవర్ధపదార్ధాలు, పచ్చిరొట్ట ఎరువులు వుపయోగించి పంటలు పండించేవారు. దిగుబడులు తక్కువైనా నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహరం లభించేది.

సేంద్రియ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలు, జాగ్రత్తలు :

 • సహజవనరులున్నా నెల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికాకుండా చూడడం
 • అన్ని రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వుపయోగించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించడం.
 • పంటలను నష్టపరిచే క్రిమి కీటకాలు, తాగుళ్ళు మొదలైన వాటి పై వృక్ష సనంద, జీవ సంబంధ పద్దార్దలను ఉపయోగించి అదుపులో పెట్టడం.
 • ప్రతి దశలోనూ సక్రమ యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వడం.

రాష్టంలోని నెలల్లో సేంద్రియ కర్బనం అత్యల్పస్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. దీనిని పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. సేంద్రియ వ్యవసాయంలో దీనిని తొలి మెట్టుగా భావించవచ్చు. సేంద్రియ కర్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణం లో సేంద్రియ ఎరువులు నెలకందిచడంమొక్కటే మార్గం. ఇంత పరియామంలో మనకు ఎక్కడి నుండి సేంద్రియ ఎరువులు లభ్యమవుతాయి ? సేంద్రియ ఎరువు అనగానే మనకు గుర్తుకొచ్చేది. పశువుల ఎరువు, పశు సంపద తగ్గిపోయిన కారణంగానే ఇది తగినంతగా లభ్యంకావడంలేదయు. దీనికి ప్రత్యామ్నాయమే పచ్చిరొట్ట ఎరువులు. మిగతా అన్ని సేంద్రియ వనరులను ఆయా ప్రాంతాలలో అందుబాటును బట్టి వీలయినంత ఎక్కువగా ఉపయోగించుకోవాలి. పచ్చి ఆకు ఎరువులు, కోడిపెంట, పందిపెంట, మొక ఎరువులు , చెరకు మద్ది, వామికంపోస్టు వంటి ఎరువులను విస్తృతంగా ఉపయోగించాలి.

 • దీర్ఘకాలిక సుస్థిరత సాధించవచ్చు. ప్రకృతి వరరుల్లో సమతుల్యత క్రమేణా వస్తుంది. పర్యావరణ సమతూకం ఏర్పడుతుంది. వచ్చ్న సమస్యలు ప్రకృతి పరంగా సమసిపోతాయి.
 • నెల పునర్నిర్మాణానికి పంటమార్పిడి, అంతర పంటలు, సేంద్రియ ఎరువులు, అతి తక్కువగా నెల దున్నడం వంటి అంశాలు తోడ్పడతాయి. పంట అవశేషాలను భూమికి చేర్చడం, నత్రజని స్ధిరీకరించే పప్పుజాతి పైర్లవల్ల భూమి సారవంతమై ఉత్పాదకత పెరుగుతుంది.

జీవ వైవిధ్యం: జన్యు స్థాయిలో చీడపీడలను తట్టుకునే రకాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం వాళ్ళ, పర్యావరణ స్థాయిలో సహజ పరిస్థితులు నెలకోవడం వల్ల, రసాయనాల వినియోగం లేకపోవడం వల్ల మంది జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది. విత్తన అభివృద్ధికి పరాగసంపర్కం బాగా జరుగుతుంది. పురుగులను అరికట్టే సహజ శత్రువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు, బుచారాలు అభివృద్ధి చెందుతాయి.

సురక్షిత ఆహరం : సేంద్రియ వ్యవసాయంలో పాటించే అన్ని అంశాలు సురక్షిత ఆహార ఉత్పత్తికి ద్రోహదపడతాయి. తధ్వర మానవాళికి ఆరోగ్యం కలుగుతుంది.

సేంద్రియ వ్యవసాయంలో సమస్యలు, సవాళ్లు :

 • సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతానికి నగరాలు, పట్టణానికి పరిమితమై ఉన్నాయి.
 • సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతికి ఆర్గానిక్ సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి.
 • అవసరమైన మేరకు సేంద్రియ ఎరువులు అందుబాటులో లేకపోడం.
 • సేంద్రియ వ్యవసాయం ప్రారంభించిన మొదటి  2 -3 సంవత్సరాలలో పంట ఉత్పత్తి తక్కువగా ఉండడం.
 • ఆనవాయితీగా రసాయనాలు వదిన పొలాలలో రసాయన అవశేషాలు విచ్చిన్నం కారడానికి 2 -3 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాతనే కల్తీలేని సేంద్రియ ఉత్పత్తి పొందగలము.
 • సేంద్రియ ఉత్పత్తులకు ఏ విధమైన రాయితీలు లేవు.
 • సేంద్రియ పంట పొలాలకు, రసాయనాలు వాడే పొలాలకు కనీసం 100 మీటర్ల దూరం వుండాలి. మనకున్న పరిస్థుల్లో చిన్న కమతాలు ఎక్కువ. కనుక ఇది కష్ట సాధ్యం.

సేంద్రియ ఉత్పత్తులకు పంటల యాజమాన్యంలో పాటించాల్సిన నిబంధనలు :

 • సాధ్యమైనంత వరకు సంత విత్తనం వాడాలి.
 • పంట మార్పిడి పాటించాలి.
 • రసాయన ఎరువులు వాడరాదు. సేంద్రియ, జీవన ఎరువులు  మాత్రమే వాడాలి.
 • రసాయన పురుగుమందులు వాడరాదు. అవసరమైనప్పుడు వృక్ష సంబంధ మందులు వాడాలి. జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
 • ప్రక్క పొలాల్లో రసాయన మందులు పిచికారీ చేస్తే, అది సేంద్రియ వ్యవసాయం చేసే పొలంలోకి రాకుండా జాగ్రత్త పడాలి. అవసమైతే కాంచేపంటగా బఫర్ జోన్ క్రింద కొంత పైరును వదలిపెట్టాలి.

ఇవన్నీ చూసినప్పుడు సేంద్రియ వ్యవసాయం చేపట్టడం . అంత సులభమైనది కాదని అనిపించవచ్చు. అయితే అది అంతకష్టమైనది కాదని కూడా గుర్తించి, సవాలుగా స్వీకరించి సాధించాలి.

నేడు ప్రపంచవ్యాప్తంగానే సేంద్రియ వ్యవసాయానికి అనుకూలత వ్యక్తమవుతుంది. ఆదరణ పెరుగుతుంది. నేడు ఆస్ట్రేలియా, అర్జన్టీనా, ఇటలీ, అమెరికా దేశాలు సేంద్రియ  వ్యవసాయంలో ముందున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి వస్తున్న గుర్తింపును గమనించి మనదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృత పరిచేందుకు 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వ "ఇండియా ఆర్గానిక్ " పేరుతో ప్రభుత్వరంగ సంస్థ ఆయన "ఆపేడ " మన ఊతపతులకు ఎగుమతి గిరాకీ తెచ్చే ప్రయత్న ఛేట్టింది. ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతి చేయాలంటే వీరి నుండి "సేంద్రియ ఉత్తత్తి " అనే సర్టిఫికెట్ పొందాలి. దీనికనుగుణంగా అనేక రాష్టాలలో కొన్ని స్వచ్చంద సంస్థలు, రైతు సంఘాలు సేంద్రియ  వ్యవసాయం ప్రోత్సహించడానికి నడుం కట్టాయి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate