హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / సేంద్రీయ ఎరువుల ఆవశ్యకత
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సేంద్రీయ ఎరువుల ఆవశ్యకత

స్థూల,చిక్కటి సేంద్రీయ ఎరువులు,ప్రయోజనాలు

పంటల దిగుబడి పెంచడానికి, అధిక మోతాదులో కృత్రిమ వనరులైన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం పరిపాటి అయ్యింది. పైర్లకు పోషకాలు అందించడంలో సమతుల్యత పాటించకపోవడం వల్ల నేల ఆరోగ్యం, ఉత్పాదకత తగ్గిపోవడం జరుగుతుంది. అంతే కాక రైతులు పురుగులను, తెగుళ్ళను, పోషక మూలకాల లోప లక్షణాలను గుర్తించడంలో సరైన అవగాహన లేక సస్యరక్షణ మందులను విచక్షణారహితంగా వాడటం వల్ల పండించిన పంటల్లో అధిక మోతాదులో రసాయన అవశేషాలు ఉండటం, మిత్ర జూవులు, పరాన్న భుక్కులు నశించడం, పర్యావరణ కాలుష్యం వంటివి వాటిల్లడం జరుగుతోంది.

అంతే కాకుండా ఆరోగ్యం, పర్యావరణ రక్షణపై పెరుగుతున్న శ్రద్ధ కారణంగా సేంద్రీయ ఎరువులకు ప్రాముఖ్యత పెరుగుతోంది. కావున సహజ వనరులైన సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షిస్తూ, నాణ్యమైన, అధిక దిగుబడులను పొందవచ్చు.

ఈ రకమైన ఎరువులు ముఖ్యంగా రెండు రకాలు. అవి-

 1. స్థూల సేంద్రీయ ఎరువులు
 2. చిక్కటి సేంద్రీయ ఎరువులు.

స్థూల సేంద్రీయ ఎరువులు

స్థూల సేంద్రీయ ఎరువులలో పశువుల ఎరువు (0.5 శాతం నత్రజని, 0.4 శాతం భాస్వరం, 0.5 శాతం పొటాఫ్) కంపోస్టు (0.4 శాతం నత్రజని, 0.5 తం భాస్వరం, 1.4 శాతం పొటాష్) వీటితో పాటు అన్ని రకాల సూక్ష్మ మూలకాల సేంద్రీయ ఎరువులతో లభ్యమవుతాయి. అలా కాకుండా ఇవి నేల భౌతిక లక్షణాలను అభివృద్ధి పరచడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి.

చిక్కటి సేంద్రీయ ఎరువులు

నూనెగింజలు పంటల నుండి నూనెను తీసివేసి మిగిలిన పదార్థాన్ని ఎరువుగా వాడుకోవచ్చు. వీటినే చిక్కటి సేంద్రీయ ఎరువులు అంటాం. ఇందులో వేరుశనగ పిండి (7.2 శాతం నత్రజని, 1.6 శాతం భాస్వరం, 1.4 శాతం పొటాష్), ఆవచెక్క (5.2 శాతం నత్రజని, 1.8 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్) వేపపిండి (5.2 శాతం నత్రజని, 1 శాతం భాస్వరం, 1.3 శాతం పొటాష్), ఆముదం పిండి (4.3 శాతం నత్రజని, 1.9 శాతం భాస్వరం, 1 శాతం పొటాష్) ఉంటాయి. అయితే వీటిలో వేరుశనగ పిండి, నువ్వుల పిండి, ఆవపిండి, పశువుల మేతగా, కోళ్ళ మేతగా వేస్తున్నారు. మిగిలినవి మాత్రమే ఎరువులుగా వాడుతున్నారు. చిక్కటి సేంద్రీయ ఎరువుల్లో స్థూల సేంద్రీయ ఎరువులకల్లా అధిక మోతాదులో పోషకాలు లభ్యమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో వానపాములతో తయారు చేసిన ఎరువులు కాడా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి.

సేంద్రీయ ఎరువుల ప్రయోజనాలు

 • భౌతిక స్థితులు నేలలో అభివృద్ధి చెందుతాయి.
 • సూక్ష్మజీవుల ఉత్పత్తి చేసే హార్మోన్ల వల్ల మొక్కల పెరుగుదల జరుగుతుంది.
 • నేలలో నిల్వ ఉన్న పురుగు మందుల అవశేఫాలను విచ్ఛనం చేస్తాయి.
 • వాతావరణానికి ఎటువంటి హాని తలపెట్టవు.
 • సేంద్రీయ ఎరువుల ద్వారా పండించిన పంటలకు అధిక మద్దతు ధర దొరుకుతుంది. నీటిని అధిక మొత్తంలో ద్రహించి ఎక్కువ కాలం పంటకు అందిస్తాయి.
 • అన్ని రకాల మూలకాలను (సూక్ష్మ, స్థూల) అందిస్తాయి.
 • నేలలోని ఆమ్ల, క్షార లక్షణాలను తగ్గించి నేలను సారవంతం చేస్తాయి.
 • ఎరువు నేలలు గుల్లబారి భూమిలో వేళ్ళు చక్కగా అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

2.91489361702
vamshi Nov 17, 2017 06:01 PM

సేంద్రియ పoటలు లాబాలు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు