హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / వృక్ష సంబంధ సేంద్రీయ పదార్థాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వృక్ష సంబంధ సేంద్రీయ పదార్థాలు

వృక్ష సంబంధ సేంద్రీయ పదార్థాలతయారీ,జీవనియంత్రణ

sendriaప్రకృతిలో సహజ వనరులైన సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి సక్రమ యాజమాన్య పద్ధతులతో సుస్థిరమైన పంటలు ఉత్పాదకతతో ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించే విధానమే సేంద్రీయ వ్యవసాయం. ఈ పద్దతుల ద్వారా పండిన వాటిని సేంద్రీయ ఉత్పత్తులు అంటారు. వ్యవసాయంలో సుస్థిరత తేవాలంటే లాభసాటి వ్యవసాయానికి, నిలకడగా దిగుబడులు పొందడానికి, వ్యవసాయ సుస్థిరత ఎంతో ముఖ్యమైనది. ఆహార భద్రతకు పౌష్టికాహార ఉత్పత్తికి, గ్రామీణులకు పని కల్పించి తద్వారా పేదరిక నిర్మూలనకు సహజ వనరులు, పరిసరాల పరిరక్షణకు తోడ్పడుతుంది. సేంద్రీయ వ్యవసాయంతో వీటిని సాధించడం సాధ్యమౌచుంది.

సేంద్రీయ వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్దతుపలను వేప, వావిలి, కానుగ, సీతాఫలం వంటి వృక్ష సంబంధ మందులతో సహజ మందులతో సహజ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పల్లెలో ఈ వృక్షాలు సర్వసాధారణఁగా ఉంటాయి. రైతుస్థాయిలో ఈ వృక్ష సంబంధ మందులు తయారు చేసుకోవచ్చు.

వేసవి వేపాకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు లభిస్తాయి. వేసవి రైతులకు సమయం కూడా ఉంటుంది. కాబట్టి వేపపప్పు ద్రావణం తయారు చేసుకొని ఖరీఫ్ సమయంలో వచ్చే చీడపీడలపై పిచికారి చేసుకోవచ్చు. వేప గింజలలోని పప్పుతో చేసే ఈ మందును ఇంటిలోనే తయారు చేసుకోవాలి. వే-జూన్ నెలల్లో వేప పండ్లు చెట్ల నుండి రాలుతున్న సమయంలో వేపచెట్ల కింద టార్ఫాలిన్ గానీ, ప్లాస్టిక్ షీట్ గానీ, పరచి కర్రతో కొమ్మలను కొడితే పండ్లు రాలుతాయి. అలా చేస్తే వాటికి మట్టి అంటకుండా ఉంటుంది. పండ్లను 2-3 రోజుల నీడలో ఆరబెట్టాలి. తర్వాత కాయలను 1-2 గంటలు నీటిలో నానబెట్టి పిసికితే పైతొక్క గుజ్జు పోతాయి. వీటిని తీసివేయకపోతే గింద నాణ్యత తగ్గుతుంది. ఈ గింజలను సంచులలో మాత్రమే నిల్వ చేయాలి.

వేపప్పు ద్రావణం తయారీ చేసే పద్ధతి

ఒక ఎకరానికి వేప విత్తనాలు 15 కిలోలు లేదా వేపపప్పు 5 కిలోలు అవసరం. నీడలో ఎండిన వేప కాయలను పగులగొడితే గింజలోని పప్పు వస్తుంది. దానిని కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా రుబ్బి పేస్టు చేయాలి. అలా వచ్చిన పేస్టును ఒక గుడ్డలో మూటలా కట్టి బక్ఖెటు నీటిలో నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత మూటను తీసి రసం పిండాలి. అదే నీటిలో మూటను ముంచుతూ అందులో సారమంతా దిగేలా చేయాలి. అలా వచ్చిన ద్రావణఁ పొలలా ఉంటుంది. వాడే మందు 1 లీటరు ద్రావణానికి 2-5 గ్రా. సబ్బు పొడి కలపాలి. అందువల్ల ద్రావణం మొక్కలకు అంటుకొని ఉంటుంది.

వాడుకునే పద్దతి : ఒక ఎకరానికి 15 కిలోల వేప గింజలు కావాలి. వాటి నుండి 50-60 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసి సాయంత్రం పూట పంటపై పిచికారి చేయాలి.

ఉపయోగం : వేపపప్పు ద్రావణం అన్ని రకాలంటే దాదాపు 150 రకాల పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని ఘాటు వాసన కారణంగా కీటకాలు మొక్క దగ్గరికి రాలేవు. ఆకుల మీద గుడ్లు పెడుతుంది. ఒక వేళ గుడ్లు పెట్టాక వేపపప్పు ద్రావణం పిచికారి చేస్తే అందులోని అజాడిరక్టిన్ గుడ్లను నాశనం చేసి కీటక సంతతి పెంచకుండా చేస్తుంది.

పచ్చిమిరప – వెల్లుల్లి ద్రావణం

దీనిని ఇంటిలో తయారు చేసుకోవాలి.

తయారీ విధానం : 3 కిలోల పచ్చి మిరపకాయలను తొడినలు తీసి మెత్తగా రుబ్బాలి. దానిని 10 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. అరకిలో వెల్లుల్లిపాయలను బాగా నూరి ¼ లీటర్ల కిరోసిన్ లో రాత్రంతా నానబెట్టాలి. వడకట్టిన మిరప ద్రావణాన్ని వెల్లుల్లి ద్రావణాన్ని రెండింటికి కలిపి దానికి 75 గ్రా. సబ్బుపొడిని నీటిలో కలిపి కలపాలి. ఈ మిశ్రమాన్ని 4 గంటల తరువాత వడగట్టి 80 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలో పిచికారి చేయవచ్చు.

వావివళి, ఆకు కషాయం తయారీ

10 కిలోల వావిలాకును 20 లీ. ఆవు మూత్రంలో రక్షం రోజులు మురగబెట్టి తరువాత వడగట్టిన ద్రావణాన్ని 8 లీ. నీరు కలిపి పలుచన చేసి ఎకరం పంటపై చల్లితే రసం పీల్చే పురుగుల బెడద ప్రత్యేకించి తామర పురుగుల బెడద చాలా మటుకు తగ్గుతుంది.

ఉపయోగాలు : వావిలి ఆకుమందులతో పంట పురుగులను సమర్థవంతంగా నిరోదించవచ్చు. వావిలి ఆకు మందు మనిషి, ఆరోగ్యానికి ఎలాంటి హానిలేదు. అలాగే, మిత్ర కీటకాలకు ఎలాంటి హాని చేయదు. ఈ మందు లార్వా దశలపై పడితే పురుగు వ్యూపా దశ ఏర్పడక తల్లి పురుగు గుడ్లు పెట్టక ముందే చనిపోతాయి.

సీతాఫల పత్రాల కషాయం

ఏవుగా పెరిగిన సీతాఫలం మొక్కల నుండి ఆకులు సేకరించాలి. ఒక లీటరు నీటికి 50 గ్రా. చొప్పున కులను మెత్తగా పలుచని, చిక్కని ద్రవంలా మారే వరకు రుబ్బురోలులో రుబ్బి తర్వాత సబ్బు పొడిని వేసి బాగా కలియబెట్టి పిచికారీ చేయవచ్చు. మరొక పద్ధతిలో 10 లీ. నీటికి 500 గ్రా. ఆకులను తీసుకొని పెద్ద మట్టి బాణలిలోకి గానీ, పాత్రలో గానీ వేసి బాగా మరిగే వరకు ఉడకబెట్టాలి. నీరు మెత్తం ముదురు రంగుకు మారిన తర్వాత కషాయాన్ని చల్లార్చి చారెడు సబ్బుపొడిని వేసి కలియబెట్టి పిచికారీ చేయాలి. ఇది కీటక సంహారకాలుగా పనిచేస్తాయి.

ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయంలో వృక్ష సంబంధ మందులను రైతులే స్వయంగా తయారు చేసుకొని, సహజ సస్యరక్షణ చర్యలను చేపట్టవచ్చు. శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలను పాటిస్తున్నట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. తక్కువ ఖర్చులో అధిక ఆదాయం సేంద్రీయ ఉత్పత్తులను పొందవచ్చు.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.05434782609
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు