অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సేంద్రీయ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయం

 1. ప్రజలు నిర్వహించే ఆహారపు అడవులు
 2. చిన్నదైనదే అందం
 3. పేలిక పంట (స్ట్రివ్ క్రాప్) - మెట్ట రైతుల ఆశాకిరణం
  1. పేలిక పంట విధానమును రైతులు ప్రయత్నించడం
  2. ఆచరణలోని ఇబ్బందులు
  3. ధనం కంటె ఎక్కువ
 4. కరవును తట్టుకోవడానికి సాంప్రదాయక విజ్ఞానం – వరిని కాపాడిన కుంటలు
  1. క్రమం తప్పని కరువు
  2. సాంప్రదాయక నీటి నిల్వ చేసుకునే కుంట
  3. ఐదు శాతం మోడల్
 5. పనికిరాని ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి నర్సరిని పెంచవచ్చు
 6. వెర్మి కంపోస్ట్‌తో మరింత దిగుబడి, మరింత రాబడి- చిన్న రైతు మార్గదర్శనం
  1. పెద్ద ఆశల చిన్న రైతు
  2. మలుపు తిప్పిన సంఘటన
  3. వెర్మి కంపోస్టు -లాభాలమయం
  4. ఆశవదులుకున్నవారికి ఆశా శిఖరం
 7. సమిష్టి కృషితో సత్ఫలితాలు
 8. పురస్కారాన్ని అందుకున్న సిక్కిం రైతు ధనపతి సప్కోట
 9. మెంటపల్లి గ్రామంలో పప్పుల బట్టి ద్వారా ఆహార పోషకాల భద్రత
  1. విజయం మరియు వ్యాప్తి
 10. ఫారెస్టు ఆఫ్ హొప్ – ఆశావాదానికి ఉదాహరణగ అడవి లేకుండా నీరు లేదు, నీరులేకపోతే తినడానికి బియ్యం ఉండదు
 11. స్థానిక ప్రజల ద్వారా సాగుచేయనటువంటి ఆహార పంటల సంరక్షణ
  1. పచ్చి ఆకుకూరలు - మంచి పోషకాలను అందించే వనరులు
  2. పంటల వైవిధ్యాన్ని ఉత్సవంగా జరుపుకొనుట
  3. ముగింపు
 12. వ్యవసాయంలోని చీడ పురుగుల యాజమాన్యంనకు పున:నిర్వచనము
  1. పునుకుల
  2. పరివర్తనకు నాంది
  3. మొదట్లో బెరుకుదనం
  4. విజయంలోని మాధుర్యం
  5. ప్రభావములు
  6. విధానము వేగంగా విస్తరించడము
  7. సస్య రక్షణ పై మారుతున్న ధృక్పధం
 13. రైతులచే స్వయంగా మార్కెటింగ్...సంఘటిత కృషికి నిదర్శనం
  1. అప్పటికి అనుసరిస్తున్న మార్కెటింగ్ పద్ధతులు
  2. తొలి అడుగు
  3. అడుగుజాడలను అనుసరిస్తు
  4. నేరుగా మార్కెటింగ్‌లో ఆదాయ వ్యయాలు...రూపాయలలో
 14. ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు...పత్తి నుంచి జొన్నకు
  1. ప్రత్యామ్నాయ సాగు పద్ధతుల దిశగా...
  2. పత్తి సాగులో ఆదాయ వ్యయాలు (ఎకరాకు రూపాయలలో) - 2005
  3. పత్తి అధ్యయన ఫలితాలను జొన్నకు విస్తరించడం
  4. జొన్న సాగులో ఆదాయ వ్యయాలు (ఎకరాకు రూపాయలలో) - 2005
 15. టొమాటోలో చీడల, తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం...మహిళా రైతులకు వ్యవసాయ క్షేత్ర పాఠశాల
  1. ప్రక్రియలు
  2. అనుసరించిన పద్ధతులు
  3. సాధించిన ముఖ్య ఫలితాలు
  4. ఆదాయ వ్యయాలు (ఎకరాకు)...పోల్చి చూడడం
  5. పెరిగిన ఆదాయం
  6. యెల్లో స్టికీ ట్రాప్‌కు బదులుగా రైతులు రూపొందించిన స్థానిక నూత్న పరికరం
  7. పర్యావరణ పరిరక్షణపై పిల్లలలో చైతన్యాన్ని రగిలించడం
 16. మెట్ట భూములలో పత్తిపంట గిట్టుబాటుకు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు
  1. మార్పు దిశగా
  2. అనుసరించిన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు
  3. ఖర్చు ఆదాయం (ఎకరాకు రూపాయలలో)
  4. సమగ్ర సాగు విధానం దిశగా
 17. పిల్లలు వేసిన పెరటితోటలు గ్రామ ముఖచిత్రాన్నే మార్చుతున్నాయి
 18. బనమాలి దాస్ - ఒక సమగ్ర కర్షకుడు
 19. ప్రజల భాగస్వామ్యాలతో పలు శ్రేణులుగా ఉండే మెట్లతో చెరువులను నిర్మించడం ద్వారా వర్షాధార పంటలను పండించుట
 20. సేంద్రీయ వ్యవసాయం
 21. హైటెక్ సాగు

ప్రజలు నిర్వహించే ఆహారపు అడవులు

అడవులు, ఇతర జీవావరణాలు అంతరించిపోవడంతో వాటి ఆధారంగా జీవించే పేద ప్రజల ఆదాయ మార్గం కుంటుపడిపోయి తీవ్రమైన ఆహార కొరతకు, పోషకాహార లోపాలకూ దారి తీసింది. గతంలో వారికి ఆహారాన్నీ, పండ్లనూ (కంద మూలాలు, రకరకాల కలుపు మొక్కలూ, రసాలూ), వారి పశువులకు మేతనూ సమకూర్చే రక రకాల సాంప్రదాయ వృక్షాలు కూడా అంతరించి పోవడం వారి కష్టాలకు మరింత తోడయ్యింది. భూమి లేని నిరుపేదల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడూ, తర్వాతా కూడా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. తగిన సామాజిక, ఆర్ధిక వనరులు లేకపోవడం వలన ప్రకృతి వైపరీత్యాల వలన ఏర్పడ్డ నష్టాన్ని భరించే స్థోమత కూడా వీరికి ఉండదు.

ఆహారపు అడవుల పద్ధతిలో భూమి లేనివారు, గ్రామీణ నిరుద్యోగులూ సమిష్టిగా ఖాళీగా ఉన్న భూములను కొద్దికాలం పాటు కౌలుకి తీసుకుని ఆ జీవావరణానికనువైన బహుళ ఉపయోగాలున్న అనేక రకాల చెట్లను నాటుతారు - అంటే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఆహారం, వంట చెరకు, పశుగ్రాసంతో పాటు ఫర్నీచర్ తయారీకి అవసరమైన కలపను కూడా కాలానుగుణంగా అందించ గలిగే విధంగా సరైన చెట్లనూ, పొదలనూ, తీగలనూ, గడ్డి జాతులనూ, దుంపలనూ తగినట్టుగా ఎంచుకోవడం. ఏదైనా నీటి వనరు ఉంటే చేపలూ, బాతులూ కూడా పెంచుకోవచ్చు. వైపరీత్యాల సందర్భంలో సంభవించే విషమ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఈ పద్ధతి విజయం సాధించింది. అంతేకాక ఈ బృందం లోని సభ్యులు చేపల పెంపకం, పౌల్ట్రీ, (కోళ్ల పెంపకం) బాతుల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో అనేక రకాల చెట్లను నాటడం వలన ఒక వైపు భూతాపాన్నిఅరికట్టి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూనే భూమిలేని వారికి భూమిని కూడా సమకూర్చి పెడుతుంది.

ఈ ఆహారపు అడవులు ప్రధమంగా 2004 సంవత్సరంలో ఖోస్కదంపూర్ గ్రామం (కంకలితల గ్రామ పంచాయితీ, బోల్పూర్ శ్రీనికేతన్ బ్లాకు, బీర్ భూమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్) లో భూమి లేని నిరుపేద కుటుంబాలతో మొదలుపెట్టారు. డి.ఆర్.సి.ఎస్.సి. భూమి లేని నిరుపేద కుటుంబాలను పి.ఆర్.ఐ. తో సంప్రదింపులు జరపడానికి కూడగట్టింది. వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం, సభ్యులు 25:75 నిష్పత్తిలో పంచుకోవాలన్న ఒప్పందంతో భూమి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. మొక్కల జాతుల ఎంపిక, మొక్కల పెంపకం, లేత మొక్కలను అడవిలో నాటడం, నాటిన మొక్కల సంరక్షణ, కోత, ఉత్పత్తి పంపకం అన్నీ సభ్యులే చేపట్టారు. సంవత్సరాల తరబడి ఈ సభ్యులు మొక్కలను సంరక్షిస్తూ, దాని మీద వచ్చే పండ్లనూ, ఇతర ఉత్పత్తులనూ వారిలో వారు సమానంగా పంచుకొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపధ్యంలో మరే ఇతర ఆహారం దొరకనప్పుడు ఈ ఫలసాయం వారికి ఎంతో ఉపయోగపడుతోంది. కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజలు వంటివి కూడా మధ్యలో సాగుచేస్తూ ఉండడం వలన వీరికి దైనందిన ఆహార అవసరాలు తీరడమే కాక పశువులకు మేత కూడా లభిస్తుంది. ఈ కృషిని మరింత సుస్థిరం చేయడానికి ఆహారపు అడవులలో కోళ్ల పెంపకాన్నీ, బాతుల పెంపకాన్నీ కూడా చేర్చారు.

ఆధారము: DRCSC newsletter, Issue 6

చిన్నదైనదే అందం

రాఖీ తురీ భోలక్ పూర్ లోని ఒక మురికివాడలో నివసించే గృహిణి. ఈమె భోలక్ పూర్ 1 అనే పొదుపు సంఘంలో సభ్యురాలు కూడా. ఆమె భర్త వికాష్ తురీ రిక్షావాడు. 5 మంది సభ్యులున్న వారి కుటుంబానికి అతని నెల సంపాదన, రూ 1,650 ఏమాత్రం సరిపోదు. ఈ షెడ్యూలు కులం కుటుంబాన్ని ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లుగా కూడా పేర్కొంది. రాఖీ ఏదైనా పనికొరకు వెదికినా ఫలితం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో కే.యు.ఎస్.పి. వారి `ఇన్నోవేటివ్ ఛాలెంజ్ ఫండ్' అన్న నిధులతో డి.ఆర్.సి.ఎస్.సి. వారు ఒక వెర్మీకంపోస్టు తయారుచేసే కార్యక్రమాన్ని తలపెట్టారు. రాఖీ తురీ బృందం ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కనబరిచింది.

ఒకో బృందంలో 15 మంది మహిళలు ఉండేలాగ 5 బృందాలను ఏర్పరచాలన్నది ఈ సంస్థ ధ్యేయం. ఈ బృందాలు భోలక్ పూర్ మార్కెట్ల నుండి కూరగాయ వ్యర్ధాలు సేకరించి వాణిజ్య సరళిలో వెర్మీకంపోస్టు తయారు చేస్తాయి. భోలక్ పూర్ 1 బృందం లోని మహిళలు జంబోని లోని `సప్పోర్ట్' అనే సంస్థ వారి స్థలంలో వెర్మీకంపోస్టు గోతు (పిట్స్)లను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ మహిళలు వెర్మీకంపోస్టు తయారీలో శిక్షణ పొందారు. మార్కెట్ల నుండి కూరగాయ వ్యర్ధాలను సేకరించడంలో కుటుంబంలోని పురుషులు కూడా తమ వంతు సహాయాన్ని అందించారు.

ఈ మహిళలు గడ్డీ, పేడా వంటివి సేకరించి, నాణ్యమైన వాన పాములతో వెర్మీకంపోస్టు తయారు చేయనారంభించారు.వారు వారి ఉత్పత్తికి `బసుంధర వెర్మీకంపోస్టు' అన్న పేరు ఖరారు చేశారు. మొదటి నెలలో రెండు తొట్టెల నుండి మొత్తం 400 కే.జీ. ల కంపోస్టు ఉత్పత్తయ్యింది. ఇంక వారు వారి ఉత్పత్తిని అమ్మే సమయం వచ్చింది. ఒక కిలో కి 10 రూపాయల ధరను నిర్ణయించారు. అమ్మగా వచ్చిన డబ్బులో రూ. 1000 బ్యాంకు ఖాతాలో తదుపరి పిట్స్ నిర్మించేందుకు పొదుపు చేస్తారు. మిగిలిన మొత్తాన్ని సభ్యులందరూ సరి సమానంగా పంచుకుంటారు.

ఇంటి పనంతా అయ్యాక రాఖీ తురీ రోజుకి 1-2 గంటలు పనిచేసేది. మొదటి నెలలో రూ. 200 సంపాదించింది. ముడి సరుకు సేకరణకూ, ప్రోజక్ట్ తరఫున ప్రచారం జరపడానికీ తన రిక్షాను అద్దెకు ఇవ్వడం ద్వారా కూడా ఆమె భర్త కొంత అదనపు ఆదాయాన్ని పొందాడు. తన ఖాళీ సమయాన్ని వెచ్చించి ఎంతో కొంత సంపాదించినందుకు రాఖీ తురీకి చాలా ఆనందంగా ఉంది. వారి వ్యాపారం భవిష్యత్తులో మరింత పెద్దది కాగలదన్న ఆశాభావాన్ని రాఖీ తురీ వ్యక్తం చేసింది.

ఆధారము: DRCSC newsletter, Issue 6

పేలిక పంట (స్ట్రివ్ క్రాప్) - మెట్ట రైతుల ఆశాకిరణం

- గురుదత్ హెగ్డె, రవీంద్రనాధ్ రెడ్డి మరియు అరుణ్ బాలమట్టి

కర్ణాటక రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలైన చిత్రదుర్గ మరియు బళ్ళారి జిల్లాలో చిన్నహగరి మరియు ఉప్పరహల్ల వాటర్ షెడ్ ప్రాంతాల కలవు. తరచూ ఈ ప్రాంతాలలో కరువు పరిస్థితులు సంభవిస్తుంటాయి. ఇక్కడి భూములు తక్కువ లోతుతో, సేంద్రియ పదార్థం లేక మరియు భూసంరక్షణ పద్ధతులు లోపించి ఏ ఇతర పంటలను పండించుట కనుగుణంగా లేక మెట్ట పంటైన వేరుశనగను మాత్రమే పండించుచున్నారు. ఇక్కడి ప్రజలలో 80 శాతం పైగా రైతుల జీవనోపాధి వేరుశనగపై ఆధారపడి వుంటుంది. లేకపోతే రోజు కూలీగాని, వలస పోవడం ద్వారా పూట గడపవలెను. ప్రతి సం|| వేరుశనగను పండించడమనేది గత 30 సం||లుగా జరుగుతుంది.

పంట యొక్క వివిధ దశలలో దాదాపు మొత్తంగా 300 మి. మీ|| వర్షపాతం నమోదయితే కాయలు మరియు పశుగ్రాసం నుండి మంచి దిగుబడిని ఆశించవచ్చును. సాధారణ వర్షపాతం నమోదైన సంవత్సరంలో వేరుశనగ పంట నుండి తక్కువలో తక్కువ రూ|| 2000 - 3000 వరకు ఆదాయం వచ్చును. కాని రైతులు ఈ పంటను కాకా మరే ఇతర పంటల వైపునకు మరలరు ఎందుకంటే వీరు చాలా సంవత్సరాల క్రితం నుండి దీనికి అలవాటు పడటం మరియు వేరుశనగ వ్యాపారులకు అపు? కలిగి వుండటం.

సన్న మరియు చిన్న కారు రైతులకు లబ్ధి చేకూర్చుటకు మరియు వారి జీవనోపాధిని మెరుగు పరుచుట కొరకు దిగుబడి మరియు ధరలలోని హెచ్చు తగ్గులను స్థిరీకరించుటయే కాకా చేయవలసినది ఇంకా వేరే వుంది.

‘‘వేరుశనగలో రాగి పేలిక’’

ప్రాంతంలోని రైతుల యొక్క ఆహారం భద్రత మరియు ఆదాయంను మెరుగు పరుచుట కొరకు 2002 - 2005 మధ్యకాలంలో కర్ణాటక వాటర్ షెడ్ అభివృద్ధి (కవాడ్) కార్యక్రమమును ప్రారంభించటం జరిగినది. ప్రాజెక్ట్ ల పరిధిలో గట్లు వేయడం, గల్లి ప్లగ్గింగ్ మరియు నీటి పరీ వాహక ప్రాంత అభివృద్ధి కొరకు విరివిరిగా పనిచేయడం జరిగింది. సామాజిక మరియు నీటి సంరక్షణ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టడం వలన మంచి ఫలితాల కనిపించినవి ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల రెట్టింపవడం జరిగింది. తక్కువ వర్షపాతం మరియు అధికాక సరిగా కురవక పోవడం వలన వ్యవసాయ ఉత్పత్తిని పెంచుట కొరకు పొలం నందే (స్థానికంగా) భూమి మరియు నీటి సంరక్షణ పద్ధతులు, భూసారాన్ని పెంపొందించునటువంటి పద్ధతులను గూర్చి బాగా చెప్పవలసిన అవసరం ఎంతైనా వున్నది. ప్రాజెక్ట్ భాగస్యామిగా “ఎయమ్ఇ” సంస్థ సాగు పద్ధతులను మెరుగు పరుచు విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేసినది.

మొదట్లో రైతులలో నమ్మకంను కలిగించుట కొరకు ఎయమ్‌ఇ సంస్థ, వారి ప్రథమ అవసరాలైన వేరుశనగలో చీడ పీడల నివారణ గూర్చి పనిచేసింది. మొదటి రెండు సం||రంలో ఈ విధంగా దాదాపు 500 మంది రైతులతో పని చేయడం జరిగినది, ఇవేకాకా జీవ పద్ధతులు, అంతర పంటల మరియు ముఖ్యమైన పోషకాలైన భాస్వరం (సూపర్, యస్ యస్ సి) మరియు కాల్షియం (జిప్సం) వంటి పద్ధతుల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని రైతులు గుర్తించారు. ఎయమ్‌ఇ సంస్థ వేరుశనగ పంటనే (ఒక్కటినే) ప్రతి సం|| వేయడాన్ని కూడా మాన్పించి ఇతర వాటిని ప్రయత్నించాలని సూచించగా వేరుశనగ ఆదాయాన్ని సమకూర్చే పంట అవడం వలన రైతులు పంట మార్పు చేయుటకు అంతగా ఇష్టపడలేదు.

ఈ సందర్భంలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా, మెట్ట పరిస్థితులను తట్టుకొని పేదవారి పంటగా పిలువబడుచూ కేవలం మొలకెత్తుటకు మాత్రమే నీటిని ఆశించి గ్యారంటి దిగుబడులను ఇచ్చే చిరుదాన్యాలను గూర్చి ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే వేరుశనగ మొలకెత్తుటకు మాత్రమే కాకా పుష్పించటం. కాయ ఏర్పడటం వంటి ఇతర దశలలో కూడా నీటి అవసరం ఎక్కువగా వుండును లేకపోతే పంటను కాపాడుకొనలేము. ఇందుకోసం వేరుశనగ పంటలో మధ్య మధ్యన చిరు ధాన్యాల పంటలను పేలికలు (స్ట్రిప్స్)గా పరిచయం చేశాము. దీనినే పేలిక పంట పద్ధతి (స్ట్రిప్ క్రాపింగ్) అని కూడా పిలుస్తారు. డబ్బా - 1 లో చూడండి.

ఈ పద్ధతిని ప్రజల భాగస్వామ్యంతో సాంకేతిక పద్ధతులను అభివృద్ధి పరచడం (Participatory Technology Development) అను విధానంలో పరిచయం చేశారు. దీని ద్వారా రైతులు వారికి కావలిసినటువంటి వివిధ పంటల జోడి (కాంబినేషన్)ని ప్రయత్నించి వారి కుటుంబ అవసరాలకు సరిపోయే పద్ధతులను అవలంభించి రైతుల సాధికారతకు తోడ్పడటం జరిగింది.

పేలిక పంట విధానమును రైతులు ప్రయత్నించడం

రెండు జిల్లాలలోని 500 మంది రైతులతో వేరుశనగతో పాటు కొన్ని చిరు ధాన్య పంటలను ప్రక్కవైపున పేలికగా వేయాలని చర్చించగా కొద్ది మంది రైతులు ఆసక్తిని కనబరచి ఖరీఫ్ 2004 లో ప్రయత్నించడం జరిగింది.

ఈ పేలిక పంట విధానం అనేది రైతులకు ఒక కొత్త పద్ధతి దీనిలో చిరు ధాన్యాల పంట యొక్క నీడ వేరుశనగ పంటను ప్రభావితం చేయును అనేటువంటి కొన్ని సందేహాలు వారిలో వుండేవి. అంతేకాకా సజ్జ లేక రాగి (పేలిక పంట ద్వారా చేకూరే ఆర్థిక ప్రయోజనం వేరుశనగ కంటే తక్కువగా వుండునని భయపడే వారు. ఆ సం||లో మొదట్లో మంచి వర్షాల పడటం వలన వేరుశనగలోనే మంచి దిగుబడిని సాధించవచ్చునని ఆశించారు. దీనితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు రైతులు మరియు వడ్డీ వ్యాపారులు వీరిని నిరుత్సాహపరచారు.

అందువలన ప్రతిరైతు సానుకూలంగా స్పందిస్తారని ఊహించలేదు. కాని దాదాపు 80 మంది రైతుల ఈ విధానాన్ని ప్రయత్నించుటకు ఒప్పుకొనడమనేది శుభ పరిణామం అంతేకాకా రైతు సంఘాలలో విరివిగా చర్చ చేపట్టడం, క్రమం తప్పని క్షేత్ర సందర్శన మరియు రైతులతో వ్యకిగత పరిచయాలను ఏర్పరచుకొనడం వలన 50 మంది రైతులు ఈ టెక్నాలజిని పాటించారు. కొర్ర మరియు సజ్జ పంటలను సరియైన పేలిక (స్ట్రిప్)గా భావించారు. దాదాపు అందరు రైతులు వేరుశనగ మరియు రాగి జోడిని (కాంబినేషన్‌ను) పాటించారు.

ఆచరణలోని ఇబ్బందులు

రైతులు కొన్ని ఇబ్బందులను ఆచరణలో ఎదుర్కొనుచుంటారు. సాధారణంగా వేరుశనగను విత్తుటకు మూడు నాగళ్ళ గొర్రెను ఉపయోగిస్తుంటారు. 9:6 నిష్పత్తిలో వేరుశనగ మరియు రాగి వేయుటకు రైతుల అంగీకరించారు. కాని వేరుశనగ మరియు విత్తనాల పై పరిమాణంలో తేడా వలన విత్తే లోతును కూలీలు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం వేరుశనగ నుండి రాగికి మారుతున్నపుడు ఏర్పడింది. రాగి విత్తనాలు మరీ లోతులో పడకుండా గొర్రుకు మరియు నాగళికి మధ్య గల తాడును గట్టిగా బిగించి పట్టుకొనవలెను. ఈ విధమైన జాగ్రత్తల తీసుకోక పోవడం వలన కొందరు రైతులకు రాగి మొలకెత్త లేదు. అంతేకాకా ఆకుమిడత బెడద నుండి కూడా రాగి మొలక తక్కువగా రావటం మూలాన కొంత మంది రైతులు మరలా వేరుశనగ విత్తనాలను వేయాల్సి వచ్చింది. ఉత్తర - దక్షిణ దిక్కున విత్తినపుడు రాగికిరు పక్కల గల వేరుశనగ వరుసలలో నీడ ప్రభావం వలన మొక్కల పెరుగుదల తక్కువగా వున్నది. చివరకు 27 మంది రైతులు ఈ పేలిక పంటను సాగు చేయగలిగినారు.

డబ్బా - 1 పేలిక పంట విధానము

పేలిక పంటలు అనునవి సాధారణంగా రైతులు పండించునటువంటివి లేదా అంతర పంటలలో అనేక వరుసలలో ఒక పద్ధతిలో పండించునటువంటి పంటలు, ఇవి సాధారణంగా వాలువెంబడి ప్రధాన పంట వరుసల తర్వాత వచ్చును. ఇవి కూడా భూసారం కోతకు గురి కాకుండా చూడును.

ఉదా :- జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, ఉలవలు, అలసంద, పందిరి చిక్కుడు, నువు?లు, అవిషలు

పేలిక పంట విధానం ద్వారా తక్కువ వర్షపాతం నమోదైనపుడు, చీడ పీడల సమస్యను ఎదుర్కొనుటకు, సహజవనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొనుటకు మరియు ఒకే పంటను ప్రతి సంవత్సరం పండించుట వంటి వాటి నుండి ఆహారం, పశుగ్రాసం మరియు అధాయ భద్రతను పొందవచ్చును.

పేలిక పంట విధానం ఉపయోగాలు :

పేలిక పంటలు భూమి ద్వారా వచ్చు కీటకాలు మరియు వ్యాధి కారక జీవులకు ఆకర్షణ మొక్కలను లేకుండా చేసి వాటికి కావాల్సిన ఆహారంను దొరకనివ్వవు. వాలు పై పేలిక పంటగా రాగిని దగ్గర దగ్గరగా వేసుకొంటే భూమి కోతను కూడా తగ్గించుకొనవచ్చును.

ఎక్కువ లోతుకు మరియు తక్కువ లోతుకు వెళ్ళే వేర్లు గల పంటలను ఈ విధావంలో ఉపయోగించుట వలన ఒకేసారి పోషకాల కొరకు పోటి అనేది వుండదు మరియు ఇవి పోషకాలు లభ్యతను బాగా ఉపయోగించుకొనును. ధాన్యం పంటైన రాగికి కావల్సిన నత్రజనిని పపు?జాతి పంటైన వేరుశనగ నుండి పొందును.

వేరుశనగను కోత కోయునపుడు మొత్తం మొక్కను నేలతో సహా తీసివేయుదురు కాని రాగి పంట యొక్క కొన్ని అవశేషాలు కోత కోసిన తర్వాత కూడా వుండటం వలన అందులోని పోషకాలు కుళ్ళింపు ప్రక్రియ ద్వారా మళ్ళీ భూమిలో కలియును.

ధనం కంటె ఎక్కువ

పేలిక పద్ధతిలో వేరుశనగలో 276 కేజిలు, మామూలు వేరుశనగ విధానలలో 326 కేజిలు ఉత్పత్తి (పట్టిక -1) వచ్చును. మామూలుగా చూస్తే ఇది తక్కువ దిగుబడి కాని మొత్తం పేలిక విధానంలో వేరుశనగతో పాటు 125 కేజిల ధాన్యం దిగుబడి కూడా వచ్చింది. రైతులకు రూ|| 5507/- విలువ గల ఆదాయం వేరుశనగ కాయలు, పశుగ్రాసం మరియు రైతులు కుటుంబాలకు అవసరమైన ధాన్యం కూడా వచ్చింది.

ఒకే పంట మరియు పేలిక పంటల నుండి వచ్చు ఆదాయంను ఆయా ప్రాంతాల వ్యవసాయ వాతావరణ పరిస్థితులను బట్టి బేరీజు వేయాలి. బ్యాచిలర్ మరియు వారి సహచరుల పరిశోధనల ప్రకారం (2000) ప్రతి పది సంవత్సరాల కాలంలో, 5 సార్లు కరువు వివిధ తీవ్రతలలో సంభవించును, అందులో రెండు మామూలవి, రెండు తీవ్రమైనవి మరియు ఇంకొకటి చాలా తీవ్రమైనది. ఈ రెండు జిల్లాలలో వర్షపాతం సాధారణం అంతకంటే ఎక్కువ అనేది చాలా అరుదు.

రెండు వాటర్ షెడ్‌లలో, ఉప్పరహల్లలో సాధారణ వర్షపాతం తక్కువగా నమోదైన వేరుశనగ పేలిక పంట మంచిగా పండింది, అందువలన పేలిక పంట విధానం అనునది మెట్ట పరిస్థితులను ఎదుర్కొను ఒక మంచి పద్ధతని భావించవచ్చు.

పట్టిక -1: వివిధ పంట పద్ధతులలో వేరుశనగ దిగుబడి/ఆదాయం

పంట పద్ధతి

కేవలం ఒక వేరుశనగ మాత్రమే

ప్రధావ పంట + పేలిక పంట (వేరుశనగ + రాగి)

Groundnut

వేరుశనగ ప్రధానం పంట

వేరుశనగ రాగి

దిగుబడి (కేజి/ఎకర)

 

 

 

కాయల/ధాన్యం

362

276

125

పశుగ్రాసం

636

624

467

మొత్తం ఆదాయం (రూ||)

 

 

 

కాయలు/ధాన్యం

5784.00

4416.00

గ్రాసం

636.00

624.00

467.00

 

 

5040.00

467.00

మొత్తం (రూ||లలో)

6420.00

Rs. 5507.00 మరియు కుటుంబానికి సరిపడా ధాన్యం

వేరుశనగ, రాగిని ఒక దాని తర్వాత ఒక దానిని వేయడం వలన చీడ పీడలను తగ్గించవచ్చును. మొవ్వకుళ్ళు వైరస్ వ్యాధి కారక క్రిములను వ్యాప్తి చేయు రసం పీల్చు పురుగులైన తామర పురుగులను ఒక పొలం నుండి మరొక పొలంనకు వెళ్ళకుండా రాగి అడ్డుకొనును. వేరుశనగతో పాటు ఇతర పంటల కూడా కలిసి వుండటం వలన భూమి ద్వారా వ్యాప్తి చెందు రోగాలను కలిగించు వ్యాధి కారక జీవుల అతిథేయ మొక్కలు లేకపోవటం వలన ఈ వ్యాధుల వ్యాప్తి కూడా తక్కువైనది.

కుటుంబానికి కావల్సివ ఆహార భద్రతను రాగులు కల్పించటం వలన రాగులంటే మహిళల అధికంగా ఇష్టపడతారు. ఇపు?డు మహిళలు ఆకుకూరలు మరియు తక్కువ కాలంలో చేతి కొచ్చే పపు? జాతి పంటలైన ఉలవ మరియు అలసందలను గృహావసరాలని మొత్తం మరియు స్థానిక మార్కెట్‌లో అమ్మవచ్చునని పేలికలలో వేయాలని ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికి ఈ కొత్త విధానం వారికి పనిని ప్రభావితం చేయలేదు.

రైతుల కూడా ఒక ఉపయోగాన్ని ఈ పద్ధతిలో తెలుసుకొన్నారు. పాత పద్ధతిలో వేరుశనగను మొక్క మొత్తం భూమిలో ఏ మాత్రం వదల కుండా తీసేసెవారు కాని పేలిక పద్ధతిలో ధాన్యం పంటను వుంచడం మూలాన వాటి అవశేషాల నుండి కొన్ని పోషకాలు తిరిగి భూమిలో కలియును.

సాధారణంగా రైతులు కోత కోసిన తర్వాత, వేరుశనగ కుప్పలుగా పోసి దాని పైన వరిగడ్డి లేదా ఇతర గడ్డిని నిలువ వుంచుకొనుట కొరకు కపు?తారు. దీనిని వారు కొనవలసి వుంటుంది. అదే పేలిక పద్ధతిలో అయితే కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాగి పంట ఉపయోగించుకొనవచ్చును. ఈ విధంగా కూడా ఖర్చును తగ్గించు కొనవచ్చును.

2004 సం||లో 27 మంది రైతుల అనుభవాలు గ్రామంలోని ఇతర రైతులు కూడా పాటించుటకు అంగీకరించారు. ఈ విధానంలో ఉపయోగాలు అనేక రకాలుగా వుండటం వలన రైతులు రాబోవు కాలంలో పెద్ద ఎత్తున చేపట్టుటకు సమ్మతించారు.

ముగింపు

పెద్ద స్థాయిలో ఈ పద్ధతిని పాటించుటకు, అనేక మంది రైతులు అవలంభించి దీని యొక్క ఉపయోగాలను అర్ధం చేసుకొని వుండాలి. ప్రస్తుత పంట పద్ధతులు, రైతుల యొక్క ఆహార మరియు గ్రాసం అవసరాల తీర్చే విధంగా వున్నాయా లేదా అని అర్థం చేసుకొని వివిధ పంటల కాంబినేషన్ (జోడులు)లను సరిచూడవలెను. తక్కువ ఖర్చుతో కూడి వారి జీవన ప్రయోగాలను మెరుగు పరుచుటకు ఈ టెక్నాలజి ఎంతో బాగా ఉపయోగపడునని వారితో చర్చించితే తెలిసినది. మొదటి సంవత్సరం పేలిక పద్ధతిలోని ఆదాయం దాదాపు ఒకే పంట ద్వారా వచ్చు ఆదాయంతో సమానంగా వున్నది. భూసారాన్ని పెంపొందించుటలో దీని ప్రభావం వుండటం వలన ఎక్కువ ఆదాయంను పొందవచ్చును. రానున్న రోజులలో దీనిని మరింతగా పరీక్షించవలసిన అవసరం వుంది.

గురుదత్ హెగ్డె , ఏరియా యూనిట్ కో-ఆర్డినేటర్, ఎయమ్‌ఇ సంస్థ,
పాత మార్కెట్ రోడ్, కంటోన్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎదురుగా, అజీజ్
కాంపౌండ్, బళ్ళారి - 583104

రవీంద్రనాథ్ రెడ్డి
ఏరియా ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎయమ్‌ఇ సంస్థ, బళ్ళారి - 58310

అరున్ బాలమట్టి
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎయమ్‌ఇ సంస్థ
నెం:204, 100 అడుగుల రింగ్ రోడ్, 3వ దశ
భనశంకరి, రెండవ బ్లాక్, మూడవ స్టేజి, బెంగళూరు - 560085

రెఫరెన్స్
బాచిలర్ సిఎచ్, రామమోహన్ రావు యం ఎస్ మరియు జేమ్స్ ఎజె, 2000.
కర్ణాటక వాటర్‌షెడ్ అభివృద్ధి పధకము : నీటి వనరుల ఆడిట్ కవాడ్ రిపోర్ట్ 17,
కబాడ్ సొసైటి, బెంగుళూరు, ఇండియా. పి. 21.

ఆధారము: LEISA India, Vol 7-2

కరవును తట్టుకోవడానికి సాంప్రదాయక విజ్ఞానం – వరిని కాపాడిన కుంటలు

-కేస్ స్టడీ

కేరళ రాష్ట్రంలోని పాలాక్కాడ్ జిల్లాలోని ఎరిమాయూర్ గ్రామంలో పడయేట్టి అనే కుగ్రామం ఉంది. వారు వరిని ప్రధాన పంటగా పండిస్తారు. ఈ కుగ్రామంలో 69 కుటుంబాలవారు 100 ఎకరాల వరి పండే భూమిని కల్గి ఉన్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో కేరళ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (బయో డైవర్సిటి బోర్డు) మరియు తనల్ అనే సేవాసంస్థ ఇరువురు కలసి మూడు సంవత్సరాల వ్యవసాయ - జీవవైవిధ్య పునః నిర్మాణ మరియు సేంద్రియ వ్యవసాయ గ్రామం అనే పధకాన్ని ప్రారంభించారు.

కొండకు మధ్యలో లోయ, కోనలలో ఈ వరి పొలాలు ఉన్నాయి. వారు నివాసముండే ఇళ్ళు ఈ పొలాలకు కొంచెం దూరంలో ఉంటాయి ఇళ్ళు వరి పొలాల కన్నా కొంచెం ఎత్తులో ఉంటాయి. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం 1200 మి.మీ, ఈ వర్షం కూడా నైఋతి పవనాలప్పుడు మాత్రమే పడుతుంది. తుల వర్షం అంటే ఈశాన్య ఋతుపవనాలు కేరళ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో పడే విధంగా కాకుండా ఇక్కడ తక్కువ వర్షాలు పడతాయి.

క్రమం తప్పని కరువు

వర్షధార ప్రభావ పరిస్థితులలో, ఇక్కడ రైతులు రెండు పంటలను పండిస్తారు. కరువు వల్ల రెండవ పంట ఎప్పుడూ కూడా ఎక్కువ విస్తీర్ణంలో దెబ్బతింటూనే ఉంది. మలామపూజా ఆనకట్ట నుండి వచ్చే కాలువ నీరు ఈ ఊరి ప్రక్కనుండే ప్రవహిస్తుంది. జనవరి నెలాఖరులో ఈ కాలువ కూడా ప్రవహించడం ఆగిపోతుంది. రైతులు ఈ కాలువకు దిగువున మరియు దగ్గరలో ఉన్న సుమారు 25 ఎకరాలలో వరిని పండించడానికి అవసరమైన నీటిని ఈ కాలువ నుండి పొందేటట్టు ప్రయత్నిస్తారు.

కాని ఈ నీటిని ఎక్కువ దూరానికి పారుదల చేయలేకపోతున్నారు. ఎత్తుగా ఉండడం వల్ల , రైతులు రెండు మూడు వారాలలో తమ పంటలను నష్టపోవలసి వస్తుంది ఫలితంగా గాలిలో తేమ ఒత్తిడి అనేది సర్వసాధారణం. ఈ గ్రామస్తులు త్రాగు నీటి కోసం గుంట బావులపై ఆధార పడి ఉన్నారు. ఇక్కడ కొన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు బావులు ఉన్నాయి. ఫిబ్రవరి –మార్చి నెలలో గుంట బావులు ఎండిపోతాయి. ఇది ఇక్కడ సర్వసాధారణం. సుమారు 10 ఇళ్ళు వారు బోరుబావులను త్రవ్వుకున్నారు.

ఈ కొండలలో మంచి భాగమంటే రాళ్ళగుట్టలు. జాగ్రత్తగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఎక్కడైతే పంట పొలాలలో నీరు నిల్వఉందో అక్కడ కొట్టుకువచ్చిన ఒండ్రు మట్టి బాగా లేదు. అక్కడ కేవలం భూమిలోనుండి బయటకు వచ్చిన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ భూములు మాడిపోయు ఉన్న భూమిగా ఉన్నాయి. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే కొంతమంది రైతులు చిన్న కుంటలు కల్గి ఉన్నారు. వీటిని స్థానికంగా కొక్కర్ని అంటారు. ఈ కొక్కర్ని లో ఉన్న నీటిని ఒకటి లేదా రెండు సార్లు రైతులు పంటకు అందిస్తున్నారు. ఎవరైతే కొక్కర్ని తమ పొలాలలో కల్గి ఉన్నారో వారు పంటలను రక్షించడానికి అవసరమైన నీటిని ఎలాగోలాగా పంపుసెట్టు అద్దెకు తెచ్చుకుని పంటకు అందిస్తున్నారు. పంటను కాపాడుకుంటున్నారు.

సాంప్రదాయక నీటి నిల్వ చేసుకునే కుంట

కొక్కర్ని అంటే పంటను పండించుకునేందుకు అవసరమైన నీటిని నిల్వ చేసుకునే, సంరక్షణ చేసుకునే చిన్న కుంట (పెర్కోలేషన్ లేదా ఫాం ఫాండ్). సాధారణంగా ఇది చెరువు కంటే చిన్నది – గుంట బావుల కంటే పెద్దది. వృద్ధాప్యంలో ఉన్న జబ్బర్ అనే రైతు గుర్తు చేసుకుంటూ – బాగా ఎతైన ప్రదేశాలలో మన పూర్వీకులు ఒక డజన్ కంటే ఎక్కువ కుంటలను త్రవ్వారు. మలాంపూజా ఆనకట్ట కట్టకముందు దశాబ్ధాల క్రితం ఈ కుంటలు త్రవ్వడం మనేది మన పూర్వీకులు చేశారు, పంటను పండించుటలో విజయాలు సాధించారు.

వేసవికాలంలో కూడా ఈ కుంట ఎండిపోయేదికాదు. పిబ్రవరి-మార్చి లో రెండవ పంటను పండించడం అయిపోగానే , ఆ కుంటలలో వారు స్నానం చేసేవారు. అలా కుంటల నిర్వహణ వల్ల కింద ఉన్న వరిపొలాలకు అవసరమైన గాలిలోతేమ ను అలాగే ఉంచగలిగేవారు.

అప్పడు తప్పేమి జరిగింది. అన్ని కుటుంబాలు విడిపోవడంవల్ల, భూమిని భాగాలుగా పంచుకోవడం జరిగింది. భూములపై ఒత్తిడి పెరిగింది. కుంటలలో నీటిని నిల్వ చేస్తున్న ప్రదేశాలలోకి కూడా కర్రపెండళం వంటి పంటలు పండించడం పెరిగింది. అవి పూర్తిగా ఇసుకతో పూడిపోయాయి. నీటి నిల్వ ప్రాంతాలన్ని ఇంకిపోయాయి. మన పూర్వీకులు ఎంత జాగ్రత్తగా కుంటలు త్రవ్వి ఉంటారో అవి ఇసుకతో నిండిపోయాయి. ప్రస్తుతం వాటిని మనము గుర్తించలేము.

ఒక దశాబ్దం క్రితం, కరువు తీవ్రంగా ఉన్నప్పుడు, వ్యవసాయ సాగు చేసే రైతులు తమ పూర్వపు కుంటలను గుర్తు చేసుకున్నారు. పొక్లైన్ సహాయంతో ఒక డజను మంది రైతులు తమ పొలాలలో ఒక వైపు కుంటలు త్రవ్వుకున్నారు. జబ్బర్ తమ పొలంలో తాను రెండు కుంటలు త్రవ్వుకున్నాడు. ఒక్కొక్క కుంటకు పదిహేను వేల రూపాయలు ఖర్చు అయినది. ఇక్కడ భూమి పరిస్థితి చూసినట్లయితే పొడి, పొడిగా, విడివిడిగా ఉండే ఇసుక. ఇది సంవత్సరానికి, సంవత్సరానికి కుంటలో పడిపోతుంది. ఈ కుంటలు ఒక దశాబ్ధంపాటు మనకు సహాయపడినట్లయితే, రాతి రాళ్ళతో కుంట చుట్టూ గోడను కట్టుకోవాలి. ఇది చాలా ఖర్చుతో కూడి ఉంది అని జబ్బరు చెబుతాడు. పడయెట్టి లో ముగ్గురు- నలుగురు రైతులు ఇలాంటి గోడలను కట్టారు. ఋతుపవనాలు ప్రారంభమయ్యే ముందు గోడలు బదులు వట్టివేర్ అనే మొక్కలను వరుసగా నాటాడు. ఇది చాలా తక్కువ ఖర్చు మరియు ఖచ్చితమైన ప్రత్యామ్నాయం కూడా.

మలాంపూజా ఆనకట్ట నీరు ఎక్కడ కైతే చేరలేని చోటు ఉందో అక్కడ ఈ కుంటలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు కూడా సంరక్షించుకుంటున్నారు. అదే ఎరిమాయార్ పంచాయితీ పడయెట్టికి చెందిన కులిసేరి కి చాలా కుంటలు ఉన్నాయి. ఇదే విధంగా కుతతానూర్ పంచాయితీకి చెందిన మరుదాంతాడం కూడా.

ఈ కుంటల వల్ల ఇంకొక ప్రయోజనం కల్గించే విషయం ఏమిటంటే కుంతలోకి మెల్లగా నీరు చేరుట వల్ల కుంటలోకి చేరే ఒండ్రుమట్టిలో తేమ ఎక్కువగా ఉంటుంది మరియు భూగర్భంలో నీటి నిల్వలు పెరుగుతాయి. ఇలాంటి కుంటలు నీరు అంతా ఒక చోటకు చేరే ఎత్తు ప్రదేశాలలో త్రవ్వడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కర్ణాటక లోని కొడగు జిల్లాలో వరిపండించే ప్రతి కుటుంబానికి చెందిన వారి పొలాలలో ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయి. తరువాత తరం వారు ఈ కుంటల వల్ల వరి పొలాలకు నీరు అందుతుందని మరియు భూగర్భ జలాల పెరుగుతాయని ఇలా అంతా మంచే జరుగుతుందని మరచిపోయారు.

నీరు చేరే ప్రదేశమంతా రాళ్ళతో కూడి ఉంటే, తమ పొలాలకి పై ఎత్తులో ఒక కుంటను త్రవ్వేవారు. దీనివలన పారే నీరు కిందస్థాయిలో ఉన్న మిగతా పొలాలకు చేరుతుంది. అందరూ రైతులు కలసి ఇలా నీరంతా ఒక చోటకు చేరే పెర్కోలేషన్ కుంటను త్రవ్వుకుంటే , వరి పంట తరువాత కూడా రెండవ పంట మినుములు, ఉలవలు వంటి పంటలను కూడా పండించుకోవచ్చు.

ఐదు శాతం మోడల్

ప్రధాన్ (ప్రొపెషనల్ అసిస్టెంట్ ఫర్ డెవలపుమెంట్ యాక్షన్ ) అనేది బీహార్ రాష్ట్రంలో పనిచేస్తున్న సేవా సంస్థ. ఇది కుంటలు మాదిరిగానే నిర్మాణాలు అమలు చేస్తున్నది. కాకపోతే దీనిని వారు ఐదు శాతం మోడల్ అంటారు. ప్రధాన్ సేవా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ దినబంధు కర్మాకర్ ఈ మోడల్ గురించి ఏమి చెబుతున్నారంటే... పురులియా జిల్లాలో హతియా అంటే ఎండిపోతున్న వర్షాధార వరిని కాపాడడానికి ఈ మోడల్ రూపకల్పన చేయబడినది. ఐదు శాతం మోడల్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతి రైతు తన పొలంలో తన స్వంతగా నీటికుంటను కల్గి ఉండాలి. వర్షం పడినప్పుడు నీటిని కుంటలో నిల్వ చేసుకోవచ్చు. లేకపోతే వర్షకాలంలో పంటలు చిగురించే పండించే దశలో ఆ నీరంతా పొలం నుండి బయటకు వెళ్ళి పోతుంది. ఇలా నీటిని నిల్వ చేసుకుంటే, గడ్డు పరిస్థితులలో ఈ నిల్వ నీరు ద్వారా పొలం సాగు చేసుకోవచ్చు. ఈ కుంట పొలం ఎత్తు ప్రదేశంలో ఉండడంవల్ల కింద ఉన్న పొలాలలకు నీటిని అందిస్తుంది మరియు ఆ ప్రాంతమంతా తేమను పెంచుతుంది

పడయెట్టి లో రైతులు ధీర్ఘకాలం అంటే 120 రోజులపాటు వరిని పండిస్తారు. అంతేకాకుండా రెండవ పంటగా ఈ వరినే పండిస్తారు. కరువు ప్రాంతాలలో నష్టపీడిత వరి పొలాలకు రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి తక్కువ కాలం వంగడాలను ఎంచుకోవడం రెండవది శ్రీ వరిసాగు పద్ధతిని పాటించడం. తన్నల్ సంస్థ తాను కౌలుకు తీసుకుని, ప్రయోగం చేస్తున్నక్షేత్ర వరిపొలంలో శ్రీవరి సాగు పద్థతిని పాటించి విజయవంతంగా సఫలీకృతమయింది.

ప్రస్తుతం , కొన్ని చైతన్య సదస్సులు నిర్వహించిన తరువాత , పడయెట్టి రైతులు కరువును తట్టుకోనే పద్థతులను ఆచరణలో పెట్టడానికి కుంటలు త్రవ్వుకోవడం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం ప్రాంతం అంతా 100 శాతం సేంద్రీయ వ్యవసాయానికి మారారు అని కేరళ రాష్ట్రంలో పర్యావరణం గురించి పనిచేస్తున్న తనల్ అనే సేవాసంస్థ లో పనిచేస్తున్న యస్. ఉషా చెప్పారు. ఒక డజను ఇళ్ళల్లో తమ పెరటితోటలలో కూరగాయలను ఎటువంటి రసాయనకాలు వాడకుండా పండిస్తున్నారు.

నిదానంగా, ప్రగతిదిశగా, పడయెట్టి మెల్లగా తమ రెండవ స్వాతంత్ర్యం వైపుకు పయనిస్తుంది. ఎవరికి తెలుసు. రానున్న రోజులలో పాలక్కాడ్ కరువు పీడిత వరి పోలాలకు పడయెట్టి అనుభవాలు మార్గదర్శకం కావచ్చు. గతం నుండి నేర్చుకున్న విషయాలు తిరిగి అనుభవించవచ్చు.

ఆధారము: శ్రీపాద్రే, వాటర్ జర్నలిస్టు, పోస్టు వాణి నగర్, వయా పేర్ల, కేరళ, 671 552

పనికిరాని ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి నర్సరిని పెంచవచ్చు

– శ్రీ సంజయ్ పాటిల్ , జవహర్ తాల్, థానే

 1. రెండు లీటర్లు నీళ్ళు పట్టే పనికిరాని ఖాళీ బాటిల్స్ ను నిలువుగా ( పొడవుగా) కత్తిరించి, వాటిని నారుమడి దిబ్బగా వేయడానికి ఉపయోగించవచ్చు.
 2. ఇలా సగానికి కత్తిరించబడిన బాటిల్స్ లో సారవంతమైన మట్టి , వర్మి కంపోస్టు మరియు వరి పొట్టు 3:2:1 నిష్పత్తిలో నింపాలి. ఒక సగం బాటిల్ కు సుమారుగా 300 గ్రాముల వరినారు దిబ్బ మెటీరియల్ అవసరం.
 3. బాటిల్ లో ఉన్న మట్టిలో అమృతపాణి లేదా బిజామృతంతో కలపబడిన విత్తనాలను నాటాలి. ప్రతి బాటిల్ లో పది గ్రాముల వరి విత్తనాలు నాటాలి.
 4. రెండు రోజులకు ఒకసారి ఈ బాటిల్స్ లోని మట్టిని తడుపుతూ వాటిని నిత్యం తడిగా ఉంచాలి
 5. 10 రోజులలో విత్తనం మొలకెత్తి పొలంలో వరినాటు నాటడానికి తయారుగా ఉంటుంది

ఒక హెక్టారు పొలంలో వరినారు నాటడానికి ఈ క్రింది మెటీరియల్ అవసరమవుతుంది
కావలసిన ఖాళీ బాటిల్స్ సంఖ్య – 625
విత్తనాలు – 6.3 కేజీలు
మట్టి – 93.8 కేజీలు
వరి పొట్టు – 31 కేజీలు
తయారయ్యే మొక్కలు సంఖ్య – 2,00,000

ఎక్కడైతే కూలీలు దొరకడం లేదో, ఖర్చు ఎక్కువవుతుందో, ఎక్కడ వరినారు పెంచడానికి ఖాళీ దొరకడం లేదో పట్టణాల దగ్గరలో ఉన్న గ్రామస్ధులు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.

బాటిల్స్ లో వరిమొక్కలను పెంచుతున్న దృశ్యం

ఆధారం ఆర్గానిక్ కల్టివేషన్ ప్యాకేజి ఆప్ ప్రాక్టిసెస్
టెక్నికల్ కో-ఆపరేషన్ ప్రాజెక్టు ఆఫ్ పుడ్ అండ్ ఎగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (యఫ్.ఎ.ఒ),న్యూడిల్లీ మరియు
నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ (యన్.సి.ఒ.య.ఫ్)
రూపొందించిన వారు
మహారాష్ట్ర ఆర్గానిక్ ఫాంమింగ్ ఫెడరేషన్ (యం.ఒ.యఫ్.యఫ్)

వెర్మి కంపోస్ట్‌తో మరింత దిగుబడి, మరింత రాబడి- చిన్న రైతు మార్గదర్శనం

సారవంతంకాని మెట్ట భూములలో, వనరుల కొరతతో బతుకు దెరువుకోసం నానాఇబ్బందులుపడే రైతులకు భిన్నంగా, ముందడుగు వేసిన ఒక చిన్న రైతును గురించిన పరిచయం ఇది. " జీవితంపట్ల ఆయనకున్న అపారమైన మమకారం " ఆయనకు ఒక మంచి బతుకుదెరువును చూపించడమేకాక, అంతకంటె ముఖ్యంగా, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, మరెందరో రైతులు ఆయన మార్గాన్ని అనుసరించేలా చేసింది. చిన్న రైతు అయిన చంద్రన్నను గతంలో ' నర్సరీ చంద్రన్న ' అనేవారు. ఇప్పుడు ' వెర్మి కంపోస్టు చంద్రన్న ' గా ఆయన సుపరిచితుడు. వెర్మి కంపోస్టును, వానపాములను అమ్మి, ఆయన మూడేళ్ళలో 1.4 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ ప్రాంతంలో చంద్రన్న లాంటి చిన్న రైతుల సగటు ఆదాయం - ఏడాదికి 15,000 రూపాయలకు మించదు. అటువంటిచోట, చంద్రన్న ప్రస్తుత రాబడి నమ్మలేని కథమాదిరిగా, అందరినీ ఆకట్టుకుంటున్నది.
కర్ణాటక రాష్ట్రంలోని చంద్రగిరి జిల్లా, మొలకల్మూరు తాలూకాలోని తుంకుర్లహళ్ళి, అనుకూలం కాని పరిస్థితులతో, గ్రామీణ వాతావరణానికి అద్దంపట్టే గ్రామం. 650 కుటుంబాలువున్న ఆ గ్రామంలో, వెనుకబడిన వర్గాలవారే ఎక్కువ. 410 ఎస్‌సి కుటుంబాలు , 100 ముస్లిం కుటుంబాలు, 100 లింగాయత్ కుటుంబాలు వున్నాయి. గ్రామ జనాభా 3800. ఆ గ్రామ పరిధిలో 3322 హెక్టేర్ల భూములు వున్నాయి. ఇందులో, 15 % మెట్టభూమి, 3.5 % బోరుబావులకింద సాగయ్యే భూమి. మిగతా 2695 హెక్టేర్లలో ( 81.5 %) బంజరు భూములు, ఊరుమ్మడి గడ్డి నేలలు, అక్కడక్కడా, చిన్నచిన్న చెట్లు.పొదలతో కూడిన రిజర్వ్ అడవుల వంటి సేద్యానికి ఉపయోగించని భూములు వున్నాయి. ఇక్కడి భూములన్నీ సాధారణంగా ఎర్రటి ఇసుక నేలలు. పొలాలలో ఎటుచూసినా పెద్ద బండరాళ్ళతో, అది వ్యవసాయికంగా లాభదాయకమయిన గ్రామమేమీకాదు.


500 మిల్లీమీటర్లకంటే తక్కువ సాలుసరి సగటు వర్షపాతంతో, ఆ గ్రామ రైతుల వేరుశనగ సాగు ఒక జూదంలా తయారయింది. అక్కడ పండించే వాణిజ్య పంట అదొక్కటే., అదీ ఏడాది విడిచి ఏడాది పండిస్తారు. వేరుశనగ, వేరుశనగ తప్ప మరో పంట అనేదే లేకుండా ,30 ఏళ్ళుగా , ఏకపంట పండిస్తుండడంతో, దిగుబడి బాగా క్షీణించి, హెక్టేర్‌కు 8 క్వింటాళ్ళకు దిగజారింది. వ్యవసాయం అంతగా ఆకర్షణీయమైన వృత్తికాకుండా పోయినప్పటికి, ఆ గ్రామంలోని అధిక సంఖ్యాకులకు, ఇప్పటీకి, వ్యవసాయం చేయడం, కూలీకి పోవడమే బతుకుదెరువు. సహజంగానే, ఆ ఊరి మగవారు సంవత్సరంలో ఎక్కువకాలం వలసపోతుంటారు.

పెద్ద ఆశల చిన్న రైతు

వ్యవసాయంలో ఆశ్చర్యం కలిగించే సంగతులేమీ వుండని ఆ ఊళ్ళో ; ఆసక్తితో, ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తే, వ్యవసాయంకూడా ఆధారపడదగిన ఉపాధి కాగలదని నిరూపించిన ఘనత చంద్రన్నది. ఎందుకంటే, అదేమీ రాత్రికి రాత్రి వచ్చిన గెలుపుకాదు; వివిధ సంస్థల ద్వారా ఆ ఊరి రైతులకు అందుబాటులోవున్న రకరకాల అవకాశాలను ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకుని సాధించిన విజయమది. పేద రైతు కుటుంబానికి చెందిన చంద్రన్నకు పారంపర్యంగా వచ్చిన ఆస్తి 3 ఎకరాల మెట్టభూమి. అందులోనూ ఒక ఎకరా సాగుకు వీలులేని బంజరుభూమి. అందువల్ల ఆ కుటుంబం ఆ రెండు ఎకరాలలో వచ్చే ఫలసాయంకంటె, కూలీ పనులకు వెళ్ళడంవల్ల వచ్చే ఆదాయంపైనే యెక్కువగా ఆధారపడుతుండేది. తమ ఒక్కగానొక్క కొడుకును బాగా చదివించాలని చంద్రన్న తల్లిదండ్రులు ఆశించినా, పేదరికంవల్ల, చంద్రన్న పి.యు.సి.దాటి చదవలేకపోయాడు. ఆపై చదవడం సాధ్యంకాక, వెనుదిరిగివచ్చి తన తలిదండ్రులకు వ్యవసాయంలో చేదోడుగా నిలవక తప్పలేదు. ఏఎంఇ ఫౌండేషన్ అనే వనరుల సంస్థ (రిసోర్స్ ఏజెన్సీ) తోడ్పాటు అందిస్తున్న కర్ణాటక వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ( క్వాడ్)లో ఒక స్వయం సహాయ సంఘం (ఎస్‌హెచ్‌జి)లో చంద్రన్న సభ్యుడుగా చేరాడు.

మలుపు తిప్పిన సంఘటన

2000 సంవత్సరంలో, కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖకుచెందిన బెయిఫ్ (బిఏఐఎఫ్) సంస్థ (బి ఐ ఆర్ డి కె), తిప్తూరులో మొక్కలపెంపకం (నర్సరీ)పై నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నాడు. అయితే, అదేసమయంలో అక్కడే, మరొక బృందానికి నిర్వహిస్తున్న వర్మికంపోస్ట్ శిక్షణపై చంద్రన్నకు ఆసక్తి ఎక్కువగా వుండేది. వీలు చిక్కినపుడల్లా చంద్రన్న, ఆ శిక్షణలో పాల్గొనేవాడు. వానపాములను పెంచడం, వర్మి కంపోస్ట్ తయారుచేయడం అంటే, ఆయనకు ఎంతో ఉత్సాహంగా వుండేది.
శిక్షణనుంచితిరిగి వచ్చిన తర్వాత, 15,000 మొక్కలతో ఒక నర్సరీని పెంచే అవకాశం చంద్రన్న సంఘానికి వచ్చింది. ఆ సంఘం, ఆ బాధ్యతను చంద్రన్నకు అప్పగించింది. 2000 సంవత్సరం నుంచి వరుసగా మూడేళ్ళపాటు, చంద్రన్న నర్సరీని పెంచాడు. 2003 లో, చంద్రన్న నర్సరీ అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందింది. చంద్రన్నను అందరూ " నర్సరీ చంద్రన్న '' అని పిలవసాగారు.

చిరు ప్రారంభం-గొప్ప ముందడుగు
వెర్మి కంపోస్టుపై చంద్రన్న ఆసక్తి కొనసాగుతూ వుండింది. శిక్షణలొ తాను నేర్చుకున్న కొద్దిపాటి జ్ఞానంతో అక్కడి పొలాలలో వుండే వానపాములను కొబ్బరిచిప్పలో వేసి అవి ఎన్నిరెట్లుగా పెరుగుతాయో చూడాలని చంద్రన్న ప్రయత్నించాడు. అయితే, అవి బతకలేదు.
2003 లో క్వాడ్ ప్రాజెక్ట్ సహకారంతో, ఒక్కొక్కటి 6 X3 X3 ఘనపుటడుగుల కొలతలతో, నాలుగు వెర్మికంపోస్ట్ గుంటలను చంద్రన్న నిర్మించుకున్నాడు. అయితే, వాటిని ఉపయోగించడం ఎలానో అతనికి తెలియదు. గార్డు పనిచేసే ఒక ఉద్యోగి, చంద్రన్నకు 2 కిలోల వానపాములు తెచ్చి ఇచ్చాడు. ఇందుకు 300 రూపాయలు ఖర్చైంది.
ఆ రెండు కిలోల వానపాములతో అతను 20 క్వింటాళ్ళ వెర్మికంపోస్ట్ తయారుచేసి, తన రెండు ఎకరాల పొలంలో పండిస్తున్న రాగి పంటకు వేశాడు. నిజానికి, ఆ ఊళ్ళో ఇంతకుముందెవరూ రాగి పండించలేదు, అందువల్ల రాగి పండించడమే అక్కడ ఒక కొత్త ప్రయోగం. 2 ఎకరాల పొలంలో, 14 క్వింటాళ్ళ రాగులు పండాయి. 2004 లో చంద్రన్న, తన 2 ఎకరాల పొలానికి 6 క్వింటాళ్ళ మేలురకం వెర్మికంపోస్టు, 2 ట్రాక్టర్ల (2 టన్నులు) ఎఫ్‌వైఎం, ఒక సంచి డిఏపి కలిపి వేశాడు. ఈ సారి చంద్రన్న వేరుశనగ పండించాడు. 20 బస్తాల (9 క్వింటాళ్ళ) దిగుబడి వచ్చింది.
తోటల పెంపకానికి సంబంధించిన పద్ధతులను గురించి తెలుసుకోవడం, కంపోస్ట్, వెర్మి కంపోస్ట్ ఎరువులు వాడి సత్ఫలితాలను సాధించిన రైతులను కలుసుకుని చర్చించడం వ్యవసాయంలో స్థిరమైన ఆదాయం ఎలా సాధించవచ్చుననేదానిపై చంద్రన్న అవగాహనను పెంచాయి. పొరుగు ఊళ్ళో వుండే మరొక అభ్యుదయ రైతు బి.జి.కెరెను కలుసుకున్న తర్వాత, వెర్మికంపోస్ట్ ను గురించి అతను మరిన్ని విషయాలు తెలుసుకోగలిగాడు.
2005 లో చంద్రన్న తన పొలంలో ఒక ఎకరాను ప్రయోగ క్షేత్రంగా (పిటిడి ప్లాట్) చేసి, కొత్త కొత్త ప్రయోగాలు చేపట్టాడు. 6 క్వింటాళ్ళ వెర్మికంపోస్ట్ వేశాడు, వేసవిలో దుక్కి దున్నాడు, విత్తేముందు విత్తనాలను రిజోబియం, ట్రికోడెర్మా వంటి సేంద్రియ పదార్థాలతో శుద్ధి చేశాడు, 50 కిలోల జిప్సం వేశాడు, మామూలుకంటె ఎక్కువగా 45 కిలోల విత్తనాలను వేశాడు, అంతర పంటలు, సరిహద్దు పంటలు పెంచాడు. వీటన్నిటి ఫలితంగా, ఒక ఎకరాలో వేరుశనగ దిగుబడి 13 బస్తాలకు (6.5 క్వింటాళ్ళకు) పెరిగింది.
ఆ ప్రాంతంలో అప్పటికి నాలుగేళ్ళుగా ఏఎంఇఎఫ్ చేపడుతున్న కార్యక్రమాలలో, ఒక ఎకరాకు అంత దిగుబడి సాధించడం అదే మొదటిసారి. ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఒక్కొక్క బస్తా వేరుశనగలు 50-60 కిలోల బరువు తూగడం ! చంద్రన్న 25 బస్తాలే 13 క్వింటాళ్ళు తూగితే, అతని పొరుగు రైతు తిప్పేస్వామి 40 బస్తాలు 13 క్వింటాళ్ళు తూగాయి. వీరినుంచి వేరుశనగ కాయలు కొన్న వ్యాపారి దీనిని నమ్మలేకపోయాడు. నిజానికి వారు బస్తాలోని వేరుశనగ కాయలను కిందపోయమని చంద్రన్నను అడిగారు. చంద్రన్న ఆ బస్తాలలో అడుగున రాళ్ళు పెట్టాడేమో, అందుకే ఆ బస్తాలు అంత బరువు తూగుతున్నాయని వారి అనుమానం. వేరుశనగ కాయల బస్తా 50 కిలోలకంటె ఎక్కువ తూగడం అసాధారణమైన విషయం. అన్ని కాయలు ఒకేరకంగా బాగా లావుగా, నిండుగా పెరగడంవల్ల వేరుశనగ గింజల నాణ్యత గణనీయంగా పెరిగింది.

వెర్మి కంపోస్టు -లాభాలమయం

వెర్మి కంపోస్టు తయారుచేయడం, దానిని తన రెండెకరాల పొలానికి వేయడం చంద్రన్న మానుకోలేదు. అతను 2004 నుంచి, ఇటు వానపాములు, అటు వెర్మికంపోస్టు -రెండూ అమ్ముతున్నాడు. 2004 లో చంద్రన్న కిలో 150 వంతున 124 కిలోల వానపాములను అమ్మి, 18, 600 రూపాయలు సంపాదించాడు. క్వింటాలు 500 రూపాయల వంతున 15 క్వింటాళ్ళ వెర్మికంపోస్టు అమ్మి , అతను మరో 7,500 రూపాయలు సంపాదించాడు. రెండూకలిపి అతను మొత్తం 26,100 రూపాయలు పొందగలిగాడు. వేరుశనగల కంటె ఎక్కువ ఆదాయం వస్తుండడంతో చంద్రన్న, రెట్టింపు ఉత్సాహంతో , 2005లో వానపాములు, వాటి కంపోస్టు తయారీ, అమ్మకాలను మరింత పెంచాడు. ఈ ప్రక్రియలో, అతను కొన్ని చేదు పాఠాలుకూడా నేర్చుకున్నాడు. ఒకసారి చంద్రన్న 30 కిలోల వానపాములను మట్టితోకలిపి మూటకట్టి అమ్మకానికి వుంచాడు. అయితే, అమ్మకం జరిగేలోగా అవి చచ్చిపోయాయి. ఆ తర్వాత అతను వానపాములను ఆవుపేడలో కలిపి కట్టాలన్న విషయం గ్రహించాడు.
వాటర్‌షెడ్ పథకం చివరి ఏడాదిలో పలువురు రైతులకు మరిన్ని వెర్మి కంపోస్టు గుంటలు తవ్వించి ఇవ్వడంతో, వానపాములకు గిరాకీ మరింత పెరిగింది. కిలో 150 రూపాయల వంతున 278 కిలోల వానపాములు అమ్మి 41,700 రూపాయలు, క్వింటాలు 500 రూపాయల వంతున , 23 క్వింటాళ్ళ కంపోస్టు అమ్మి 11,500 రూపాయలు , మొత్తం 53,200 రూపాయలు చంద్రన్న సంపాదించాడు. అతను వెర్మికంపోస్టు గుంటలను కూడా మరిన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు చంద్రన్నకు పంటల అవశేషాలు, వ్యవసాయ వ్యర్ధ పదార్థాలు మరింతగా కావలసి వచ్చాయి. ఆయన పొలంలో వున్న నాలుగు కానుగ చెట్లు, కాల్వ గట్టు వెంట వుండే చెట్లనుంచి రాలే ఆకులు , కొమ్మలు; యూకలిప్టస్ ఎండు ఆకులు ఆయన కంపోస్టు గుంటలకు సరిపడా వృక్షసంబంధమైన సేంద్రియ పదార్ధాలను సమకూర్చగలిగాయి. వెర్మికంపోస్టుకు ఆవుజాతి పశువుల పేడ అవసరాన్ని గుర్తించిన చంద్రన్న, రెండుఎద్దులను, ఒక ఆవును, 20 కోళ్ళను పెంచసాగాడు. రాబడి క్రమేణా పెరగసాగింది.
అంతకుముందు 50 ఏళ్ళలో, ఎన్నడూ ఎరుగనంతటి కరువులాంటి పరిస్థితి, 2006వ సంవత్సరంలో ఏర్పడింది. అప్పుడుకూడా చంద్రన్న, 285 కిలోల వానపాములు, 32 క్వింటాళ్ళ వెర్మి కంపోస్ట్ అమ్మి 58, 750 రూపాయలు సంపాదించగలిగాడు. 2003 నుంచీ, తను సంపాదించిన మొత్తం 1,38,050 రూపాయలు. ఈ దాదాపు 1.40 లక్షల రూపాయలు, రసీదులనుబట్టి వెల్లడయ్యే ఆదాయం మాత్రమే. నిజానికి, చంద్రన్నకు ఇంతకంటె ఇంకా చాలా ఎక్కువే ఆదాయం వచ్చివుంటుంది. చంద్రన్న ఖాతాదారులలో ఎక్కువమంది ఎస్‌హెచ్‌జిలవారు, బళ్ళారి, చిత్రదుర్గ,బాగల్‌కోట్, బిజాపూర్ జిల్లాలలోని ఎన్‌జిఓలనుంచి వచ్చే రైతులు. వీరు బిల్లులు ఇవ్వాలని పట్టుపట్టి తీసుకుంటారు. వీరేకాకుండా, బిల్లులు అడగకుండా వానపాములు, వెర్మికంపోస్టు కొనుగోలుచేసే రైతులు అనేకమంది వున్నారు. ఇలాంటి లావాదేవీలకు బిల్లులుండవు. చంద్రన్న ఇప్పుడు ఎస్‌హెచ్‌జిలకు ధర తగ్గించి, 100 రూపాయలకే కిలో వానపాములు అమ్ముతున్నాడు. మిగిలినవారు కిలోకు 150 రూపాయలు చెల్లించవలసిందే. వానపాములు కొనుగోలుచేసిన సమీప రైతులకు చంద్రన్న ఆ తర్వాత కూడా తన సేవలు అందిస్తాడు. చంద్రన్న వారి వెర్మికంపోస్టు గుంటలను సందర్శించి, వానపాముల పెరుగుదల సరిగా లేకుంటే, వారికి ఉచితంగా మరికొన్ని వానపాములను అందజేస్తాడు.

ఆశవదులుకున్నవారికి ఆశా శిఖరం

ఒకప్పటి '' నర్సరీ చంద్రన్న'', ఇప్పుడు; ' వెర్మి కంపోస్టు చంద్రన్న గా ' కొత్త పేరు తెచ్చుకున్నాడు.. మామూలు మట్టి మిద్దె ఇపుడు, సిమెంటు గోడలతో, విస్తీర్ణం మరింత పెరిగి, ఇంటి వెనుక మరిన్ని వెర్మి కంపోస్టు గుంటలతో సిద్ధమవుతున్నది. ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను అమలుచేయడంలో, ముఖ్యంగా, వెర్మికంపోస్టును చేపట్టడంలో ఆయన ఇప్పటికే తన ఊరిలోని చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. చంద్రన్నమాదిరిగా, ఇలా చిన్నచిన్న వ్యక్తిగత విజయాలనుకూడా సామూహిక ఉద్యమాలుగా మలిచే ప్రేరణ శక్తులకోసమే, ఎన్‌జిఓలు ఎదురుచూస్తున్నాయి . ఎందరో పేద రైతులు, తమ పరిమితులను అధిగమించి, ఇబ్బందులకు తలవంచకుండా ఎదగాలంటే, అవసరమైన అసలైన తపన ఇదే.

ఆధారము: ఏఎంఇ ఫౌండేషన్

సమిష్టి కృషితో సత్ఫలితాలు

భాలుక్‌గాజర్ గ్రామం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, పురూలియా జిల్లా, కాశీపూర్ బ్లాక్‌లో తూర్పున వుంది. ఇక్కడి భూములు రాతి నేలలు, ఈ నేలలకు నీటిని నిల్వచేసుకునే సామర్ధ్యం బాగా తక్కువ. సాలుసరి వర్షపాతం 1200-1400 మిల్లీ మీటర్ల వరకు వుంటుంది; కానీ కేవలం రెండు నెలలలో మొత్తం వానలు పడతాయి. ఉష్ణమండలంలోని ఈ ప్రాంతమంతటా ఏడాదికి ఒకే పంట వేస్తారు. అదీ వర్షాధారపు పంట. నీరు వుండనందువల్ల మిగతా 8-9 నెలలలో పంటలేవీ వేయరు. అయితే, ఇటీవల వాతావరణంలో వస్తున్న ప్రతికూలమైన మార్పులవల్ల ఆ ఒక్క వర్షాధారపు పంటకూడా దెబ్బతింటున్నది.

ఈ కారణంగా చాలాకాలంనుంచి అనేక పొలాలు నిరుపయోగంగా వుండిపోయాయి. ఆహారం కొరత వల్ల ఆ ప్రాంతంలోని పనిచేయ గలిగిన శక్తివున్న స్త్రీపురుషులు పనులకోసం పంటలు బాగాపండే పొరుగు జిల్లాలకు వలస వెళ్ళవలసివచ్చేది. ఇలాంటి బంజరు భూములు భాలుక్‌ గాజర్ గ్రామంలోకూడా చాలానే వున్నాయి. కానీ, భాలుక్‌గాజర్ గ్రామానికి చెందిన రైతు బృందం ఇలాంటి 300-350 బిఘాల పొలాన్ని ఒకే పంట నుంచి, రెండు పంటలకేకాదు, ఏడాదికి మూడు పంటలు పండే పొలంగా అభివృద్ధిపరచుకోగలిగింది. ఈ గ్రామం పక్కనుంచే ద్వారకేశ్వర్ నది ప్రవహిస్తుంది.

వారు నదికి దగ్గరలో ఒక బావి తవ్వి, నదినుంచి ఆ బావికి కాలువలు చేశారు. ఇందువల్ల వానాకాలంలో నదికి వరద వచ్చినపుడు, ఆ కాల్వలగుండా నది నీరు వచ్చి బావిని నింపుతుంది. వానలులేని సమయంలో ఈ నీటితో పక్కనేవున్న పొలాలకు నీరు పారించాలన్నదే వారి పథకం. ఇవి తవ్వే సమయంలో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితేనేం, అనేక అడ్డంకులను అధిగమించి, చివరకు వారు 15 అడుగుల లోతు, 16 అడుగుల వ్యాసంతో బావి తవ్వగలిగారు.

10 హెచ్‌పి పంపుతో, వారు ప్రస్తుతం, ఆ బావి చుట్టుపక్కల 300-350 బిఘాల విస్తీర్ణంలో వున్న పొలాలకు నీరు పారించడంలో సఫలమైనారు. వర్షాధారంగా పండే వరిపంటే కాకుండా, నదినుంచి సేకరిస్తున్న నీటితో వారు ఇప్పుడు మరి రెండు పంటలు పండించగలుగుతున్నారు.ఈ బృందంలోనివారిలో ఎక్కువ మంది సొంత భూమిలేని, వ్యవసాయ కూలీలే. భూమి యజమానులతో ఈ బృందం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, వర్షాకాలంలో భూమి యజమానులు పండించుకుని, సంవత్సరంలో మిగిలిన కాలంలో ఈ బృందం వారిని సాగు చేసుకోనిస్తారు.

వీరు, క్రిందటి ఏడాది గోధుమ, ఆవాలు, ఉలవలు,వేరుశనగ, కంది, లిన్ సీడ్ , గుమ్మడి, టొమాటో, వంకాయలు, ఆలు, ఉల్లిగడ్డలు మొదలైన పంటలు పండించారు. 110 క్వింటాళ్ళ గోధుమ, 700 కిలోల ఆవాలు, 35 కిలోల కంది, 10 కిలోల లెథైరస్, 55 కిలోల శనగలు, 5 కిలోల లిన్‌సీడ్, 210 కిలోల టొమాటోలు, 22 కిలోల బీరకాయలు, 400 కిలోల గుమ్మడికాయలు మొదలైనవి పండించి, 120,000 రూపాయల ఫలసాయం పొందారు. మూడేళ్ళలో ఈ బృందం సభ్యులు పనులులేనికాలంలో పనులకోసం ఇతర జిల్లాలకు వలసపోవలసిన అవసరమే వుండదని భావించవచ్చు.

ఆధారము: డి ఆర్ సి ఎస్ సి వార్తాలేఖ , సంచిక నం:1; ఏప్రిల్-ఆగస్టు 2008

పురస్కారాన్ని అందుకున్న సిక్కిం రైతు ధనపతి సప్కోట

గాంగ్టక్ లో జరిగిన అంతర్జాతీయ పువ్వుల పండగలో నిర్వహించిన కూరగాయల పెంపకం పోటీలో ధనపతి సప్కోట లక్షన్నర రూపాయల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు. పదిరకాల ఉద్యాన పంటలను పండించినందుకు గాను చోటా సింగ్టం, అస్సాం లింజే, తూర్పు సిక్కింకు చెందిన ఈ అభ్యుదయ రైతుకు ముఖ్య మంత్రి ఈ నగదు బహుమానాన్ని, సత్కార పత్రాన్ని అందజేశారు.
గృహావసరాల నిమిత్తం సాంప్రదాయంగా పండించే వరి, మొక్కజొన్నా కాకుండా సప్కోట మార్చాక్ లో ఒక మూడురోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన రెండు ఎకరాల పొలంలో ఉద్యాన పంటలను పండించడం మొదలు పెట్టారు. రాష్ట్ర ఉద్యాన శాఖ వారు సేంద్రీయ సేద్యం పై ఉత్తరాంచల్ లో నిర్వహించిన 11 రోజుల శిక్షణా కార్యక్రమంలో కూడా ఈయన పాల్గొన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమాలూ, అచంచలమైన అతని ఆత్మ విశ్వాసం, సప్కోటకు సత్ఫలితాలను కలుగజేసాయి.. అతను ఒకే సంవత్సరంలో రూ. 1,52,00 విలువ చేసే 19 క్వింటాళ్ళ చెర్రీ మిరపకాయలను 1,900 విత్తనాలనుండి పండించాడు. దీనితో అతను ఉద్యాన పంటలమీద దృష్టి సారించి గోబీ పువ్వు, టమాటో, కాబేజీ, బ్రోక్కోలీ పండించసాగాడు.
సప్కోట తన పొలంలో రక్షిత సేద్యం క్రింద ఒక్క టొమాటో చెట్టునుండి 40 కేజీల దిగుబడి పొందాడు. ఈ సంవత్సరం ఈ ఆదర్శ రైతు టెక్నాలజీ మిషన్ కింద రాష్ట్ర ఉద్యానవన శాఖ నుండి పొందిన ఆఫ్ సీజన్ (సీజనుకు అనువుకాని) రోమియో రకం టమోటా విత్తనాలతో అనువుకాని కాలంలో పంటను పండించాడు. సప్కోట రూ 1,94,000 విలువ చేసే 97 క్వింటాళ్ళ టొమాటోలను అమ్మాడు. అంతేకాక రూ 64,000 విలువ చేసే ఎనిమిది క్వింటాళ్ళ గోబీ పువ్వును, రూ 96,000 కు 12 క్వింటాళ్ళ చెర్రీ మిరపను అమ్మాడు. "లేబరు ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు పోనూ ఉద్యాన పంటల ద్వారా నేను సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను." అని అంటాడు సప్కోట. టెక్నాలజీ మిషన్ పరిధిలో ఉద్యానవన శాఖ కూరగాయల సాగు విస్తీర్ణం పెంచే ప్రయత్నంలో భాగంగా ఆ శాఖ వారినుండి లభించే విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, పురుగుమందులు మరియు ఇతరత్రా తోడ్పాటుతో సప్కోట అనేక రకాల కూరగాయలను సాగు చేస్తున్నాడు.

సొర కాయ ఆకారంలో ఉండే `జుకునీ ఫార్సీ' రకం గుమ్మడికాయను సిక్కింలో తానే ప్రవేశపెట్టానని సప్కోట చెప్పుకుంటాడు. ఈ `జుకునీ ఫార్సీ' ని మొట్ట మొదట సప్కోట పండించాడు కాబట్టి అస్సాం లింజే ప్రజలు ఆ గుమ్మడికాయకు `సప్కోట ఫార్సీ' అని నామకరణం చేశారు. తాను ఈ రకం గుమ్మడికాయను మొదటిసారి భక్తపూర్ లోని రాణా పొలంలో చూశాననీ, 2004 లో జుకునీ ఫార్సీ విత్తనాలను తాను ఖాట్మండు నుండి తెచ్చానని సప్కోట చెప్పాడు. ఈ జుకునీ ఫార్సీని పండించి అమ్మడం ద్వారా సప్కోట రూ 90,000 ఆర్జించాడు.
ఈ అభ్యుదయ రైతు కేవలం సేంద్రీయ వ్యవసాయమే కాదు పశు పోషణ కూడా చేపట్టాడు. ఇందుకుగాను కర్ఫేక్తర్, జోర్థాంగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతనికి 5 ఆవులు ఉండగా అందులో మూడు ఆవులు పాలిస్తున్నాయి. లీటరుకి రూ 20 చొప్పున అతను రోజూ 20 లీటర్ల పాలను అమ్ముతున్నాడు. ఈ ఆవుల నుండి సప్కోట పొలానికి ఎరువు కూడా లభిస్తుంది. ఉద్యానవన శాఖ వారి సహకారంతో ఒక వెర్మీకంపోస్టు యూనిట్ ను కూడా సప్కోట మొదలుపెట్టాడు.

మార్కెటింగ్ పరంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, మార్కెట్ డిమాండ్ కి సరిపడేంత ఉత్పత్తిని సిక్కిం రైతులు పండించినప్పుడే ఈ సమస్య పరిష్కారం కాగలదని సప్కోట అభిప్రాయపడ్డారు.
సప్కోట ప్రగతికి ముగ్ధులై రాష్ట్ర ఉద్యానవన శాఖ వారు టెక్నాలజీ మిషన్ పరిధి కింద సప్కోట ఉత్పత్తుల అమ్మకానికి ఒక `ఫారం హాండ్లింగ్ యూనిట్' ను నెలకొల్పారు. ఇప్పుడు అతనికి తన ఉత్పత్తిని మార్కెట్ కు తరలించే పని కూడా లేదు.

ఆధారము: isikkim.com

మెంటపల్లి గ్రామంలో పప్పుల బట్టి ద్వారా ఆహార పోషకాల భద్రత

- శ్రీనాథ్ దీక్షిత్, యస్ పి వాణి మరియు సిహెచ్ రవీందర్ రెడ్డి

మెంటపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. ఈ గ్రామం కూడా భారత దేశంలోని అర్థ ఉష్ణ మండలంలోని గ్రామాలలో వలె ఒక గ్రామం. ఇక్కడ సాధారణంగా 650 మె-మో|| వర్షపాతం నమోదవుతుంది ఇది కూడా మధ్య జూన్ - సెప్టెంబర్ మధ్య కాలంలో పడుతుంది. అది పంటలకు సరిగా సరిపోదు. ఈ గ్రామం నందు సన్న, చిన్న కారు రైతుల అధిక సంఖ్యలో వుండి, వారి పొలాలను కేవలం ఒక సీజన్ మాత్రమే సాగు చేసుకుంటుంటారు. వ్యవసాయ పనులు లేని సమయంలో రైతులు ఉపాధిని వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు.

జొన్న, మొక్క జొన్నపంటల మాదిరిగా కంది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన పంట. కందిలో భూమి ద్వారా వ్యాప్తి చెందు శీలీంద్రం ఎండు తెగుళు ప్రధాన సమస్యగా మారి, బాగా పంట నష్టంను కలగ చేస్తుండేది. ఇక్రిశాట్ సంస్థ వారి జీవనోపాధుల పథకంను ఈ గ్రామంలో అమలు చేయుట వలన, ఇక్కడ రైతులు ఎండు తెగుళును తట్టుకొనే రకమైన ‘ఆశ’ రకంను సాగుచేసి కొద్దో గొప్ప పంటను పొందుతున్నారు. ఈ రకము ఎండు తెగుళును సమర్థవంతంగా తట్టుకొని, సాధరణ రకం కంటే 20 నుండి 30 శాతం అధిక దిగుబడి నిచ్చును.

కంది పంటను కోత కోసిన తర్వాత, కందులను చేతితో ఆడించే ఇసురాయి ద్వారా బద్దలుగా (పప్పు) చెయడమనేది ఇక్కడ సంప్రదాయ పద్ధతి. ఈ పనులను సాధరణంగా పురుషుల చేస్తుంటారు. కాని పురుషులు ఉపాధి కొరకు యితర ప్రాంతాలకు వలస వెళ్ళడం మొదలైనప్పటి నుండి ఈ పద్ధతి అంతరించి పోవడం ప్రారంభమైనది. అంతేకాగా ఈ గ్రామంలో పండించిన కందులను కోళ్ళ పరిశ్రమకు తక్కువ ధరలో ఒక కేజి కి రూ|| 12 - 14 వరకు అమ్మి, వారి గృహ అవసరాలకు కేజి కంది పప్పును రూ|| 22/-కు కొనుకుంటున్నారు.

‘తక్కువ ధరకు అమ్మి, ఎక్కువ ధరకు కొనడం’ అనే పద్ధతికి స్వస్తి పలకాలని ఇక్రిశాట్ వాటర్ షెడ్ బృందం నిర్ణయించి మెంటపల్లి గ్రామస్తులతో చర్చ చేపట్టినది. గ్రామస్తులు వీరి యొక్క అభిప్రాయంతో అంగీకరించి, కందులను గ్రామం నందే పప్పు (బద్దలుగా)గా మార్చి, వారి గృహావసరాలకు ఉపయోగించడం ప్రారంభించిరి. ఇందుకు అక్కడ వాటర్ షెర్ కార్యక్రమములను అమలు చేయుచున్న కరువు పీడిత ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎస్.డి.డి.పి.ఎ.) అను స్వచ్ఛంద సంస్థ స్వయం సహాయక సంఘాలలోని మహిళలను చైతన్యవంతులను చేయుట వలన, ఒక చిన్న పప్పుల బట్టిని (దాల్ మిల్) ఆ గ్రామం నందు ఏర్పాటు చేసి, రైతులకు అందుకు అవసరమైన శిక్షణ నివ్వడం జరిగినది.

స్వయం సహాయక సంఘం ఒక కేజి పప్పు ఆడించినందుకు కొద్ది మొత్తం డబ్బును తీసుకొనడం ద్వారా ఆ మిల్లు యొక్క విద్యుత్ ఛార్జీలను (కరెంట్ బిల్లును) కట్టుకొగలిగినారు. ఈ విధంగా గ్రామస్తుల సరసమైన ధరలకే కందులను బద్దలుగా/పప్పుగా ఆడించుకోవడంతో పాటు ధాన్యం యొక్క తవుడును పశువుల దాణాగా కూడా ఉపయోగించుకొంటున్నారు.

గ్రామంనందే ఆడించిన కంది పప్పునకు మంచి రంగు మరియు అక్కడ కోళ్ళు లేకపోవడం వలన వారికి మార్కెట్ నందు సరియైన ధర లభించుట లేదు. కాని, గ్రామస్తుల ఆ కంది పప్పును వారి ఇంటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ‘ఆశ’ కంది రకంను మంచి పెద్దదైన పప్పు ఇందులో వండుకొను గుణంను అధికంగా కలిగి వుండును. వీటిని మహిళలు ఎక్కువగా ఇష్ట పడతారు.

ప్రస్తుతం మెంటపల్లిలోని పప్పుల బట్టి (దాల మిల్లు) పూర్తి స్థాయిలో పని చేస్తూ గ్రామస్తుల మొహంలో నవ్వులను పూయిస్తున్నది. మహిళలు, వారు సాగు చేయిచున్న వాటినె వండుకొని తింటున్నందు వలన ఎంతో ఆనందంగా వున్నారు. అపరాళ్ళు అధిక పోషక విలువల కలిగి వుండడం వలన, గ్రామస్తుల తక్కువ ఖర్చులోనే ఎక్కువ పోషక విలువలను పొందగలగుచున్నామనే సంతోషాన్ని వ్యక్తపరిచిరి.

విజయం మరియు వ్యాప్తి

ఈ పప్పుల బట్టి (దాల్ మిల్లు) విజయం సాధించుటకు మూడు ముఖ్య కారణాలు కలవు. మొదటిది, ఈ పప్పుల బట్టిని ఆడించడం అనేది మాములుపిండి మిషన్ ఆడించినట్లే ఎంతో సులవుగా వుండటం. రెండవది, వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో వలె కందులను రాత్రంతా నీటిలో నాన బెట్టి, 2 - 3 రోజుల ఎండలో ఆరబెట్టి పప్పుగా విడ గొట్టడం మాదిరిగా వుండట. మూడవది, ఈ సరళమైన పప్పుల బట్టి సింగిల్, ఫేజ్ కరెంట్ తో పని చేయుట, ఎందుకంటే మెంటపల్లి గ్రామంలో ఆసలు త్రీ ఫేజ్ కరెంట్ లేదు కనుక.

ఈ పప్పుల బట్టి గూర్చి పక్క గ్రామాలలొ కూడా తెలిసి, పక్క గ్రామస్తులు ఇక్కడికి వచ్చి వరి కందులను కూడా పప్పు ఆడించి తీసుకుపోతుంటారు.

ప్రస్తుతం మెంటపల్లిలోని స్వయం సహాయక సంఘం, గ్రామం కొరకు మరొక బట్టిని కొనవలెనని ప్రణాళిక రచించుకొంటున్నది. మెంటపల్లిలోని ఈ విజయ గాధను చూసి కర్నూలు జిల్లా కందులను అధికంగా పండించుచున్న ఇతర ప్రాంతాలలో కూడా ఈ విధంగా ప్రయత్నించడం ప్రారంభించుచున్నారు.

ఆధారము: LEISA India, Vol 6-3

ఫారెస్టు ఆఫ్ హొప్ – ఆశావాదానికి ఉదాహరణగ అడవి లేకుండా నీరు లేదు, నీరులేకపోతే తినడానికి బియ్యం ఉండదు

బిరుభూం లో రాజ్ నగర్ బ్లాకులో నారాయణపూర్ గ్రామం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక కుగ్రామం ఒకప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క చెట్టు కూడా లేకుండా ఖాళీగా ఉండి, ఎండాకాలంలో చాలా దూరం ప్రయాణించడానికి కుక్కలు కూడా భయపడే ప్రాంతమే. నారాయణపూర్ శిశు సమితి (యన్.యస్.యస్) అనే ప్రజల సంస్థ జనవరి 2008 సంవత్సరంలో ఏర్పడినది. ఈ సంస్ధ పంటలు పండడం అసాధ్యంమైన 40 ఎకరాల ఖాళీగా సారవంతంగా లేని ఎర్రటి భూమిని వారి పర్యవేక్షణ లోకి తీసుకునారు.

ఇంతకుముందు ఈ భూమిలో పశువుల మేత మేసేవి. యన్.యస్.యస్ వారు 12 మంది భూమిలేని రైతులను మరియు నలుగురు చిన్నకారు రైతులను కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసినది. వీరిలో అధిక శాతం గిరిజనులు. ఈ సారవంతంగా లేని భూమిని గ్రామ భూమిలో పండ్లు, పశుగ్రాసం, వంటచెఱకు చెట్లను నాటి వాటి మథ్యలో తక్కువకాల పంటలు వేసి మళ్ళి ఆ భూమిని శాశ్వత ఆస్తి గా మరల్చదలుచుకోవాలనుకున్నారు.

అయితే ఈ సంఘం భూమి హక్కుదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. పంట పండిన దాంట్లో యాబై శాతం భూమి హక్కుదారునికి పోతుంది. మిగతా యాభై శాతం పంటను కాపాడే సంఘానికి చెందుతుంది. ఆ యాభై శాతాన్ని సంఘ సభ్యులు పంచుకుంటారు. చెట్ల మధ్య నాటిన తక్కువ కాలం పంటను సంఘ సభ్యులు సమానంగా పంచుకుంటారు. ఈ సంఘం ఏప్రిల్ 2008 లో నర్సరీలో మొక్కలు మొలకెత్తించడంతో తమ కార్యక్రమాలను ప్రారంభించారు. సామాజిక విశ్లేషణ పద్ధతి (యస్.ఏ.యస్) అంటే ప్రజల భాగస్వామ్య పద్ధతిలో 36 చెట్ల మొక్కలను ఎంపిక చేశారు. 26000 మొక్కలలో 19150 మొక్కలను నాటారు, 4000 మొక్కలను అమ్మారు, మిగతా మిగిలిన మొక్కలను స్థానిక గ్రామస్థులకు పంచారు.

వచ్చే వర్షాకాలానికి నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా భూగర్భజలాలను పెంచుట ద్వారా భూమి సారవంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. గడ్డి, కలుపు మొక్కలు వాటికంతట అవే మొలకెత్తడం జరిగింది. 50 చిన్నపాటి కట్టలు (సెమీ సర్క్యలర్ బండ్స్), 4 అంచుకట్టలు (రిడ్జెస్), ఐదు రాళ్ళకట్టలు (స్టోన్ బండ్స్) తో పాటు పొలం చుట్టూ కందకం (ట్రెంచేస్) ఏర్పాటు చేశారు.

మొత్తం 1342 పనిదినాలు ఉపాధి కల్పించారు. మొక్కజోన్న,సొరకాయ, చిక్కుడు పంటలను పండ్ల చెట్ల మధ్యలో వేయడంతో వారు తమ పనులను ప్రారంభించారు. ధీర్ఘకాల పంటలయిన కంది పప్పు, సబై పశుగ్రాసం, గోంగూర (రోసెల్లే) వంటి పంటలు వేశారు.

భూసారం గల మట్టి, ఎరువు మరియు వేప చెక్క మొదలగునవి ఎరువులుగా వాడారు. పంట రక్షణ కోసం తాటి, ఈత, కంది చెట్లు మరియు గోంగూర (రోసెల్ల) వాటితో చుట్టూ కంచెలా పెంచారు. సభ్యులు వంతులవారీగా సామాజిక రక్షణగా పంటను కాపాడారు. ఖరీఫ్ సీజను అయ్యేనాటికి 150 కేజీల కూరగాయలు, 15 కేజీల మొక్క జొన్న, 200 కేజీల గోంగూరు (రోసెల్ల) మరియు 250 కేజీల పశుగ్రాసం పండించారు. వాటిని సంఘ సభ్యులే వాడుకున్నారు. చేతిబొమ్మలు మరియు వైద్యమందులకు అవసరమయ్యే ముడిసరుకు అయిన  కలుపు మరియు గడ్డి వల్ల వీరికి అదనపు ఆదాయం వచ్చింది.

ఈ వ్యవసాయానికి మొత్తం రూ.2.5 లక్షల రూపాయలు మూలధన పెట్టుబడిగా పెట్టగా, అందులో ప్రజల కూలీగా శ్రమదానం చేసినది 30 శాతం ఉంది. 16 కుటుంబాలు, సగటున 155 పనిదినాలు పనిచేశారు. కుటుంబాలకు అవసరమైన కనీస కూరగాయలు ఈ సీజనల్ పంటలు అందించగలిగాయి. చాలా ఎక్కువ మొత్తంలో పశుగ్రాసం దిగుబడి వచ్చింది. అంతరించడానికి దగ్గరలో ఉన్న చెట్లను తిరిగి పెంచడం వల్ల జీవవైవిద్యం పెరుగుతుంది. చీపుర్లు తయారుచేయడం, గోంగూర జామ్ తయారీ వంటి కార్యక్రమాలు ద్వారా ఆదాయాభివృద్ధి కల్పించవచ్చు. పొరుగున ఉన్న మూడు, నాలుగు గ్రామాల ప్రజలు ఇలాంటి కార్యక్రమాలను తమ గ్రామాలలో కూడా అమలు చేయాలని ఆసక్తి గా ఉన్నారు. ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ ఎయిడ్ వారు ఆర్థిక సహాయం అందించారు.

ఆధారం: డి ఆర్ సి యస్ సి, సంచిక నెం. 3

స్థానిక ప్రజల ద్వారా సాగుచేయనటువంటి ఆహార పంటల సంరక్షణ

- బి. సలోమ్ ఏసుదాను

దక్కన్ పీఠ భూమిలోని దక్షిణ భారతదేశ మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మెదక్ జిల్లా నందు జహీరాబాద్ ప్రాంతం కలదు. ఇక్కడ ఎక్కువ శాతం నేలలు నల్లరేగడి నేలలు కాని కొద్ది వరకు ఇసుక నేలలు కూడా కలవు. సాధారణ వర్షపాతం 700 నుండి 850 మి. మీ || కాని ఇది కూడా సరిగా కురవక అస్తవ్యస్తంగా విస్తరించబడి వుండును. నేల యందు లోతు 6 - 8 ఇంచులుండును. ఇటువంటి వాతావరణ పరిస్థితులనెదుర్కొనుటకు రైతులు కొన్ని తరుణోపాయాలను అభివృద్ధి పరిచినారు.

డిడియన్ పాత్ర

దక్కన్ డెవలప్ మెంట్ సొసైటి (డిడియస్), ఒక అట్టడుగు స్థాయి స్వచ్ఛంద సంస్థ, మెదక్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో గత దశాబ్దన్నర కాలంగా పని చేయుచున్నది. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుచుటలో సాగు చేయని ఆహారం యొక్క పాత్ర గూర్చి దీర్ఘంగా పని చేయుచున్నది. 1989 నుండి డిడియస్ యొక్క ఆరోగ్య కార్యకర్తలు పేదల జీవితాలలో “సాగు చేయని ఆహారం’’ యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకొనుటకు ప్రయత్నించు చున్నారు. దాదాపు పండించని 80 రకాల ఆహార ఉత్పత్తులను గుర్తించి కూరగాయలు, ఆకుకూరలు మరియు కాయలుగా వర్గీకరించినారు.

వీటిలో ఎక్కువ భాగం పంటలను సామాజిక ఆర్థిక నిచ్చెనలో అట్టడుగు స్థాయిలో వున్నటు వంటి దళిత మహిళలు పండించుచున్నారు. వీరు జీవన బండిని నడుపుకొనుటకు వ్యవసాయ కూలీలుగా పనిచేయు చున్నారు.

పంటల వైవిధ్యమును అవలంభించుట ద్వారా అనుకూల వాతావరణ పరిస్థితులను అధిగమించుటయే కాకా ఎక్కువ దిగుబడులను పొందుటకు వీలగును. ఇక్కడ వీరు కనీసం 8 నుండి 12 రకాల పంటలను ఒకేసారి పండించెదరు.

పచ్చి ఆకుకూరలు - మంచి పోషకాలను అందించే వనరులు

గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేదవారికి సాగు చేయనటువంటి ఆకుకూరలే ప్రధానమైన ఆహార వనరులు. ప్రధానమైన ఆహార వనరులే కాకా ప్రధాన పోషకాలను పేదవారు వీటి ద్వారా తీసుకుంటున్నారు. కాల్షియం, ఇనుము, కెరోటిన్, సి-విటమిన్ మరియు ఫోలిక్ ఆమ్లం గల అనేక రకాల ఆకుకూరలను కూరలుగా తింటున్నారు. ఈ పచ్చి ఆకులు ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలను బాగా అందించును. వీటిని అధిక మోతాదులో ముఖ్యంగా స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు పిల్లలు తీసుకుంటారు.

సంఘంలోని పిల్లల సంరక్షణ కేంద్రంలో బడిలో చేరబోయే పిల్లలకు ఈ పచ్చి ఆకులను అన్నం, పప్పుల లేదా రొట్టెలతో ఇస్తునారు. ఈ విధంగా చేయుట వలన మొదటి నుండే పిల్లలకు స్థానికంగా లభ్యమవుచున్న వైవిధ్యమైన, రుచికరమైన, రక్షితమైన పోషకాహారంను ప్రతిరోజు తిన్నట్లవుతుంది. వీరు వీటిని పొలాల కంచె దగ్గర మరియు ఇంటి పెరట్లో నుండి సేకరిస్తారు. కలపు పనులకు వెళ్ళు మహిళలందరు పనికొచ్చే ఆకులను ఆరోజు వంట కొరకు తెచ్చుకుంటుంటారు.

పేదవారి ఆరోగ్య సంరక్షణలో ఈ ఆకుకూరల పాత్రను తెలుసుకోవలెనంటె సాగు చేయనటువంటి ఆకు కూరలను శాస్త్రీయంగా విశ్లేషణ చేయవలసిన అవసరం వున్నది. ఆకుకూరలను పొలం నుండి స్థానిక మహిళల సహకారంతో ఇవి ఎక్కువగా పెరుగు ఆగష్ట్ - సెప్టెంబర్ మాసంలో సేకరించి జాతీయ పౌష్టికాహర సంస్థ, హైదరబాద్ నందు అందులో గల వివిధ పోషకాల కొరకు విశ్లేషించడం జరిగినది. ఫలితాలను చూస్తే, ‘జొన్న చంచెల్లి’ ప్రతి మొక్కలో 3237 మి. గ్రా||ల కాల్షియం మరియు 111.3 మిగ్రా|| ఇనుము (ఐరన్), అడవి పుల్ల కూర (ఇది సంవత్సరమంతా దొరుకును)లో 139 మి.గ్రా||న ఇనుము మరియు 331 మి.గ్రా|| కాల్షియం కలదు, మరియు తుమ్మికూర (దీనిని ప్రతి కుటుంబం ఎంతో ఇష్టంగా తింటుంది) 81.6 మి.గ్రా|| ఇనుము వున్నది. మన మహిళల యొక్క తెలివి, జ్ఞానము ఎంతో గొప్పదని ఫలితాలు ద్వారా మరొక సారి నిరూపణ అయినది.

పంటల వైవిధ్యాన్ని ఉత్సవంగా జరుపుకొనుట

ఇక్కడి వారు వారి పొలాలనందు గల వైవిధ్యమైన సాగు చేయని ఆహార పంటలకు కృతజ్ఞతా పూర్వకంగా వివిధ రకాలుగా ఉత్సవాలను జరుపుకొంటుంటారు. అందుకు ఉదాహరణ ‘శూన్యం పండుగ’ పండుగను ఖరీఫ్ మరియు రబి పంటలు అయిపోవు సమయంలో డిసెంబర్ మాసంలో జరుపుకుంటారు. జనమంత గుమిగూడి పొలం చుట్టు నడుస్తూ, పండుగకు సంబంధించిన పాటల పాడుతూ, 20 కంటే ఎక్కువ రకాల సాగుచేయని పంటలతో వండి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారాన్ని సమర్పించి భూమి తల్లి పూజిస్తారు.

వైవిధ్యమైన సాగు చేయుట వంటి ఆహార పంటల పండుగను జరుపు కొనుటలో ప్రధాన కారణం ఏమిటంటే, ఇది పేదవారికి గత కొన్ని శతాబ్ధాలుగా ఆహారంగా ఉపయోగ పడుచున్నది. వారి జీవితంలో ఈ ఆహారం ఎక్కువ భాగం గడుపుటయే, ఈ ఆహారం ద్వారా ఆధిక పోషక విలువలను పొందుచున్నారు.

ముగింపు

ఈ అనుభవం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే సాగు చేయన్ని ఆహార పంటలు ఈ ప్రాంతంలో జీవనంలో ఒక భాగంగా వున్నాయి. ఆవరణ వ్యవస్థలోని వ్యవసాయ జీవన వైవిధ్యాన్ని మరియు వ్యవసాయ పద్ధతులను (మిశ్రమ పంటల, కలుపు మందులు, పురుగు మందులను ఉపయోగించకుండుట) కాపాడుట ద్వారా ఈ సాగు చేయని ఆహారాన్ని మన వంటింట్లో మరియు సంప్రదాయంలో భాగం చేయవచ్చును దీని ద్వారా స్థానిక ఆహారం పై అజమాయిషి కలిగిన వారి నుండి పేదవారికి మేలు చేయవచ్చును. ఈ సాగు చేయని ఆహారంలొ చాలా వరకు బీటా కెరోటిన్, విటమిన్-సి, కాల్షియం, ఇనుము మొదలగు వాటితో పాటు సహజ సిద్ధమైన పోషకా లు, సూక్ష్మపోషకాలు కూడా వుంటాయి, అందువలన కృత్రిమంగా పోషకాలను అందించుటకు బదులుగా వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం వుంది.

బి. సలోమ్ ఏసుదాసు
డెక్కన్ డెవలప్ సొసైటి (డిడియస్)
పస్తాపూర్, జహీరాబాద్, మెదక్ జిల్లా
ఆంధ్రప్రదేశ్

ఆధారము: LEISA India, Vol 6-1

వ్యవసాయంలోని చీడ పురుగుల యాజమాన్యంనకు పున:నిర్వచనము

- G. V. జి.వి. రామాంజనేయుల మరియు జాకీర్ హుస్సేన్

ప్రస్తుతము వ్యవసాయ రంగం చాలా క్లిష్ట పరిస్థితులలో వున్నది. బయటి ఉత్పాదకాలపై ఎక్కువగా ఆధారపడటం వలన పెరిగిన సాగు ఖర్చులు, మార్కెట్లను బార్లా తెరవడం వలన ధరలలోని హెచ్చు తగ్గులు, స్వేచ్ఛాయుత వాణిజ్యం తర్వాత ప్రభుత్వ మద్దతు కొరవడటం వీటికి తోడు ఋతు పవనాల యొక్క దోబూచులాటతో వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న వారి బ్రతుకులు కష్టంగా మారినవి. రసాయనకాలు ముఖ్యంగా పురుగు మందులు ప్రత్తి, మిరప మొదలగు పంట ఖర్చులు పెరగడానికి కారణము.

పురుగు మందులను ఐదు సం||రాల కాలంలో (1999 నుండి 2003) పూర్తిగా త్యజించిన పునుకుల గ్రామం యొక్క కథ ఇది. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా నందు కలదు. నేడు ఆ గ్రామస్తులందరు ఎవ్వరు పురుగు మందుల వాడకుండా ఆ జిల్లాలోని ఇతర రైతులకు స్పూర్తిని కలిగిస్తూ అంతేకాకా ఎక్కడికెళ్ళిన అక్కడ కూడా స్పూర్తిని నింపి వారి జీవనోపాధుల మెరుగునకు తోడ్పడుచున్నారు. ఆ గ్రామ పంచాయితి ఎప్పటికి కూడా పురుగుమందులు వాడరాదని ఒక తీర్మానం చేసినది.

పునుకుల

కొద్ది రోజుల క్రితం వరకు పునుకులలో ప్రత్తి ఒక ప్రధాన పంట, దీనినొక్క దానినే పండిస్తూ ఈ పంటను కాపాడుకొనుటకు అధిక మోతాదులలో పురుగు మందులను వాడేవారు. దీని నుండి అనేక సమస్యలు తలెత్తినవి, విషం బారిన వైకల్యం పొందిన అనేక దృష్టాంతములు కలవు. అంతేకాకా ఆరోగ్య సంరక్షణ కొరకు డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేది. అక్కడి వైద్యుడు శ్రీ మధు చెబుతూ 2000వ సంవత్సరంనకు పూర్వం కనీసం 50 నుండి 60 విషం బారిన పడిన కేసులు సీజన్‌లో వస్తుండేవి అని గుర్తు చేసుకున్నారు.

మరొక సమస్య ఏమిటంటే పురుగు మందులను కొనుట కొరకు చేసిన అప్పు. ఈ రుణాల నుండి ఆర్థిక పరిస్థితి వారి చేయి దాటి పోవునట్లయినది. ఈ డబ్బంతా నేరుగా ‘సింగిల్ విండో’ లేక ‘అన్నింటికి ఒకరే’ అయిన డీలర్ చేతిలోకి వెళ్తుంది. ఈ డీలర్ రైతుల యొక్క కలలను కల్లలు చేస్తుంటారు. ఇతనే విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులను అమ్ముతుంటారు. ఇతను వీటన్నింటిని రైతులకు రూ|| 3 నుండి 5 అధిక వడ్డీకి ఇస్తుంటారు. రైతుల ఈ అప్పులనే చెల్లించలేని పరిస్థితిలో వుంటే వారి దిగుబడిని ఇతనికే అమ్మాలని ఒప్పందం చేసుకుంటారు. ఈ విధంగా డీలరు మార్కెట్ ధర కంటే తక్కువ ధరలను నిర్ణయించి కొంటారు. వచ్చే సంవత్సరానికి అప్పు ఇస్తాడని వేరే అవకాశం లేక రైతు ఈ తక్కువ ధరకే ఒప్పుకుంటాడు. ఈ విధంగా వీరి జీవిత చక్రం విషవలయమై పురుగు మందుల యొక్క ట్రేడ్ మిల్‌పై వున్నది.

చాలా మంది గ్రామస్తులు డీలర్ యొక్క కబంధ హస్తాలలో ఇరుక్కొన్న సంఘటనలను భయంతో గుర్తు చేసుకొంటుంటారు. అప్పులు వుండటాన్ని వారు సమాజంలో అగౌరవంగా భావిస్తారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారి అప్పు చెల్లించమని ఒత్తిడి చేయడాన్ని చాలా మంది భరించలేరు.

పరివర్తనకు నాంది

1999 లో స్థానిక ప్రభుత్వేతర సంస్థ అయిన సెక్యూర్ వారు గ్రామస్తుల యొక్క జీవనోపాధులను విశ్లేషించారు. పెట్టుబడి దొరకక పోవడం, ప్రతి సంవత్సరం అధికమవుచున్న ఖర్చులు, మార్కెట్ మద్దతు లేక పోవడం, అప్పు పుట్టకపోవడం వంటి అనేక సమస్యలు విశ్లేషణలో బహిర్గతమైనవి. ఈ అనేక సమస్యలకు ప్రత్తిలో ఉపయోగించుచున్న ఎక్కువ పురుగుమందులే కారణం అని గుర్తించి ఈ సంస్థ వారు పురుగుమందులు లేని యాజమాన్యంపై పని చేయవలెనని నిర్ణయించారు. ఈ పురుగు మందులు లేకుండా యాజమాన్యంను హైదరా బాద్ కేంద్రంగా గల ‘‘సెంటర్ ఫర్ వరల్డ్ సొలిడారిటి’’ వారి సుస్థిర వ్యవసాయ విభాగం ప్రస్తుతం సుస్థిర వ్యవసాయ కేంద్రంగా పిలవబడు చున్నది వారి యొక్క సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో కార్యక్రమాలను అమలు చేశారు.

మొదట్లో బెరుకుదనం

సెక్యుర్ సంస్థ వారు పురుగుమందులు లేని పద్ధతులతో రైతులను సంప్రదించినపుడు వారు అంతగా దానిని స్వీకరించలేదు. ఎందుకంటె పురుగు మందుల పరిశ్రమ వారి మార్కెటింగ్ మరియు ప్రచార వ్యూహాలు మరియు సవాళ్ళలోని ఇబ్బందులను అర్థం చేసుకొనగలము. మొదట్లో హేమ్ల నాయక్ అనే రైతు, సంస్థ వారిని ఎంతో శక్తి వంతమైన పురుగుమందుల విషమే కీటకాలను చంపలేనపుడు, నేను ప్రతిరోజు పళ్ళు తోము కొనుటకు ఉపయోగించే వేపనుపయోగించి ఎలా అదుపు చేయగలదని నమ్మాలి’ అని ప్రశ్నించడాన్ని గుర్తు చేసుకుంటారు. కాని మెల్ల మెల్లగా రైతులు తేడాను గుర్తించగలిగిరి.

విజయంలోని మాధుర్యం

మొదటి సంవత్సరం చివరికల్లా, పురుగు మందులు లేని వ్యవసాయం యొక్క ఫలితాలు సానుకూలంగా అగుపించినవి. 2001-02లో, పురుగు మందులు లేని వ్యవసాయంను ఎనిమిది మంది రైతులతో 6.4 హెక్టార్లలో పునుకూల గ్రామంలో చేపట్టడం జరిగినది. మరొక సారి పాత రసాయనిక పద్ధతులలో పండించిన రైతులు నష్టపోగా, పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేసిన రైతులు గొప్ప ఆర్థిక ప్రగతిని సాధించి, మంచి నికర ఆదాయంను పొందగలిగారు.

ఈ ప్రయత్నం నుండి, మొదటి సంవత్సరంలో ఫలితాలను మరియు ఆ రైతులు యొక్క పొలాలను చూసి రెండవ సంవత్సరంలో అనేక మంది రైతులు పాల్గొనడం జరిగినది. ఎక్స్‌పోజర్ విజిట్ (క్షేత సందర్శన) కొరకు ఇతర జిల్లాలకు రైతులను తీసుకెళ్ళడం జరిగినది. అంతేకాకా ఎక్కువ శిక్షణ శిబిరాలను గ్రామం నందే నిర్వహించడం జరిగినది. మెల్లగా ఒకరి నుండి మరొకరికి మాట ద్వారా వ్యాప్తి చెంది పురుగు మందులను విడిచిపెడితేనే బయట పడగలమనే గట్టి సంకల్పం ఏర్పడినది.

2002-03 ఈ పురుగు మందులు లేని వ్యవసాయంను వరి, కంది, ప్రత్తి మరియు మిరప పంటలలో ప్రయత్నించగా 58 హెక్టాటర్ల విస్తీర్ణంలో రైతుల సంఖ్య 59 కి పెరిగినది. ఇందులోని నికర ఆదాయం రైతుకు సంతృప్తికరంగా వున్నది. 2003-04 లో ప్రత్తిలో పురుగుమందులు లేని వ్యవసాయం క్రింద విస్తీర్ణం 480 హెక్టార్లకు పెరిగినది. ఈ విస్తీర్ణము పునుకుల మరియు పుల్లాయి గూడెం గ్రామంలలో పెరిగినది. పురుగు మందుల ఉపయోగంను మిరపలో ఆపివేయడం వలన నాణ్యత బాగా పెరిగి ఈ ఉత్పత్తులకు మార్కెట్ నందు మంచి ధర లభించినది.

ప్రభావములు

2004 - 2005 వరుసగా రెండవ సంవత్సరంలో పునుకుల గ్రామంలో ఏ రైతు కూడా పురుగు మందు డీలర్ ను సంప్రదించలేదు. గ్రామ పంచాయితీ కూడా ఈ గ్రామం పురుగు మందులను ఉపయోగించనటువంటి గ్రామము, ఇది ఇలాగే కొనసాగుతుందని ఒకతీర్మానం చేయడం జరిగినది. అంతేకాక డీలర్లు ఎవరు తమ గ్రామం నందు వారి ఉత్పత్తులను విక్రయించవద్దని గ్రామ పంచాయితీ తరపున విన్నవించడం జరిగింది.

గ్రామంలోని రైతులందరూ వారి పాత బకాయిలను కేవలం రెండు సంవత్సరాలలో తీర్చివేయగలిగినారు. ఎటువంటి అప్పులు లేకపోవడం వలన పర్యావరణ అనుకూలమైన పద్ధతులను ప్రయత్నించుటకు రైతులు ముందుకు వస్తున్నారు. పురుగు మందులు లేని వ్యవసాయమునకు మారిన తరువాత ఈర్ల దానమ్మ అదనంగా రెండు ఎకరాలు తీసుకున్నది. తన అప్పులన్నింటిని తీర్చివేయగలిగానని హేమ్లా నాయక్ చెబుతున్నారు. మాన్ సింగ్ అదనంగా రెండు ఎకరాల పొలంను ప్రత్తి కొరకు కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో పురుగు మందుల ఉపయోగం మానేసిన తర్వాత, గృహావసరాలకు అధికంగా డబ్బును ఉపయోగించడాన్ని సెక్యూర్ సంస్థ యొక్క క్షేత్ర సిబ్బంది గమనించారు. పొలాల యందు పర్యావరణ సమతుల్యత తిరిగి ఏర్పడినది. పొలం నందు అనేక రకాల కీటకాలు అగుపించుచున్నవి. కాని ఒక్కటి కూడా చీడపీడ దశను చేరడం లేదు. సాళీళ్ళు, తూనీగలు మరియు కందిరీగలు తన పొలం నందుండడం గూర్చి దానమ్మ మాట్లాడుతుంది. పక్షులు గ్రామంలోనికి తిరిగి వస్తుండడం గురించి కూడా గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు.

రైతుల ఆరోగ్యం కూడా మెరుగైనది. అందువలన ఇక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినదని కొత్తగూడెంలోని డా. నాగరాజు గమనించారు.

2004 సంవత్సరంలో పునుగుల గ్రామానికి మహిళా సంఘం వారు వేపగింజలను క్రష్ (దంచే) చేసే యాంత్రాన్ని తెచ్చారు. దీనిని సెంటర్ ఫర్ వరల్డ్ సొలిడారిటి వారి ఆర్థిక సహాకారంతో పంచాయితీ తరపున తేగా, దీని నుండి ఇద్దరు మహిళలకు పూర్తి స్థాయి ఉపాధి దొరికినది.

విధానము వేగంగా విస్తరించడము

పునుగులలో 174 మంది రైతులతో పాటు పుల్లాయిగూడెం నందలి 120 రైతులు పురుగుల యాజమాన్యం లోని కొత్త విధానం ను అందలి సూత్రాలను దాని నుండి వారు ఏ విధంగా లబ్ధి పొందగలిగినారు. అను విషయాలను ఇతరులకు వివరించే స్థితికి చేరినారు. ఒకరి నుండి మరోకరికి నోటి మాట ద్వారా ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందినది. పునుగుల గ్రామ రైతులు ఈ సమాచారమును ప్రక్క గ్రామాలకు చేర వేయడంలో చాలా క్రియ శీలకంగా వ్యవహరించాలని నిర్ణయించిరి. ఆ గ్రామాన్ని సందర్శించిన ప్రతి అతిథి పరివర్తనను గూర్చి వింటున్నారు. అంతేకాకా పునుగుల గ్రామ రైతులు వేరే సామాజిక అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క యన్‌పియమ్ గాథను తెలియజేయుటకు ఒక పనిగా పెట్టుకొ న్నారు.

గ్రామం

విస్తీర్ణం

సరాసరి దిగుబడి

సరాసరి ఉత్పత్తి ఖర్చు/హెక్టారు

సరాసరి నికర ఆదాయం/హెక్టారు

పునుకుల మరియు పుల్లాయి గూడెం

480 హెక్టార్లు

30 క్వి/హె

రూ|| 21408/ హెక్టారు

రూ|| 52593/ హెక్టారు

సస్య రక్షణ పై మారుతున్న ధృక్పధం

ధృక్పధం రసాయనిక పురుగు మందులతో సస్య రక్షణను బాగా చేయవచ్చునని భావిస్తుంటారు. కాని ఈ పురుగులు/ కీటకాలు తమ జీవిత చక్రంలోని డింభక (లార్వా) దశ యందు ఎక్కువ నష్టంను కలగ చేయును అపుడు మాత్రమే పురుగు మందులను పిచికారి చేయవలెను. కాని ఈ రైతులు పురుగులు ఎక్కువగా కనిపించినపుడంతా వాటిని ఉపయోగిస్తుంటారు. ఒకే పంటను పండించునపుడు ఇది సర్వ సాధారణము. పురుగు మందులను వరుసగా వాడుట వలన కీటకాలలో జన్యు నిరోధక శక్తి ఏర్పడి, పిచికారి నిష్ప్రయోజనం అగును. అప్పుడారైతులు ఖచ్చితంగా మోతాదును పెంచవలసిన అవసరం ఏర్పడి పెట్టుబడి పెరుగును. మరొక వైపు సస్యరక్షణలోని ప్రాధమిక సూత్రాలను పాటించకుండా రసాయనిక పురుగు మందులకు బదులుగా జీవ సంబంధ ఉత్పత్తులను ఉపయోగించడమనేది మాత్రం ప్రత్యామ్నాయం కాదు. మానవాళి ఆరోగ్యం మరియు పర్యావరణ సమతుల్యత వీటి ప్రభావం పై అనేక చర్చలు చేపట్టుట ద్వారా సమగ్ర సస్యరక్షణ విధానం అనునది ప్రారంభించిరి.

పురుగు మందులు లేకుండా యాజమాన్యం :

పురుగు మందులు లేకుండా పంటల యాజమాన్యం నందలి ప్రధాన సూత్రములు.

 1. పర్యావరణ సమతుల్యతో ఏర్పడి పొలం పురుగుల ఎక్కువగా వుండక, పంట దిగుబడికి నష్టం ఏర్పడదు.
 2. అసలు రసాయనికములనే ఉపయోగించకపోవుట వలన ప్రకృతి సమతుల్యతను పాటించును.
 3. పంటలలోని చీడ పురుగుల యాజమాన్యంలో వాటి యొక్క జీవిత చక్రం మరియు ప్రవర్తనను అర్థం చేసుకోవడమనేది చాలా ముఖ్యం అంతేకాని పురుగులు కనిపించిన వెంటనే పిచికారి చేయడమనేది మంచిది కాదు.
 4. నిర్మూలన కంటే నివారణ మంచిదనేది ఇందలి ప్రధాన సూత్రము.
 5. పంటల జీవ వైవిధ్యము మరియు నేల ఆరోగ్యము అనేవి చీడ పురుగుల యాజమాన్యములో కీలక పాత్ర వహించును. స్థానికంగా లభ్యమయ్యే ప్రత్యామ్నాయాల నుండి కూడా ఈ చీడ పురుగుల యాజమాన్యము సాధ్యమగును.

డా|| జి వి రామాంజనేయులు మరియు జాకీర్ హుస్సేన్
సుస్థిర వ్యవసాయ కేంద్రము
12-13-445, స్ట్రేట్ నెం: 1, తార్నాక, సికింద్రాబాద్ - 500 017
ఫోన్: 91(40) 27017735, 27014302

ఆధారము: LEISA India, Vol 8-2

రైతులచే స్వయంగా మార్కెటింగ్...సంఘటిత కృషికి నిదర్శనం

తమిళనాడులోని పెరంబలూరు జిల్లా మెట్టప్రాంతాలలో ఇప్పుడు ఎటుచూసినా విస్తారంగా మొక్కజొన్న పంటచేలు కనిపిస్తాయి. సాంప్రదాయికంగా, పత్తి, వేరుశెనగ పండించే ఈ ప్రాంత రైతులు, మొక్కజొన్నకు మళ్ళడంవెనుక అనేక కారణాలు వున్నాయి. రైతులు విపరీతంగా రసాయనిక ఎరువులు వాడడానికి అలవాటు పడడంతో, పత్తిసాగు గిట్టుబాటుకాకుండా పోయింది. వానలు ఆలస్యమవుతూ, విత్తడం ఆలస్యమవుతుండడంతో, దిగుబడి తగ్గుతున్నది. అందువల్ల, వాటికంటె, మొక్కజొన్నే మేలన్న అభిప్రాయం బలపడింది; పైగా, మొక్కజొన్న సాగుతో పశువులకు కూడా నమ్మకంగా ఆహారం సమకూరుతున్నది కదా ! ఈ నేపథ్యంలో, 2005 మే లో, ఏఎంఇ ఫౌండేషన్ తిరుచి శాఖ, పెరంబలూరు జిల్లా కున్నం తాలూకాలోని నాలుగు గ్రామాల రైతు బృందాలతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. మొక్కజొన్న సాగులో, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం ఏఎంఇ ఫౌండేషన్ ఈ ప్రమేయం లక్ష్యం . ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడానికి తోడు, మార్కెటింగ్ తరుణంలో పంటనష్టం ఎక్కువగా వుంటుండడంవల్లకూడా రాబడి బాగా తగ్గిపోయిందని రైతులతో చర్చల సందర్భంగా తేలింది. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తిగా మొక్కజొన్న మార్కెటింగ్‌పై దృష్టి కేంద్రీకరించడం జరిగింది.

అప్పటికి అనుసరిస్తున్న మార్కెటింగ్ పద్ధతులు

రైతులు తమ ఊరికి వచ్చే వ్యాపారులకే పంట అమ్ముతుండేవారు. పంటకోత సమయంలో పెరంబలూరునుంచి వ్యాపారులు వచ్చి, పంట కొనుక్కుపోయేవారు. వారు తక్కెడలు, గోనెసంచులు తీసుకుని వచ్చేవారు. కొన్న మొక్కజొన్నలను వెంటనే తమ పట్టణానికి తరలించడానికి రవాణా ఏర్పాట్లు కూడా వారే చేసుకునేవారు. మొక్కజొన్నలను తూకం వేసి, వంద కిలోల గోతాల్లో నింపి, అమ్మకం కోసం లారీలలో పెరంబలూరుకు తరలించేవారు.
మొక్కజొన్న ఎక్కువ పండినా, తక్కువ పండినా, ఇదే పద్ధతి. వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తారనేది ఒక్కో సీజన్లో ఒక్కోరకంగా వుండేది. ఫిబ్రవరి-మార్చి కోతాకాలంలో చాలా తక్కువ ధర ఇచ్చేవారు. కోసిన వెంటనే  పంటను అమ్మివేస్తుండడంతో మార్కెట్ కు పంట రావడం ఎక్కువై, రైతులకు అందే ధర తక్కువగా వుండేది.  అయినప్పటికీ, పంటను నిలువ చేసుకునే సౌకర్యాలు లేక పోవడంతో, రైతులు మరోదారిలేక   తక్కువ  ధరకే పంట అమ్ముకోవలసి వచ్చేది.
మళ్ళీ ఆ రైతులే, మొక్కజొన్నతో తయారయ్యే  పశువుల దాణాను ఎక్కువ ధరపెట్టి  కొనవలసి వచ్చేది. ముఖ్యంగా, వ్యాపారులు తమ పంటను కొలిచే తీరు, రైతులను బాగా  కుంగదీసేది. మొక్కజొన్నలను కొలవడంలో అక్రమాలు ఎన్నెన్నో ! కొన్నిటిని  రైతులు గమనించగలిగే వారు కారు. ఏమైనా, చాలా

సందర్భాలలో రైతులు నిస్సహాయంగా చూస్తూ, మిన్నకుండి పోయేవారు. కొన్నిచోట్ల మాత్రమే వుండే , ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వీరికి అందుబాటులో వుండేవి కావు. ఎక్కువ తూకాలతో కొలవడం వల్ల మిగిలే మొక్కజొన్నల తోనే, 14 టన్నులకు, దాదాపు 1000 రూపాయలు మధ్య దళారీలకు లభించేది. సక్రమంగా కొలిస్తే, ఎన్ని మొక్కజొన్నలు తూగుతాయో అలాంటి బస్తాలను  ముందుగానే సిద్ధంచేసుకుని, ఈ అక్రమాలబారినుంచి బయటపడడానికి  రైతులు ప్రయత్నించక పోలేదు. కానీ, ఏం లాభం ?  వ్యాపారులు ఆ ఊరికి మళ్ళీ వచ్చేవారు కాదు.

మొక్కజొన్న కొనుగోలులో సాధారణంగా జరిగే అవకతవకలు

 • పంటలో కొంత చెత్త చెదారం వుందంటూ, వ్యాపారులు  బస్తాకు అరకిలో   మొక్కజొన్నలు ఎక్కువగా తీసుకునేవారు. దీనికి రైతులు అంతగా  అభ్యంతరంచెప్పేవారు కారు.
 • ఎక్కువబరువున్న తూకపురాళ్ళతో తూచేవారు; ఆరకంగా, బస్తాకు కనీసం ఒక కిలో మొక్కజొన్నలు ఎక్కువగా కొలుచుకునేవారు.
 • బస్తాను త్రాసులో పెట్టేతీరులో చాకచక్యంగా, 2 నుంచి 8 కిలోల మొక్కజొన్నలు అదనంగా  తూచుకునేవారు.
 • సాధారణంగా  చీకటిపడిన తర్వాతనే ఈ తూకాలు సాగించేవారు. ఆ తూకపురాళ్ళను రైతులు సరిగాచూడలేక పోయేవారు. పైగా, చీకట్లో తూకం తక్కువ వచ్చిందంటూ, దానిని సరిచేసే పేరుతో మరికొంచెం మొక్కజొన్నలు  తీసుకోవడం కూడా చాలచోట్ల జరిగేది.
 • తూకంవేసేవారంటూ వ్యాపారులు తమతో తీసుకువచ్చినవారే తూకం వేస్తారు; రైతులను తూయనిచ్చేవారుకారు.

ఈ రకమైన దొపిడీకి ఒకరకంగా, రైతులే బాధ్యులు. స్థానిక వ్యాపారులు చెప్పే ఎక్కువధరకు, గోతాలు  వారే తెస్తుండడానికి రైతులు లోబడిపోయేవారు. తప్పుడు తూకాలతో తమకు కలిగే నష్టాన్ని వారు గ్రహించలేకపోయేవారు. చిన్నరైతులవద్ద చాలా కొద్దిపాటి  సరుకు వుంటుందికాబట్టి ,  బేరసారాలు సాగించే ధైర్యం వారికి వుండేది కాదు.  ఇంతేకాక,  తక్షణం డబ్బు అవసరాలు కూడా వారి నోళ్ళను కట్టివేసేవి. ఇక ఎక్కువగా మొక్కజొన్నలు పండిచిన రైతుల పరిస్థితీ ఇంతకంటె భిన్నమైనదేమీకాదు. పంట నిల్వచేయడానికి గోతాలు కానీ , చాలినంత స్థలంకానీ  లేక వారికి  పంటను నిల్వచేసుకోవడం సాధ్యమయ్యేదికాదు.

తొలి అడుగు

తమ సంఘంలో కూడగట్టుకున్న మద్దతును, ఏ ఎం ఇ ఎఫ్ తోడ్పాటును అందిపుచ్చుకున్న  పెర్మతుక్కుడికాడు గ్రామంలోని వినాయక సంఘ సభ్యులు, తాము పండించిన మొక్కజొన్నలను తామే స్వయంగా నమ్మక్కల్‌లోని కోళ్ళదాణా ఫ్యాక్టరీకి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. వారి ఊరికి, నమ్మక్కల్‌కు 160 కిలోమీటర్ల దూరం. మొదటి దఫాగా ఇద్దరు రైతులు 14 టన్నుల ( ఒక లోడు) మొక్కజొన్నలను నమ్మక్కల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళారు. 
నేరుగా మార్కెటింగ్ చేయడంలో మొదటి అనుభవం కావడంతో, వారికి అనేక సమస్యలు ఎదురయ్యాయి. రైతులు  తమపైనే ఆధారపడక  తప్పదని గ్రహించిన సరుకు ఎత్తుడు, దింపుడు కూలీలు ; బస్తాకు 5 రూపాయల కూలీని  ఒకేసారి  రెట్టింపుచేసి, 10 రూపాయలు చెప్పారు. వారికంటూ ఒక యూనియన్ వుండడంతో, నిస్సహాయులైన ఈ రైతులనుంచి మంచి లాభం రాబట్టాలని  వారు వెనుకకు తగ్గకుండా వుండిపోయారు.  బయటివారు ఈ ఎత్తుడు, దింపుడు పనులకు పోటీ రాకూడదన్నది ఆఊరి కట్టుబాటు.
అనుకూలంకాని మరో విషయం, అది  మార్కెట్‌కు పంట ముమ్మరంగావచ్చే సీజన్‌కావడం. ఇటు సరుకురవాణా చార్జీలను లారీల వాళ్ళు 25 % పెంచితే,  అటు  పశుదాణా ఫ్యాక్టరీలవారు కొనుగోలు ధరను తగ్గించారు. ఇంతేకాక, మొక్కజొన్నలలో తేమ శాతాన్ని కొలవడంలో రీడింగ్‌ను తప్పుగా చూపించి,  వీరు తెచ్చిన మొక్కజొన్నలకు  ధర తక్కువగా వస్తుందని బుకాయించారు. బాగా డిమాండ్‌వున్న సీజన్‌కావడంతో, గోతాల ధరలుకూడా 50 % పెరిగాయి.
అయితే, ఆ ఫ్యాక్టరీ యజమాని స్వయంగా జోక్యంచేసుకుని ,వీరిపట్ల  వ్యక్తిగత శ్రద్ధచూపి,   వీరికి అండగా నిలవడంతో, మొత్తంమీద, ఆ సమస్యనుంచి వీరు గట్టెక్కగలిగారు. ఇవేకాకుండా, వర్షాలవల్ల పంట దెబ్బతినవచ్చునని, సరకు తరలించడంలో జాప్యం జరగవచ్చునని, పక్క రాష్ట్రాలనుంచి తక్కువధరకే మొక్కజొన్నలు వస్తున్నాయని సాకుచూపి , ఫ్యాక్టరీలవారు తమ సరుకును కొనుగోలుచేయక పోవచ్చునని, ఇంకా రోడ్డు ప్రమాదాలు, లారీలు చెడిపోయి నిలిచిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చునని కూడా రైతులు ముందే ఊహించారు. అయితే, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని తామే నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలన్న ఆ సంఘ సభ్యుల దృఢ నిర్ణయం వారు,  వీటన్నింటినీ అధిగమించేలా చేసింది.
ఎన్నో అడ్డంకులెదురైనప్పటికీ , రైతులు చెప్పుకోదగినంతగా లబ్ధి పొందగలిగారు.    వే బ్రిడ్జిపై తూకంవేయడంవల్ల, ఒక్క తూకం విషయంలోనే, 14 టన్నులకు 610 కిలోల మొక్కజొన్నలు వారు మిగుల్చుకోగలిగారు. అంటే, 3385 రూపాయలు అదనపు రాబడి అన్నమాట. ధరవిషయంలోకూడా నిస్సందేహంగా  అది లాభసాటి బేరమే. ఊళ్ళో క్వింటాలుకు 500 రూపాయలు ఇస్తామన్నారు. కాని, ఇక్కడ వీరు అమ్మింది క్వింటాలు 555 రూపాయలకు. తామే స్వయంగా మార్కెట్ చేసుకోవడానికి కొంత ఖర్చయినప్పటికీ, అంతకు మించి,3.2 % లాభం వారికి వచ్చింది. మొత్తంమీద ఈ కొత్త అడుగు వేయడం ద్వారా రైతులు బస్తాకు 13.30 రూపాయలు అదనంగా పొందగలిగారు. రైతులు సీజన్‌కంటె ముందుగా గోతాలు కొనుక్కుని, కొంత ముందుగా లారీలు మాట్లాడుకుంటే, వారి నికర ఆదాయం 50 % పెరగడానికి ఎంతైనా అవకాశం వుంది. అయితే రాబడి కొంతే ఎక్కువ వచ్చిందా,  ఇంకా ఎక్కువ వచ్చేదా అనే దానికంటె, ఈ విధంగా తాము పొందిన అనుభవానికి, తాము  అవగాహన పెంచుకోగలిగినందుకు  రైతులు మరింత విలువ ఇస్తున్నారు.

అడుగుజాడలను అనుసరిస్తు

తమ సంఘంలోని ఇద్దరు రైతులు  సాహసంతో వేసిన ముందడుగుతో స్ఫూర్తిని పొందిన ఆ సంఘంలోని ఇతర రైతులు , తామూ అదే పంథాను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తు, కోళ్ళకు  బర్డ్‌ఫ్లూ వ్యాధి  సొకడంతో , నమ్మక్కల్‌లో చాలా కోళ్ళ పెంపకం కేంద్రాలు మూతపడ్డాయి. అందువల్ల మొక్కజొన్న ధర బాగా పడిపోయింది.
అయినా కూడా,  రైతులు ధైర్యం కోల్పోకుండా, ప్రత్యామ్నాయ పద్ధతులగురించి ఆలోచించారు.
ధర పెరిగేదాకా వేచిచూడాలని వారు  తమ సంఘ సమావేశాలలో తీర్మానించుకున్నారు. అత్యవసరంగా డబ్బు కావలసినవారికి తోటి సభ్యులు సహాయం చేశారు. నాలుగు సంఘాలకు చెందిన దాదాపు 50 మంది రైతులు మంచి ధర వచ్చేదాకా వేచి చూడడానికి మొగ్గుచూపారు. అదేవిధంగా, రెందు నెలలు ఆగి వారు తమ పంటను స్థానిక వ్యాపారులకు విక్రయించారు. ఇందువల్ల బస్తాకు 10 రూపాయల అదనపు ధర వారికి లభించింది. సగటున ఒక్కొక్క రైతు  300 రూపాయల అదనపు ఆదాయం పొందారు. రైతులు తాము కలసికట్టుగా సొంతంగా మార్కెటింగ్‌కోసం ప్రయత్నించడం, పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా,   తూకాలలో అవకతవకలను అడ్డుకోగలిగే ధైర్యాన్ని వారికి ఇచ్చింది.
పాడిపశువులు వున్న రైతులను,  వారు పండించిన  పంటతో పశుదాణా తయారుచేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది. మొక్కజొన్న, జొన్న,వేరుశెనగ , నువ్వులు వంటి పోషక  పదార్థాలతో పశుదాణా తయారుచేసుకోవడంలో రైతులకు శిక్షణ ఇచ్చారు. నాలుగు సంఘాలలో ఆ విధంగా  శిక్షణ  పొందిన 30 మంది రైతులు  పశుదాణా కొనుగోలు చేయడానికి బదులు తామే సొంతంగా తయారుచేసుకున్నారు. కిలో పశుదాణా తయారీకి వీరికి 8 రూపాయలు ఖర్చైంది. అదే కొనుగోలుచేసే పశుదాణా ఖరీదు కిలో 13 రూపాయలు. ఆ ధరతో పోల్చుకుంటే, వీరికి  చాలా తక్కువ ఖర్చుకే  పశుదాణా వచ్చింది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా,   ఒక్కొక్క ఆవుకు నెలకు 200 రూపాయల వంతున, ఈ రైతులందరికీ  పశుదాణా ఖర్చు మిగిలినట్టే . ఇంతేకాదు, ఈ పశుదాణాతో  మరిన్ని ఎక్కువ రోజులపాటు ఆవులు పాలిస్తుండడాన్ని  కూడా రైతులు గమనించారు.  పశువుల ఆహారంలో కొవ్వు పదార్థాల శాతం పెరగడమే   ఇందుకు కారణం.

నేరుగా మార్కెటింగ్‌లో ఆదాయ వ్యయాలు...రూపాయలలో

క్ర.సం.

అంశం

గతంలో పద్ధతి

నేరుగా మార్కెటింగ్

తేడా

1

మొక్కజొన్నలు తూగినది (కిలోలు)

14000.00

14610.00

4.3%

 

అయిన ఖర్చు

 

 

 

 

సామగ్రి (గోతాలు )

 

1667.50

 

 

ఎత్తుడు కూలీలు

 

1450.00

 

 

రవాణా

 

5440.00

 

 

ఇతరాలు

 

266.00

 

2.

మొత్తం ఖర్చు

 

8823.00

 

3.

మొత్తం ఆదాయం

70000.00

81085.50

15.8%

4.

నికర ఆదాయం

70000.00

72262.00

3.2%

ఆధారము: ఏఎంఇ ఫౌండేషన్

ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు...పత్తి నుంచి జొన్నకు

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో నాగలాపూర్ 140 కుటుంబాలతో కూడిన చిన్న ఊరు. ఈ గ్రామంలోనివారిలో ఎక్కువ మంది చిన్న రైతులు. లింగాయత్‌లు, ఎస్సీలు, మదివల తెగలకు చెందినవారే అధికం. తుంగభద్ర కెనాల్ ప్రాజెక్ట్‌కు చివర్లోవున్న ఊరు కావడంతో, కొద్దిమంది రైతులకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. అయితే, గత ఐదేళ్ళుగా ఈ కెనాల్‌ నీరు ఈ గ్రామానికి అందిందే లేదు. అందువల్ల, ఇక్కడి పొలాలు కేవలం వర్షాధారంగా మిగిలిపోయాయి. జొన్న, పత్తి, పొద్దుతిరుగుడు ఇక్కడి ప్రధానమైన పంటలు. గ్రామంలో ఎక్కువ నల్ల భూములు కావడంతొ, పత్తిపంటకు అనుకూలంగా వుంటాయి. పత్తిని ఏక పంటగా పండిస్తారు. పత్తిసాగుకు అవసరమైన పెట్టుబడులను కొనుగోలుచేసి సమకూర్చుకోవడం ఎక్కువకావడంతో, పత్తి పంట గిట్టుబాటు కాకుండా పోతున్నది.

నాగలాపూర్ గ్రామంలో లింగాయత్ తెగకు చెందిన బసవరాజప్ప ఒక చిన్న రైతు. 38 ఏళ్ళ బసవరాజప్ప నాల్గవ తరగతి వరకు చదువుకున్నాడు. వారిది 12 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. వారు తమ పొలం పనులు చేసుకోవడమే కాకుండా, ఇల్లు గడవడం కోసం కూలీ పనులకు కూడా పోతుంటారు. పనులులేని రోజులలో ఆ కుటుంబంలోని మగవారు పనులకోసం సమీపంలోని పట్టణాలకు వలస పోతుంటారు. బసవరాజప్పకు 4 ఎకరాల మెట్ట భూమి వుంది. ఆయన పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు సాగుచేస్తాడు. పత్తిని ఏకపంటగానే ఆయన సాగుచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో చాలామంది ఇలానే చేస్తారు. మూడేళ్ళకొకసారి పొలానికి పశువుల ఎరువు వేయడం, ప్రతి సీజన్లో యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువులవంటి రసాయనికాలను ఎకరాకు 50కిలోల వంతున వేయడం అక్కడ సర్వ సాధారణం. చిల్లర దుకాణాల నుంచి విత్తనాలను తెచ్చి, నేరుగా పొలంలో విత్తుతారు. పంటకు పురుగు సోకకుండా నివారించడానికి, పట్టిన పురుగును పోగొట్టడానికి మోనోక్రోటోఫాజ్, ఎండోసల్ఫాన్, క్వినాల్ ఫాస్ వంటి రసాయనిక పురుగు మందులను 5-6 సార్లు చల్లుతారు. ఇన్నిచేస్తే, ఎకరాకు 5 క్వింటాళ్ళ వరకు పత్తి పండుతుంది.

ప్రత్యామ్నాయ సాగు పద్ధతుల దిశగా...

తమ రైతు సంఘంలో బసరాజప్ప చురుకుగా పాల్గొనే సభ్యుడు. ఏఎంఈ ఫౌండేషన్ నిర్వహించిన రైతుల క్షేత్ర పాఠశాల (ఎఫ్ ఎఫ్ ఎస్)కు బసవరాజప్ప హాజరైనాడు. తన పొలంలో ఒక ఎకరాలో ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను ఆయన చేపట్టాడు.
ఎఫ్ ఎఫ్ ఎస్‌ కోసం కేటాయించిన ఆ పొలాన్ని తొలకరి వానల కోసం వేసవిలోనే దున్ని సిద్ధంచేయడం జరిగింది. ఆ తర్వాత విత్తనాలు వేయడానికి ముందు మరి మూడుసార్లు ఆ పొలాన్ని దున్నారు. పొలంగట్లకు అవసరమైన మరమ్మతులు చేసి, పొలంలో తేమను పట్టివుంచేలా అంతర కట్టలను వేశారు. గట్లమీద జత్రోఫా, గ్లైరిసీడియా మొక్కలను నాటారు . రెండు ప్రయోజనాలను ఆశించి  ఈ మొక్కలను పెంచుతారు. అవి: గట్ల సంరక్షణ, సేంద్రియ ఎరువు తయారీకి మరింతగా  మొక్కల వ్యర్ధాలను పొందడం.  పొలంలోకి మేకలను తోలించి , వాటి విసర్జితాలతో  నేల సారాన్ని పెంచే ప్రయత్నంకూడా చేశారు.
ఏక పంట పద్ధతికి  భిన్నంగా, కంది, అలసంద, బెండవంటి పంటలను పత్తితో కలిపి సాగుచేయడం  మొదలెట్టారు. కందిని సరిహద్దు పంటగా వేయగా, బెండ, అలసంద విత్తనాలను పొలంలో అక్కడక్కడ ఎర పంటగా  చల్లారు. విత్తన శుద్ధితో మొదలుపెట్టి , పురుగు నివారణకు రకరకాల చర్యలు చేపట్టారు. విత్తడానికి ముందు, విత్తనాలను  ట్రికోడెర్మాతోను, పిఎస్‌బితోను శుద్ధి చేశారు.  15-20 రోజుల  వ్యవధితో, మొక్కలపై మూడు సార్లు వేపగింజల కషాయాన్ని చల్లారు.  ఈ కషాయం  పురుగు మందుగా పనిచేస్తుంది. ఇప్పుడు రసాయనిక పురుగుమందులు చల్లడాన్ని రెండుసార్లకు పరిమితం చేశారు.  అదికూడా, పంటను కాయ తొలుచు పురుగు ఎక్కువగా ఆశించే సెప్టెంబర్ నెలలో చల్లారు. ఇలా, పర్యావరణానుకూలమైన  ప్రత్యామ్నాయ సాగు పద్ధతులతో, బసవరాజప్ప తాను  సాగుచేసే పొలంలోనే ఎకరాకు 8 క్వింటాళ్ళ  పత్తి పండించ గలిగాడు. అతను సాధారణంగా సాధించే దిగుబడి కంటె ఇది , ఒకమోస్తరుగా, 6.25 క్వింటాళ్ళు ఎక్కువ . అయితే, ఆయన సాధించిన గొప్ప లాభం రసాయనికాలను తక్కువగా వాడడంవల్ల  ఉత్పత్తి వ్యయాన్ని బాగా  తగ్గించుకోవడం.  రసాయనిక ఎరువుల వాడకం 60 శాతం తగ్గింది (150 కిలోల వివిధ రకాల రసాయనాలు వాడేచోట కేవలం 50 కిలోల కాంప్లెక్స్ ఎరువులు మాత్రమే వేశారు). రసాయనిక పురుగు మందుల చల్లకం 6 సార్ల నుంచి 2 సార్లకు పరిమితమైంది.  . రసాయనాల వాడకం తగ్గడంతో సాగుకు అయ్యే ఖర్చుకూడా గణనీయంగా  తగ్గింది ; రసాయనిక ఎరువులలో 37 % . రసాయనిక పురుగు మందులలో 77 % ;  మొత్తం మీద 38 % ఖర్చు ఆదా అయింది.
పత్తితోపాటు పండించిన  ఇతర పంటలు ఆ కుటుంబ ఆహార అవసరాలకు  ఉపయోగపడ్డాయి. కంది , బెండ చెరి క్వింటాల్ వంతున పండగా;  అలసందలు 30-35 కిలోలు వచ్చాయి. బసవరాజప్ప పొందిన మరో ముఖ్య ప్రయోజనం పురుగుల నివారణకు సంబంధించి తన అవగాహనను పెంచుకోగలగడం. ఎఫ్ ఎఫ్ ఎస్ శిక్షణతో అతనిప్పుడు లేడీ బర్డ్ బీటిల్, క్రిసోపా వంటి మిత్ర కీటకాలను గుర్తించి, ఏది ఏమిటో తెలుసుకో గలుగుతున్నాడు.
పత్తితోపాటు పండించిన  ఇతర పంటలు ఆ కుటుంబ ఆహార అవసరాలకు  ఉపయోగపడ్డాయి. కంది , బెండ చెరి క్వింటాల్ వంతున పండగా;  అలసందలు 30-35 కిలోలు వచ్చాయి. బసవరాజప్ప పొందిన మరో ముఖ్య ప్రయోజనం పురుగుల నివారణకు సంబంధించి తన అవగాహనను పెంచుకోగలగడం. ఎఫ్ఎఫ్ఎస్ శిక్షణతో అతనిప్పుడు అక్షింతల పురుగు,  అల్లిక రెక్కల పురుగు వంటి మిత్ర కీటకాలను గుర్తించి, ఏది ఏమిటో తెలుసుకో గలుగుతున్నాడు.

పత్తి సాగులో ఆదాయ వ్యయాలు (ఎకరాకు రూపాయలలో) - 2005

క్రమ సంఖ్య

అంశం

మామూలుసాగు పొలం

ప్రయోగ క్షేత్రం

తేడా (%)

1.ఉత్పత్తి వ్యయం

 

భూమి సిద్ధం చేయడం

600

600

 

 

సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు

1650

1000

- 39.4 %

 

విత్తనాలు, విత్తన శుద్ధి

700

715

 

 

చీడలు, తెగుళ్ళ నివారణ

2380

550

-76.9 %

 

కూలీలు

1050

1050

 

 

మొత్తం వ్యయం

6380

3915

-38.6 %

2

దిగుబడి (కిలోలు)

750

800

6. 25 %

3

మొత్తం రాబడి (రూ)

16500

17600

6.66 %

4

నికర ఆదాయం

10120

13685

35.22 %

పత్తి అధ్యయన ఫలితాలను జొన్నకు విస్తరించడం

పత్తి పంటలో ప్రత్యామ్నాయ సాగువల్ల చేకూరిన ఫలితాలు, ఈ సంఘ సభ్యులను ఆహార పంట అయిన జొన్నలోకూడా ఆ పద్ధతులను పాటించేలా ప్రోత్సహించాయి. జొన్నను ఆహార పంటగా  , ముఖ్యంగా ఇంటి అవసరాలకు పండించేవారు. జొన్న పంట విషయంలో భూసారం పెంపు,  చీడల నివారణ వంటి అంశాలగురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏఎంఇఎఫ్ మార్గ దర్శకత్వం లో  బసవరాజప్ప కొన్ని ప్రత్యామ్నాయ సాగుపద్ధతులను చేపట్టాడు. నేలలో నీటితడి నిలిచి వుండడం కోసం  పొలాన్ని పల్లం వైపుగా దున్నాడు. 20 బండ్ల  సేంద్రియ  ఎరువు పొలానికి తోలాడు. పశువులు మేయకుండా శాఫ్ పూల మొక్కలను జొన్నకు  సరిహద్దు పంటగా వేసి, శనగను అంతర పంటగా వేశాడు. ముందుగా, జొన్న, శనగ విత్తనాలను  పిఎస్‌బి తో శుద్ధిచేసి, ఆ తర్వాతనే వాటిని  విత్తాడు. సాధారణంగా మూడు కిలోల జొన్నలు వేసేవారు,  ప్రస్తుతం రెండు కిలోలే వేశారు. మొక్కకు మొక్కకు మధ్య తగినంత ఎడం వుండేలా జాగ్రత్త పడిన  బసవరాజప్ప, జొన్నవిత్తనాలను  ఒక  కిలో తగ్గించడంవల్ల మొక్కల సంఖ్య అనువుగా  కుదిరిందని గ్రహించాడు. దీనితో మొక్కలు పెద్ద మొవ్వలతో,  ఏపుగా పెరిగాయి. మామూలు పద్ధతిలో పండించే జొన్నతో పోలిస్తే, ఈ జొన్న కాండం , ఆకులు రెట్టింపు సైజులో పెరిగాయి.
ఆకు తొలుచు పురుగు, కాండం తొలుచు పురుగులనుంచి  మొక్కలను సంరక్షించడంకోసం, వేప కషాయాన్ని రెందుసార్లు   చల్లారు. ప్రత్యామ్నాయ సాగు పద్ధతివల్ల  తొలుత సాగుకయ్యే ఖర్చు పెరిగింది. ఇందుకు మొదటి కారణం అదనపు భూమిని దున్నడానికి అయిన ఖర్చుకాగా, ఎఫ్‌ వై ఎం కొనుగోలు చేసి వాడవలసిరావడం రెండవ కారణం. అయితే, బసవరాజప్ప తన పొలంలో స్వయంగా సేంద్రియ ఎరువు తయారు చేసుకుంటుండడంతో, ఇకపై ఆ ఖర్చు క్రమేణా తగ్గుతుందని భావించవచ్చు.  ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ, బసవరాజప్ప మరింత  నికర  ఆదాయాన్ని పొందగలిగాడు. అతను 9 క్వింటాళ్ళ జొన్న పండించగలిగాడు. గతంలోని  దిగుబడికి ఇది రెట్టింపుకంటెకూడా ఎక్కువ. పశువుల మేత కూడా ఎకరాకు 2 టన్నుల స్థాయి నుంచి, 4 టన్నులకు పెరిగింది. అదనంగా బసవరాజప్పకు 60 కిలొల  శనగలు, 60 కిలోల శాఫ్ పూలు వచ్చాయి. ఆ పూల నుంచి 9 కిలోల నూనె వచ్చింది.

జొన్న సాగులో ఆదాయ వ్యయాలు (ఎకరాకు రూపాయలలో) - 2005

క్రమ సంఖ్య

అంశం

మామూలుసాగు పొలం

ప్రయోగ క్షేత్రం

తేడా (%)

 

దున్నడం

400

2000

400 %

 

ఎఫ్‌వైఎం

900

 

 

 

విత్తనాలు, విత్తన శుద్ధి

94

65

-30 %

 

కూలీలు

880

880

 

1

ఉత్పత్తి వ్యయం

1374

3845

179 %

2

దిగుబడి (కిలోలు)

400

900

125 %

3

మొత్తం రాబడి

2400

7410

208 %

4

నికర ఆదాయం

1026

3565

247 %

ఆధారము: ఏఎంఇ ఫౌండేషన్

టొమాటోలో చీడల, తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం...మహిళా రైతులకు వ్యవసాయ క్షేత్ర పాఠశాల

కర్ణాటక రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా కొత్తూరు, సీరియంపట్టి, ఈచంపల్లం గ్రామాలలో ప్రధానమైన వాణిజ్య పంట టొమాటో. ఎక్కువ మంది కూలీలు అవసరమయ్యే పంట కావడంతో, ఈ గ్రామాలలో టొమాటో సాగు పలువురికి బతుకు దెరువు కూడా కల్పిస్తున్నది. ఇక్కడి రైతులు ఎక్కువ ఖర్చుతో వ్యవసాయ పెట్టుబడులను కొనుగోలుచేసి . టొమాటో సాగుచేస్తున్నారు. విచక్షణారహితంగా రసాయనిక ఎరువులను, రసాయనిక పురుగు మందులను వాడుతుండడంతో, ఉత్పత్తివ్యయం బాగా పెరిగిపోతున్నది. ఈ రైతులకు పర్యావరణానుకూలమైన సాగుపద్ధతులను గురించి నేర్పించాలన్నా, ముఖ్యంగా, ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే మెళకువలను తెలియజేయాలన్నా వారికి ప్రత్యామ్నాయ సాగుపద్ధతులపై సమగ్ర అవగాహన కలిగించవలసి వుంది. ఇందుకు వారు తమంతట తాము ప్రయోగాత్మకంగా నేర్చుకోగలిగే 'రైతుల వ్యవసాయ పాఠశాల (ఎఫ్ఎఫ్ఎస్)' ఎంతైనా అనువైన సాధనమని గుర్తించడం జరిగింది.

ప్రక్రియలు

వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ విశ్లేషణ (ఏఇఎస్ఏ)
ఈ వ్యవసాయ పాఠశాలలో పాల్గొనేవారు అధ్యయనంద్వారా, అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికి వీలుగా 0.64 ఎకరాల అభ్యాస క్షేత్రాన్ని ఉపయోగించడం జరిగింది. రైతుల అభ్యాసానికి. ప్రామాణిక పంట సాగుకు, దీర్ఘకాలిక అధ్యయనానికి, సమగ్ర తెగుళ్ల యాజమాన్యానికి సంబంధించిన ప్రత్యమ్నాయాలతో కూడిన ప్రయోగాలను రూపొందించారు. తెగుళ్ళ నివారణకు, అదనపు ఆదాయానికి వీలుగా, అలసంద వంటి అంతర పంటలను; మొక్కజొన్న, బంతి, సజ్జ వంటి సరిహద్దు పంటలను ఉపయోగించారు. సాధారణ క్షేత్రాలలో, ప్రయోగ క్షేత్రంలో వారంవారం ఏఇఎస్ఏ పరిశీలనాంశాలను ఉపసంఘాలలో చర్చించేవారు; తమ తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడంద్వారా చక్కని నిర్ణయాలు తీసుకోగలిగేవారు. పోషకాల యాజమాన్య పద్ధతులను గురించి, మల్చింగ్‌ను గురించి స్వల్పకాలిక అధ్యయనాల ద్వారా ; మిత్ర శత్రు కీటకాలగురించి ప్రదర్శన ద్వారా రైతులు తెలుసుకునే ఏర్పాట్లు జరిగాయి.

సంఘంగా వ్యవహరించడం
రైతుల క్షేత్ర పాఠశాల ప్రక్రియలో సంఘంగా వ్యవహరించడమనేది ఒక భాగం. సంఘ నిర్మాణ నైపుణ్యాలను, సమస్యా పరిష్కార నైపుణ్యలను పెంపొందించడంలో ఒక సంఘంగా వ్యవహరించడమనేది ఎంతైనా ఉపకరిస్తుంది. ఎఫ్ఎఫ్ఎస్ రైతులు గ్రామాలలోని ఇతర సంఘాల సమావేశాలలో ఉత్సాహంగా పాల్గొని, ఎఫ్ఎఫ్ఎస్ అధ్యయనాలను వారితో పంచుకున్నారు. ఎఫ్ఎఫ్ఎస్ ముగింపునాడు క్షేత్రదినోత్సవం జరిగింది.ఆరోజు ఎఫ్ఎఫ్ఎస్ రైతులు చుట్టుపట్టు ఐదు గ్రామాలకు చెందిన టొమాటో రైతులతో తమ అనుభవాలను పంచుకున్నారు.

అనుసరించిన పద్ధతులు

నారుమళ్ళ పెంపకం
నారుపోసి పెంచే పద్ధతిలో, ముఖ్యంగా ఎత్తుగా తయారుచేసిన మళ్ళలో టొమాటో మొక్కలను పెంచడం ద్వారా , మట్టిలోని సూక్ష్మక్రిములవల్ల మొక్కలు దెబ్బతినకుండా పెంచడం ఎలానో, మొక్కలు నాణ్యంగా పెరగడానికి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో  రైతులు గ్రహించగలిగారు.  నారుమళ్ళలో వరుసలలో విత్తడం, కలుపును నివారిస్తుందనికూడా వారు తెలుసుకున్నారు.
సరిహద్దు పంటలు-ఎర పంటలు
టొమాటోను ఎప్పుడూ ఏకపంటగానే పండిస్తూ వచ్చారు.  అంతర పంటలు టొమాటో పంటతో పోటీపడతాయని, అవి చీడపురుగులను ఆకర్షిస్తాయనేది  ఎఫ్ఎఫ్ఎస్ కు ముందు రైతుల భావన. అయితే,  ఎఫ్ఎఫ్ఎస్ లో పాల్గొన్న తర్వాత  మొదటిసారిగా వారు టొమాటోలో ఇతర పంటల ప్రాధాన్యాన్ని గురించి తెలుసుకున్నారు. అంతకుముందు వారికి వున్న అపోహలు తొలిగాయి. మొక్కజొన్న, సజ్జ వంటి సరిహద్దు పంటలు తెల్లదోమ సోకకుండా అడ్డుకట్టగా   నిలిచాయన్న విషయాన్ని వారు  గ్రహించారు. ఎర పంటగా బంతి కాయతొలుచుపురుగులను గుడ్లు పెట్టుకోవడానికి ఆకర్షించగా, మరో ఎరపంట అయిన అలసంద బదనికలకు ఆహారంగా ఉపయోగపడిందని వారు తెలుసుకున్నారు.
అనేక ప్రయోజనాలను అందించే మల్చింగ్
మల్చింగ్ ప్రయోజనాలను తెలుసుకోవడం ఒక ముఖ్యమైన అధ్యయనం.  చెరకు చెత్త, పనికిరాని వరిగడ్డి, కొబ్బరి ఆకులను టొమటో పంటలో మల్చింగ్‌కు ఉపయోగిస్తారు.  నేలలోని తేమ వ్యర్ధంగా  ఆవిరైపోకుండా మల్చింగ్ సంరక్షిస్తుందని రైతులు తెలుసుకోగలిగారు. నేలలో అవసరమైనంత తేమ వుండడంవల్ల :

 • పంటను ఎంతగానో దెబ్బతీసే ఎర్రనల్లి సోకడం చాలావరకు  తగ్గిపోయింది.
 • పొలానికి ఎక్కువసార్లు నీరు కట్టవలసిన పనిలేకుండాపోయింది. గతంలో 3-4 రోజులకు ఒకసారి నీటిపారుదల అవసరమైతే,  మల్చింగ్‌వల్ల 7రోజులకు ఒకసారి నీరుకడితే సరిపోతున్నది.
 • మొక్క పెరుగుదల మెరుగుపడింది; అంటే మొక్కకు మరిన్ని ఆకులు రావడం, మరింత ఎత్తు పెరగడం వంటివి 30 % మెరుగుపడ్డాయి
 • కలుపు మొక్కలు తగ్గాయి

తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం (ఐపిఎం)
పంటసంరక్షణలో భాగంగా    తెగుళ్ళ నివారణకు అనేక ఐపిఎం పద్ధతులను అనుసరించడం జరిగింది. వాటిలో  జిగటపూసిన పసుపు రంగు ఎరలను  పొలంలో అమర్చడం (ఎల్లోస్టిక్  ట్రాప్),ఫెర్మోన్ ఎరలను పెట్టడం, గుంతలాంటివాటిలో పడేవిధంగా ఎర ఏర్పాటుచేయడం (పిట్‌ఫాల్ ట్రాప్), కందిరీగలాంటి పురుగు (ట్రికోగ్రామా) అండాల బదనికలను వెదజల్లడం, ఆకుపురుగు(క్రైసోపెర్ల) బదనికలను ఉపయోగించడం, మిరప-వెల్లుల్లి రసాన్ని చల్లడం, లంతన ఆకురసాన్ని చల్లడం, పంచగవ్య, ఎన్‌పివి మొదలైనవి వున్నాయి..
పసుపురంగు జిగట ఎర

రసంపీల్చే పురుగులు పసుపురంగు జిగట ఎరలో చిక్కుకునే పద్ధతిని రైతులు తెలుసుకున్నారు.వివిధరంగుల ఎరలను  అనేక రకాలుగా అమర్చి  చూస్తూ,  పురుగులు ఎరలో చిక్కుకునేలాచేయడంలో ఎర రంగు, ఎరను అమర్చే ఎత్తు ముఖ్యమైన  అంశాలని రైతులు గ్రహించారు

సాధించిన ముఖ్య ఫలితాలు

ఖర్చు తగ్గుదల
ఈ రైతులు గతంలో అనుసరించిన సాగుపద్ధతులతో పోల్చుకుంటే, కొనుగోలు చేసివాడే వ్యవసాయ పెట్టుబడులు తగ్గడంతో, ఉత్పత్తి వ్యయం గణనీయంగా ఎకరాకు 13,000రూపాయలు తగ్గింది. టొమాటోనారును సొంతంగా పెంచుకోవడంవల్ల నారు ఖర్చు 68 % తగ్గింది. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుమందులమీద వెచ్చించే ఖర్చు భారీగా 75 % తగ్గింది. ఏఫ్ఎఫ్ఎస్ ప్రదర్శన క్షేత్రంలో కలుపుతీసే అవసరంలేకపోవడంతో, కూలీలపై వ్యయం 16 % తగ్గింది. ఈ ఖర్చు తగ్గుదలలన్నీ కలుపుకుంటే, ఉత్పత్తి వ్యయం మొత్తంమీద 29 % తగ్గినట్టు.

తెగుళ్ళ సమగ్ర నివారణ నిర్ణయాలు- మహిళల కొత్త పంథా
కొత్తూరులో వ్యవసాయానికి సంబంధించిన నిర్ణయాలు, , ముఖ్యంగా, తెగుళ్ళ నివారణపై నిర్ణయాలలో కేవలం మగవారిదే గుత్తాధిపత్యంగా వుండేది. అయితే, ఈసారి ఎఫ్ఎఫ్ఎస్‌లో పాల్గొన్న మహిళా రైతులు తాము నేర్చుకున్న ప్రత్యామ్నాయ పద్ధతులను పొలాలలో ప్రయోగించి, పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీసే ఎర్రనల్లి సోకడాన్ని తగ్గించడం వంటి సత్ఫలితాలను సాధించగలిగారు. మగవారు మొదట్లో స్త్రీల ఈ ప్రయోగాలను చిన్నచూపుచూసినప్పటికి, వారు సాధించిన సత్ఫలితాలుచూసి, క్రమంగా టొమాటోలోతెగుళ్ళ నివారణపై మహిళల నిర్ణయాలను అంగీకరించడం మొదలెట్టారు. పైగా, చాలా ఖరీదుతోకూడుకున్న రసాయనికాల ఖర్చు తగ్గడంతో వారు సంతోషిస్తున్నారు. ఇంతేకాక, ఎఫ్ఎఫ్ఎస్ శిక్షణకు క్రమంతప్పకుండా హాజరయ్యేలా వారు మహిళలను ప్రోత్సహిస్తున్నారుకూడా. ఎఫ్ఎఫ్ఎస్ తమ అవగాహనను పెంచి, వ్యవసాయోత్పత్తికి తాముకూడా తోడ్పడేలా చేసిందని మహిళలుకూడా ఆనందిస్తున్నారు. మగవారు ఈ వాస్తవాన్ని గుర్తిస్తున్నారు. అంగీకరించసాగారు.

ఆదాయ వ్యయాలు (ఎకరాకు)...పోల్చి చూడడం

క్రమసంఖ్య

అంశం

మామూలు పొలం

ఎఫ్ఎఫ్ఎస్ క్షేత్రం

తేడా  ( % )

1

ఉత్పత్తి వ్యయం

 

భూమిని సిద్ధం చేయడం

2200

2200

-

 

కావలసిన పదార్థాలు

12000

12000

-

 

పెట్టుబడులు ( మొక్కలు,
సేంద్రియ ఎరువు, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు)

15590

5125

67 %

 

కూలీలు

15860

13260

16 %

 

మొత్తం

45650

32585

29 %

2

పంట దిగుబడి

18420

17800

-3 %

3

మొత్తం ఆదాయం

230250

222500

-3 %

4

నికర ఆదాయం

184600

189915

3 %

పెరిగిన ఆదాయం

రైతులు ఎకరాకు 5315 రూపాయల అదనపు నికర ఆదాయం పొందగలిగారు. ఉత్పత్తి వ్యయం తగ్గడం, మామూలుకంటె భిన్నంగా, ఆసీజన్లో పంటకు అధికధర రావడం వల్ల ఈ అదనపు ఆదాయం చేకూరింది. రసాయనికాల వినియోగంనుంచి, లీసా (ఎల్ఏఐఎస్ఏ) పద్ధతులకు మారిన మొదటి ఏడాదే, ఎకరాకు 620 కిలోల దిగుబడి తగ్గినప్పటికి, ఈ 3 % అదనపు ఆదాయం సాధ్యమైంది.

యెల్లో స్టికీ ట్రాప్‌కు బదులుగా రైతులు రూపొందించిన స్థానిక నూత్న పరికరం

సాంప్రదాయికమైన యెల్లో స్టికీ ట్రాప్ చట్రానికి బదులుగా ఈ క్షేత్ర పాఠశాలలో పాల్గొన్న రైతులు ఒక కొత్త పరికరాన్ని రూపొందించారు. కొబ్బరి చిప్ప (కొబ్బరితీసివేసినది) కు పసుపు రంగు వేసి, దానిపై జిగటకోసం ఆముదం చల్లి, దానిని ఎరగా ఉపయోగించవచ్చునని వారు కనుగొన్నారు.మూడు నాలుగురోజులకొకసారి ఆముదంచల్లుతుంటే పురుగులు దానికి బాగా అతుక్కుంటాయి.

ఎల్లో స్టికీ ట్రాప్‌కు బదులుగా ఉపయోగించిన కొబ్బరి చిప్ప

పర్యావరణ పరిరక్షణపై పిల్లలలో చైతన్యాన్ని రగిలించడం

పర్యావరణంతో మనిషికివున్న అనుబంధాన్నిగురించి పిల్లలకు అవగాహన కలిగించడంద్వారా ఈ క్షేత్ర పాఠశాల ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. విద్యార్థులు, పిల్లలు తమ తీరిక సమయాలలో కొన్ని ఎఫ్ఎఫ్ఎస్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. భూమి పరిశీలన, చార్టులను తయారుచేయడం, వాటిని తోటివారికి వివరించడం వంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.పంటలు, తెగుళ్ళు, అవిసోకే కారణాలు, పంటపై వాటి దుష్ఫలితాలు మొదలైన విషయాలను విద్యార్థులు అవగాహనచేసుకున్నారు. ఆ తరువాత వీరు తాము తెలుసుకున్న విషయాలను తమ ఉపాధ్యాయులతోను, తోటి విద్యార్థులతోను పంచుకున్నారు.

ఆధారము: ఏఎంఇ ఫౌండేషన్

మెట్ట భూములలో పత్తిపంట గిట్టుబాటుకు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ తాలూకా గధర్ గ్రామంలో 450 కుటుంబాలు వున్నాయి. ఈ గ్రామంలో పండించే వాణిజ్య పంటలలో పత్తి ముఖ్యమైనది. గ్రామంలోని చాలామందికి మెట్టభూములే జీవనాధారం. కొద్దిమందిమాత్రం, దిగుడుబావుల నీటితో పంటలు పండించుకుంటారు. ఈ ఒక్క గ్రామంలోనేకాదు, ఈ ప్రాంతమంతటా ఒకే పంట పండించడం అలవాటు. కొన్నేళ్ళక్రిందట ఇక్కడ పత్తి సాగు చాలా లాభదాయకంగా వుండేది. అయితే, కొనుగోలుచేసి పెట్టవలసిన పెట్టుబడులు నానాటికి ఎక్కువకావడంతో ఆదాయం తగ్గిపోయింది. పంటలకు పెట్టవలసిన పెట్టుబడులగురించి రైతులు ఎక్కువగా, వాటి డీలర్ల సూచనలనే పాటిస్తారు. ఇంతేకాదు, విత్తనాల అమ్మకందారులనుంచి పాకెట్లలోకాకుండా, విడిగా విత్తనాలను కొని, నేరుగా పొలంలో విత్తుతారు. గత కొన్ని సంవత్సరాలుగా , పత్తిసాగుకు అయ్యే ఖర్చులు పెరిగిపోయాయి; పొలాలలో సారం తగ్గింది; పంట దిగుబడులు తగ్గుతున్నాయి.

మార్పు దిశగా

ఈ ప్రాంతంలో వ్యవసాయ జీవనాధారాలకు సంబంధించి రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను గమనించిన ఏఎంఇ ఫౌండేషన్, బాహ్య పెట్టుబడులను తగ్గించి, , సుస్థిర ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటల సాగు పద్ధతులతో రైతులకు తోడ్పాటు అందించడంకోసం, ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నది.
రైతులతో చర్చించగా, మొక్క రసంపీల్చే పురుగులు, కాయతొలుచు పురుగులవల్ల పంట ఎక్కువగా నష్టపోతున్నట్టు తెలిసింది. ఈ చీడపురుగులను నివారించడంకోసం రైతులు సగటున తొమ్మిది సార్లు పురుగు మందు స్ప్రే చేస్తున్నారు. వీటిలో కాయతొలుచుపురుగు నివారణకోసం ఐదుసార్లు కాగా, మిగతా నాలుగు సార్లు పంట రసంపీల్చే పురుగుల నివారణకోసం. సాధారణ పంటదిగుబడి ఎకరానికి సగటున 6 క్వింటాళ్ళుకాగా, బాగాతక్కువగా 3.5 క్వింటాళ్ళు మాత్రమే వచ్చింది. పంటదిగుబడి తగ్గడానికి నాణ్యతలేని విత్తనాలు, ఆలస్యంగా విత్తడం, సారవంతంకాని నేల, నీటి నిర్వహణ లోపాలు, సేంద్రియ ఎరువు తగినంత వేయకపోవడంవంటి ఇతరకారణాలుకూడావున్నాయి.

కేవలం పంటను గురించేకాకుండా, పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో, రైతులు పంటల తీరుతెన్నులను అవగాహన చేసుకోవడానికి వీలుకల్పించే ' రైతుల క్షేత్ర పాఠశాల (ఎఫ్ఎఫ్ఎస్) ' లను నిర్వహించడం మిక్కిలి అనువైన సాధనంగా పరిగణిస్తున్నారు. ఇది రైతులు సొంతంగా తెలుసుకుంటూ అధ్యయనంచేసే పద్ధతి. గధర్ రైతులకు 2005 పంటకాలంలో, జూన్ నుంచి డిసెంబర్ వరకు, ' రైతుల క్షేత్ర పాఠశాల (ఎఫ్ఎఫ్ఎస్) ' ను నిర్వహించారు.
ఏఎంఇఎఫ్ ప్రమేయం, ముఖ్యంగా పత్తి పంటసాగుపై ఎఫ్ఎఫ్ఎస్ నిర్వహణ , సాధించిన ఫలితానికి నిదర్శనంగా శ్రీ ప్రతాప్ రెడ్డి చేపట్టిన సాగు తీరుతెన్నులను చూపవచ్చు. తాను ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను అనుసరించి, ఆ అనుభవాలను తమసంఘంలొని రైతులతోను, ఇతరులతోను పంచుకోవడానికి ఒక రైతు సాగించిన కృషికి ఇది అద్దంపడుతుంది.

దాదాపు 35 ఏళ్ల వయసున్న ప్రతాపరెడ్డి ఎస్ఎస్ఎల్‌సి వరకు చదువుకున్నాడు. లింగాయత్ తెగకు చెందిన ప్రతాపరెడ్డికి వివాహమైంది, ఇద్దరు పిల్లలుకూడా వున్నారు. ఆయనకు 16 ఎకరాల భూమి వుంది. వ్యవసాయ కూలీల సహాయంతో, ఆ భూమిని ఆయన సాగుచేసుకుంటున్నాడు. ప్రతాపరెడ్డి చాలా సంవత్సరాలుగా పత్తి పండిస్తున్నాడు. పత్తి సాగు అంటే ఆయన దృష్టిలో, విత్తనాల డీలర్ దగ్గరనుంచి పత్తిగింజలుకొనితెచ్చి నేరుగా పొలంలో విత్తడం; పంటమీద పురుగు కనిపిస్తేచాలు వెంటనే పురుగుమందులు చల్లడం; క్రమంతప్పకుండా రసాయనిక ఎరువులు వేయడం వంటి కొన్ని బాగా అలవాటైన పనులతోకూడిన చాలా సాదాసీదా వ్యవహరం. ఆ సంఘంలోని సభ్యుడుగా ప్రతాపరెడ్డి , పత్తిపై నిర్వహించిన ఎఫ్ఎఫ్ఎస్‌లో చాలా చురుకుగా పాల్గొన్నాడు. 0.75 ఎకరాల విస్తీర్ణంగల పొలంలో ఆయన ఎఫ్ఎఫ్ఎస్ చేపట్టాడు. ఇందులో .50 ఎకరంలో ఎఫ్ఎఫ్ఎస్ సంఘం నిర్దేశాలమేరకు; మిగిలిన .25 ఎకరంలో తాను అనుసరిస్తూవచ్చిన సొంత పద్ధతుల మేరకు ఆయన సాగుచేశాడు. ఎఫ్ఎఫ్ఎస్‌లో భాగంగా నిర్వహించిన ప్రయోగాలతో, పత్తి పంటలో ప్రత్యామ్నాయ సాగు పద్ధతుల గురించి ఆయన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు.

అనుసరించిన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు

సరిహద్దు పంటగా కంది వేశారు. 1:10 దామాషాలో బంతి విత్తనాలను పొలంలో చల్లి, బెండవిత్తనాలను నాటారు. విత్తడానికి ముందు, అన్ని రకాల విత్తనాలను శుద్ధి చేశారు.

 • విత్తన శుద్ధి జరిపిన తీరు: విత్తడానికి ముందు విత్తనాలను ఫాస్ఫో బాక్టీరియా, అజో స్పిరిలంతో ఈ కింది విధంగా శుద్ధి చేశారు.
 • ప్రతి 750 గ్రాముల పత్తి విత్తనాలకు:
 • 20 గ్రాముల బెల్లం పానకం
 • 50 గ్రాముల ఫాస్ఫో బాక్టీరియా
 • 50 గ్రాముల అజో స్పిరిలం

పత్తి విత్తనాలను ఒక బట్ట లేదా గోనెపట్ట మీద పలుచగా పరచాలి. వాటి మీద బెల్లంపానకం పోయాలి. ఆ తరువాత జీవ రసాయనికాలయిన ఫాస్ఫో బాక్టీరియా , ఆజొస్పిరిలం లను వాటిమీద చల్లాలి. అరగంటపాటు నీడలో ఆరనిచ్చి, ఆ తరువాత వాటిని నేరుగా విత్తుకోవచ్చు.
( నిజానికి, ఎకరా పొలంలో నాటే విత్తనాలను 200 గ్రాముల జీవ రసాయనిక ఎరువులతో శుద్ధి  చేయాలని వ్యవసాయ నిపుణులు సిఫారసు చేసినప్పటికి, ఎకరా పత్తి విత్తనాల కు 50 గ్రాములు సరిపోతుందని విత్తనశుద్ధి  ద్వారా రైతులు స్వయంగా గ్రహించారు).

చీడ పురుగుల నివారణ : రసం పీల్చు పురుగు, కాయ తొలుచు పురుగువంటి చీడ పురుగులను నివారించడంకోసం, కంది, బంతి, బెండవంటి ఎర పంటలను ప్రతాపరెడ్డి వేశాడు. ట్రికోగ్రామా వంటి మిత్ర కీటకాలను గురించి ఆయన తెలుసుకున్నాడు.  పంటలకు మేలుచేసే కీటకాలుకూడా వుంటాయనే విషయం  ఆయనకు అంతకుముందు తెలియదు. ముందుజాగ్రత్తగా ఎన్‌పివి అనే ఒక జీవ రసాయనికాన్ని, ఒక రసాయనిక ఎరువును పంటపై ఒకసారి చల్లారు. గతంలో పంటపై ఒక పురుగు లేదా క్రిములకు సంబంధించిన ఏదైనా గుడ్డు కనిపించగానే వెంటనే రసాయనిక ఎరువులు చల్లేవారు. ఈ కొత్త విధానంవల్ల రసాయనిక ఎరువుల చల్లకం మొదటి ఏడాది 9 నుంచి 4కు, రెండవ ఏడాది 4 నుంచి ఒకటికి తగ్గింది. గతంలో రసాయనిక ఎరువులకే చాలా ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఇప్పుడది  75 % తగ్గింది.
పోషకాల నిర్వహణ: గతంలో రసాయనిక ఎరువులను  లేదా పురుగు మందులను రైతులు పోటాపోటీగా వినియోగించేవారు. ఒక రైతు 10 సంచుల రసాయనిక ఎరువు వేస్తే పక్క రైతు 12 సంచులు వేసేవాడు. మొదటి సీజన్లో ప్రతాపరెడ్డి రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించలేదు; పైగా, అదనంగా ఎఫ్ వైఎంని కలిపి, ఎకరాకు 2 క్వింటాళ్ళకు బదులు 3 క్వింటాళ్ళు వేశాడు. ఇంకా ఎకరాకు 2 క్వింటాళ్లు  వర్మీ కంపోస్ట్ వేశాడు. ప్రస్తుతం రసాయనిక ఎరువులతో పాటు తన పొలంలో తానే స్వయంగా తయారుచేసిన కంపోస్టు వాడుతున్నాడు. మళ్ళీ పత్తి మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా మారుతున్నది. ఎక్కువగా రసాయనిక ఎరువుల వాడకంనుంచి పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులకు మారుతున్న మొదటి ఏడాదిలోనే పత్తి దిగుబడి 20 % , ఆదాయం 44% పెరిగింది. అయితే, కొనుగోలుచేసిన సేంద్రియ ఎరువును వాడినందున పంట ఉత్పత్తి వ్యయం పెరిగింది. కాని, ప్రతాపరెడ్డి తన పొలంలో తానే సేంద్రియ ఎరువును తయారు చేసుకోవడం నేర్చుకున్నందున రాబోయే సంవత్సరాలలో ఉత్పత్తి వ్యయం తగ్గే అవకాశం వుంది.

ఖర్చు ఆదాయం (ఎకరాకు రూపాయలలో)

క్రమ సంఖ్య

అంశం

రైతు క్షేత్రం

ఎఫ్ఎఫ్ఎస్ క్షేతం

తేడా శాతం ( %)

ఎ.

పెట్టుబడుల వ్యయం

 

విత్తనాలు, విత్తనశుద్ధి

280

290

-

 

సేంద్రియ ఎరువులు

1500

2650

76.6 %

 

రసాయనిక ఎరువులు

555

555

-

 

పురుగు మందులు

1030

240

-75.2 %

 

జీవరసాయనికాలు

-

304

 

 

మొత్తం

3365

4039

70.7 %

బి

కూలీల ఖర్చు

2475

2250

-9 %

1

ఉత్పత్తి వ్యయం

5840

6289

7.6 %

2

దిగుబడి (కిలోలు)

500

600

20.0 %

3

మొత్తం రాబడి

9800

12 000

22.4 %

4

నికర ఆదాయం

3960

5711

44.2

సమగ్ర సాగు విధానం దిశగా

ఏఎంఇఎఫ్ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు జరిపిన చర్చలు , సంఘంలొ సభ్యులతో జరిపిన సంప్రదింపులు  ప్రతాపరెడ్డి సహజ వనరుల నిర్వహణపైన, తన వ్యవసాయ క్షేత్రంలోని వ్యర్థాలను పునర్వినియోగంలోకి  తేవడంపైన దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. పొలంలో మరింత సేంద్రియ ఎరువు తయారుకావాలంటే, మొక్కల వ్యర్ధ పదార్ధాలు  మరింతగా అవసరమని  తన అధ్యయన   పర్యటనలలో భాగంగా   లీసా (ఎల్ఈఐ ఎస్ఏ) వ్యవసాయ క్షేత్ర సందర్శనలో ప్రతాపరెడ్డి  గ్రహించాడు. అందువల్ల తనపొలంలో గట్లమీద, నీటి కుంట చుట్టూ 10,000 వివిధరకాల మొక్కలను పెంచాడు. ఇంతేకాకుండా, మామిడి, చింత, సపోటా  వంటి పండ్లచెట్లనుకూడా ఆయన పెంచాడు. మొక్కల వ్యర్థ పదార్థాల ప్రాధాన్యాన్ని తెలుసుకున్న ప్రతాపరెడ్డి, పొద్దుతిరుగుడు మొదళ్ళను తగులబెట్టే  తన పాత పద్ధతికి స్వస్తిచెప్పాడు. వాటిని నేలలో కుళ్ళేలా శ్రద్ధ  వహించాడు.
ఇవేకాకుండా, వెర్మీ కంపోస్ట్ తయారుచేయడం, పెరటితోట సాగు వంటి ఆర్ధికంగా అదనపు ఆదాయం పనులు  చేపట్టాడు. ఇంటిదగ్గర వంకాయలు, గుమ్మడి,టొమాటో,  బీర ; పత్తి చేలో బెండకాయలు పండించసాగాడు. తన ఇంటికి కావలసిన కూరగాయలన్నీ  తానే పండించగలుగుతున్నానని ప్రతాపరెడ్డి  సంతృప్తి చెందగలుగుతున్నాడు. నీటి నిల్వకోసం 12 అడుగుల లోతున పొలంలో నీటికుంట తవ్వాడు. ఆ నీటికుంటలో నీటి లభ్యతనుబట్టి , భవిష్యత్తులో చేపలను పెంచాలనికూడా ప్రతాపరెడ్డి యోచిస్తున్నాడు.

ఆధారము: ఏఎంఇ ఫౌండేషన్

పిల్లలు వేసిన పెరటితోటలు గ్రామ ముఖచిత్రాన్నే మార్చుతున్నాయి

పశ్ఛిమ మదినిపూర్ లోని బలియాఘటి అనేది ఒక గిరిజన గ్రామం. ఇందులో తక్కువ ఆదాయం పొందుతూ, కనీస అవసరాలైన ఆరోగ్యం మరియు పౌష్టికాహారం వసతులు లేకుండా ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. యన్.పి.యం.యస్. అనే ఒక సేవాసంస్థ అక్కడ పరిస్థితులలో మార్పు, పరివర్తన తీసుకురావాలని అక్కడ పనిచేస్తుంది. 2006 సంవత్సరం నుండి డి.ఆర్.సి.యస్.సి. 12-15 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలలకు పర్యావరణం మరియు సహజ వనరులకు సంబంధించిన అంశాలు నేర్పించడానికి, ప్రయోగాత్మక కార్యక్రమాలు చేపట్టడానికి యన్.పి.యం.యస్. తో కలసి పనిచేస్తుంది.బలియాఘటి ప్రాంతములో అటు వరదలు ఇటు కరువు ఈ రెండు కూడా అతివృష్టి, అనావృష్టిని సృష్టిస్తున్నాయి. ఇవి ఇక్కడ పేద ప్రజలకు సర్వసాధారణం. వీరికి ప్రకృతి వైపరీత్యాలను భరించడం మరియు తమ జీవితాలను దారపోయడం తప్ప మరోక ప్రత్యామ్నాయంలేదని అనుకునేవారు.వారు తీసుకునే అల్పహారం. అందులోనూ కూరగాయనేవి భాగమే కాదు. 2008 జూన్ లో 200 కూరగాయల సంచులను 30 మంది బాలలకు పంపిణి చేయడం జరిగింది. అందులో 18 మంది తమ ఇంటి పెరటి తోటలో కూరగాయ మొక్కలను పెంచారు.

గ్రూపులో మిగతావారు నాటిన మొక్కలు వరద నీటి కి కొట్టుకుపోయాయి. ఈ సంచులలో క్యాబేజి, పొట్లకాయ,బీరకాయ, సొరకాయ, చిలకడదుంప, అలసందలు, కర్రపెండలం, చిక్కుడు, దోసకాయ, కాకరకాయ, బెండకాయ, బచ్చలికూర మొదలగు కూరగాయ విత్తనాలు ఉన్నాయి. ఈ కూరగాయలు ఇంతకు ముందు వారు చూడనందున తినడానికి వారు ఇష్ట పడలేదు. తరువాత యన్.పి.యం.యస్. చొరవ తీసుకుని తెలియని కూరగాయలను వారిలో ఇష్టత పెంచడానికి వాటిని వండి, వారికి తినడానికి అందించినది. భూసారం పెంచడానికి ఎరువు, వర్మీకంపోస్టును పిల్లలు తయారు చేశారు.

3, 4 నెలలలో సగటున ఒక్కొక్కరు సుమారు 150 కేజీల కూరగాయలను అందుకోగలిగారు. ఈ కూరగాయలను పండించడానికి ఏఏ కార్యక్రమాలు చేశారో, ఏమేమి మార్పులు గమనించారో, చేసిన ప్రక్రియలు, చీడ పురుగులు, కీటకాలు తాకిడి, మొక్కల జీవిత చక్రం, అంకురించిన శాతం, కూరగాయల నాణ్యత, పండిన పరిమాణం మొదలగు వాటిని పిల్లలు రికార్డు చేసుకున్నారు. ఈ రికార్డు ల వల్ల పిల్లలకు పరిసరాల విజ్ఞానం పై అవగాహన వచ్చింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా ఉత్సాహాంగా ఆసక్తిని కనపరచారు. గ్రూపులో మిగతావారు నాటిన మొక్కలు వరద నీటి కి కొట్టుకుపోయాయి. ఈ సంచులలో క్యాబేజి, పొట్లకాయ,బీరకాయ, సొరకాయ, చిలకడదుంప, అలసందలు, కర్రపెండలం, చిక్కుడు, దోసకాయ, కాకరకాయ, బెండకాయ, బచ్చలికూర మొదలగు కూరగాయ విత్తనాలు ఉన్నాయి. ఈ కూరగాయలు ఇంతకు ముందు వారు చూడనందున తినడానికి వారు ఇష్ట పడలేదు. తరువాత యన్.పి.యం.యస్. చొరవ తీసుకుని తెలియని కూరగాయలను వారిలో ఇష్టత పెంచడానికి వాటిని వండి, వారికి తినడానికి అందించినది. భూసారం పెంచడానికి ఎరువు, వర్మీకంపోస్టును పిల్లలు తయారు చేశారు. 3, 4 నెలలలో సగటున ఒక్కొక్కరు సుమారు 150 కేజీల కూరగాయలను అందుకోగలిగారు. ఈ కూరగాయలను పండించడానికి ఏఏ కార్యక్రమాలు చేశారో, ఏమేమి మార్పులు గమనించారో, చేసిన ప్రక్రియలు, చీడ పురుగులు, కీటకాలు తాకిడి, మొక్కల జీవిత చక్రం, అంకురించిన శాతం, కూరగాయల నాణ్యత, పండిన పరిమాణం మొదలగు వాటిని పిల్లలు రికార్డు చేసుకున్నారు. ఈ రికార్డు ల వల్ల పిల్లలకు పరిసరాల విజ్ఞానం పై అవగాహన వచ్చింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా ఉత్సాహాంగా ఆసక్తిని కనపరచారు.

పర్యావరణ సంఘంలోని పిల్లలు మరియు వారి కుటుంబీకులే కాకుండా, ఇరుగు పొరుగున ఉన్న ఇతర గ్రామస్తులు కూడా ఈ కూరగాయలను తినే అవకాశం పొందారు. పర్యావరణ సంఘంలోని పిల్లలు ఇతర గ్రామస్తులకు చైతన్యం కల్పించేటప్పుడు, తాము ఉపయోగించుకోగా మిగిలిన కూరగాయలను వారికి పంచారు. అన్ని గ్రామాల ప్రజలు తమ ఇంటి పెరటితోటలో కూరగాయలు పెంచుకోవడం వల్ల కలిగే లాభాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఆర్థిక సహాయం చేసినవారు Indienhilfe

ఆధారము: డి.ఆర్.సి.యస్.సి న్యూస్,సంచిక – 3

బనమాలి దాస్ - ఒక సమగ్ర కర్షకుడు

బనమాలి దాస్ వెస్ట్ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల , గాయాధామ్ అనే గ్రామములో నివసించుచున్నాడు. సమగ్ర వ్యవసాయంలో ఐదుగురు సభ్యులను కల్గిఉన్నాడు. ఇంటి ఆవరణలో నున్న తోట మరియు చెరువు తో నున్న 0.25 ఎకరాల భూమిలో మరియు 0.33 ఎకరాల పల్లపు భూమిలో వ్యవసాయం చేయుట ప్రారంభించెను.

అతని పొలము సుందర్బాన్ డెల్టా లో ఉండడంవల్ల అక్కడి నేల బంకమట్టితో, ఉప్పగా ఉంటుంది. ఇది నది ప్రక్కన ఉండడం వల్ల తరచుగా వరద తాకిడికి గురికాబడుతుంది. బనమాలి ఖరీఫ్ సీజన్ లో వరి మరియు రబీ సీజన్ లో లాథిరస్ మరియు ఆలుగడ్డలు పండించేవాడు. అతని ఇంటి ఆవరణలో అతను పండ్లను, ఆకుకూరలను సాగుచేసేవాడు. కాని ఇది బజారుకెళ్ళి కాయగూరలను తెచ్చుకోవడాన్ని తప్పించలేదు. అతను చెరువులో చేపలను కూడా పెంచేవాడు. కాని అంత ఎక్కువ సంపాదన వచ్చేది కాదు. ఆవుపేడ మరియు పెరడులోని ఎరువులను భూసారమును అభివృద్దిచేయుటకు ఉపయోగించేవాడు.

మార్పులు చేర్పులు

అతని పొలములో ఒక మూల చిన్న చెరువుని తవ్వి వచ్చిన మట్టిని అతని (పరిశోధనా స్థలము) పంట ప్రయోగాలకి అనువుగా ఉండేటట్టు నేల యొక్క మట్టమును పెంచడానికి ఉపయోగించాడు. సంవత్సరమంతా సేద్యపు నీరుకోసం అతని ప్లాట్ చుట్టూ లోపలి సరిహద్దు గుండా ఒక కందకంను ఏర్పాటు చేశాడు.

ప్లాట్ యొక్క బయటివైపు సరిహద్దులో యూకలిప్టస్, వేప, సుబాబుల్, వెదురు మొదలగు వాటిని పెంచాడు. అతని ఇంటి పెరటి ఆవరణలోనున్న తోటలో సంవత్సర మంతా ఫలాలనిచ్చే చెట్లు – అరటి, జామ, వాటర్ ఆపిల్, సపోటా, నిమ్మ, మామిడి మరియు కొబ్బరి ఉన్నాయి. వివిధ రకాల సమ్మేళనములతో మిశ్రమ వ్యవసాయ మెళకువలు ఉపయోగించి అతను సంవత్సరము మొత్తంలో 25-30 రకాల కాయగూరలను పెంచుతున్నాడు. బనమాలి దాస్ ఇటీవల బయో గ్యాస్ మరియు స్లర్రీని ఉత్పత్తి చేయుటకు బయోగ్యాస్ ప్లాంట్ ను స్థాపించి అతని పెరడులో బయోడైజెస్టర్ నిర్మించాడు.అతని దగ్గర ఆవు, బాతు, కోడి మొదలైన పశుసంపద ఉన్నది. అతడు ఖరీఫ్ సీజన్ లో వరి-చేప-బాతు-అజోల్లా(ఫెర్న్)లతో తగిన మిశ్రమ వ్యవసాయ ప్రణాళికను పాటించాడు. అతను చేసే పరిశోధనా/ప్రయోగాత్మక వ్యవసాయ పద్ధతి, రసాయనిక పదార్థాలకు అతీతంగా ఉంటుంది. అతను ఎక్కువ ఉత్పత్తినిచ్చే చేపల రకాలైన రాహు, కాట్లా, బాటా, మైనర్ కార్ప్, మరియు క్యాట్ ఫిష్ లను చెరువులో సాగు చేస్తాడు.

చేప మేత కొరకు అతను మిగిలిపోయిన పశుగ్రాసము, వంట ఇంటిలోని పనికిరాని వ్యర్థ పదార్థాలు, ఆవుపేడ, మరియు నువ్వుల తెలగ పిండిని మాత్రమే ఉపయోగిస్తాడు. అతను 5 ఆవులు, 8 బాతు పిల్లలు, 4 కోళ్ళు మరియు 14 కోడిపిల్లలను కల్గియున్నాడు. అతడు వాటికి మేతగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి మరియు మిగిలి పోయిన వివిధ పంటల అవశేషాలను ఉపయోగించుచున్నాడు. కోడిపిల్లలకు మరియు బాతులకు అతను బియ్యపు గింజలు, ఊక , వరిపంట కోయగా మిగిలిన అవశేషాలు మరియు చెరువుల నుండి చిన్న నత్తలను మేతగా ఉపయోగించుచున్నాడు.

అతను స్వయంగా వెర్మి కంపోష్టులను, సేంద్రియ ఎరువులను తయారుచేయుచున్నాడు. అతను నువ్వుల తెలగపిండిని మరియు నాణ్యమైన బయోగ్యాస్ స్లర్రీని సేంద్రియ ఎరువులుగా ఉపయోగించేవాడు. వేపరసం , వెల్లుల్లి ముద్ద మరియు కిరోసిన్ ల మిశ్రమమును తయారుచేసి తెగుళ్ళ నివారిణిగా ఉపయోగించుచున్నాడు. సాధారణంగా అతను గత సీజన్లో పండించిన పంటలో కొంత భాగం విత్తనాలుగా నిల్వచేసుకుంటాడు.సీజనల్ పంటలను కొన్నింటిని మాత్రమే , ముఖ్యముగా వాణిజ్యపంటలైన కేబేజీ మరియు కాలీఫ్లవర్ లాంటి వాటిని స్థానిక మార్కెట్ నుండి కొనుబడి చేస్తాడు. కొంతకాలం గడచిన తర్వాత అతని విత్తనాలను మార్పిడి కూడా చేస్తాడు.

అతని పరిశోధనా స్థలం మరియు ఇంటి ఆవరణలోనున్న తోట విస్తృతంగా వ్యాపింప చేసి చాలా అందంగా తయారుచేశాడు. అతను మిశ్రమ వ్యవసాయాన్ని (వంకాయ, ముల్లంగి, పొన్నగంటి కూర, బంగాళాదుంపలు+గుమ్మడి, ఉల్లి+బాసిల్లా) పరిచయం చేశాడు. అతడు అతని పొలాలకు, తోటకు అవసరమైన సేంద్రియ ఎరువులను అతనికున్న సేంద్రియ ఎరువుల గొయ్యి నుండి పొందుతున్నాడు. పొలం లో గాలి ప్రసరించడానికి బాతులను వదలుట ద్వారా, తోటలోని చీడ పురుగులను తగ్గించుటకు కోళ్ళను ఉప యోగించడం ద్వారా, వరిపొలాలు వరదకు గురైనప్పుడు చేపపిల్లలను పెంచుట ద్వారా అతను సమగ్ర వ్యవసాయమును అవలంభించుచున్నాడు.

అతని పరిశోధనా స్థలంలో పంటల సమ్మేళనాన్ని 2004 ఖరీఫ్ లో ఏకపంట నుండి 2005 ఖరీఫ్ లో 9 పంటల సమ్మేళనమునకు పెంచగలిగాడు. అతను కోళ్ళ గూడును చెరువు మీదకు తరలించాడు. దీని వలన కోళ్ళ రెట్టలు తిన్నగా చెరువులో పడతాయి. ఎందుకంటే జూప్లాంక్ టాన్, ఫైటోప్లాంక్ టాన్, కోళ్ళ రెట్టలలో ఉండబట్టి అవి చేపల యొక్క మేతకు మంచి మూలాధారం.

చెరువుగట్లను ఇంపోమియా అక్వాటికా లాంటి ఆకు కూరలను పెంచుటకు ఉపయోగించుచున్నాడు.  అతని మొత్తం పెట్టుబడి రూ. 12235.75/- (కుటుంబ సభ్యులు చేసిన పనికయ్యే ఖర్చు కాకుండా)లో అంతర్గత పెట్టు బడి విలువ 9497.75/-. సుమారుగా 77.62 % మొత్తం పెట్టుబడి అంతర్గతంగా ఉపయోగించినట్లు అని అర్థం.  గత కొన్ని సంవత్సరాలుగా భూమిలోని సేంద్రియ కర్బన్ శాతము పెరిగినది.  మనం బనమాలి  ప్లాట్ ను శిలాజ ఇంధనముపై ఆధారపడిన సాంప్రదాయ పద్ధతిలో చేసిన ప్లాట్ తో పోల్చిచూసినట్లైతే శిలాజ ఇంధనాధారితము అనుభవపూర్వకంగా (సున్న) ఏమియూ లేదని మనం గుర్తించవచ్చు.  ఎందుకంటే అన్ని రకాలైన పెట్టుబడులు అతని పొలం నుండే వచ్చినవి కనుక.  ఈ విధానంలో చాలా వరకు పనివారి అవసరం లేకుండా రైతు, అతని కుటుంబసభ్యుల సహాయంతో పని చేయడమైనది.  ఏది ఏమైనప్పటికీ అతను వ్యవసాయం ఈ విధంగా ప్రణాళిక ప్రకారం చేయుటవలన అతనికి అతి ప్రయాస తగ్గింది.  ఈ రోజు బనమాలి  దాస్ అతని వ్యవసాయాన్ని నైపుణ్యతతో నిర్వహించి, దాని నుండి ఆర్థిక స్థితిగతుల,పర్యావరణ మరియు సమాజ శ్రేయస్సు వంటి మంచి ఫలితాలను పొందాడు.  బనమాలి  దాస్ విజయం చూసి ఆ ప్రాంతంములోని మరియు చుట్టుప్రక్కల చాలా మంది రైతులు సమగ్ర వ్యవసాయ విధానానికి మారారు.  బనమాలి  పెట్టుబడి విషయం లోనే కాకుండా మార్కెట్ మీద ఆధారపడడాన్ని కూడా తగ్గించాడు.  అంతే కాకుండా అతని కుటుంబానికి కావలసిన వాటిని ఉంచుకుని మిగిలిన వాటిని సరసమైన ధరలకు అమ్ముట ద్వారా లాభాలను పొందాడు.

అతని  సమగ్ర సేంద్రియ వ్యవసాయ సాధన అతనికి ఆహారభద్రతను ఇచ్చింది. అతని పొలంలో ఎక్కువ విస్తారంలో  సమగ్ర వ్యవసాయ విధానము చేయుటవలన మరియు సాగుకు అవసరమైన వాటిని తన స్వంత పొలంలోనే పండించుకోగలిగడం మార్కెట్ మీద ఆధారపడటాన్ని  తగ్గించ్చింది.

ఆధారము: కమ్యూనికేషన్ అభివృద్ధి పరిశోధన మరియు సర్వీస్ కేంద్రం ( డీ.ఆర్.సి.ఎస్.సి ) , కల్ కత్తా

ప్రజల భాగస్వామ్యాలతో పలు శ్రేణులుగా ఉండే మెట్లతో చెరువులను నిర్మించడం ద్వారా వర్షాధార పంటలను పండించుట

సమస్య

చోటానాగ్పూర్ ప్రాంతపరిధి వెస్ట్ బెంగాల్ పడమర దిక్కులో విస్తరించబడి ఉంది.  ఇక్కడ భూనైసర్గిక స్వరూపం ఎగుడు దిగుడుగా ఉంటుంది.  గుట్టల పైభాగంలో ఏ విధమైన మొక్కలు మొలవని ప్రాంతంగా ఉంటుంది.  ఇక్కడి నేల లాటరైట్ రాళ్ళతో నిండి ఉండి నీటిని అతి తక్కువ మోతాదులో నిలువ చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి.  సంవత్సర సరాసరి వర్షపాతం 1200 నుండి 1400 మి. మి. కాని ఈ వర్షపాతము కూడా సంవత్సరములలో రెండు నెలల లోపే పడుతుంది.  మిగతా సంవత్సరకాల భాగంలో ఏవిధమైన వర్షపాతం లేకుండా నేలలు తేమను కోల్పోయి కరువు లాంటి పరిస్థితులను కలుగజేస్తాయి.  ఈ సెమీ ఏరిడ్ ప్రాంతమంతా వర్షాధారంగా ఒకే పంట పండుతుంది. నీటివసతి లేక సంవత్సరములో మిగతా 8-9 నెలల్లో ఏ విధమైన పంట పెరగదు.  ఆ ఒక్క వర్షాధార పంట కూడా వాతావరణమార్పుల తేడావల్ల అడ్డంకులు ఎదుర్కొంటుంది.

ఆ విధంగా చాలా వరకు ఆ భూములను సాగుచేయలేక నిరర్ధకంగా చాలాకాలం పాటు వదిలేశారు.  ఆహార కొరత వల్ల పనిచేసే మగ మరియు ఆడవాళ్ళు పనిని కల్పించుకొనుటకు ప్రక్కనే ఉన్న జిల్లాలకు పనిని వెదకుచూ వలసపోయారు.

చాలా వరకు అభేధ్యమైన రాళ్ళు ఉండుట వలన చెరువులు త్రవ్వుట చాలా కష్టము మరియు ఖర్చుతో కూడు కున్నది.  అందువలన చెరువులు సాధారణంగా చాలా మెట్ట ప్రాంతంగా, లోతు లేకుండా ఉండి, వేసవి కాలము వరకు సరిపడు వర్షపు నీటిని నిలవచేయలేవు.  బావులు కూడా ఎండిపోతాయి.  కొన్ని నదులు మాత్రము 10 - 12 నెలల వరకు నీటిని కల్గిఉంటాయి.  కాని పేద గిరిజనులకి వేసవి కాలములో, నీరు లేని సమయములో వ్యవసాయమునకు వాటినుపయోగించుకునే వనరులు మరియు తెలివితేటలు లేవు.

మార్పులు, చేర్పులు
 • చిన్న మరియు ఒక మోస్తరు రైతులు సమూహములుగా ఏర్పడి క్రొత్త చెరువులు త్రవ్వడానికి మరియు పాత చెరువులను మళ్ళీ త్రవ్వడానికి పూనుకున్నారు.ఈ చెరువులు మూడు లేదా నాలుగు వరుసశ్రేణుల నమూనాలో ఉన్నాయి.  మధ్యభాగమును చేరుకొనుటకు నాలుగు వైపులా మూడు లేక నాలుగు వెడల్పైన మెట్లను తయారుచేశారు.  ఈ మెట్లు వర్షాలకు అలాగే మునిగిపోయినవి. సరాసరి చెరువులో పడే వర్షపునీరే కాకుండా ప్రక్కన ఉన్న ప్లాట్స్ నుండి వర్షపునీరు సరాసరి చెరువులలో పడేలా కందకాల ను తవ్వి కాల్వలను తయారుచేశారు.   చెరువు ఒడ్డున నాలుగు వైపులా, గుమ్మడి, సొరకాయ, కాకర కాయలు మొదలైన కూరగాయలనిచ్చే  పాదులకు ఆధారముకొరకు  బద్దలతో అల్లిన తడకను చెరువు పైన వ్రేలాడదీసే ఏర్పాటుచేశారు. నీరులేని నెలల్లో , చెరువు నీటి మట్టము పడిపోయినప్పుడు కూర గాయలు వెడల్పాటి మెట్లపై పెంచబడతాయి.     చిక్కుడు లాంటి కాయ ధాన్యములు వంటి వివిధ రకాలై న కూరగాయలను, ఆ ఋతువులో పెరిగే చెట్లు, సంవత్సరమంతా ఫలసాయాన్నిచ్చేవి మరియు అర్థ సంవత్సరం ఫలసాయాన్నిచ్చేవి, వివిధ రకాలుగా అవసరమయ్యే చెట్లు పెంచుటకు చెరువు ఒడ్డును ఉప యోగించుకోవచ్చును. అదనపు ఆదాయము కొరకు చేపలు కూడా చెరువులో పెంచ బడతాయి. చెరువు లలో నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించి చెరువుకు ఇరువైపులా విస్తారమైన కూరగాయల రకాలను పెంచుట ద్వారా బీడుభూములలో కూడా వ్యవసాయం చేయవచ్చును.  మెట్లమీద, చెరువు ఒడ్డున మరియు పొలాలలో సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేయబడుతుంది. గ్రూపు మొత్తం అవసరాల్ని చూసిన తర్వాత , చెరువు నుండి వచ్చిన రాబడి,  చెరువు ఒడ్డు నుండి మరియు క్రొత్తగా బీడు భూమి సాగు చేయగా వచ్చిన రాబడి అంతా కలిపి గ్రూపులోని సభ్యులందరూ సమానంగా పంచు కుంటారు. ఇవి కాక మిగిలిన దానిలో కొంత భాగంను గ్రూపులో లేని గ్రామస్తులకు పంచిపెడతారు.   దీని తర్వాత  మిగిలినది మార్కెట్ లో అమ్మి వచ్చిన సొమ్ము  గ్రూపు యొక్క బ్యాంక్ ఖాతాలో  జమచేయ బడుతుంది.
 • ఆ భూమి యజమాని వర్షాధార పంట పండించిన తరువాత సామూహిక రైతు సంఘమునకు గాని ప్రక్కనే ఉన్న రైతులకుగాని, సాగుకు అనువుకాని సమయంలో తన పొలమును ఉపయోగించుకొనుటకు తగిన ఏర్పాట్లు చేసుకొన్నారు.  వ్యవసాయము కొరకు నీటిని నది నుండి పైకి తీయుటకు ఒక తక్కువ ఖరీదు మోడల్ అభివృద్ధి చేసుకున్నారు
 • చెరువు పరిమాణము 1.3 ఎకరాలు; 180అడుగులు X 160 అడుగులు X 10 అడుగులు.
 • చెరువును తవ్విన భూమి ఐదుగురు వ్యక్తులకు చెందినది. వారు 30 మంది రైతులకు కౌలుకు ఇవ్వడానికి అంగీకరించారు.  కౌలుకిచ్చిన సమయము పూర్తవగానే ఆ భూమిని యజమానికి ఇవ్వ బడుతుంది, కాని నీటిని మాత్రము గ్రూపులో నున్న రైతులు ఉపయోగించుకొనవచ్చును.
ప్రభావము
 • ఇంతవరకు ఉపయోగించని సహజవనరులను (బీడుభూములను) ఉపయోగించుకుని. ఆహారాన్ని, పశు గ్రాసము, వంటచెరకును పెంచుకోగలిగాడు.
 • చాలా మంది వ్యక్తులకు పనిని కల్పించడంద్వారా , సీజనల్ గా వలసపోయే వ్యక్తుల సంఖ్యను తగ్గించ గలిగారు.  చెరువు త్రవ్వడానికి 2979 మందికి , బీడు భూమిలో మిశ్రమ వ్యవసాయం ద్వారా 831 మందికి పనిని కల్పించగలిగారు.
 • భూసారము పెంచగలిగారు.
 • సంవత్సరమంతా కుటుంబానికి కావలసిన ఆహారము మరియు పోషకాలు సమకూర్చుకోగలిగారు.  చెరువు ఒడ్డున సాగు చేసిందే కాకుండా,  10 ఎకరాల బీడు భూమిని కూడా సాగు చేయుట సాధ్యమైనది.  2006 లో 40 రకాల కూరగాయలను మిశ్రమ వ్యవసాయం ద్వారా సాగు చేయడమైనది.
 • స్వంత వినియోగానికి పోగా మిగిలినది అమ్ముకొనుట ద్వారా రాబడి  పొందుటకు అవకాశం ఏర్పడింది.

సేంద్రీయ వ్యవసాయం

హైటెక్ సాగు

వ్యవసాయం చేసిన రైతుకు చివరికి అప్పులు మిగలడం ఆనవాయితీగా వస్తున్నది. దీనిని తిరగరాయాలన్న లక్ష్యంతో ఇంజినీరింగ్ పట్టభద్రులైన కొం దరు యువకులు నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్ సాయంతో ఆధునిక వ్యవసా యం చేస్తూ కాసుల పంట పండిస్తున్నారు.

ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన  29 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులైన యువకులు రా అండ్ అగ్రి సొసైటీగా ఏ ర్పడి కట్టంగూరు మండలం ఈదులూరులో 2010లో 70 ఎకరాలు కొనుగోలు చేశారు. వారిలో ప్రస్తుతం 19 మంది కలిసి వ్యవసాయం  చేపట్టారు. మొత్తం 70 ఎకరాలకుగాను 50 ఎకరాల్లో వివిధ రకాలకూరగాయలు సాగు చేస్తున్నారు.

మల్చింగ్‌తో నీటి పొదుపు..
ఏ పంట వేసినా మల్చింగ్ (కవర్ పరిచే) విధానాన్ని అవలంబిస్తున్నారు. దీని వల్ల నీరు, ఎరువుల వృథాను అరికట్టవచ్చు. కలుపు, పురుగుల ప్రభావం ఉండదు. నాణ్యమైన, మన్నికైన దిగుబడులు 30శాతం అదనంగా లభిస్తాయి.

టమాటలో ట్రెల్లీసాగు:
టమాట పంటకు ట్రెల్లీసాగు పద్ధతిని ఉపయోగిస్తున్నారు. దీనిలో దిగుబడి సమయంలో కాయలు నేలబారకుండా ఉండేందుకు మొక్కలకు పురుకోసలను తీగపద్ధతిలో కడతారు.  ఇనుప పైపులను స్తంభాలుగా క్రమపద్ధతిలో ఉపయోగిస్తున్నారు. దీనివ్లల సరైన గాలి, సూర్యరశ్మి మొక్కలకు అందుతుంది.

తొమ్మిది రకాల పంటల సాగు:
తొమ్మిదిరకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఒక్కో పంటను రెండు, మూడు ఎకరాల విస్తీర్ణంలో వేశారు. ఒక పంట కాలం పూర్తి అయ్యేలోపు మరో పంట దిగుబడులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. మిర్చి, టమాట, వంగ, బీర, సొర, కాకర, దోస, చిక్కుడు తదితర పంటలు సాగుచేస్తున్నారు.

రూ. కోటి 8 లక్షల పెట్టుబడి
50 ఎకరాల్లో వ్యవసాయం కోసం సొంతంగా రూ. కోటి 8లక్షలు పెట్టుబడి పెట్టారు. బోర్లు ఏర్పాటు, విద్యుత్ మో టార్లు, ట్రాక్టర్ల కొనుగోలు, ఇనుప పైపులు (కడ్డీలకోసం) ట్రాక్టర్ మౌంటెడ్ భూమ్ స్ప్రేయర్ కొనుగోలు, దున్నకం షెడల్ ఏర్పాటు కోసం ఈ మొత్తం ఖర్చు చేశారు.

సోలార్ సిస్టం ఏర్పాటు
మొత్తం 70 ఎకరాలకు 5 బోర్లు ఉన్నాయి. కరెంట్ సమస్య ను అధిగమించేందుకు 5.5 కేవీఎం సామర్థ్యం కలిగిన సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు.  విద్యుత్ సరఫరా లేని సమయంలో సోలార్ విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఐదు వ్యవసాయ మోటార్లు 6గంటల పాటు నీరందిస్తాయి. 2లక్షల నీటి సామర్థ్యం కలిగిన పాంపాండ్ ఏర్పాటు చేశారు. పాంపాండ్‌లో నీటిని నిల్వ చేసి అవసరమైనపుడు డ్రిప్ ద్వారా నీటిని పంటలకు అందిస్తారు. ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందిస్తున్నా పూర్తిగా డ్రిప్ ఏర్పాటుతోనే పంటల సాగు చేపట్టారు.

శాస్త్రవేత్తల సలహాలతో ముందడుగు
వీరు ఏ పంటలను ఏ సమయంలో వేయాలో..వచ్చే చీడ, పీడలకు ఏ మందు ఎంత మోతాదులో వాడాలనే సమాచారాన్ని పూర్తిగా ఇంటర్నెట్‌లో చూసి అమలు చేస్తున్నారు. శాస్త్రవేత్తల సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఏ పంటకు ఎంత ధర, డిమాండ్, మార్కెటింగ్ ఉంటుం ది.. నాణ్యమైన సీడ్ ఎంపిక, సస్యరక్షణ చర్యల కోసం నెట్‌నే ఉపయోగిస్తున్నారు. మందులను ట్రాక్టర్ మౌంటెడ్ భూమ్ స్ప్రేయర్‌తో పిచికారీ చేస్తున్నారు. ఇది గుజరాత్ టెక్నాలజీతో ఉంటుంది. దీంతో ఒకేసారి 50 ఫీట్ల వెడల్పులో పిచికారీ చేయొచ్చు.

ఆధారము: సాక్షి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate