సాధారణ నామము : ఆమ్ల
శాస్త్రీయి నామము : ఫిల్లాంథస్ ఎంబ్లికా
కుటుంబము : ఫిల్లాంథస్
ప్రాంతీయ నామము : ఉసిరి
వాణిజ్య నామము : ఆమ్ల/గుస్బెర్రీ
ఉపయోగపడు భాగములు : కాయలు
ఫిల్లాంథస్ ఎంబ్లికా అనే శాస్త్రీయ నామము కలిగిన ఈ మొక్క ఫిల్లాంథస్ కుటుంబానికి చెందుతుంది. ఈ మొక్క 10 నుంచి 15 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. ఉసిరిలో పత్రాలు రెమ్మ వంటి చిన్న కొమ్మల పైన వచ్చి ఎక్కువ సంఖ్యలో ఎదురెదురుగా అమర్చబడి 2.5 నుంచి 8 మిల్లి మీటర్లు పరిమాణంలో ఉంటాయి. స్త్రీ, పురుష పుష్పాలు చాల చిన్న పరిమాణంలో ఉండి, ఆకుపచ్చ రంగులో కొమ్మల పైన ఏర్పడతాయి. కాయలు గుండ్రంగా ఉండి ఆకుపచ్చ కలసిన లేత పసుపు రంగులో ఉండి నిలువు చరలను కలిగి ఉంటాయి. కాని నేడు ఉసిరి మొక్కలలో అంట్లు కట్టడం వల్ల గాని క్లోన్ల వల్ల గాని కేవలం తక్కువ ఎత్తు పెరిగి అధిక దిగుబడి నిచ్చే రకాలను రూపొందించడం జరిగింది. వీటిలో భవాని సాగర్, చకియా, కాంచన్, కృష్ణ ఆనంద్. ఫ్రాన్నిస్, బెనారసి, ఎన్.ఎ. – 7, ముఖ్యమైనవి.
భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఇది వ్యాప్తి చెంది ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో దీనిని సాగు చేయడం జరుగుతున్నది.
లోమ్ నేలలు / ఎర్రనేలలు / ఇసుక నేలలు, ఉదజని సూచిక (pH)7 నుంచి 9.5 వరకు.
10 నుంచి 46 సెంటిగ్రేడ్
400 మి.మీ.
60*60*60 సెం.మీ సైజు గల గుంతలను తీసుకోని రెండు గంపల చివికిన ఎరువు 200 గ్రా. సూపర్ ఫాస్ఫేట్ 50 గ్రా. 4% ఎండోసల్ఫాన్ పొడి కలిపి గుంతలు నింపి మొక్కలను నాటుకోవాలి. తరువాత అవసరాన్ని బట్టి సేంద్రియ ఎరువులు – పచ్చి రొట్ట , వార్మికంపొస్టు వాడాలి. 8 నుంచి 10 సంల వయసు గల మొక్కలకు 1.5 కిలోల నత్రజని 1.0 కిలో భాస్వరము, 0.8 కిలోల పొటాష్ నిచ్చే ఎరవులను వేసుకోవాలి. కాయలలో కుళ్లు రోగము రాకుండా సెప్టెంబర్ – అక్టోబర్ మాసాలలో 2,3 సార్లు 15 రోజుల వ్యవధిలో 0.6% మోతాదులో బోరాక్స్ పిచికారి చేయాలి.
విత్తనములు.
ఎకరాకు 160 మొక్కలు, అంతరం 5*5 మీటర్లు.
విత్తనములు 10*1 మీ. బెడ్ లలో (తాజాగా తీసిన విత్తనములను మాత్రమే) చల్లుకోవాలి. విత్తనాలను 5 నిమిషములు పాటు వేడి నీటిలో ఉంచి చల్లుకుంటే త్వరగా మొలకెత్తుతాయి. లేదా విత్తనములను 500 పి.పి.యం. జిబ్బర్లికామ్లంలో 24 గంటలు పాటు నానబెట్టి చల్లుకోనినచో ఎక్కువ శాతం మొలకెత్తుతాయి. బెడ్ లలో మొక్కలు 5 నుంచి 10 సెం.మీ. ఎత్తు పెరిగిన తరువాత వాటిని తీసి పాలీథిన్ సంచులలో పెట్టి ఒక సం. పాటు ఉంచి రెండవ సం. నుంచి పొలంలో నాటుకోవాలి. అంటు కట్టు కొమ్మల్లో ఎక్కువగా స్త్రీ పుష్పాలున్న కొమ్మల్ని అంటుకట్టుకొంటే అధిక దిగుబడులను పొందవచ్చును.
జూన్/జులై మాసాలు
మూడవ సంవత్సరము నుండి కాయలు వస్తాయి. ఆ తరువాత ప్రతి సంవత్సరం కాయలు దిగుబడి పెరుగుతుంది.
సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు
విత్తనములు / అంటు కట్టిన మొక్కలు
చకియా : ఇది మధ్యన్థంగా గుబురుగా పెరిగి అధిక దిగుబడి నిస్తుంది. ఒకొక్క కాయ బరువు 38 గ్రాములు ఉంటుంది.
బెనారసి : ఇది నిలువుగా ఒక మోస్తరు ఎత్తు పెరిగి మంచి దిగిబడినిస్తుంది. ఒకొక్క కాయ బరువు 50 గ్రా. ఉంటుంది.
ఫ్రాన్సిస్ : ఇది నిటారుగా ఎత్తుగా పెరిగి ప్రతి సంవత్సరం నిలకడగా కాపు వస్తుంది. ఒకొక్క కాయ బరువు 63 గ్రాములు ఉంటుంది.
భావాని సాగర్ : ఇది ఒక మోస్తరు ఎత్తు పెరిగి ప్రతి సంవత్సరం అధిక దిగుబడినిస్తుంది. కాయ బరువు 30 గ్రాములు ఉంటుంది.
కాంచన్ : ఇది ఫజియాబాద్ నుండి విడుదల చేయబడిన ఉసిరి రకము. అధిక దిగుబడినిస్తుంది. కాయ బరువు 38 గ్రాములు ఉంటుంది.
కృష్ణ : ఇది కూడా ఫజియాబాద్ నుండి విడుదల చేయబడిన ఉసిరి రకము. అధిక దిగుబదినిస్తుంది. ఒకొక్క కాయ బరువు 38 గ్రాములు ఉంటుంది.
అన్నంద్ – 1.2 : ఈ రెండు రకాలు గుజరాత్ నుండి విడుదల చేయబడిన ఉసిరి రకాలు. అధిక దిగుబదినిస్తాయి. ఒకొక్క కాయ బరువు 38 గ్రాములు ఉంటుంది.
యన్.ఎ. – 7 : ఇది నరేంద్రదేవ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేయబడిన ఉసిరి రకము. అధిక దిగుబదినిచ్చు రకాలలో యన్.ఎ. – 7 ఒకటి. ఒకొక్క కాయ బరువు 40 గ్రాములు ఉంటుంది.
గాల్ చిడపురుగు : వర్షకాలంలో ఉసిరి కొమ్మల చివరి భాగంలో పిల్ల పురుగులు రంధ్రాలు చేయడం వలన కాంతులు లేదా గాల్స్ ఏర్పడటం వల కొమ్మల పెరుగుదల తగ్గిపోతుంది. దీని నివారణకు గాను, 2 మి.లీ. రొగార్ ను నీటితో కలిపి పిచికారి చేయాలి.
అకుచుట్టు పురుగు : ఆకులను చుట్టి పత్ర హరితాన్ని తినడం వలన కిరణ జన్య సంయోగ క్రియ తగ్గిపోతుంది. దీని నివారణకు గాను, 2 మీ.లీ. మలాధియాన్ ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బెరడు తినేపురుగు : ఈ పురుగులు చేట్ల మొదల్లోను, కొమ్మలపై బెరడును తినేస్తాయి. ఈ పురుగులు విసర్జించిన పదార్దాని తీసివేసి రంద్రాలలో రెండు చుక్కలు కిరోసిన్ వేసి రంధ్రాని తడిమట్టితో మూసేయ్యాలి.
పిండి పురుగు : ఈ పురుగులు ఏప్రిల్ నెల నుండి డిసెంబర్ వరకు ఆశిస్తాయి. ఈ పురుగులు నివారణకు మలాధియాన్ 2 మీ.లీ. ఒక నీటికి కలిపి పిచికారి చేయాలి.
రస్ట్ : ముందుగా ఆకుల మీద గుండ్రని లేదా అర్థ చంద్రాకారపు తుప్పు మచ్చలు కనిపిస్తాయి. తరువత కాయలు మీద కనిపిస్తాయి.
అకుతుప్ప : ఈ తెగులు జూలై – ఆగస్ట్ నెలలో కనిపిస్తుంది.
పై రెండు తెగుళ్ళు నివారణకు గాను 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు ఒక శాతం బోరోమిశ్రమం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఉసిరి పంటతో అంతర పంటలుగా ఆశ్వగంధ, నేలవేము , కోలియనస్ , లెమన్ గ్రాస్ , పామ రోసా వంటి పంటలను వేసుకోనవచ్చును.
మూడవ సంవత్సరం ఉసిరి కాయల దిగుబడి 1,600 కిలోలు, నాలుగవ సంవత్సరం కాయల దిగుబడి 4,800 కిలొలు ఐదవ సంవత్సరం 8,000 కిలోలు ఆరవ సంవత్సరం నుండి 12,000 కిలోల దిగుబడి ప్రతి సంవత్సరం రావచ్చును.
నేల స్వభావం, వాతావరణ పరిస్తితులు, మార్కేట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి.
ఉసిరి ఫలాల్లో గాలిక్ ఆమ్లం, టానిక్ ఆమ్లం, ఫిల్లెంబ్లిన్, టానిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్లు మొదలయినది ఉంటాయి. ఉసిరిని త్రిఫల చూర్ణం, చ్యవనప్రాశ లేహ్యము, విటమిన్ సి, పచ్చళ్ళు, మురబ్బా, జెల్లీ, జామ్ ల తయారీలోను, స్కర్వీ వ్యాధి నివారణలోను మొదడును చల్లపరచడంలోను, చర్మ వ్యాధుల్లోను, స్కర్వి వ్యాధి నివారణలోను మెదడును చల్లపరసడంలోను, చర్మ వ్యాధుల్లోను, మధుమేహ నువారణలోను, మూత్ప సంబంధ వ్యాధుల్లోను వాడతారు. ఎండుకాయల నుండి తీసిన నూనెను మందుల పరిశ్రమల్లోను తలనూనెల తయారిలొను, షాంపుల తయారిలొను, ఉపయోగిస్తారు. 10 గ్రా. బరువున్న తాజా ఉసిరి కాయలలో 600 నుంచి 900 మిల్లీ గ్రా. విటమివ్ సి ఉంటుంది.
ఆధారం: తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, TSGLI బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోన్: +21 40 66364096, 24764096 . website : ww.tsmpb.in , E-mail: tsmapb@gmail.com